Ruhani Sharma
-
మెరిసే... మురిసే...
సిల్వర్ స్క్రీన్‌పై మెరుపులా మెరవడానికి మెరుపు తీగల్లాంటి కథానాయికలు జోరుగా హుషారుగా సినిమాలు చేస్తుంటారు. ఒకే ఏడాది మూడు ఆపై ఎక్కువసార్లు తెరపై మెరిసే చాన్స్ వస్తే వాళ్ల ఆనందం పట్టలేనంతగా ఉంటుంది. ఈ ఏడాది అలా మినిమమ్ మూడు చిత్రాలతో తెలుగులో మెరిసి, కెరీర్ బాగున్నందుకు మురిసిపొయిన కథానాయికల గురించి తెలుసుకుందాం.2024లో తెలుగు తెరపై మీనాక్షీ చౌదరి హవా కనిపించింది. మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’, దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’, వరుణ్ తేజ్ ‘మట్కా’, విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ చిత్రాలతో మీనాక్షీ చౌదరి వెండితెరపై కనిపించారు. అంతేనా... తమిళ హీరో విజయ్ ‘గోట్: ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ తెలుగులో అనువాదమై, ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోనూ ఓ లీడ్ రోల్ చేశారు మీనాక్షి. ‘లక్కీ భాస్కర్, మట్కా, మెకానిక్ రాకీ’ చిత్రాలు నెల రోజుల గ్యాప్‌లో విడుదల కావడం విశేషం. ఇక ‘గుంటూరు కారం, లక్కీ భాస్కర్, మెకానిక్ రాకీ, గోట్’ చిత్రాలు హిట్స్‌గా నిలిచాయి.మరోవైపు తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల ఈ ఏడాది మంచి జోరు కనబరిచారు. హారర్ మూవీ ‘తంత్ర’లో లీడ్ రోల్ చేసి, రూరల్ యాక్షన్ ఫిల్మ్ ‘΄÷ట్టేల్’లో గృహిణిగా భావోద్వేగభరితమైన పాత్ర చేశారు. ప్రియదర్శి–నభా నటేష్ లీడ్ రోల్స్‌లో నటించిన ‘డార్లింగ్’లోనూ డాక్టర్‌గా ఓ లీడ్ రోల్ చేశారీ బ్యూటీ. అలాగే నేడు విడుదలవుతోన్న ‘శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్’ చిత్రంలోనూ ఓ లీడ్ చేశారు. ఇలా అనన్య ఈ ఏడాది నాలుగుసార్లు ప్రేక్షకుల ముందుకు వచ్చినట్లవుతుంది. ఇక ముంబై బ్యూటీ కావ్యా థాపర్ కూడా తెలుగు ప్రేక్షకులను ఈ ఏడాది తరచూ పలకరిస్తూ వచ్చారు.రవితేజ ‘ఈగిల్’, సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన, రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’, గోపీచంద్ ‘విశ్వం’ చిత్రాల్లో కావ్యా థాపర్ కనిపించారు. ఓ మంచి కమర్షియల్ హీరోయిన్గా ఈ ఏడాది తెలుగు ఆడియన్స్‌ను అలరించారు కావ్యా థాపర్. మరోవైపు హీరోయిన్గా పరిచయమైన తొలి ఏడాదే మూడు సినిమాలతో సత్తా చాటారు యువ హీరోయిన్ నయన్ సారిక. ఆనంద్ దేవరకొండ ‘గం గం గణేశా’, నార్నే నితిన్ ‘ఆయ్’, కిరణ్ అబ్బవరం ‘క’ చిత్రాల్లో హీరోయిన్గా చేశారీ బ్యూటీ.నయన్ చేసిన ఈ మూడు చిత్రాలకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం ఆమె కెరీర్‌కు బలం చేకూరినట్లయింది. ఇక హీరోయిన్గా కాదు కానీ... కథను ఇంపాక్ట్ చేసే పాత్రల్లో రుహానీ శర్మ కనిపించారు. వెంకటేశ్ ‘సైంధవ్’, వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’, సుహాస్ ‘శ్రీరంగనీతులు’ చిత్రాల్లో రుహానీ మంచి పాత్రలు చేశారు. ‘లవ్ మీ’ చిత్రంలో ఓ చిన్న గెస్ట్ రోల్లో కూడా కనిపించారు రుహానీ. ఇలా ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులను తరచూ పలకరించిన మరికొంతమంది హీరోయిన్లు ఉన్నారు.విలన్‌గానూ విజృంభించారు సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు స్క్వేర్’లో స్పై ఏజెంట్ లిల్లీ జోసెఫ్‌గా, రవితేజ ‘ఈగిల్’లో జర్నలిస్ట్ నలినీ రావుగా కనిపించారు అనుపమా పరమేశ్వరన్. అయితే ‘డీజే టిల్లు 2’లో కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అనుపమ నటించడం విశేషం. ఈ తరహాలోనే మరో హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ తొలిసారి నెగటివ్ షేడ్స్ ఉన్న అప్సర ఆలియాస్ మాయ పాత్రను విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ సిని మాలో చేశారు. ఈ బ్యూటీయే వెంకటేశ్ ‘సైంధవ్’లో మనోజ్ఞ అనే సెంటిమెంట్ రోల్లో కనిపించడం విశేషం. మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’లో హీరోయిన్గా చేసిన శ్రీలీల, అల్లు అర్జున్ ‘పుష్ప: ది రూల్’లో స్పెషల్ సాంగ్ ‘కిస్సిక్’లో మెరిశారు. ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది తెలుగులో రష్మిక కనిపించిన చిత్రం ఇదొక్కటే. విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’తో మృణాల్ ఠాకూర్ (‘కల్కి 2898 ఏడీ’లో ఓ గెస్ట్ రోల్ చేశారు), శర్వానంద్ ‘మనమే’లో ఐటీ ఉద్యోగిగా కృతీ శెట్టి, ఫ్యామిలీ డ్రామా ‘35: చిన్న కథ కాదు’లో గృహిణి సరస్వతిగా నివేదా థామస్‌ల నుంచి ఈ ఏడాది ఒక్క చిత్రమే తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన అనుష్క, సమంత, సాయి పల్లవి, పూజా హెగ్డే, కీర్తీ సురేష్ వంటి హీరోయిన్లు ఇతర భాషల చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల ఈ ఏడాది తెలుగులో కనిపించలేదు. ఇక ఈ ఏడాది దీపికా పదుకోన్, భాగ్యశ్రీ భోర్సే, రుక్మిణీ వసంత్... ఇలా దాదాపు 20మంది హీరోయిన్లు తెలుగుకు పరిచయం అయ్యారు. – ముసిమి శివాంజనేయులు -
టాలీవుడ్ హీరోయిన్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా?
'చి.ల.సౌ' అనే తెలుగు సినిమాతో హీరోయిన్ అయిన రుహానీ శర్మ.. ఆ తర్వాత కూడా టాలీవుడ్లో ఆడపాదడపా మూవీస్ చేస్తూనే ఉంది. గ్లామరస్ ఫొటోలతో ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటుంది. అలాంటిది ఈమె ఇన్ స్టాలో పెట్టిన స్టోరీ చూసి చాలామంది షాకయ్యారు. ఎందుకంటే పెళ్లి దుస్తుల్లో ఈమె కనిపించడం ఆసక్తికరంగా మారింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 23 సినిమా రిలీజ్.. ఆ ఐదు స్పెషల్)ఇంతకీ ఏమైంది?రుహానీ శర్మ.. తన ఇన్ స్టాలో పెళ్లి దుస్తులతో ఉన్న పిక్ పోస్ట్ చేసి 'కల నిజమైన వేళ' అనే క్యాప్షన్ పెట్టింది. అయితే ఇందులో ఉన్న రుహానీ శర్మ కాదు ఆమె సోదరి శుభి శర్మ. చూడటానికి వీళ్లిద్దరూ ఒకేలాంటి పోలికలతో ఉండటం వల్ల ఈమె ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుసుకుందా అని అనుకున్నారు.ఈ ఏడాది రుహానీ శర్మ.. తెలుగులో 'సైంధవ్', ఆపరేషన్ వాలంటైన్, శ్రీరంగ నీతులు, లవ్ మీ, బ్లాక్ అవుట్ తదితర సినిమాల్లో నటించింది. కానీ ఇవన్నీ కూడా దేనికదే అన్నట్లు ఫ్లాప్ అయ్యాయి. ప్రస్తుతానికైతే 'మాస్క్' అనే తమిళ మూవీ చేస్తోంది. మరి సోదరి పెళ్లి అయిపోయింది. మరి ఈమె ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతుందో?(ఇదీ చదవండి: ప్రేమ విషయం.. పబ్లిక్‌లో ఓపెన్ అయిపోయిన రష్మిక) -
సందెవేళ తెల్ల తెల్లని చీరలో హీరోయిన్ రుహానీ శర్మ! (ఫొటోలు)
-
విరాట్ కోహ్లీ మరదలు టాలీవుడ్లో హీరోయిన్.. ఈమెని గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
బోల్డ్ సీన్స్ వైరల్.. నన్ను జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు: రుహానీ శర్మ
'చిలసౌ' అనే తెలుగు సినిమాతో రుహానీ శర్మ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. దీని తర్వాత టాలీవుడ్లో అడపాదడపా మూవీస్ చేస్తూనే ఉంది. అయితే ఈమె ప్రధాన పాత్రలో నటించిన 'ఆగ్రా' అనే హిందీ సినిమా.. గతేడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. ప్రశంసలతో పాటు అవార్డులు కూడా వచ్చాయి. తాజాగా ఈ బోల్డ్ కంటెంట్ ఉన్న మూవీ.. అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చింది.'ఆగ్రా' సినిమాలో శ్రుతిమించిన శృంగార సన్నివేశాలు ఉండటంతో మన దగ్గర స్ట్రీమింగ్‌లోకి రాలేదు. కానీ పైరసీ సైట్లలో కనిపించింది. దీంతో కొందరు ప్రేక్షకులు ఈ సినిమాలో బోల్డ్ సన్నివేశాలు చూసి షాకయ్యారు. రుహానీ శర్మ ఇలా చేసిందేంటి అని ఆమెని విమర్శిస్తూ తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయం ఈమె వరకు వెళ్లడంతో స్పందించింది. పెద్ద నోట్ రిలీజ్ చేసింది.(ఇదీ చదవండి: 'మిస్టర్ బచ్చన్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయిందా?)'అందరికీ హాయ్. నేను నటించిన 'ఆగ్రా' సినిమా లీక్ అయింది. నెలల తరబడి మేం పడ్డ కష్టం ఇలా వృథా అవుతుందనుకోలేదు. అప్పటి నుంచి ఓ విషయం మాట్లాడాలనుకుంటున్నాను. నేను చాలా అసంతృప్తికి గురయ్యాను. ఆర్ట్ ఫిల్మ్ తీయడమంటే ఆషామాషీ కాదు. ఎన్నో నిద్రలేని రాత్రులు, ఇబ్బందులు ఉంటాయి. ఇవేవి చూడకుండా నా గురించి నోటికొచ్చినట్లు మాట్లాడటం, నన్ను జడ్జ్ చేయడం నిజంగా దారుణం'''ఆగ్రా' అనే రోజూ చేసే మరో సినిమా కాదు. గతేడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. నటిగా ఇది నాకెంతో గర్వ కారణమైన విషయం. అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకుని, అవార్డులు పొందిన ఈ చిత్రం విషమయై నా నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. ఫిల్మ్ మేకింగ్ గురించి మీకేం తెలియకపోతే ఏది పడితే అనొద్దు. కాస్త గౌరవమిచ్చి మాట్లాడండి. అవసరమైతే ప్రోత్సాహించండి కానీ మేం పడ్డ శ్రమని తక్కువ చేసి చూడొచ్చు' అని రుహానీ శర్మ భావోద్వేగానికి లోనైంది.(ఇదీ చదవండి: ప్రభాస్-అర్షద్ వివాదం.. సెటిల్ చేస్తున్న నాగ్ అశ్విన్) -
#RuhaniSharma : వీడియోలు వైరల్ ట్రెండింగ్‌లో హీరోయిన్ రుహాని శర్మ (ఫొటోలు)
-
రీఎంట్రీ షురూ
అదృష్టం అనేది ఎవరిని ఎప్పుడు వరిస్తుందో తెలియదు. అది వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. నటి రుహానీశర్మ పరిస్థితి ఇలాంటిదే. ఈ బాలీవుడ్ బ్యూటీ ఎవరో తెలుసా, ప్రముఖ క్రికెట్ కళాకారుడు విరాట్ కోహ్లి భార్య, నటి అనుష్కశర్మకు దగ్గర బంధువు. కథానాయకిగా హిందీ, తెలుగు చిత్రాల్లో నటిస్తున్న రుహానీశర్మ కోలీవుడ్‌కు సుపరిచితమే. 2017లో కడసీ బెంచ్ కార్తీక్ అనే చిత్రం ద్వారా ఈమె కథానాయకిగా కోలీవుడ్‌కు పరిచయం అయ్యారు. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో రుహానీశర్మను ఇక్కడ ఎవరూ పట్టించుకోలేదు. అలాంటిది 7 ఏళ్ల తర్వాత ఈ బ్యూటీకి కోలీవుడ్‌లో మరో మంచి అవకాశం లభించడం విశేషం. నటుడు కవిన్‌కు జంటగా మాస్క్ చిత్రంలో రుహానీశర్మ నటించనున్నారన్నది తాజా సమాచారం. దర్శకుడు వెట్రిమారన్ తన గ్రాస్ రూట్ కంపెనీ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి విక్రనన్ అశోక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆండ్రియా ప్రధాన పాత్రను పోషిస్తున్న ఇందులో చార్లీ బాలసర్వం ఆర్జే అర్చన ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాగా మే నెల చివరి వారంలో ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. దీనికి జీవీ. ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని ఆర్డీ రాజశేఖర్ చాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్రం నటి రుహానీశర్మకు మంచి బ్రేక్ వస్తుందేమో చూడాలి. స్టార్ వంటి హిట్ చిత్రం తర్వాత నటుడు కవిన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కావడం, దర్శకుడు వెట్రిమారన్ నిర్మిస్తున్న చిత్రం కావడంతో మాస్క్‌పై మంచి అంచనాలే నెలకొంటున్నాయి. -
పల్లెటూరి పొలం గట్లపై రచ్చచేస్తున్న పాపులర్ బ్యూటీ ఫోటోలు వైరల్
-
‘శ్రీరంగ నీతులు’ మూవీ రివ్యూ
టైటిల్: శ్రీరంగ నీతులు నటీనటులుః సుహాస్, కార్తీక్‌రత్నం, రుహానిశర్మ, విరాజ్ అశ్విన్, కిరణ్, రాగ్ మయూర్, దేవి ప్రసాద్ తదితరులు నిర్మాణ సంస్థ: రాధావి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత: వెంకటేశ్వరరావు బల్మూరి దర్శకుడు: ప్రవీణ్ కుమార్ సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్, అజయ్ అరసాడ సినిమాటోగ్రఫీ: టీజో టామీ శ్రీరంగ నీతులు కథేంటంటే.. ఈ సినిమా కథంతా మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంది. బస్తీకి చెందిన శివ(సుహాస్) టీవీ కంపెనీలో జాబ్ చేస్తుంటాడు. అతనికి ఫ్లెక్సీల పిచ్చి. బతుకమ్మ సందర్భంగా ఆ ఏరియాలోని గ్రౌండ్లో ఎమ్మెల్యేతో కలిసి దిగిన ఫోటోతో ఫ్లెక్సీ కట్టిస్తాడు. అయితే దాన్ని రాత్రికి రాత్రే ఎవరో మాయం చేస్తారు. మరో ప్లెక్సీ కట్టించడానికి డబ్బులు ఉండవు. ఎలాగైన పండక్కి గ్రౌండ్లో తన ప్లెక్సీ ఉండాలనుకుంటాడు. దాని కోసం శివ ఏం చేశాడు? చివరకు ఏం జరిగింది? మరోవైపు వరుణ్(విరాజ్ అశ్విన్), ఐశ్వర్య(రుహానీ శర్మ) ప్రేమించుకుంటారు. తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పడానికి భయపడుతుంది ఐశ్వర్య. పెళ్లి చేసుకుందామని వరుణ్ పదే పదే అడగడంతో ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పేందుకు రెడీ అవుతుంది. ఇంతలోపు ఆమె తండ్రి ఓ పెళ్లి సంబంధం తీసుకొస్తాడు. వారికి అమ్మాయి నచ్చడంతో త్వరలోనే పెళ్లి చేయాలనుకుంటారు. ప్రేమ విషయాన్ని చెప్పలేక, పెద్దలు చూసిన సంబంధం చేసుకోలేక సతమతమవుతారు. దీంతో పాటు ఐశ్వర్యకు మరో సమస్య వస్తుంది. ఆది ఏంటి? చివరకు వరుణ్, విరాజ్‌లు పెళ్లి చేసుకున్నారా లేదా? ఇంకోవైపు ఉన్నత చదువులు చదివిన కార్తిక్(కార్తీక్ రత్నం) డ్రగ్స్‌కి అలవాటు పడి జులాయిగా తిరుగుతుంటాడు. ఇంట్లోనే గంజాయి మొక్కలు పెంచుతున్నాడని తెలిసి అతన్ని పట్టుకోవడం కోసం పోలీసులు తీరుగుతుంటారు. కొడుకును పోలీసులకు చిక్కకుండా కాపాడుకునే క్రమంలో తండ్రి(దేవీ ప్రసాద్) చిక్కుల్లో పడతాడు. చివరకు తండ్రిని కూడా పోలీసులు పట్టుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? కార్తిక్ డ్రగ్స్‌కు ఎందుకు బానిసయ్యాడు? చివరకు ఈ ముగ్గురి జీవితాల్లో వచ్చిన మార్పు ఏంటి? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. జీవితంలో ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు. అలాంటి వారికి ఒక్క చాన్స్ ఇస్తే వారి తప్పులను తెలుసుకొని మారిపోయే అవకాశం ఉంటుంది. ఇదే విషయాన్ని ‘శ్రీరంగ నీతులు’ సినిమా ద్వారా చెప్పాడు దర్శకుడు ప్రవీణ్ కుమార్ వీఎస్ఎస్. అలాగే నేటి యువత చేస్తున్న ప్రధాన తప్పులను మూడు పాత్రల రూపంలో చూపిస్తూ.. చివర్లో మంచి సందేశాన్ని ఇచ్చాడు. పేరు కోసం ఒకరు.. పరువు కోసం మరోకొరు.. ఫెయిల్యూర్ని తీసుకోకుండా పెడదారి పట్టేది ఇంకొకరు.. వీరంతా అలా ప్రవర్తించడానికి కారణం సమాజమే. ఇతరులను నిందించడం మానేసి వారికొక అవకాశం ఇస్తే మార్పు వస్తుందని ఈ కథ తెలియజేస్తుంది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది కానీ.. తెరపై దాన్ని క్లారిటీగా చూపించడంలో కాస్త తడబడ్డాడు. ప్రధాన పాత్రల ప్రవర్తన విషయంలో క్లారిటీ మిస్ అయింది. శివకి ప్లెక్సీ అంటే ఎందుకంత ఇష్టం? ఉన్నత చదవులు చదివిన కార్తిక్ ఎందుకు డ్రగ్స్‌కి బానిసయ్యాడు? అనేది ఇంకాస్త క్లారిటీగా చూపిస్తే బాగుండేది. ఆ పాత్రల్లో వచ్చిన మార్పుకు గల కారణం కూడా బలంగా లేదు. అయితే ఈ రెండు పాత్రలు వాస్తవికానికి దగ్గరగా ఉంటాయి. ఇప్పటి యువతకి..ముఖ్యంగా ఊరు, బస్తీల్లో ఉండేవారికి ప్లెక్సీల పిచ్చి ఎక్కువగా ఉంటుంది. పండగ వేళల్లో రాజకీయ నాయకులతో దిగిన ఫోటోలతో హడావుడి చేస్తుంటారు. ఇదే విషయాన్ని శివ పాత్ర రూపంలో కళ్లకు కట్టినట్లు చూపించారు. రుహానీ శర్మ, విరాజ్ అశ్విన్‌ల పాత్రల ద్వారా ఈ తరం ప్రేమికులు పడుతున్న ఇబ్బందులను చూపించారు. టాలెంట్ ఉన్నా.. సరైన గైడెన్స్ లేక, ఫెయిల్యూర్ సమయంలో భుజం తట్టి అండగా నిలిచేవారు లేక యువత ఎలా పెడదారిన పడుతున్నారనేది కార్తీక్ రత్నం పాత్ర ద్వారా చూపించాడు. అయితే ఈ మూడు కథల మెసేజ్ బాగున్నప్పటికీ కథనం స్లోగా సాగడంతో సాగదీతగా అనిపిస్తుంది. కథలో పెద్దగా మలుపులు, ట్విస్టులు ఉండవు. క్లైమాక్స్ కూడా రొటీన్‌గానే ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలోని ప్రధాన పాత్రలు పోషించినవారంతా సహజ నటనతో ఆకట్టుకున్నారు. బస్తీకి చెందిన శివ పాత్రలో సుహాస్ ఒదిగిపోయాడు. ఇక డ్రగ్స్‌కి బానిసైన కార్తిక్‌గా కార్తిక్ రత్నం అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. అతని సంభాషణలు తక్కువే అయినా.. గుర్తిండిపోతాయి. కార్తిక్ తండ్రి పాత్రకి దేవి ప్రసాద్ న్యాయం చేశాడు. ప్రేమ జంట వరుణ్-ఐశ్వరగా విరాజ్ అశ్విన్, రుహానీ శర్మలు చక్కగా నటించారు. కిరణ్, రాగ్ మయూర్, తనికెళ్ల భరణితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. నేపథ్యం సంగీతం, సినిమాటోగ్రపీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
ట్రైలర్‌తో ‘శ్రీరంగనీతులు’ చెబుతున్న సుహాస్
సుహాస్, కార్తీక్ రత్నం, విరాజ్ అశ్విన్, రుహానీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘శ్రీరంగనీతులు’. ప్రవీణ్‌కుమార్ వీఎస్ఎస్ దర్శకుడు. వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మాత. త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఈ చిత్రం సిద్దంగా ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. రీసెంట్గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో హిట్ కొట్టిన సుహాస్ ఇప్పుడు ‘శ్రీరంగనీతులు’ చెప్పేందుకు వస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. నేటి యువత ఆలోచనలు, కుటుంబ బంధాలు, వినోదం.. ఇలా అన్ని అంశాలతో ఈ చిత్రం ఉండనుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి టైటిల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. 'వినరా వినరా చెబుతా వినరా.. ఈ కాలం శ్రీరంగనీతులు' అంటూ సాగే పాట ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను పెంచుతున్నాయి. -
మనసుని హత్తుకునేలా ‘శ్రీరంగ నీతులు’.. రిలీజ్‌ఎప్పుడంటే?
రుహానీ శర్మ, సుహాస్, కార్తీక్ రత్నం, విరాజ్ అశ్విన్ ముఖ్య తారలుగా ప్రవీణ్‌కుమార్ వీఎస్ఎస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీరంగ నీతులు’. వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మించిన ఈ సినిమాని ఏప్రిల్ 12న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ వీఎస్ఎస్ మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘శ్రీరంగ నీతులు’. యువతరం భావోద్వేగాలు, సహజంగా సాగే మాటలు, మనసుని హత్తుకునే సన్నివేశాలు ఉంటాయి. కొత్తదనంతో పాటు వాణిజ్య అంశాలతో రూపొందిన మా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు. ‘‘నేటి యువత ఆలోచనలు, కుటుంబ బంధాలు, వినోదం.. ఇలా అన్ని అంశాల కలయికతో అందర్నీ అలరించేలా ఈ మూవీని తెరకెక్కించాడు దర్శకుడు’’ అన్నారు వెంకటేశ్వరరావు బల్మూరి. ఈ చిత్రానికి కెమెరా: టీజో టామీ, సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్, అజయ్ అరసాడ. -
మరింత క్యూట్‌గా అనసూయ.. ఒక్కసారిగా షాకిచ్చిన రుహానీ శర్మ!
పొట్టి నిక్కర్లో మరింత క్యూట్‌గా యాంకర్ అనసూయ చెక్స్ డ్రస్‌లో మోడ్రన్ మహాలక్ష్మిలా హీరోయిన్ కృతిశెట్టి దేవకన్యలా ధగధగా మెరిసిపోతున్న సచిన్ కూతురు సారా గ్లామర్ చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న బిగ్‌బాస్ స్రవంతి హీటెక్కించే లుక్‌తో షాకిచ్చిన హీరోయిన్ రుహానీ శర్మ క్లాస్ లుక్‌లో క్యూట్ అండ్ స్వీట్‌గా మలయాళ బ్యూటీ నిమిషా తెలుగు హీరోయిన్ అంజలి కేక పుట్టించే లుక్.. చూస్తే అంతే View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Sara Tendulkar (@saratendulkar) View this post on Instagram A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by NIMISHA BINDU SAJAYAN (@nimisha_sajayan) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaj) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Vaani Kapoor (@_vaanikapoor_) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) -
ఎంగేజ్మెంట్ హడావుడిలో సాయిపల్లవి.. మరింత క్యూట్‌గా అనుపమ
అనాథ పిల్లలతో 'గుంటూరు కారం' చూసిన సితార చెవిలో పువ్వు పెట్టుకుని అనుపమ క్యూట్‌నెస్ డిఫరెంట్ చీరలో అంతే డిఫరెంట్‌గా ఆలియా భట్ పసుపు పచ్చని చీరలో సోయగాలతో రుహానీ శర్మ నాభితో పాటు అందాల జాతర చేస్తున్న అనికా మలయాళ బ్యూటీ అదితీ రవి మెల్ట్ అయ్యే పోజులు చెల్లి ప్రీ ఎంగేజ్మెంట్ హడావుడిలో సాయిపల్లవి క్రేజీ వింటేజ్ లుక్‌లో అలా కనిపిస్తున్న యాంకర్ శ్రీముఖి View this post on Instagram A post shared by sitara 🪩 (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Roopashree nair(Anicka Vikramman) (@anickavikramman) View this post on Instagram A post shared by Aditiii🔥Ravi (@aditi.ravi) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Samyuktha Hegde (@samyuktha_hegde) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) -
‘సైంధవ్’ మూవీ రివ్యూ
టైటిల్: సైంధవ్ నటీనటులు: వెంకటేశ్,నవాజుద్దీన్ సిద్ధిఖీ, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, ఆర్య, బేబీ సారా, జయప్రకాశ్ తదితరులు నిర్మాణ సంస్థ: నిహారిక ఎంటర్టైన్మెంట్ దర్శకత్వం: శైలేష్ కొలను సంగీతం: సంతోష్ నారాయణన్ సినిమాటోగ్రఫీ: ఎస్. మణికందన్ ఎడిటర్: గ్యార్రి బి.హెచ్ విడుదల తేది: జనవరి 13, 2024 సైంధవ్ కథేంటంటే... ఈ సినిమా కథ అంతా చంద్రప్రస్థ అనే ఫిక్షనల్ టౌన్ చుట్టూ తిరుగుతుంది. అక్కడ డ్రగ్ సరఫరా, గన్ బిజినెస్..లాంటి అసాంఘిక కార్యక్రమాలు విచ్చలవిడిగా జరుగుతుంటాయి. కార్టెల్ లీడర్ విశ్వామిత్ర (ముఖేష్ రిషి) ఆధ్వర్వంలో ఇదంతా జరుగుతుంది. ఓ సారి విశ్వామిత్రకు 20 వేలమంది యువతతో పాటు గన్స్, డ్రగ్స్ సరఫరా చేసే డీల్ వస్తుంది. ఆ పనిని తన వద్ద పని చేసే మాఫియా లీడర్ వికాస్ మాలిక్(నవాజుద్దీన్ సిద్ధిఖి)కి అప్పగిస్తాడు. అతను తన అనుచరురాలు జాస్మిన్(ఆండ్రియా)తో ఈ డీల్ సక్రమంగా జరిగేలా చూస్తుంటాడు. అదే సమయంలో ఐదేళ్ల క్రితం వెళ్లిపోయిన సైంధవ్ కోనేరు అలియాస్ సైకో(వెంకటేష్) తిరిగి చంద్రప్రస్థ టౌన్‌కి వస్తాడు. అతనికి కూతురు గాయత్రి(సారా పాలేకర్) అంటే ప్రాణం. చంద్రప్రస్థలో పోర్ట్‌లో పని చేస్తూ కూతురుతో కలిసి జీవిస్తుంటాడు. పక్కింట్లో నివాసం ఉంటున్న మనో(శ్రద్ధా శ్రీనాథ్)కి సైంధవ్ అంటే చాలా ఇష్టం. భర్త (గెటప్ శ్రీను) కొట్టడంతో అతనిపై కేసు పెట్టి, ఒంటరిగా ఉంటుంది. గాయత్రిని సొంత కూతురిలా చూసుకుంటుంది. ఓ సారి స్కూల్లో సడెన్‌గా పడిపోతుంది గాయత్రి. ఆస్పత్రికి తీసుకెళ్తే.. స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే నరాల వ్యాధి సోకిందని, పాప బతకాలంటే రూ. 17 కోట్లు విలువ చేసే ఇంజెక్షన్ ఇవ్వాలని డాక్టర్లు చెబుతారు. డబ్బు కోసం విశ్వామిత్ర, వికాస్ మాలిక్‌ను చంపడానికి మైఖేల్ (జిషు సేన్ గుప్తా)తో డీల్ కుదుర్చుకుంటాడు సైంధవ్. అసలు సైంధవ్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఐదేళ్ల క్రితం ఏం జరిగింది? కలిసి బిజినెస్ చేస్తున్న విశ్వామిత్ర, వికాస్ మాలిక్‌లను చంపేందుకు మైఖేల్ ఎందుకు ప్రయత్నించాడు? కూతురు ప్రాణాలు కాపాడుకోవడం కోసం సైంధవ్ ఏం చేశాడు? చివరకు కూతుర్ని రక్షించుకున్నాడా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ‘గతాన్ని పక్కన పెట్టి సామాన్య జీవితం గడుపుతున్న హీరోకి సమస్య రావడం.. మళ్లీ పాత శత్రువులతో యుద్ధం చేయడం.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.. భారీ యాక్షన్ సీన్‌తో కథను ముగించడం’ ఈ తరహా కాన్సెప్ట్‌తో భాషా మొదలు కొని మొన్నటి జైలర్ వరకు చాలా సినిమాలు వచ్చాయి. సైంధవ్ కథ కూడా ఇలానే ఉంటుంది. కథలో యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్ అన్నీ ఉన్నా.. ఏ ఒక్కటీ ఆకట్టుకునేలా తీర్చిదిద్దలేకపోయాడు దర్శకుడు శైలేష్ కొలను. కథను బలంగా రాసుకున్నాడు కానీ.. స్క్రీన్‌ప్లేని సరిగా పట్టించుకోలేకపోయాడు. ప్రేక్షకుల్ని థ్రిల్ చేసేలా ఒక్క సన్నివేశాన్ని కూడా తీర్చిదిద్దలేకపోయాడు. కొన్ని సన్నివేశాల మధ్య కనెక్షన్ కూడా సరిగా లేదు. ఎంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా.. తెరపై చూస్తే కొంతవరకు అయినా నమ్మేలా ఉండాలి. చుట్టూ వందల మంది ఉండడం.. వారి చేతుల్లో పెద్ద పెద్ద గన్స్ ఉన్నా.. హీరో మాత్రం ఓ చిన్న గన్‌తో వాళ్లందరినీ మట్టుపెట్టడం ఏంటి? పైగా ఓ సీన్లో హీరోకి బుల్లెట్ తాకుతుంది.. అది స్పష్టంగా చూపిస్తారు కూడా.. కాసేపటికి హీరో ఒంటిపై ఆ గాయం కూడా కనిపించదు? ఇదెలా సాధ్యం? పది నిమిషాల్లో ఇంటికి వచ్చిన విలన్లను ‘లెక్క మారుతుందిరా నా కొడకల్లారా’ అంటూ కొట్టి చంపడమే కాదు ఎక్కడో దూరంలో ఉన్న పోర్ట్‌కి వెళ్లి వాళ్లను సముద్రంలో పడేసి వస్తాడు? ఎంత లెక్క మారినా.. అది ఎలా సాధ్యం అవుతుంది? ఇలాంటి లాజిక్ లెస్ సీన్స్ చాలానే ఉన్నాయి. ఏ దశలోనూ సినిమా రక్తి కట్టదు. డ్రగ్స్ డీల్.. 20 వేల మంది యువత సరఫరా అంటూ సినిమాను చాలా ఆసక్తికరంగా ప్రారంభించాడు దర్శకుడు. హీరో ఎంట్రీ తర్వాత కథ ఫాదర్-డాటర్ సెంటిమెంట్ వైపు సాగుతుంది. అయితే సినిమా ప్రారంభంలోనే సైకో వచ్చాడని విలన్లు భయపడడం చూస్తే.. ఫ్లాష్ బ్యాక్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే ఆ స్టోరీని పక్కకి పెట్లి ఫాదర్-డాటర్ సెంటిమెంట్‌తో ఫస్టాఫ్‌ని నడిపించాడు. డబ్బు కోసం హీరో ప్రయత్నించడం.. ఈ క్రమంలో ఎదురయ్యే సమస్యలతో ఫస్టాఫ్ పర్వాలేదనిపిస్తుంది. కానీ సెకండాఫ్‌లో మాత్రం కేవలం యాక్షన్ ఎపిసోడ్లపైనే ఎక్కువగా ఫోకస్ చేశాడు. అందువల్ల భావోద్వేగాలు బలంగా పండలేదు. పోనీ యాక్షన్ ఎపిసోడ్స్ అయినా ఆసక్తికరంగా ఉంటాయా అంటే.. అదీ లేదు. కాల్పుల మోతే తప్ప ఏమీ ఉండదు. కొన్ని పాత్రలకు సరైన ముగింపు ఉండదు. ఇక క్లైమాక్స్ ఎలా ఉంటుందో సినిమా ప్రారంభంలోనే తెలిసిపోతుంది. తెరపై కూడా అంత ఆసక్తికరంగా చూపించలేకపోయాడు. కథ బాగుంది కానీ స్క్రీన్‌ప్లే విషయంలో దర్శకుడు ఇంకాస్త జాగ్రత్త పడుంటే ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. సైంధవ్ పాత్రలో ఒదిగిపోయాడు వెంకటేశ్. యాక్షన్ తో పాటు ఎమోషనల్ సీన్స్‌లో కూడా అద్భుతంగా నటించాడు. తెరపై స్టైలిష్‌గా కనిపించాడు. వెంకటేశ్ తర్వాత ఈ సినిమాలో బలంగా పండిన పాత్ర నవాజుద్దీన్ సిద్ధిఖిది. ఆయన పాత్రను తిర్చిదిద్దిన విధానం బాగుంది. తెలుగు,హిందీని మిక్స్ చేస్తూ ఆయన చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. మనోగా శ్రద్ధా శ్రీనాథ్ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. జాస్మిన్‌గా ఆండ్రియా యాక్షన్ సీన్ అదరగొట్టేసింది. ఆర్యది కేవలం అతిథి పాత్రే. ముఖేష్ రుషి, జిష్షు సేన్ గుప్తా, రుహానీ శర్మ, జయప్రకాశ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేంతిక పరంగా సినిమా పర్వాలేదు. సంతోష్ నారాయణన్ పాటలు, నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఈ హీరోయిన్‌కు విరాట్ బావ అవుతాడట! కోహ్లి గురించి ఏమందంటే?
'చి.ల.సౌ.' సినిమాతో తెలుగులో హీరోయిన్గా పరిచయమైంది రుహానీ శర్మ. ‘హిట్’, ‘డర్టీ హరి’, ‘101 జిల్లాల అందగాడు’ వంటి పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ హీరోయిన్గా సినిమాలు చేస్తోంది. తాజాగా ఆమె విక్టరీ వెంకటేశ్ 'సైంధవ్' మూవీలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. వెంకీ మామకు అభిమానిని తాజాగా ఓ కార్యక్రమానికి వెళ్లిన ఈ బ్యూటీ తన గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'నేను చిన్నప్పటినుంచి వెంకీ సర్ సినిమాలు చూస్తూ పెరిగాను. సైంధవ్‌లో నటించాక ఆయనకు ఇంకా పెద్ద అభిమానిగా మారాను. ఇప్పుడాయనతో సినిమా చేయడం సంతోషంగా ఉంది. చిన్నప్పటినుంచి డాక్టర్ అవ్వాలని కోరికగా ఉండేది. కానీ సినిమాల్లోకి వచ్చాను. ఇప్పుడు సైంధవ్‌లో డాక్టర్ పాత్ర పోషించడం సంతోషంగా ఉంది' అని చెప్పుకొచ్చింది. అక్కడున్న విలేఖరి.. అనుష్క శర్మతో మీ అనుబంధం ఎలా ఉంటుంది? అని ప్రశ్నించింది. విరాట్ బావ ెలా ుంటాడంటే? ఇది విని అవాక్కైన హీరోయిన్.. 'నేను ఈ విషయం గురించి ఎప్పుడూ, ఎక్కడా మీడియా ముందు చెప్పలేదు. గోప్యంగానే ఉంచాను. మీకెలా తెలిసింది? అడిగారు కాబట్టి చెప్తున్నా.. అవును, అనుష్క నాకు సోదరి అవుతుంది' అని చెప్పింది. దీంతో విలేఖరి.. 'అనుష్క అక్క అంటే విరాట్ కోహ్లి బావ అవుతాడు.. మీ బావ మీతో ఎలా ఉంటాడు?' అని అడిగింది. రుహానీ మాట్లాడుతూ.. 'విరాట్ నాతో చాలా బాగుంటాడు. వాళ్లిద్దరూ ఫిల్టర్ లేకుండా చాలా సింపుల్‌గా ఉంటారు. అది నాకు బాగా నచ్చుతుంది' అని చెప్పుకొచ్చింది. రుహానీ శర్మకు విరాట్- అనుష్క దగ్గరి బంధువులే అని తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. చదవండి: 'విక్రమ్‌కు అస్సలు నటించడమే రాదు'.. నటి భర్త, డైరెక్టర్ సంచలన కామెంట్స్! -
ప్రతి ఒక్కరి పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంది
-
ముద్దొచ్చే ఫోజులతో రుహాని శర్మ..చీరలో సెగలు రేపుతుందిగా (ఫోటోలు)
-
స్టన్నింగ్ లుక్‌తో అదిరిపోతున్న రుహానీ శర్మ ధరించిన చీర ఎంతంటే..?
బిజీ లైఫ్‌కి కాస్త బ్రేక్ ఇచ్చి ఓ టూర్‌కి వెళ్లొస్తే కావల్సినంత ఉత్సాహం, ఎనర్జీ వస్తాయి. కొత్త ప్రదేశాలు చూడటం, కొత్త వ్యక్తుల్ని కలుసుకోవడం వల్ల మన ఆలోచన తీరే మారిపోతుంది. ఆ ఇన్స్పిరేషన్తోనే ఫ్యాషన్ విషయంలోనూ ఎప్పుడూ కొత్తగా ట్రై చేస్తుంటా! అంటోంది రుహానీ శర్మ. ఇక ఆమె నటించిన సినిమాలు విజయం సాధించకపోయినా, సోషల్ మీడియాలో ఆమెకున్న ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. కారణం.. అప్ టు డేట్‌గా ఉండే ఆమె ఫ్యాషన్ స్టయిలే! ఆ యూనిక్‌నెస్ కోసం రుహానీ ఫాలో అవుతున్న ఫ్యాషన్ బ్రాండ్స్‌లో ఇవీ ఉన్నాయి.. రియా జ్యూయెల్స్.. ట్రెండీ డిజైన్స్‌కు పెట్టింది పేరు రియా జ్యూయెల్స్. ఇదొక ఆన్లైన్ జ్యూలరీ స్టోర్. ఆకట్టుకునే.. వైవిధ్యమైన డిజైన్స్‌ను రూపొందిస్తూ యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అన్ని రకాల బంగారు, వెండి, బంగారు పూత నగలతోపాటు ఫ్యూజన్, నక్షీ, నవరతన్ వంటి ఇతర డిజైనర్ నగలూ ఇక్కడ లభిస్తాయి. ధర.. ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. కేవలం వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మాత్రమే కొనుగోలు చేసే వీలుంది. నీరూస్.. నాలుగు దశాబ్దాలుగా ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న దేశీ బ్రాండ్ నీరూస్! దీనిని 1971లో హరీష్ కుమార్ ప్రారంభించారు. చక్కటి ఎంబ్రాయిడరీ, అందమైన డిజైన్స్‌లో లభించే వీరి దుస్తులకు మంచి ఆదరణ దొరకడంతో 1983లో ‘నీరూస్ టెక్స్టైల్స్’ పేరుతో ఫ్యాబ్రిక్ తయారీ సంస్థనూ ప్రారంభించారు. ఈ బ్రాండ్ డిజైన్స్‌కు విదేశాల్లోనూ డిమాండ్ ఎక్కువే. అయినా ధరలు సామాన్యులకు అందుబాటులోనే ఉంటాయి. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. రుహానీ శర్మ ధరించిన నీరూస్ డిజైన్ చీర రూ. 24, 190/- --దీపిక కొండి -
వారివల్లే ఈ ప్రయాణం సాధ్యమైంది
‘‘నా మొదటి సినిమా(కలియుగ పాండవులు) నుంచి ఇప్పుడు 75వ సినిమా ‘సైంధవ్’ వరకూ నన్ను ఎంతగానో ప్రేమించి, ఆదరించి, అభిమానిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మీ ప్రేమ, అభిమానం, ఆప్యాయత వల్లే ఈ ప్రయాణం సాధ్యపడింది. ఇందుకు ప్రేక్షకులకు, నా అభిమానులకు, చిత్ర పరిశ్రమకు ధన్యవాదాలు’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘సైంధవ్’. నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా, సారా కీలక పాత్రల్లో నటించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ‘సైంధవ్’ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో జనవరి 13న విడుదల కానుంది. ఈ మూవీ టీజర్ లాంచ్ వేడుకలో వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘బలమైన భావోద్వేగాలు, యాక్షన్‌కి అవకాశం ఉన్న కథ ‘సైంధవ్’. కుటుంబ ప్రేక్షకులందరికీ సినిమా నచ్చుతుంది. ఇందులో నన్ను కొత్తగా చూస్తారు. గతంలో నా సినిమాలు ‘చంటి, కలిసుందాం రా, లక్ష్మి’ సంక్రాంతికి వచ్చి, హిట్ అయ్యాయి. ఇప్పుడు ‘సైంధవ్’ వస్తోంది. సంక్రాంతి రోజు ప్రేక్షకులు ఒక మంచి సినిమా చూడబోతున్నారు’’ అన్నారు. ‘‘ఈ మూవీ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు నవాజుద్దీన్ సిద్ధిఖీ. ‘‘వెంకటేశ్‌గారి ప్రతిష్టాత్మక 75వ చిత్రానికి దర్శకత్వం చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు’’ అన్నారు శైలేష్ కొలను. ‘‘వెంకటేశ్‌గారితో సినిమా చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు వెంకట్ బోయనపల్లి. -
49 ఏళ్ల బ్యూటీ హాట్ లుక్.. దేవకన్యలా ఆ తెలుగు హీరోయిన్
వైట్ అండ్ వైట్‌లో రుహానీ అందాల విందు సోఫాపై పడుకుని హీరోయిన్ శ్రద్ధా దాస్ వయ్యారాలు ఈ వయసులోనూ రెచ్చిపోతున్న మలైకా అరోరా చాలారోజుల తర్వాత ఐశ్వర్యా రాజేశ్ గ్లామర్ వీడియో సెల్ఫీ పోజుల్లో హెబ్బా పటేల్ సోయగాలు చీరకట్టులోనూ అందాల్ని చూపిస్తున్న శోభిత బ్లాక్ స్కిన్ ఫిట్ డ్రస్‌లో నభా నటేశ్ పింక్ ఫ్రాక్‌లో మెగా డాటర్ నిహారిక View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by ELLE India (@elleindia) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Aisha (@aishasharma25) -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సినిమాలు థియేటర్లలో రిలీజవ్వడం ఎంత ముఖ్యమో ఓటీటీలో విడుదలవడం కూడా అంతే ముఖ్యమైపోయింది. ఎల్లప్పుడూ జనాలకు అందుబాటులోకి ఉండేందుకు ఓటీటీలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కొన్ని చిత్రాలు థియేటర్లో విడుదలైన రెండు, మూడు వారాలకు ఓటీటీ డేట్ చెప్పి మరీ డిజిటల్ స్ట్రీమింగ్కు వస్తున్నాయి. మరికొన్ని మాత్రం గప్‌చుప్‌గా ఓటీటీలో ప్రత్యక్షమవుతున్నాయి. కట్టప్ప సత్యరాజ్ తనయుడు సిబి సత్యరాజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మాయోన్ మూవీ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సంగతి తెలిసిందే కదా! ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా మరో థ్రిల్లర్ మూవీ ఓటీటీలో ప్రత్యక్షమై సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. అదే 'హర్'. రుహాని శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను శ్రీధర్ స్వరాఘవ్ డైరెక్ట్ చేశారు. డబుల్ అప్ మీడియాస్‌పై రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి నిర్మించారు. జూలై 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా దాదాపు రెండు నెలల తర్వాత ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. హర్ సినిమా కథేంటంటే.. ఏసీపీ అర్చన ప్రసాద్ (రుహానీ శర్మ).. కేశవను పట్టుకునే ఆపరేషన్‌లో భాగంగా తన ప్రియుడైన శేషాద్రి (వికాస్ వశిష్ట)ను పోగొట్టుకుంటుంది. తర్వాత ఆమె ఆరు నెలలు సస్పెన్షన్‌కు గురవుతుంది. డ్యూటీలో తిరిగి జాయిన్ అయ్యే టైంలోనే సిటీలో రెండు హత్యలు జరుగుతాయి. విశాల్, స్వాతి హత్యలను చేధించే సమయంలో కేశవకు సంబంధించిన లింక్ దొరుకుతుంది. మరి అర్చన.. కేశవను పట్టుకుందా? సిటీలో జరిగిన రెండు హత్యలకు ఏదైనా కనెక్షన్ ఉందా? ఈ కేసును ఆమె ఎలా పరిష్కరించింది? అనే విషయాలు తెలియాలంటే ఓటీటీలో చూసేయండి. చదవండి: లక్షలు మోసపోయాడు, ఇంట్లోకే రానన్నాడు, పెళ్లెప్పుడంటే.. పల్లవి ప్రశాంత్ పేరెంట్స్ -
వెంకటేశ్ 'సైంధవ్' కొత్త షెడ్యూల్.. అక్కడ షూటింగ్
వెంకటేశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్’. ఈ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ కర్ణాటకలోని బీదర్‌లో ప్రారంభమైంది. వెంకటేశ్ పాల్గొంటున్న ఈ షెడ్యూల్లో ఓ యాక్షన్ సీక్వెన్స్ ను ప్లాన్ చేశారట శైలేష్ కొలను. తాజాగా మొదలైన బీదర్ షెడ్యూల్ ఈ నెలాఖరు వరకూ సాగుతుందట. సెప్టెంబరులో ప్లాన్ చేసిన ఓ విదేశీ షెడ్యూల్‌తో ‘సైంధవ్’ చిత్రీకరణ దాదాపు పూర్తవుతుందని, వినాయక చవితి పండగ సందర్భంగా టీజర్‌ను విడుదల చేసే ఆలోచనలో చిత్రయూనిట్ ఉన్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ‘సైంధవ్’ చిత్రం డిసెంబరు 22న విడుదల కానుంది. ఈ సినిమాకు సహ నిర్మాత: కిషోర్ తాళ్లూరు, సంగీతం: సంతోష్ నారాయణ్. -
HER: Chapter 1 Movie Review - ‘హర్’ మూవీ రివ్యూ
టైటిల్: హర్ నటీనటులు: రుహానీ శర్మ, వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్,అభిగ్న్య, బెనర్జీ తదితరులు నిర్మాణ సంస్థ: డబుల్ అప్ మీడియాస్ నిర్మాతలు: రఘు సంకురాత్రి, దీప సంకురాత్రి దర్శకత్వం: శ్రీధర్ స్వరాఘవ్ సంగీతం: పవన్ సినిమాటోగ్రఫీ: విష్ణు బేసి ఎడిటింగ్: చాణక్య తూరువు విడుదల తేది: జులై 21, 2023 చిలసౌ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది రుహానీ శర్మ. ఆ సినిమాతో క్లాస్ ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు యాక్షన్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించింది. ఆమె నటించిన హర్ (Her Chapter 1)చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంతో రుహానీ శర్మ యాక్షన్ హీరోయిన్గా ప్రేక్షకుల్లో ముద్ర వేసిందా? లేదా? అన్నది చూద్దాం. కథ ఏంటంటే?.. ఏసీపీ అర్చన ప్రసాద్ (రుహానీ శర్మ) కేశవను పట్టుకునే ఆపరేషన్‌లో భాగంగా తన ప్రియుడైన శేషాద్రి (వికాస్ వశిష్ట)ను పోగొట్టుకుంది. ఆ తరువాత అర్చన ప్రసాద్ ఆరు నెలలు సస్పెన్షన్‌కు గురవుతుంది. డ్యూటీలో తిరిగి జాయిన్ అయ్యే టైంలోనే సిటీలో రెండు హత్యలు జరుగుతాయి. విశాల్, స్వాతి హత్యలను చేధించే టైంలో కేశవకు సంబంధించిన లింక్ దొరుకుతుంది. కేశవను పట్టుకోవాలనే తన కోరిక నెరవేరుతుందా? అసలు విశాల్, స్వాతిలు ఎవరు? వారిద్దరి మధ్య ఉన్న బంధం ఏంటి? వారిని చంపింది ఎవరు? అర్చన ప్రసాద్ ఈ కేసును ఎలా పరిష్కరిస్తుంది? అనేది కథ. ఎలా ఉందంటే.. కాప్ డ్రామాలు ఎన్నో వస్తుంటాయి. పోలీస్ ఇన్వెస్టిగేషన్లు ఎలా ఉంటాయో ఎన్నో సినిమాల్లో చూశాం. క్రైమ్ థ్రిల్లర్ మూవీలకు స్క్రీన్ ప్లే ముఖ్యం. హర్ సినిమా విషయానికి వస్తే.. కథ, కథనాలు ఏమంత కొత్తగా అనిపించకపోవచ్చు. కానీ దర్శకుడు మాత్రం రెండు గంటల సేపు ప్రేక్షకుడ్ని కూర్చుండబెట్టేస్తాడు. బోర్ కొట్టించకుండా సినిమాను నడిపించేశాడు. ఆ విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. మొదటి సినిమానే అయినా డైరెక్టర్ బాగానే హ్యాండిల్ చేశాడు. కొన్ని చోట్ల సీన్లను గమనిస్తే మనకు హిట్ సినిమా గుర్తుకు వచ్చే అవకాశాలుంటాయి. హర్ సినిమాను లాజిక్స్, ఎమోషన్స్ ఇలా అన్నింటిని మిక్స్ చేసి రాసుకోవడంతో ప్రేక్షకుడు ఎక్కడా బోరింగ్‌గా ఫీల్ కాడు. రెండో పార్టుకు కావాల్సినంత సరుకును ఉంచుకున్నాడు. ఈ మొదటి చాప్టర్లో కేవలం మర్డర్ కేసును మాత్రమే పరిష్కరించే పనిని పెట్టుకున్నాడు దర్శకుడు. దీంతో నిడివి కూడా చాలా తక్కువే అయింది. ప్రథమార్దంలో పాత్రల పరిచయం వరకే అన్నట్టుగా ఉంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది. కానీ ఆ ట్విస్ట్‌తో పెద్దగా మార్పులు జరగవు. ఇక క్లైమాక్స్ ఊహకు అందేలానే సాగుతుంది. సాంకేతికంగా ఈ సినిమా మెప్పిస్తుంది. ఆర్ఆర్ బాగుంది. కెమెరా వర్క్ మెప్పిస్తుంది. నిడివి తక్కువే. నిర్మాత ఈ కథతో ప్రయోగం చేసి సక్సెస్ అయినట్టు కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎవరెలా చేశారంటే.. ఏసీపీగా అర్చనా ప్రసాద్ చక్కగా నటించింది. తన హోదాకు తగ్గ హుందాతనాన్ని చూపిస్తుంది. చూపుల్తోనే కొన్ని సీన్లను లాక్కొచ్చింది. ఎంతో ఇంటెన్సిటీతో నటించింది. రుహానీ శర్మ ఈ సినిమాతో తనలోని మరో కోణాన్ని చూపించింది. శేషాద్రిగా, అర్చన ప్రియుడిగా వికాస్ వశిష్ట కనిపించేది కొంత సేపే అయినా గుర్తుండిపోతాడు. రవి వర్మ, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య పాత్రలు కూడా జనాల మీద ముద్ర వేస్తాయి. చిత్రం శ్రీను చిన్న పాత్రలో ఆకట్టుకుంటాడు. మిగిలిన పాత్రలన్నీ పరిధి మేరకు మెప్పిస్తాయి. -
రిస్క్ తీసుకొని హర్ చేశా
‘‘హర్’ సినిమా నా దగ్గరికి వచ్చినప్పుడు ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ నేను చేయగలనా? అని ఒక అనుమానం ఉండేది. కానీ డైరెక్టర్ శ్రీధర్‌గారు నాకు నమ్మకం ఇచ్చారు. రిస్క్ తీసుకొని మరీ ఈ సినిమా చేశాను’’ అని హీరోయిన్ రుహాని శర్మ అన్నారు. శ్రీధర్ స్వరాఘవ్ దర్శకత్వంలో రుహాని శర్మ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘హర్’. డబుల్ అప్ మీడియాస్‌పై రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి నిర్మించారు. సురేష్ మూవీస్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 21న ఈ మూవీ విడుదలవుతోంది. ఈ మూవీ ట్రైలర్‌ని హీరో వరుణ్ తేజ్ వర్చువల్‌గా లాంచ్ చేశారు. అనంతరం నిర్వహించిన ప్రెస్‌మీట్‌కి నిర్మాత రాజ్ కందుకూరి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడుతూ–‘‘హర్’ నేను ఇప్పటికే చూశాను.. సినిమా చాలా బాగుంది. తప్పకుండా మంచి హిట్ అవుతుంది’’ అన్నారు. శ్రీధర్ స్వరాగవ్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా మొదటి సీన్ నుంచి చివరి వరకు ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’ అన్నారు. -
హీరోయిన్ లుక్కే మార్చేశారుగా.. గన్నుతో ఏకంగా
'చి.ల.సౌ' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రుహానీ శర్మ డిఫరెంట్ గెటప్ లో కనిపించింది. HER (హెర్) లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తోంది. జూలై 21న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. సమ్ థింగ్ ఇంట్రెస్టింగ్ అనేలా ఈ ట్రైలర్ ఉండటం విశేషం. ట్రైలర్ లో రుహానీ శర్మ ఫుల్ సీరియస్ మోడ్ లో కనిపించింది. ఇంట్రెస్టింగ్ డైలాగ్స్ సినిమా రేంజ్ పెంచేలా ఉన్నాయి. మొత్తంగా చూస్తే.. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు క్రియేట్ చేస్తోంది. కెరీర్ లో రుహానీ శర్మ తొలిసారి ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తోంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో శ్రీధర్ స్వరాఘవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి నిర్మించారు. 'ఎప్పుడూ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేయాలని ఉండేది. ఈ సినిమా నన్ను ఆశ్చర్యపరిచింది. నా దగ్గరికి ఈ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఫిమేల్ ఓరియెంటెడ్ చేయగలనా అని ఒక డౌట్ ఉంది కానీ డైరెక్టర్ నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. రిస్క్ తీసుకొని ఈ సినిమా చేశాను. డైరెక్టర్ విజన్ కి తగ్గట్టు నటించానని అనుకుంటున్నాను. జులై 21 ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా చాలా రియలిస్టిక్ గా ఉంటుంది' అని రుహానీ శర్మ చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: రెచ్చిపోతున్న తమన్నా.. ఆ విషయం అర్థమైపోవడం వల్లే!) -
ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన రుహానీ శర్మ
రుహాణీ శర్మ పోలీసాఫీసర్‌గా నటించిన చిత్రం ‘హర్’. శ్రీధర్ స్వరాఘవ్ దర్శకత్వంలో రఘు సంకురాత్రి, దీపాసంకురాత్రి నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా ఈ సినిమా జూలై 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత డి. సురేష్‌బాబు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఇది. వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: పవన్. -
గ్లామర్‌కు నో చెప్పను, కానీ వల్గారిటీకి మాత్రం..: హీరోయిన్
రుహానీ శర్మ.. వెండి తెర నటి. ఇటు గ్లామరస్ రోల్స్.. అటు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను పోషిస్తూ కెరీర్ బ్యాలెన్స్ చేసుకుంటోంది. ఇప్పుడు వెబ్ తెరకూ పరిచయమై అక్కడా చక్కటి అవకాశాలను అందుకుంటోంది. ఆమె గురించి కొన్ని వివరాలు.. రుహానీ శర్మ సొంతూరు హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్. ఆర్ట్స్‌లో డిగ్రీ చేసిన ఆమె తొలుత కొన్ని వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది. అలా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోణ్‌తో కలసి ఓ యాడ్‌లో నటించింది. ఆ యాడ్ చూసిన దర్శకుడు రాహుల్ రవీంద్ర.. రుహానీకి సినిమా ఛాన్స్ ఇచ్చాడు.. ‘చి.ల.సౌ.’తో! అది ఆమెకు ఎంతోమంది అభిమానులను సంపాదించి పెట్టింది. తర్వాత ‘హిట్’, ‘డర్టీ హరి’, ‘101 జిల్లాల అందగాడు’ వంటి చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. తెలుగు సినిమాలే కాకుండా కొన్ని పంజాబీ కవర్ సాంగ్స్‌తో పాటు ‘కడైసి బెంచ్ కార్తీ’ అనే తమిళ చిత్రంలోనూ అభినయించింది. ఈ మధ్యనే ఓటీటీలోకి అడుగుపెట్టింది. ‘పాయిజన్’ అనే జీ5 వెబ్ సిరీస్‌తో. ఆమె రావడమే ఆలస్యం వరుస అవకాశాలు క్యూ కట్టాయి. సోనీలివ్‌లో స్ట్రీమింగ్‌లో ఉన్న ‘మీట్ క్యూట్’ అనే ఆంథాలజీతో స్టార్‌గా వెలుగుతోంది. ప్రస్తుతం ‘ఆగ్రా’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ‘హర్’ అనే మరో హిందీ చిత్రంతో పాటు, వెంకటేష్ 75వ చిత్రం ‘సైంధవ్’లోనూ నటిస్తోంది. సినిమా అంటేనే గ్లామర్. సో.. మితిమీరని గ్లామర్‌కు నో చెప్పను. కానీ, వల్గారిటీకి మాత్రం నేనెప్పుడూ వ్యతిరేకినే. – రుహానీ శర్మ చదవండి: కాబోయే భార్యను పరిచయం చేసిన కెవ్వు కార్తీక్ -
హిట్ కాంబినేషన్స్ రిపీట్.. ఆ హీరోయిన్సే కావాలంటున్న డైరెక్టర్స్!
ఫిలిం ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్‌కు చాలా క్రేజ్ ఉంటుంది. హిట్ అయిన సినిమాలో హీరో, హీరోయిన్స్ మళ్లీ నటిస్తున్నారన్నా.. సక్సెస్ సాధించిన సినిమా డైరెక్టర్, హీరో కాంబోలో మరో సినిమా తెరకెక్కుతుందన్నా.. సినీ అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకుతుంటాయి. అంతేకాదు బాక్సాఫీస్ వసూళ్లు...మార్కెట్ లెక్కలు మారిపోతుంటాయి. అందుకే ఇలాంటి క్రేజీ కాంబినేషన్స్‌కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇలా హీరోయిన్-డైరెక్టర్ కాంబోకి కూడా బాక్సాపీస్ దగ్గర ఫుల్ క్రేజ్ వుంది. ప్రజెంట్ టాలీవుడ్లో చాలా మంది హీరోయిన్స్ తమకు సక్సెస్ అందించిన డైరెక్టర్స్ మూవీస్‌లో నటిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత వీరరాఘవ, అల వైకుంఠపురంలో హీరోయిన్గా నటించింది పూజాహెగ్డే. బుట్టబొమ్మ నటించిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఇక అల వైకుంఠపురంలో సినిమా అయితే ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసింది. ఈ సినిమా నుంచే పూజాహెగ్డే బుట్టబొమ్మగా మారిపోయింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వరుసగా రెండు సినిమాల్లో నటించిన పూజా... ఇప్పుడు #SSMB 28 లో మహేశ్‌కు జోడీగా నటిస్తోంది. త్రివిక్రమ్-పూజాహెగ్డే కాంబోలో హ్యాట్రిక్ మూవీగా రాబోతున్న #SSMB 28 సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. డిఫరెంట్ స్టోరీతో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. మే నెలాఖరు కల్లా షూటింగ్ కంప్లీట్ చేసి ఆగస్టులో ఈ సినిమాను రిలీజ్ చేయటానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ ను ఉగాది రోజు వెల్లడించనున్నారు. ఇక సమంతకు డైరెక్టర్ శివనిర్వాణ మజిలీ సినిమాతో మరుపురాని హిట్ అందించాడు. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ఖుషి . ఈ సినిమాలో సమంత, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కలిసి నటిస్తున్నారు. మహానటి తర్వాత సమంత, విజయ్ దేవరకొండ కలిసి నటిస్తున్న సినిమా ఇదే. కశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో శివనిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న ఈ ఖుషి మూవీ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీ ఆగస్ట్ తర్వాత ధియేటర్స్ లోకి వచ్చే చాన్స్ వుంది. తన డెబ్యూ మూవీ ఆర్ఎక్స్ 100 తోనే సక్సెస్ అందుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి. ఈ సినిమాతోనే తెలుగు తెరకి హీరోయిన్గా పరిచయమైన పాయల్ రాజ్‌పుత్ మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబోలో మంగళవారం అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో పాయల్ రాజ్ పూత్ 30 పాత్రల్లో కనిపించనుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని తెలుగుతో పాటు...తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయటానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే దర్శకుడు నాగ్ అశ్విన్ తన డెబ్యూ మూవీ ఎవడే సుబ్రహ్మణ్యంలో పరిచయం చేసిన హీరోయిన్ మాళవిక నాయర్. నాగ్ అశ్విన్ ఈ సినిమా తర్వాత తెరకెక్కించిన మహానటిలో కూడా మాళవికనాయర్ నటించింది. ఇప్పుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కె మూవీలో కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ లో మాళవిక నాయర్ కనిపించనుంది. ఈ విషయాన్ని ఇప్పటికే ఈ బ్యూటీ కన్ఫార్మ్ కూడా చేసింది. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తున్న సినిమా సైంధవ్..ఈ పాన్ ఇండియా మూవీలో ముగ్గురు హీరోయిన్స్ లో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా రుహానీ శర్మ సెలెక్ట్ అయింది. గతంలో శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్ సినిమాలో రుహానీ శర్మ నటించింది. క్రేజీ కాంబినేషన్స్ గా రాబోయే ఈ కాంబో మూవీస్ బాక్సాపీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తాయో చూడాలి! -
Ruhani Sharma Latest Photos: కళ్లతోనే కబుర్లు చెప్తున్న రుహానీ శర్మ (ఫొటోలు)
-
సస్పెన్స్ , క్రైమ్ థ్రిల్లర్‌గా ‘హర్’.. ఆకట్టుకుంటున్న ట్రైలర్
రుహాని శర్మ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ ‘హర్’. శ్రీధర్ స్వరగావ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను నటుడు నాని విడుదల చేశారు. మిస్టరీ మర్డర్ కేసును చేధించే క్రమంలో ఓ మహిళా పోలీస్ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంది? అనే ఆసక్తికర అంశాలతో ఈ టీజర్ రూపుదిద్దుకుంది. డ్యూటీ పరంగా 6 నెలల సస్పెన్షన్ తర్వాత ఓ హత్య కేసును ఛేదించడానికి తిరిగి ఖాకీ డ్రెస్ ధరించిన రుహాణి శర్మ సీన్ తో మొదలైన ఈ టీజర్ ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది. -
రుహాణి శర్మ ప్రధాన పాత్రలో హర్(HER).. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
చిలసౌ ఫేం రుహాణి శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ హర్(HER). సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు శ్రీధర్ స్వరగావ్ రచయితగా, దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. డబుల్ అప్ మీడియాస్ సంస్థ ఫస్ట్ ప్రొడక్షన్‌గా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా చిత్రం నుంచి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో లీడ్ రోల్ పోషిస్తున్న రుహాణి శర్మ లుక్‌ను రిలీజ్ చేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ఈ చిత్రం సాగనుందని ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ పోస్టర్లో రుహాణి శర్మ కంటతడి పెడుతూ కనిపిండం, ఆమె వెనకాల హైవే, సిటీ పరిసరాలు చూస్తుంటే సినిమాలో అంచనాలు పెంచేస్తున్నాయి. ఇక పోస్టర్‌పై HER Chapter 1 అనే టైటిల్ వేయడం చూస్తుంటే ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలో ఈ సినిమా టీజర్‌ను కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. -
కళ్లతో కహానీ చెప్తున్న రుహానీ శర్మ
-
‘నూటొక్క జిల్లాల అందగాడు’ మూవీ రివ్యూ
టైటిల్ : నూటొక్క జిల్లాల అందగాడు జానర్ : కామెడీ డ్రామా నటీనటులు : అవసరాల శ్రీనివాస్, రుహానీ శర్మ, రోహిని, రాకెట్ రాఘవ తదితరులు నిర్మాతలు : శిరీష్, రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి కథ: అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం : రాచకొండ విద్యాసాగర్ సంగీతం : శక్తికాంత్ కార్తీక్ విడుదల తేది : సెప్టెంబర్ 3, 2021 Nootokka Jillala Andagadu Movie Review: ‘అష్టాచెమ్మా’తో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అవసరాల శ్రీనివాస్.. మంచి నటుడిగా, దర్శకుడిగా, రచయితగా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నటుడిగా ఒకే జానర్‌కు పరిమితం కాకుండా డిఫరెంట్ పాత్రలతో నటిస్తూ ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. .‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’సినిమాలతో ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడిగా మారిపోయారాయన. తాజాగా ఆయన రచయితగా, హీరోగా ‘నూటొక్క జిల్లాల అందగాడు’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బట్టతల వల్ల ఒక యువకుడు ప్రేమ, పెళ్లి విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. 2020లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా, కరోనా కారణంగా వాయిదా పడుతూ... శుక్రవారం(సెప్టెంబర్ 3)న థియేటర్లలో విడుదలైంది. . టీజర్, ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలు ఈ ‘నూటొక్క జిల్లాల అందగాడు’ ఏ మేరకు అందుకున్నాడో రివ్యూలో చూద్దాం. నూటొక్క జిల్లాల అందగాడి కథేంటంటే..? గొత్తి సత్యనారాయణ అలియాస్ జీఎస్ఎన్(అవసరాల శ్రీనివాస్) వంశ పారంపర్యంగా వచ్చిన బట్టతలతో బాధపడుతూ ఉంటాడు. బట్టతల ఉంటే ఏ అమ్మాయి ఇష్టపడదని, జీవితంలో తనకు పెళ్లి కూడా కాదనే అభద్రతాభావంతో జీవిస్తుంటాడు. బట్టతల ఉందనే విషయం తెలిస్తే ఎక్కడ తనను హేళన చేస్తారోనన్న భయంతో విగ్ పెట్టి కవర్ చేస్తుంటాడు. ఇలా తనని తనను ఇష్టపడని జీఎస్ఎన్.. తను పని చేసే ఆఫీస్‌లో అంజలి(రుహానీ శర్మ)ని ఇష్టపడతాడు. అంజలి కూడా జీఎస్ఎన్ని ఇష్టపడుతుంది. అయితే ఒకరోజు అనుకోకుండా జీఎస్ఎస్ విగ్ మ్యాటర్ అంజలికి తెలిసిపోతుంది. ఆ తర్వాత వీరి మధ్య బంధం ఎలా కొనసాగింది? బట్టతల ఉంటే ఎవరూ ఇష్టపడరనుకునే జీఎస్ఎన్ అనుమానం నిజం అయిందా? ఆ నిజం బయటపడ్డాక వారి ప్రేమలో ఎలాంటి పరీక్షలు ఎదురయ్యాయి? చివరకు ఈ జంట ఎలా కలిశారనేదే మిగత కథ. ఎవరెలా చేశారంటే? బట్టతలతో బాధపడే యువకుడు జీఎస్ఎన్ పాత్రలో అవసరాల శ్రీనివాస్ అద్భుతంగా నటించాడు.. తనదైన మేనరిజమ్స్‌తో నవ్విస్తూనే.. ఎమోషనల్ సీన్స్‌ని కూడా అద్భుతంగా పండించాడు. సినిమా భారం మొత్తం తన భూజాల మీద వేసుకొని కథని నడిపించాడు. ఇక అంజలి పాత్రలో రుహానిశర్మ జీవించేసింది. తెరపై అందంగా కనిపిస్తూనే తనదైన నటనతో ఆకట్టుకుంది. అలాగే హీరో తల్లిపాత్రలో రోహిణి ఎప్పటి మాదిరే ఒదిగిపోయింది. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? పక్కవారిలో ఏదైనా లోపం ఉంటే దాన్ని ఎత్తి చూపిస్తూ కొందరు కామెడీగా, హేళనగా మాట్లాడుతుంటారు. దీనివల్ల ఆల్రెడీ తాము బాగోలేమనే ఆత్మన్యూనతాభావంలో ఉన్నవారి ఆత్మవిశ్వాసం మరింత దెబ్బ తింటుంది. ఇలాంటి ఓ అంశం ఆధారంగా చేసిన సినిమానే ‘నూటొక్క జిల్లాల అందగాడు’.తన అందానికి, ఆనందానికి బట్టతల అడ్డంగా మారిందని తనను తాను అసహ్యించుకునే ఓ యువకుడి కథ ఇది. నేటి సమాజంలో చాలా మంది బట్టతల వస్తే నామోషీగా ఫీలవుతుంటారు. జీవితంలో ఏదో కోల్పోయినట్లు బాధపడుతుంటారు. అందం అంటే శరీరానికి సంబంధించినది కాదని మనసు సంబంధించినది ఈ సినిమా ద్వారా మరోసారి గుర్తు చేశారు. అందరికి కనెక్ట్ అయ్యే విషయాన్ని.. కాస్త ఫన్నీగా, ఎమోషనల్‌గా తెరపై చూపించాడు దర్శకుడు విద్యాసాగర్. అయితే బట్టతల కాన్సెప్ట్‌తో హిందీలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా ‘బాలా’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ‘నూటొక్క జిల్లాల అందగాడు’కూడా దాదాపు అలాంటి కథే. కానీ తెలుగు ప్రేక్షకులకు ఇది కొత్త కథ. కోట్లాది మందికి ఈజీగా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. అయితే ఈ కథను ఇంకాస్త పకడ్భందీగా తీర్చిదిద్దితే బాగుండేది. ఫస్టాఫ్ అంతా చాలా వినోదాత్మకంగా నడిపించిన దర్శకుడు.. సెకండాఫ్‌లో ఎమోషనల్ టర్న్ తీసుకున్నాడు. అయితే అక్కడ కూడా కామెడీ మిస్ కాకుండా జాగ్రత్త పడ్డాడు. ఇంటర్వెల్ టిస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. కానీ కథనంలో కొత్తదనం లేకపోడం, హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ కూడా అంత హాట్ టచింగ్‌గా అనిపించకపోవడం సినిమాకు కాస్త మైనస్. ఇక క్లైమాక్స్ కూడా అందరూ ఊహించినట్టుగా రొటీన్‌గా ఉంటుంది. డైలాగ్స మాత్రం ఆకట్టుకుంటాయి. ఇక సాంకేతిక విషయాకొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధాన బలం శక్తికాంత్ కార్తీక్ సంగీతం. పాటలు అంతంతమాత్రమే అయినా నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది. ఎమోషనల్ సీన్లను తన రీరికార్డింగ్‌తో మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
అదే జరిగితే నేను ఫ్లాప్ అయినట్టే: అవసరాల శ్రీనివాస్
Srinivas Avasarala Comments On Nootokka Jillala Andagadu ‘‘నా రచన, నటన, దర్శకత్వం నన్ను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాయి. సినిమాలన్నీ రైటింగ్ అండ్ ఎడిటింగ్ టేబుల్‌పైనే జరుగుతాయని నా ఫీలింగ్. అందుకే నాకు రచనే సంతృప్తినిస్తుంది. దర్శకత్వం నన్ను ఒత్తిడికి గురి చేస్తుంది’’ అన్నారు రచయిత, నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్. రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వంలో అవసరాల శ్రీనివాస్, రుహానీ శర్మ జంటగా నటించిన చిత్రం ‘నూటొక్క జిల్లాల అందగాడు’. ‘దిల్’ రాజు, క్రిష్ సమర్పణలో శిరీష్, రాజీవ్‌రెడ్డి, క్రిష్ జాగర్లమూడి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ చిత్రానికి కథ అందించి, హీరోగా నటించిన అవసరాల శ్రీనివాస్ చెప్పిన విశేషాలు. ► హిందీలో వచ్చిన ‘బాల’ చిత్రానికి మా ‘నూటొక్క జిల్లాల అందగాడు’ రీమేక్ కాదు. 2019 అక్టోబరులో మా సినిమా ఓపెనింగ్ జరిగింది. అప్పటికి ‘బాల’ రాలేదు. తర్వాత ‘బాల’ వస్తుందని తెలిసి వీలైనంత తొందరగా పూర్తి చేసి, ‘బాల’కు పోటీగా ఈ సినిమాను విడుదల చేద్దామనే ప్రయత్నం చేశాం.. కుదర్లేదు. 2020 ఏప్రిల్‌లో విడుదల చేద్దామనుకుంటే.. మార్చిలోనే లాక్డౌన్ విధించారు. అయితే ‘బాల’ సినిమా ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి మా సినిమాలో ఏమైనా మార్పులు అవసరం అవుతాయా? అని నేనా సినిమా చూశాను. మార్పులేవీ అవసరం లేదనిపించింది. మా సినిమా కథ వేరేలా ఉంటుంది. ► పక్కవారిలో ఏదైనా లోపం ఉంటే దాన్ని ఎత్తి చూపిస్తూ కొందరు కామెడీగా, హేళనగా మాట్లాడుతుంటారు. దీనివల్ల ఆల్రెడీ తాము బాగోలేమనే ఆత్మన్యూనతాభావంలో ఉన్నవారి ఆత్మవిశ్వాసం మరింత దెబ్బ తింటుంది. ఇలాంటి ఓ అంశం ఆధారంగా సినిమా చేసే ఆలోచన ఉందని క్రిష్‌గారితో చెబితే ఐడియా బాగుందన్నారు. ఇది ఎమోషన్‌తో కూడిన హ్యూమర్ మూవీ. ఇలాంటి కామెడీ ఎక్కువ కాలం నిలిచిపోతుందన్నది నా నమ్మకం. ► నేను డైరెక్షన్ చేస్తున్న ‘ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’ (వర్కింగ్ టైటిల్) సినిమా యాభై శాతం పూర్తయింది. మిగతా భాగం అమెరికాలో షూట్ చేయాలి. టీమ్‌కి వీసాలు కావాలి. అందుకు కాస్త ఆలస్యం అవుతుంది. ఈ లోపు ఓ సినిమా చేద్దామని ‘నూటొక్క జిల్లాల..’లో నటించాను. నా డైరెక్షన్లో ఓ సినిమా సెట్స్‌పై ఉన్నప్పుడు మరో సినిమాకు నేను దర్శకత్వం వహించడం నాకు కరెక్ట్ కాదనిపించింది. అందుకే నా అసోసియేట్ డైరెక్టర్ విద్యాసాగర్ ‘నూటొక్క జిల్లాలకు..’ డైరెక్షన్ చేస్తే బాగుంటుందని నిర్మాతలతో చెప్పాను. ► ఒక్క సినిమాతో ప్రపంచంలో సమస్యలు పరిష్కారం కావు. సందేశం ఇవ్వాలని ఈ సినిమా చేయలేదు. అయితే ఎవరికైనా సందేశంలా అనిపిస్తే ఓకే. ఎవర్నీ కించపరచాలనో, అవహేళన చేయాలనో ఈ సినిమా తీయలేదు. నిజంగా మా సినిమాలోని సన్నివేశాలు, హ్యూమర్ ఎవరి మనోభావాలను అయినా దెబ్బతీసినట్లయితే.. ఒకవేళ సినిమా సక్సెస్ అయినా కూడా నేను ఫ్లాప్ అయినట్లే. ఏ పాయింట్‌ని అయినా కాస్త నవ్విస్తూ చెబితే ప్రేక్షకులకు బాగా రీచ్ అవుతుందని నా నమ్మకం. ► నా కెరీర్ గురించి నాకు కంగారు లేదు. నా సినిమా కథలను నేనే రాసుకుంటున్నా. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా రాయడానికి మూడేళ్లు పట్టింది. ‘జో అచ్యుతానంద’ చిత్రాన్ని రెండేళ్లల్లో రాశాను. ఆ నెక్ట్స్ సినిమాకి రెండేళ్లు పట్టింది. ఈ కథ నాది కాదనే ఫీలింగ్ ఉంటే ఆ సినిమాకు నేను డైరెక్షన్ చేయలేను. ► యాక్టర్‌గా నన్ను నేను భిన్నమైన పాత్రల్లో చూడాలనుకుంటాను. అందుకే ‘జెంటిల్‌మేన్’లో విలన్‌గా చేశా. అలాగే బాగా నచ్చి చేసిన ‘బాబు బాగా బిజీ’ ఆడకపోయినా చేసినందుకు రిగ్రేట్ ఫీల్ కావడం లేదు. ► నేను రాసిన కథలకు ఇప్పటివరకు ఏ ప్రాబ్లమ్ రాలేదు. హింసాత్మక చిత్రాలు నాకు పెద్దగా నచ్చవు. ఇప్పట్నుంచి ఎక్కువగా రచన, దర్శకత్వంపైనే ఫోకస్ పెడదామని అనుకుంటున్నాను. ఓటీటీలో నిత్యా మీనన్ లీడ్ రోల్ చేయనున్న ‘కుమారి శ్రీమతి’ అనే షోకి రన్నర్‌గా చేయనున్నాను. -
సైకో పాత్ర చేయాలని ఉంది: హీరోయిన్
‘‘మనకు బాహ్యసౌందర్యం మాత్రమే ముఖ్యం కాదు.. మన అంతర్గత వ్యక్తిత్వం, స్వభావం కూడా ఉన్నతంగా ఉండాలి. మనల్ని మనంగా ఒప్పుకునే తత్వమే అందం’’ అన్నారు రుహానీ శర్మ. అవసరాల శ్రీనివాస్, రుహానీ శర్మ జంటగా రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు, క్రిష్ సమర్పణలో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. ఈ సినిమా సెప్టెంబరు 3న విడుదల కానుంది. (చదవండి: టాలీవుడ్ డ్రగ్ కేసు: ముగిసిన పూరి జగన్నాథ్ విచారణ) ఈ సందర్భంగా రుహానీ శర్మ మాట్లాడుతూ – ‘‘బట్టతల ఉన్న ఓ యువకుడు తనను తాను ఇష్టపడడు. కానీ ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. తన ప్రేమను గెలిపించుకోవడానికి అతను ఏం చేశాడు? ఫైనల్‌గా తనను తాను ఎలా ప్రేమించుకున్నాడు? అన్నదే కథ. శ్రీని (అవసరాల శ్రీనివాస్) బ్రిలియంట్ డైరెక్టర్, యాక్టర్ అండ్ రైటర్. లవ్లీ కోస్టార్. డైరెక్టర్ విద్యాసాగర్ బాగా హెల్ప్ చేశారు’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘తెరపై ఎంతసేపు కనపడతామన్నది నాకు ముఖ్యం కాదు. పాత్ర ప్రాధాన్యం ముఖ్యం. హిందీ, మలయాళం, తమిళ భాషల్లోనూ సినిమాలు చేస్తున్నాను. అయితే ఎక్కువ ఫోకస్ తెలుగు చిత్రాలపైనే. నాని నిర్మిస్తున్న ‘మీట్ క్యూట్’ ఆంథాలజీలో సత్యారాజ్తో కలిసి ఓ భాగంలో యాక్ట్ చేశాను. తెలుగులోనే మరో ఆంథాలజీలో కూడా నటించాను. వ్యక్తిగతంగా నాకు లవ్‌స్టోరీలు, సైకో థ్రిల్లర్స్ ఇష్టం. సైకో పాత్రలో నటించాలని ఉంది’’ అన్నారు రుహాని. -
అవసరాల.. నవరసాల శ్రీనివాస్ అయ్యారు
‘‘కంచె’ సినిమా అప్పుడు అవసరాలగారు.. ‘హైట్‌గా లేననో, జుట్టు లేదనో, కలర్‌గా లేననో అనేకమైన ఇన్‌సెక్యూరిటీస్‌తో కొందరు తమ జీవితాలను నరకప్రాయంగా మార్చుకుంటారు. దాన్ని హిలేరియస్‌గా చూపిస్తాను’ అంటూ ఓ ఇరవై నిమిషాల కథ చెప్పారు. ఆ పాయింట్ నాకు, రాజీవ్‌గారికి బాగా నచ్చింది’’ అన్నారు దర్శకుడు జాగర్లమూడి క్రిష్. రాచకొండ విద్యాసాగర్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, అవసరాల శ్రీనివాస్, రుహానీ శర్మ హీరో హీరోయిన్లుగా ‘దిల్’రాజు, క్రిష్ సమర్పణలో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. సెప్టెంబర్ 3న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో క్రిష్ మాట్లాడుతూ – ‘‘2017లో దర్శకుడు సాగర్ ఓ థ్రిల్లర్ కథ చెప్పారు. ఆ కథను అవసరాలతో చేద్దామని నేను, రాజీవ్‌గారు అనుకున్నాం. అయితే ‘కంచె’ అప్పుడు చెప్పిన కథ గురించి అవసరాలను అడిగితే, ఆ కథకు ‘నూటొక్క జిల్లాల అందగాడు’ అనే టైటిల్ పెట్టానని చెప్పారు. ఆ సినిమా చేద్దామను కున్నాం. అవసరాల అంకితభావం ఉన్న నటుడు. టెక్నాలజీ సాయంతో బట్టతల కనిపించేలా చేస్తామన్నాం.. కానీ బట్టతల కనిపించేలా షేవ్ చేసుకుని ఓ నాలుగైదు నెలలు ఆయన అలానే ఉన్నారు. అందంగా, కొత్తగా అవసరాల శ్రీనివాస్.. నవరసాల శ్రీనివాస్ అయ్యారు. నిర్మాతలుగా ఎవరూ చెప్పని కథలను చెప్పాలని కంకణం కట్టుకున్న మాకు ‘దిల్’ రాజు, శిరీష్ వంటి నిర్మాతలు తోడయ్యారు. ఈ సినిమా కథ వెండితెరపైకి రావడానికి కృషి చేసిన రాజీవ్ రెడ్డిగారికి థ్యాంక్స్’’ అన్నారు. రాచకొండ విద్యాసాగర్ మాట్లాడుతూ– ‘‘నాకు చిన్న ఫిజికల్ ప్రాబ్లమ్ ఉంది (సరిగా నడవలేకపోవడం, చేయి సరిగా ఉండకపోవడం). నేను డిఫరెంట్‌గా నడుస్తుంటే అందరూ ఏమనుకుంటారో అని బాధపడేవాడిని. నా ఇబ్బందిని యాక్సెప్ట్ చేయడానికి భయపడ్డాను. అమేజింగ్ కథ రాశారు శ్రీని (అవసరాల శ్రీనివాస్). సినిమా తీసిన రెండేళ్లకు అర్థమైంది.. అది నా కథ కూడా అని. ఈ సినిమా కథ చాలామందిని ఆలోచింపజేస్తుంది. నన్ను చూసి అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, నా డైరెక్షన్ టీమ్, చిత్రయూనిట్‌తో పాటు నా లైఫ్‌లో నన్ను సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘ఫస్ట్ ఈ సినిమా ఐడియా వచ్చినప్పుడు నా ఐడియా అనుకున్నాను. స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టి క్రిష్‌గారికి చెప్పిన తర్వాత అది మా ఐడియా అయింది. ఆ తర్వాత ఆ ఐడియా సినిమాగా మారింది. సినిమా మీలోని నిజమైన మిమ్మల్ని మీకు పరిచయం చేస్తుంది’’ అన్నారు అవసరాల శ్రీనివాస్. -
ఈ నటుడు '101 జిల్లాలకు అందగాడు'
నటుడిగా, దర్శకుడి గుర్తింపు పొందిన అవసరాల శ్రీనివాస్ ఇప్పుడు కథానాయకుడిగానూ అలరించేందుకు రెడీ అవుతున్నారు. అవసరాల శ్రీనివాస్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘101 జిల్లాల అందగాడు’ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఆగస్ట్ 27న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, ఎస్వీసీ-ఎఫ్ఈఈ బ్యానర్స్‌పై ‘దిల్’ రాజు, డైరెక్టర్ క్రిష్ సమర్పణలో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మించారు. బట్టతల ఉండే యువకుడి పాత్రలో అవసరాల నటించగా, ఆయన ప్రేయసి పాత్రలో రుహానీ శర్మ నటించారు. శక్తికాంత్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. -
'డర్టీ హరి' హీరోయిన్‌తో కార్తికేయ..
ఆర్ఎక్స్ 100 సినిమాతో యూత్‌లో మాంచి క్రేజ్ సంపాదించుకున్న కార్తికేయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలె కార్తికేయ నటించిన చిత్రం చావు కబురు చల్లగా యావరేజ్ టాక్‌ను సంపాదిచుకుంది. ప్రస్తుతం 'రాజా విక్రమార్క' అనే ప్రాజెక్టులో నటిస్తున్న కార్తికేయ ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కార్తికేయకు జోడీగా 'రుహాని శర్మ'ను ఫిక్స్ చేశారట. 'డర్టీ హరి' చిత్రంతో రుహాని మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం. లవ్ రొమాంటిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాతో దర్శకుడిగా ప్రశాంత్ పరిచయం కానున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. -
చిట్టి డ్యాన్స్, కొంటెగా కన్ను గీటిన వేదిక
♦ పోనీటైల్ వేసుకుంటూ కొంటెగా చూస్తోన్న వేదిక కుమార్ ♦ క్యూట్‌గా డ్యాన్స్ చేసిన ఫరియా అబ్దుల్లా ♦ బీటీఎస్ వీడియో షేర్ చేసిన చాందినీ చౌదరి ♦ ఒడిశాలో ఎంజాయ్ చేస్తోన్న మౌనీ రాయ్ ♦ అద్దం ముందు సెల్ఫీ దిగిన రుహానీ శర్మ ♦ తన ఫస్ట్ కారును చూపించిన అషూ రెడ్డి ♦ కొడుకు శౌర్యకు బర్త్‌డే విషెస్ తెలిపిన అనసూయ భరద్వాజ్ ♦ గురి చూసి కొట్టిన ఈషా రెబ్బా View this post on Instagram A post shared by Vedhika (@vedhika4u) View this post on Instagram A post shared by Vedhika (@vedhika4u) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkkar) View this post on Instagram A post shared by Jahnavi Dasetty (@mahathalli) View this post on Instagram A post shared by Amy Jackson (@iamamyjackson) View this post on Instagram A post shared by Priyankaa Thimmesh (@iampriyankaathimmesh) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by NIKHIL VIJAYENDRA (@nikhiluuuuuuuuu) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Yamini Bhaskar (@yamini_bhaskar) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Priyanka Sharma (@priyankaasharmaofficial) View this post on Instagram A post shared by Tanya Hope (@hope.tanya) View this post on Instagram A post shared by Surbhi Puranik (@surofficial) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) -
101 జిల్లాల అందగాడు: నిజాన్ని దాచేస్తే..!
అవసరాల శ్రీనివాస్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. రాచకొండ విద్యాసాగర్ దర్శకుడు. రుహానీ శర్మ కథానాయికగా నటించారు. ‘దిల్’ రాజు, డైరెక్టర్ క్రిష్ సమర్పణలో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమాలోని ‘మనసా వినవా..’ అనే పాట బుధవారం విడుదలయింది. ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా, శ్రీరామచంద్ర, ధన్య బాలకృష్ణ పాడారు. రచయిత భాస్కర భట్ల మాట్లాడుతూ– ‘‘ప్రేమలో నిజాయతీ ఉండాలనుకునే అమ్మాయి... దొరక్క దొరికిన ప్రేమను, ప్రేయసిని వదులుకోకూడదనుకునే యువకుడు కొన్ని నిజాలను దాస్తాడు. ఆ నిజం బయటపడితే వారి ప్రేమలో ఎలాంటి పరీక్షలు ఎదురవుతాయి? వారి మధ్య ఊసులు కరువై ఊహలే ఊసులైన వేళ ఎలా ఉంటుంది? తన ప్రేమలో నిజాయతీ ఉందని, తాను ఊరకనే మోసం చేయలేదని ప్రేమికుడు.. తెలిసి నిజాన్ని దాచి పెట్టడం తప్పు అనే ప్రేయసి పాడుకునే పాట ‘మనసా వినవా..’’ అన్నారు. చదవండి: వైరల్: కూతుర్ని గుండెలపై ఎక్కించుకున్న అల్లు అర్జున్ -
మరో ఇంట్రెస్టింగ్ కేసుతో 'హిట్ 2'
విశ్వక్ సేన్, రుహానీ శర్మ జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హిట్: ది ఫస్ట్ కేస్’. హీరో నాని, ప్రశాంతి నిర్మించిన ఈ సినిమా విడుదలై ఫిబ్రవరి 28కి ఏడాది పూర్తయింది. ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించనున్నట్లు నాని ప్రకటించారు. ‘‘హిట్’ సినిమా విడుదలై ఏడాది పూర్తయింది. ‘హిట్ 2’ చిత్రాన్ని ప్రకటించడానికి ఇంతకన్నా మంచి రోజు లేదు. కనిపించకుండా పోయిన అమ్మాయి కేసును ఆఫీసర్ విక్రమ్ రుద్రరాజు ఎలా డీల్ చేశారనే కథాంశంతో తెలంగాణ హిట్ టీమ్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా హిట్ సినిమాను రూపొందించాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హిట్ టీమ్ ఓ ఇంట్రెస్టింగ్ కేసును ఆఫీసర్ కె.డి ఆసక్తికరంగా ఎలా డీల్ చేస్తారో చూపించబోతున్నాం. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు నాని. -
వారిద్దరూ జంటగా '101 జిల్లాల అందగాడు'
అవసరాల శ్రీనివాస్, రుహానీ శర్మ జంటగా తెరకెక్కిన చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. ఈ సినిమాతో రాచకొండ విద్యాసాగర్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. నిర్మాత ‘దిల్’ రాజు, డైరెక్టర్ క్రిష్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్స్‌పై శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. ఈ సినిమాను మే 7న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘‘వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ చిత్రంలో హీరోగా నటించడంతో పాటు కామెడీ పంచ్‌లతో ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా మంచి ఎంటర్టైనింగ్ కథను అందించారు అవసరాల శ్రీనివాస్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: రామ్, సంగీతం: శక్తికాంత్ కార్తీక్. -
మాళవిక.. తళుకులు..
-
థియేటర్లో హరి
శ్రవణ్‌రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహానీ శర్మ ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘డర్టీహరి’. ఈ సినిమా మొదట ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫ్రైడే మూవీస్ ఏటీటీలో డిసెంబర్ 18న, ఆ తర్వాత ఆహాలో విడుదలైంది. ఈ నెల 8న ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతున్న సందర్భంగా యం.ఎస్. రాజు మాట్లాడుతూ – ‘‘రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. థియేటర్లో మా సినిమా ప్రేక్షకులకు ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని అనుకుంటున్నాను. కంటెంట్ బాగుంటే సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని ‘డర్టీ హరి’ నిరూపించింది’’ అన్నారు. ‘‘యం.యస్. రాజుగారు సినిమా తీసిన విధానం అద్భుతంగా ఉందని సినిమా చూసినవాళ్లందరూ అంటున్నారు’’ అన్నారు శ్రవణ్‌రెడ్డి. -
మరీ అంత డర్టీ కాదు!
చిత్రం: ‘డర్టీ హరి’; తారాగణం: శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహానీ శర్మ, సురేఖావాణి; సంగీతం: మార్క్ కె. రాబిన్; కెమెరా: బాలరెడ్డి; నిర్మాతలు: గూడూరు సతీశ్ బాబు, గూడూరు సాయిపునీత్; రచన, దర్శకత్వం: ఎం.ఎస్. రాజు; ఏ.టి.టి: ఫ్రైడే మూవీస్. ఒకటే పాట. అంతకు మించి పాటలు లేవు. కామెడీ లేదు. అడల్ట్ సీన్లు మినహాయిస్తే... రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో కనపడేవేవీ లేవు. ఒకరకంగా మొదలైన సినిమా మరో రకంగా ముగుస్తుంది. అయినా సరే, ఓ సినిమా మరీ అసంతృప్తికి గురి కానివ్వకపోవడం, జనాన్ని ఆద్యంతం కూర్చోబెట్టగలగడం విశేషమే. దర్శకుడిగా ఎం.ఎస్. రాజు చేసిన మ్యాజిక్... అదే ‘డర్టీ హరి’. బహుశా, అందుకే వివాదాస్పద వాల్ పోస్టర్లు, ట్రైలర్లతో వార్తల్లోకి వచ్చిన ‘డర్టీ హరి’ చూస్తున్నప్పుడు ఉన్నట్టుండి సర్ప్రైజ్ చేస్తుంది. అంతదాకా పెట్టుకున్న అంచనాలను మార్చేస్తుంది. అదే ఈ సినిమాకు ఉన్న బలం. కథేమిటంటే..: చేయి తిరిగిన చెస్ ప్లేయర్ హరి (శ్రవణ్ రెడ్డి). ఎలాగైనా జీవితంలో పైకి రావాలనే యాంబిషన్ ఉన్న ఆ కుర్రాడు అవకాశాల వేటలో హైదరాబాద్‌కు వస్తాడు. అక్కడ ఓ బడా కంపెనీ దంపతుల (అంబరీష అప్పాజీ, సురేఖావాణి) కుమార్తె – పెయింటరైన వసుధ (రుహానీ శర్మ)తో ప్రేమలో పడతాడు. మరోపక్క వసుధ కజిన్, హరికి స్నేహితుడూ అయిన ఆకాశ్ ఏమో సినిమాల్లోకి పైకి రావాలని ప్రయత్నిస్తున్న మోడల్ గర్ల్ జాస్మిన్ (సిమ్రత్ కౌర్)తో ప్రేమలో ఉంటాడు. వసుధతో ప్రేమ పెళ్ళి పీటలకెక్కే దశలో ఉన్నప్పటికీ, హరి మాత్రం తన స్నేహితుడి లవర్ మీద కన్నేస్తాడు. జాస్మిన్ కూడా హరికి లొంగిపోతుంది. తీరా ఆకాశ్‌తో ఆమె ప్రేమ బ్రేకప్ అవుతుంది. వసుధతో పెళ్ళయిపోయినా సరే జాస్మిన్‌తో ఎఫైర్‌ను మన యాంబిషియస్ హరి కొనసాగిస్తాడు. ఆ క్రమంలో జాస్మిన్ గర్భవతి అవుతుంది. ఆ వ్యవహారం చివరకు ఎక్కడ దాకా వెళ్ళింది, హరి వైవాహిక జీవితం ఏ మలుపు తిరిగింది, ఏమైంది అన్నది ఆసక్తికరంగా సాగే చివరి ముప్పావుగంట మిగతా కథ. ఎలా చేశారంటే..: దాదాపు రెండు గంటల సినిమాకు ప్రధాన బలం ప్రధాన పాత్రల్లో హరిగా నటించిన శ్రవణ్ రెడ్డి, జాస్మిన్‌గా కనిపించిన పంజాబీ పిల్ల సిమ్రత్ కౌర్. ఈ హీరోయిన్ గతంలో ‘పరిచయం’ లాంటి ఒకటీ అరా సినిమాల్లో చేసింది. కొంతకాలంగా ముంబయ్‌లో హిందీ సినిమాలు, సిరీస్‌లలో స్థిరపడ్డ తెలంగాణలోని కరీంనగర్ కుర్రాడైన శ్రవణ్ రెడ్డికి తెలుగులో ఇదే తొలి పెద్ద ఛాన్స్. అలా ఈ ప్రధాన పాత్రధారులిద్దరూ మన ప్రేక్షకులకు కొత్త ముఖాల కిందే లెక్క. అయినప్పటికీ, క్యారెక్టరైజేషన్లో కొన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ ఇద్దరూ తెరపై ఆకట్టుకుంటారు. ఫస్టాఫ్‌లో కథానుగుణంగా హీరో స్వభావాన్ని ఎస్టాబ్లిష్ చేసే క్లిష్టమైన అడల్ట్ సీన్లలో అచ్చంగా పాత్రలలానే ప్రవర్తించారు. ఇక, జీవితంలో పైకి ఎదగడానికి ఎత్తులు పైయెత్తుల ఆట, కళ్ళలోనే కనిపించేసే కామం, మనసులోని చెడును కనపడనివ్వకుండా పైకి మంచిగా ప్రవర్తించే తీరు, కోపం – ఇలా బోలెడన్ని వేరియేషన్లను హరి పాత్రలో శ్రవణ్ రెడ్డి బాగా చూపించారు. కడుపు పండాలని ఆరాటపడే అమ్మాయిగా రుహానీ శర్మ ఉన్నంతలో బాగానే చేశారు. మిగిలిన పాత్రలన్నీ కథానుగుణంగా వచ్చిపోతుంటాయి. చివరలో వచ్చే పోలీసు ఇంటరాగేషన్ సీన్ల లాంటివి మరికొంత బలంగా రాసుకొని ఉంటే ఇంకా బాగుండేది. ఎలా తీశారంటే..: ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ లాంటి అభిరుచి గల చిత్రాలు నిర్మించి, భారీ విజయాలు అందుకున్న ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజుకు దర్శకుడయ్యాక లభించిన సక్సెస్ శూన్యం. ఈ నేపథ్యంలో ఆయన తన ట్రెండ్ మార్చి, ‘డర్టీ హరి’ లాంటి పేరుతో, పెద్దలకు మాత్రమే కంటెంట్‌తో న్యూ ఏజ్ సినిమా తీస్తుంటే సహజంగానే ఆశ్చర్యమేస్తుంది. తీరా సినిమా చూశాక కథాగమనం, కథలోని ట్విస్టులతో ఆశ్చర్యం పెరుగుతుంది. అందుకే, ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ – దర్శకుడు ఎం.ఎస్. రాజే! దర్శక – రచయిత, నిర్మాతలు ఎవరూ పైకి చెప్పకపోయినా, సినీ ప్రియులు ఈ కథకు మూలం ఇట్టే చెప్పేస్తారు. ఉడీ అలెన్ రచన, దర్శకత్వంలో పదిహేనేళ్ళ క్రితం వచ్చిన హాలీవుడ్ సినిమా ‘మ్యాచ్ పాయింట్’ (2005) కథను మనవాళ్ళు యథాతథంగా తీసుకొని, చివరి ఘట్టాలను మనదైన పద్ధతిలో మార్చేసుకున్నారు. ఆకట్టుకొనేలా, తెలివిగా ఆ కాపీ కొట్టడమే అసలైన సినీ ట్రేడ్ సీక్రెట్. హైక్లాస్ జీవితాన్ని చూపించే నేపథ్య నిర్మాణ విలువలు మొదలు కీలకమైన ఘట్టాల్లో రీరికార్డింగ్, కెమెరా వర్క్ దాకా అనేకం బాగా తీర్చిదిద్దారు. పనిలో పనిగా నవతరంలోని హైక్లాసు వర్గం వాడే అశ్లీల పదాలు ఈ సినిమాలో యథేచ్ఛగా వినిపిస్తాయి. ఫస్టాఫ్‌లో, అలాగే సెకండాఫ్ మొదట్లో కాసేపు శృంగారం మోతాదు మించి చూపించినా, చివరి ముప్పావుగంట థ్రిల్లింగ్ అంశాలు వాటిని మర్చిపోయేలా చేస్తాయి. ఒక్కమాటలో... ఫస్టాఫ్ డర్టీనెస్, క్లైమాక్స్ హెవీ హార్టెడ్నెస్ ఫీలింగ్! చూడడం పూర్తయ్యాక, సినిమా సంతృప్తిగా ఉందనే భావన కలిగిస్తాయి. చాలా గ్యాప్ వచ్చిన ఎం.ఎస్. రాజు మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చారనిపించేలా చేస్తాయి. అయితే, వచ్చిన చిక్కల్లా... థియేటర్లు పూర్తిగా ఓపెన్ కాని పరిస్థితుల్లో... ఎన్నిసార్లు చూస్తే, అన్నిసార్లు డబ్బులు కట్టి చూసే ‘పే పర్ వ్యూ’ పద్ధతిలో, టెక్నికల్ ఇబ్బందులుండే కొత్త ‘ఎనీ టైమ్ థియేటర్’ (ఏ.టి.టి.) యాప్‌లో సినిమా రిలీజు చేయడం! అది ఈ సినిమాకు ఎంత వరకు కలిసొస్తుందో వేచి చూడాలి. కొసమెరుపు: ఎంగేజింగ్ ఎరోటిక్ క్రైమ్ థ్రిల్లర్! బలాలు: ఊహించని ట్విస్టున్న కథ ఆలోచింపనివ్వని కథనం ప్రధాన పాత్రధారుల నటన, రీరికార్డింగ్ ప్రొడక్షన్ విలువలు, చివరి ముప్పావుగంట సినిమా బలహీనతలు: పిల్లాపాపలతో చూడలేని అడల్ట్ సీన్లు క్యారెక్టరైజేషన్లో ఎగుడుదిగుళ్ళు పెద్దగా పరిచయం లేని నటీనటులు. – రెంటాల జయదేవ -
రాముడు... రావణుడు కాదు!
‘‘నాది హైదరాబాద్. హిందీలో పలు సీరియల్స్, వెబ్ సిరీస్‌లు చేశాను. కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ చేశాను. నేను నటించిన ‘థింకిస్థాన్’ వెబ్ సిరీస్ చూసి ‘డర్టీ హరి’ చిత్రం కోసం ఎం.ఎస్. రాజుగారు నన్ను తీసుకున్నారు’’ అని శ్రవణ్ రెడ్డి అన్నారు. శ్రవణ్ రెడ్డి హీరోగా, సిమ్రత్ కౌర్, రుహానీ శర్మ హీరోయిన్లుగా ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డర్టీ హరి’. గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్, కేదార్ సెలగం శెట్టి, వంశీ కారుమంచి నిర్మించిన ఈ సినిమా ఫ్రైడే మూవీస్ అనే ఏటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రవణ్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘నేటి తరానికి కనెక్ట్ అయ్యే చిత్రం ‘డర్టీ హరి’. జీవితంలో ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు. వాటివల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయన్నదే కథ. మనుషుల్లో అంతర్లీనంగా దాగి ఉండే చెడు, పశుప్రవృత్తిని ఎలాంటి నాటకీయత లేకుండా వాస్తవిక కోణంలో చూపించారు రాజుగారు. ఇందులో నా పాత్ర రాముడిలా, రావణుడిలా కాకుండా మధ్యస్తంగా ఉంటుంది. కథలో భాగంగా రొమాన్స్ ఉంటుందే కానీ, సినిమా మొత్తం బోల్డ్‌గా ఉండదు. మా సినిమా ట్రైలర్, నా పాత్ర తీరును చూసి చాలా మంది ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో పోలుస్తున్నారు. ఆ చిత్రానికి, మా సినిమాకి ఎటువంటి పోలిక ఉండదు. నేను హీరోగానే చేయాలనుకోవడం లేదు. క£ý , పాత్ర నచ్చితే సహాయ నటుడిగా కనిపించడానికి కూడా అభ్యంతరం లేదు. ప్రస్తుతం హిందీలో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నా’’ అన్నారు. -
ఒక్కోసారి గ్యాప్ సహజం
‘‘సినిమా ఇండస్ట్రీలో నా కెరీర్ స్టార్ట్ అయి 30ఏళ్లు నిండాయి. 1990 జనవరి 2న నా తొలి సినిమా ‘శత్రువు’ విడుదలైంది. వ్యాపారాల్లో, రాజకీయాల్లో, సినిమాల్లో.. ఇలా ఆయా రంగంలోనివారి జీవితాల్లో ఎత్తు పల్లాలు ఉన్నట్లే నా జీవితంలోనూ ఉన్నాయి. అందుకు భయపడి ప్రయత్నం ఆపకూడదు’’ అని దర్శక–నిర్మాత ఎం.ఎస్. రాజు అన్నారు. శ్రవణ్ రెడ్డి హీరోగా, సిమ్రత్ కౌర్, రుహానీ శర్మ హీరోయిన్లుగా ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డర్టీ హరి’. గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్, కేదార్ సెలగం శెట్టి, వంశీ కారుమంచి నిర్మించిన ఈ సినిమా ఏటీటీ ప్లాట్‌ఫామ్ ఫ్రైడే మూవీస్ ద్వారా ఈ నెల 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భం గా ఎం.ఎస్. రాజు చెప్పిన విశేషాలు. ►‘మస్కా’ తర్వాత నిర్మాతగా, ‘ తూనీగ తూనీగ’ తర్వాత దర్శకునిగా గ్యాప్ వచ్చింది. ఒక్కోసారి గ్యాప్ రావడం సహజం. ‘హిట్లర్’ సినిమాకి ముందు చిరంజీవిగారికి కూడా ఏడాది గ్యాప్ వచ్చింది. ‘తూనీగ తూనీగ’ ఫ్లాప్ కావడంతో నిర్మాణమా? దర్శకత్వమా? అనే డైలమాలో ఉండిపోయాను. ఆ తర్వాత అడల్ట్ కంటెంట్‌తో ‘డర్టీ హరి’ కథ రాసుకున్నాను. మా సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్లో అన్ని జానర్ సినిమాలు తీశాను. ట్రెండ్‌కి తగ్గట్టు మారాలని అడల్ట్ కంటెంట్‌తో ‘డర్టీ హరి’ తీశా. ఈ సినిమాని నా కుటుంబ సభ్యులు చూసి, బాగుందన్నారు. ప్రేక్షకులు కూడా బాగుందంటారు. కుటుంబమంతా కలసి చూడదగ్గ చిత్రమిది. ►‘డర్టీ హరి’ని థియేటర్స్‌లో రిలీజ్ చేద్దామనుకున్నాం. కానీ, సినిమా చూసిన నిర్మాత ‘బన్నీ’ వాస్ చాలా బాగుంది, మా ‘ఫ్రైడే మూవీస్’ ఏటీటీలో రిలీజ్ చేద్దామన్నారు. ప్యాన్ ఇండియా కథతో రూపొందిన చిత్రం కాబట్టి ఇతర భాషల్లోనూ అనువదించి, రిలీజ్ చేస్తాం. -
ఇది అలాంటి సినిమా కాదు!
‘‘శృంగారానికి, బూతుకు చాలా తేడా ఉంది. ‘డర్టీ హరి’ అనేది ఎం. ఎస్. రాజు ఫిల్మ్. బూతు ఫిల్మ్ కాదు. ఈ సినిమాలో మంచి హ్యూమన్ డ్రామా ఉంది’’ అన్నారు దర్శక–నిర్మాత ఎం.ఎస్. రాజు. శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహానీ శర్మ హీరో హీరోయిన్లుగా ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘డర్టీ హరి’. గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్, కేదార్ సెలగం శెట్టి, వంశీ కారుమంచి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఫ్రైడే మూవీస్ అనే ఏటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సినిమా సెకండ్ ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ– ‘‘నాకు క్లీన్ ప్రొడ్యూసర్‌గా పేరు ఉంది. కానీ ఒక బోర్డర్ దాటి నేను ‘డర్టీ హరి’ లాంటి సినిమాను ఎందుకు తీయాల్సి వచ్చిందనే విషయం ఈ నెల 18న తెలుస్తుంది. ఎం.ఎస్. రాజు వివాదాస్పద సినిమా తీశారేంటి? అనుకునేవారికి సమాధానం దొరుకుతుంది’’ అన్నారు. ‘‘ఇది మంచి ఎంటర్టైనింగ్ మూవీ’’ అన్నారు శ్రవణ్. ‘‘నా ముందు సినిమాలో నేను సంప్రదాయంగా ఉండే పాత్ర చేశాను. కానీ ఇందులో ముద్దు సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. యాక్టర్‌గా అన్ని రకాల పాత్రలు చేయాలి. వందశాతం కష్టపడాలని మా అమ్మగారు అనడంతో ఈ సినిమాకు ఓకే చెప్పాను’’ అన్నారు సిమ్రత్ కౌర్. ‘‘ఇదొక రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్’’ అన్నారు నిర్మాత వంశీ. ‘‘మా ఫ్రైడే మూవీస్ యాప్‌లో ప్రతి శుక్రవారం ఓ సినిమాను రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. ‘డర్టీ హరి’ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం’’ అన్నారు విజయ్. ఈ కార్యక్రమంలో కేదార్, మదన్, భాస్కర్, అనురాగ్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
హిందీకి హిట్
టాలీవుడ్లో ఘన విజయం సాధించిన చిత్రాలు బాలీవుడ్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలో తాజాగా ‘హిట్’ సినిమా చేరింది. విశ్వక్ సేన్, రుహానీ శర్మ జంటగా నూతన దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన చిత్రం ‘హిట్’. హీరో నాని, ప్రశాంతి నిర్మించిన ఈ క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై మంచి విజయం అందుకుంది. ఈ చిత్రాన్ని నిర్మాత ‘దిల్’ రాజు హిందీలో రీమేక్ చేయనున్నారు. నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ చిత్రాన్ని షాహిద్ కపూర్ హీరోగా ‘దిల్’ రాజు హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ నిర్మాత కుల్దీప్ రాథోర్‌తో కలిసి ‘హిట్’ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇందులో రాజ్‌కుమార్ రావ్ హీరోగా నటించనున్నారు. హిందీ రీమేక్‌ను కూడా శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమా 2021లో సెట్స్‌పైకి వెళ్లనుంది. డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ– ‘‘రాజ్‌కుమార్ రావ్, ‘దిల్’ రాజుగారితో కలిసి పని చేయనుండటం ఎగ్జయిటింగ్‌గా అనిపిస్తోంది. యూనివర్సల్ పాయింట్‌తో తెరకెక్కిన చిత్రమిది. బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచి, నేటివిటీకి తగినట్లు చిన్న చిన్న మార్పులు చేస్తా’’ అన్నారు. ‘‘ప్రస్తుతం మన సమాజానికి అవసరమైన కథాంశంతో తెరకెక్కిన ఎంగేజింగ్ మూవీ ‘హిట్’. ఓ నటుడిగా ఇలాంటి పాత్ర కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ‘హిట్’ రీమేక్ చేసే అవకాశం వచ్చింది’’ అన్నారు రాజ్‌కుమార్ రావ్ . -
అది జరగదనే నమ్ముతున్నాను
‘‘పుస్తకం, సినిమా, వెబ్‌సిరీస్... ఇలా ఏదైనా సరే మంచి కథలను ప్రేక్షకులకు చెప్పాలనుకుంటాను. మా నాన్నగారికి తెలియకుండానే సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేశాను. నేను ‘హిట్’ సినిమా తీశాక నాన్నగారు షాక్ అయ్యారు’’ అని శైలేష్ కొలను అన్నారు. విశ్వక్ సేన్, రుహానీ శర్మ జంటగా తెరకెక్కిన చిత్రం ‘హిట్’. ‘ది ఫస్ట్ కేస్’ అన్నది ఉపశీర్షిక. హీరో నాని సమర్పణలో ప్రశాంతి నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. శైలేష్ కొలను మాట్లాడుతూ – ‘‘నానీగారికి పెద్ద అభిమానిని. ఆయనకి చెప్పిన కథల్లో ‘హిట్’కి నిర్మాతగా ఓకే అన్నారు. ‘హిట్’కి వచ్చే ఏడాది సీక్వెల్ కూడా ఉంటుంది. ఇండస్ట్రీలో డైరెక్టర్‌గా సెకండ్ మూవీ సిండ్రోమ్ (డైరెక్టర్‌గా తొలి విజయం సాధించి, రెండో సినిమా ఫ్లాప్ కావడం) సమస్య గురించి విన్నాను. నా విషయంలో అది జరగదనే నమ్మకం ఉంది. ఆ భయం నా బాధ్యతను పెంచుతుందనుకుంటున్నాను. నా పారితోషికాన్ని కూడా పెంచాలనుకుంటున్నాను’’ అన్నారు. -
‘హిట్’ సక్సెస్ మీట్
-
‘హిట్’ మూవీ రివ్యూ
టైటిల్: హిట్ జానర్: సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ నటీనటులు: విశ్వక్సేన్, రుహానీ శర్మ, బ్రహ్మాజీ, భానుచందర్, మురళీశర్మ, తదితరులు సంగీతం: వివేక్ సాగర్ దర్శకత్వం: శైలేష్ కొలను బ్యానర్: వాల్ పోస్టర్ సినిమా నిర్మాతలు: నాని, ప్రశాంతి త్రిపురనేని విశ్వక్ సేన్, రుహానీ శర్మ జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హిట్’. ‘ది ఫస్ట్ కేస్’ అన్నది ట్యాగ్ లైన్ . హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి త్రిపురనేని నిర్మించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంతో నాని ప్రొడ్యూసర్‌గా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడా? క్రైమ్ స్టోరీని దర్శకుడు శైలేష్ కొలను తెరపై చక్కగా ప్రజెంట్ చేశాడా? విశ్వక్ సేన్ క్రైమ్ ఇన్వెస్టిగేట్ ఆఫీసర్‌గా ఏ మేరకు మెప్పించాడు? అనేది మన సినిమా రివ్యూలో తెలుసుకుందాం. కథ: క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లో హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీం(హిట్) ఓ విభాగం. హిట్‌కు విశ్వ (భానుచందర్) హెడ్. విశ్వ టీంలోనే విక్రమ్ (విశ్వక్ సేన్), అభిలాష్ (శ్రీనాథ్ మాగంటి), రోహిత్ (చైతన్య సగిరాజు)లు ఎంతో సిన్సియర్ అండ్ టాలెంటెడ్ ఆఫీసర్స్. ప్రతీ క్రైమ్ కేసును సులువుగా ఛేదిస్తుంటారు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్న నేహ(రుహానీ శర్మ), విక్రమ్‌ల మధ్య ఎప్పటినుంచో ప్రేమ కొనసాగుతోంది. ఈ క్రమంలో నగరంలో ప్రీతి అనే అమ్మాయి కిడ్నాప్‌కు గురవుతుంది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత నేహ కూడా గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేస్తారు. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసే బాధ్యతను విక్రమ్‌కు విశ్వ అప్పగిస్తాడు. అయితే కేసుకు సంబంధించి ఎటువైపు వెళ్లినా అన్ని దారులు మూసుకపోతుంటాయి. కేసులో భాగంగా విచారిస్తున్న వారందరూ అనుమానితులుగానే కనిపిస్తారు. అయితే ఈ కేసులోకి షీల(హరితేజ), షిండే (బ్రహ్మాజీ), ఇబ్రహీం(మురళీ శర్మ)లు ఎందుకు ఎంటర్ అవుతారు? చివరికి ఈ కేసును విక్రమ్ ఛేదించాడా? ప్రీతి, నేహాలకు ఏమైంది? వారిని కిడ్నాప్ చేసింది ఎవరు? రెండు కిడ్నాప్‌లు చేసింది ఒకరేనా లేక ఇద్దరా? అసలు విక్రమ్‌కు ఉన్న ఆ వింత వ్యాధి ఏంటి? అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. నటీనటులు: తొలి రెండు సినిమాల్లో మన గల్లీలోని కుర్రాడిలా కనిపించిన విశ్వక్ సేన్ ఈ చిత్రంలో ఓ సీరియస్ పోలీస్‌మన్ పాత్రలో మెరిశాడు. ఓ క్రైమ్ కేసును ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో ఓ పోలీస్ ఆఫీసర్ పడే ఇబ్బందులు, ఆలోచించే విధానం, టెన్షన్స్, ఎమోషన్స్, అంతేకాకుండా అతడికున్న వింత వ్యాధితో పాటు, ప్రేమించిన అమ్మాయి దూరం అవడంతో పడే ఆవేదన ఇలా అన్ని భావాలను పండించాడు విశ్వక్. ఈ కథ హీరోయిన్ మిస్సింగ్ చుట్టూ జరిగినా.. రుహానీ శర్మకు నటన పరంగా అంతగా ప్రాధాన్యం దక్కలేదు. లుక్స్ పరంగా బాగుంది. హరితేజకు చాలా రోజుల తర్వాత మంచి పాత్ర దక్కింది. ఇప్పటివరకు ఆమె చేయని క్యారెక్టర్ అయినప్పటికీ షీలా పాత్రలో ఒదిగిపోయింది. ఇక విక్రమ్‌తోనే ఉండే రోహిత్ (చైతన్య సగిరాజు) కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. భానుచందర్, మురళీ శర్మ, బ్రహ్మాజీలు తమ అనుభవంతో వారి పాత్రలను అవలీలగా చేశారు. మిగతా తారాగణం వారి పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ: నాని ప్రొడక్షన్ హౌజ్ నుంచి విశ్వక్ సేన్ సినిమా అనగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందులోనూ డిఫరెంట్ టైటిల్, సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పగానే అందరూ ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూశారు. అభిమానుల అంచనాలను, నాని నమ్మకాన్ని, విశ్వక సేన్ ఆశలను డైరెక్టర్ శైలేష్ కొలను వమ్ము చేయలేదు. ఇలాంటి క్రైమ్ స్టోరీలపై సినిమాలు చాలానే వచ్చినా.. ఇన్వెస్టిగేషన్ చేసే విధానం కొత్తగా అనిపిస్తుంది. కథ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టకుండా, బలమైన క్రైమ్, ఇన్వెస్టిగేషన్ సీన్లపైనే దర్శకుడు ఎక్కువగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అయితే అవే సినిమాకు ప్రధాన బలం అవుతాయి. ఇన్వెస్టిగేషన్ సీన్స్‌తో పాటు మధ్యమధ్యలో హీరోహీరోయిన్ల లవ్ సీన్స్, హీరో గతం గురించి చూపించడం వంటివి డిఫరెంట్ స్క్రీన్‌ప్లేకు అద్దంపట్టింది. సినిమా మొదలైనప్పటి నుంచి ఎండ్ కార్డు పడే వరకు కూడా ప్రేక్షకుడు నెక్ట్స్ ఏంటి అని ఆసక్తిగా ఎదురుచూస్తాడు. కొన్ని క్రైమ్ సినిమాలలో అసలు దోషి ఎవరో ప్రేక్షకుడికి ముందే తెలిసిపోతుంది అయితే హీరో అతడిని ఎలా పట్టుకుంటాడని ఆసక్తిగా తిలకిస్తారు. కానీ ఈ సినిమాలో హీరోతో పాటు ప్రేక్షకుడు కూడా అసలు ఈ కిడ్నాప్ చేసింది ఎవరో అని మదిలో ఇన్వెస్టిగేట్ చేయడం ఖాయం. అయితే ప్రీ క్లైమాక్స్ వరకు బాగానే ఉన్నా.. క్లైమాక్స్‌తోనే దర్శకుడు కాస్త నిరుత్సాహపరిచాడు. ఈ క్రైమ్ కేసు వెనక బలమైన కారణాన్ని చూపించలేదు. దీంతో సినిమా గ్రాఫ్ ఒక్కసారిగ పడిపోయిందన్న భావన కలుగుతుంది. హిట్‌కు సీక్వెల్ ఉండటంతో క్లైమాక్స్‌ను సాదాసీదాగా ముగించవచ్చని సగటు అభిమానికి సందేహం కలగక మానదు. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. పాటలు అంతగా ప్రాధాన్యం లేనప్పటికీ.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో వివేక్ సాగర్ మ్యాజిక్ చేశాడు. ఇక సినిమాటోగ్రఫీ చాలా కొత్తగా ఉంది. మణికందన్ తన కెమెరా పనితనంతో ప్రేక్షకుడు కూడా పలుమార్లు క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో తాను కూడా ఇన్వాల్వ్ అవుతాడు. ఇక ఎడిటింగ్‌పై కాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ఫైనల్‌గా ఈ సినిమా గురించి చెప్పాలంటే.. క్లైమాక్స్ ఒక్కటి మినహా సినిమా అంతా చకచకా సాగిపోతుంది.. ఇలాంటి జానర్ సినిమాలను ఇష్టపడే వారు ‘హిట్’ కథలో తప్పకుండా ఇన్వాల్వ్ అయి ఆసక్తిగా చూస్తారు. థ్రిల్‌గా ఫీలవుతారు. ప్లస్ పాయింట్స్: విశ్వక్ సేన్ నటన కథనం ఇన్వెస్టిగేషన్ సీన్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మైనస్ పాయింట్స్: స్లో నెరేషన్, నిడివి బలమైన క్లైమాక్స్ లేకపోవడం - సంతోష్ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్ -
హిట్ అందరికీ నచ్చుతుంది
‘‘కొత్త కాన్సెప్ట్, ప్రతిభని ప్రోత్సహించడానికే వాల్ పోస్టర్ పతాకాన్ని స్థాపించాను. మా బ్యానర్లో కథకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే నిర్మిస్తాం. ఇందులో స్టార్ డైరెక్టర్స్ సినిమాలు చేయరు.. నేను కూడా నా బ్యానర్లో నటించను. నాకు కథ నచ్చి, నేను చేయలేని సినిమాలను నా బ్యానర్లో నిర్మిస్తాను’’ అని నాని అన్నారు. విశ్వక్ సేన్, రుహానీ శర్మ జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హిట్’. ‘ది ఫస్ట్ కేస్’ అన్నది ట్యాగ్ లైన్ . హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాని మాట్లాడుతూ– ‘‘ఈరోజు మా సినిమా విడుదలవుతుండటంతో చాలా సంతోషంగా, నమ్మకంగా ఉన్నాం. ప్రేక్షకుల స్పందన కోసం ఆత్రుతగా వేచి చేస్తున్నాం.. ‘హిట్’ అందరికీ నచ్చే చిత్రం అవుతుంది. సినిమా నచ్చి.. మళ్లీ మీ స్నేహితులతోనో, కుటుంబ సభ్యులతోనో వెళతారనే నమ్మకం ఉంది. మా బ్యానర్లో కొత్త తరహాలో చేసిన ‘అ!’ సినిమాకు జాతీయ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈసారి మరో కొత్త జానర్‌తో మీ ముందుకు వస్తున్నాం. నేను ఇప్పటి వరకు ఏడు సార్లు ‘హిట్’ సినిమా చూశాను.. ఒక్కసారి కూడా బోర్ కొట్టలేదు. ప్రశాంతిగారిలాంటి వ్యక్తులు, మంచి టీమ్ ఉండబట్టే నేను సినిమాల్లో నటిస్తూ, నిర్మించగలిగాను’’ అన్నారు. ‘‘హిట్’ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందనే భావిస్తున్నాం’’ అన్నారు ప్రశాంతి త్రిపిర్నేని. ‘‘ఈ రోజు మా చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్నా మా అందరి ముఖాల్లో చిరునవ్వు ఉందంటే సినిమాపై ఎంత నమ్మకంగా ఉన్నామో ప్రేక్షకులు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా’’ అన్నారు విశ్వక్ సేన్. ‘‘నిజాయతీగా తీసిన థ్రిల్లర్ ‘హిట్’. కథకు ఏది అవసరమో దాన్ని అందించారు నానీగారు. మా అందరి కష్టానికి తగిన ఫలితం దక్కుతుందని భావిస్తున్నాం’’ అన్నారు శైలేష్ కొలను. ‘‘ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. మా చిత్రాన్ని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు రుహానీ శర్మ. -
విశాఖలో 'హిట్' గ్రాండ్ రిలీజ్ ఈవెంట్
-
హిట్ ఇస్తున్నందుకు గర్వంగా ఉంది
‘‘అ’ సినిమాతో నాని నిర్మాతగా మారి నేర్చుకున్నాడు.. ఇప్పుడు ‘హిట్’ అంటున్నాడు. ఎంత నమ్మకం లేకుంటే ఆ పేరు పెడతాడు. చాలా సినిమాలు చేశాడు కదా.. కొన్ని ఆడతాయి, మరికొన్ని ఆడవు. ఆడని వాటిలోని తప్పులు.. ఆడిన వాటిలోని బెస్ట్‌లు తీసుకుని ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని ‘హిట్’ అని పేరు పెట్టే్టశాడు. మొత్తంగా ఓ డాక్టర్ని(శైలేశ్) డైరెక్టర్ చేశాడు నాని’’ అని డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు అన్నారు. ‘ఫలక్‌నుమాదాస్’ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా, రుహానీ శర్మ హీరోయిన్గా నటించిన చిత్రం ‘హిట్’. ‘ది ఫస్ట్ కేస్’ అన్నది ఉపశీర్షిక. శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది. ప్రీ రిలీజ్ వేడుకలో డైరెక్టర్ రాజమౌళి మాట్లాడుతూ– ‘‘హిట్’ సినిమా టీజర్, ట్రైలర్ చాలా బాగున్నాయి.. యూనిట్ ప్రమోషన్ ఐడియాలు కూడా కొత్తగా ఉన్నాయి. సినిమా మంచి హిట్ అవ్వాలి. ఉపశీర్షికలో ఫస్ట్ కేస్ అని పెట్టారు.. రెండో కేస్, మూడో కేస్ అంటూ దీనికి మరిన్ని ఫ్రాంచైజీలు రావాలి. సినిమా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు. అనుష్క మాట్లాడుతూ– ‘‘ఈరోజు నేను ఇక్కడికి అతిథిగా రాలేదు. నాని, ప్రశాంతి నా కుటుంబసభ్యులే. ‘అ’ చాలా మంచి సినిమా. రెండో సినిమా చాలా మంచి కథతో వస్తారనుకుని వేచి చూశా. ‘హిట్’ ట్రైలర్స్, పాటలు బాగున్నాయి’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘హిట్’ సినిమా పెద్ద విజయం సాధించాలి. నాని హీరో అయినప్పటికీ కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తున్నాడు.. అలాంటి నాని బ్యానర్‌కి సక్సెస్ కావాలి’’ అన్నారు. నాని మాట్లాడుతూ–‘‘హిట్’ సినిమాని తొలుత నేనే చేద్దామనుకున్నా.. విశ్వక్ అయితే బాగుంటుందనిపించింది. శైలేష్ చెప్పిన కథల్లో ‘హిట్’ వెంటనే తీయాలనిపించింది. డాక్టర్ ఉద్యోగం వదలొద్దని తొలుత చెప్పేవాణ్ణి.. ఈ రోజు చెబుతున్నా ఉద్యోగం వదిలేయ్.. పర్లేదు. ‘ఫలక్‌నుమాదాస్’లో విశ్వక్ ఆ పాత్రకు సరిపోయాడు.. ‘హిట్’ సినిమా చూశాక ఏ పాత్ర అయినా ఇరగదీస్తాడనే నమ్మకం ఉంది. ఈ సినిమాకి ఇద్దరు హీరోలు.. ఒక్కరు విశ్వక్ సేన్.. మరొకరు సంగీత దర్శకుడు వివేక్ సాగర్. ‘అ’ సినిమా బాగున్నా డబ్బులు రాలేదేమో? అని కొందరు రాస్తుంటారు.. నిర్మాతగా నేను చెబుతున్నా. ఆ సినిమా పక్కా కమర్షియల్ హిట్. ఈ నెల 28న ప్రేక్షకులకు ‘హిట్’ రూపంలో ఓ క్వాలిటీ, మంచి సినిమా ఇస్తున్నాం.. ఇందుకు గర్వంగా ఉంది’’ అన్నారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘రుహాని శర్మ మంచి నటి. ప్రశాంతిగారు సో స్వీట్. ఒకేసారి రెండు సినిమాలు చేయొద్దు.. ఒక్కొక్కటి చేస్తే ప్రశాంతంగా ఉంటుందని నాని అన్న సలహా ఇచ్చాడు.. అది ఎంతో ఉపయోగపడింది. శైలేష్గారు శాస్త్రవేత్తలాంటివాడు.. తెలివైనవాడు. ‘హిట్’ సినిమాకి నీళ్లు ఎక్కువ తాగి రాకండి.. వాష్‌రూమ్ వెళ్లే టైమ్ కూడా ఉండదు. ఇలాంటి థ్రిల్లర్ సినిమా తెలుగులో నేను చూడలేదు’’ అన్నారు. శైలేశ్ కొలను మాట్లాడుతూ– ‘‘2017లో నానీ అన్నకి కథ చెప్పా.. విన్నాక ‘నువ్వే ఎందుకు దర్శకత్వం చేయకూడదు?’ అన్నారు. ఆ తర్వాత సిడ్నీ వెళ్లిపోయి డైరెక్షన్ నేర్చుకుని వచ్చి ఈ సినిమా తీశా. నన్ను దర్శకునిగా పరిచయం చేసినందుకు మీకు థ్యాంక్స్ అన్న. ప్రశాంతి మేడమ్‌కి థ్యాంక్స్. విక్రమ్ రుద్రరాజు అని నేను రాసుకున్న పాత్రకి రెట్టింపు నటన ఇచ్చిన విశ్వక్‌కి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఈ చిత్రం బాగా రావడానికి ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు. నాకు అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకి థ్యాంక్స్’’ అన్నారు రుహాని శర్మ. ఈ వేడుకలో నిర్మాత ప్రశాంతి, డైరెక్టర్ నందినీ రెడ్డి, హీరోలు రానా, నవదీప్, సందీప్ కిషన్, ‘అల్లరి’ నరేశ్, సునీల్, కార్తికేయ, నటి మంచు లక్ష్మి, నటులు భానుచందర్, రాహుల్ రామకృష్ణ, రవివర్మ, నిర్మాతలు రాజ్ కందుకూరి, బెక్కం వేణుగోపాల్, సంగీత దర్శకులు కీరవాణి, వివేక్ సాగర్, కాలభైరవ, కెమెరామేన్ మణికంద¯Œ , ఎడిటర్ గ్యారీ, డైరెక్టర్ తరుణ్ భాస్కర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పాల్గొన్నారు. -
భావోద్వేగాల హరి
ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘డర్టీ హరి’. శ్రవణ్ రెడ్డి హీరోగా పరిచయం అవుతున్నారు. సిమ్రత్ కౌర్, రుహాణి శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ నిర్మిస్తున్న ఈ సినిమా రీ–రికార్డింగ్ మొదలయింది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో బోల్డ్ అంశాలతో పాటు సున్నితమైన, భావోద్వేగభరితమైన సన్నివేశాలు ఉంటాయి. రొమా¯Œ్సని దర్శకుడు చాలా పొయెటిక్‌గా చూపిస్తున్నారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసిన దర్శక–నిర్మాత ఎం.ఎస్. రాజుగారికి ఇది కమ్‌బ్యాక్ చిత్రం అవ్వడంతో భారీ అంచనాలున్నాయి. త్వరలోనే టీజర్‌ని విడుదల చేసి, సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తాం’’ అన్నారు. -
బోల్డ్ హరి
శ్రవణ్ రెడ్డి, రుహానీ శర్మ, సిమ్రత్ కౌర్ నాయకా నాయికలుగా నటించిన చిత్రం ‘డర్టీ హరి’. గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయిపునీత్ నిర్మిస్తున్నారు. ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ఎం.ఎస్. రాజు ఈ చిత్రానికి దర్శకుడు. ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ– ‘‘బాలచందర్, పుట్టన్న కనగల్, భరతన్ వంటి దర్శకులు బోల్డ్ మూవీస్ తీశారు. అవి బోల్డ్‌గా ఉన్నా బ్యూటిఫుల్‌గా, క్లాసికల్‌గా ఉండేవి. అలాంటి దర్శకుల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని నేను బోల్డ్గాను, పొయెటిక్గానూ తీశాను. ఇది ప్రేక్షకులకు నచ్చుతుందని అనుకుంటున్నాను’’ అన్నారు. గూడూరు శివరామకృష్ణ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కథాంశాన్ని గోప్యంగా ఉంచుతున్నాం. షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్నాం. త్వరలోనే టీజర్ విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘డర్టీ హరి’ బోల్డ్‌గా ఉంటుంది. అలాగని ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ని మిస్ కాలేదు’’ అన్నారు నిర్మాతలు. -
హిట్ లుక్
హీరోగా నాని సూపర్ సక్సెస్ఫుల్. నిర్మాతగా మారి ‘అ!’ చిత్రం తీశారు. ఆ సినిమా మంచి ప్రశంసలు అందుకుంది. తాజాగా రెండో సినిమా కూడా సిద్ధం చేస్తున్నారు. ‘ఫలక్‌నుమా దాస్’ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘హిట్’. నాని సమర్పణలో ప్రశాంత్ త్రిపిర్నేని నిర్మిస్తున్నారు. రుహానీ శర్మ హీరోయిన్. ‘హిట్’ ఫస్ట్‌లుక్‌ను బుధవారం విడుదల చేశారు. ఈ చిత్రంలో విక్రమ్ రుద్రరాజు అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా విశ్వక్సేన్ కనిపించనున్నారు. జనవరి 1న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకు కెమెరా: మణికందన్, సంగీతం: వివేక్ సాగర్. -
మోసగాళ్లు
‘మోసపోయేవాళ్లు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్లకు ఏ ఢోకా లేదు. కావాల్సిందల్లా పక్కా ప్లాన్ మాత్రమే’ అనే ఫిలాసఫీ నమ్మే కుర్రాడు అర్జున్. ఓ పెద్ద ప్లాన్‌తో ప్రపంచంలోనే అతి పెద్ద స్కామ్ చేయగలుగుతాడు. ప్రస్తుతం ఇలాంటి కాన్సెప్ట్‌తో మంచు విష్ణు హీరోగా తెలుగు–ఇంగ్లీష్ భాషల్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. జెఫ్రీ చిన్ దర్శకుడు. కాజల్, రుహానీ శర్మ, సునీల్ శెట్టి ముఖ్య పాత్రలు చేస్తున్న ఈ చిత్రానికి ‘మోసగాళ్లు’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఐటీ ఇండస్ట్రీలో జరిగిన స్కామ్ ఆధారంగా ఈ సినిమా ఉంటుందని తెలిసింది. నేడు విష్ణు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ‘అర్జున్’ పాత్రలో కనిపిస్తారు విష్ణు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది. -
బర్త్‌డే సర్ప్రైజ్
తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నారు మంచు విష్ణు. టాలీవుడ్–హాలీవుడ్ క్రాస్ఓవర్ (రెండు వేరు వేరు ప్రాంత నటులు కలిసి నటించడాన్ని క్రాస్ఓవర్ అంటారు) ప్రాజెక్ట్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారట చిత్రబృందం. జెఫ్రీ చిన్ దర్శకత్వంలో విష్ణు మంచు, కాజల్, రుహానీ శర్మ, సునీల్ శెట్టి ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే హైదరాబాద్‌లో తొలి షెడ్యూల్ పూర్తయింది. ఈ చిత్రం ఫస్ట్ లుక్, టైటిల్‌ను మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 23న రిలీజ్ చేయాలనుకుంటున్నారని తెలిసింది. ఈ సినిమాతో తొలిసారి తెలుగుకి ఎంట్రీ ఇస్తున్నారు హిందీ నటుడు సునీల్ శెట్టి. మరో విశేషం ఏంటంటే విష్ణు, కాజల్ అన్నా చెల్లెళ్లుగా కనిపిస్తారట. నవదీప్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ కుమార్ ఆర్, ప్రొడక్షన్ డిజైన్: కిరణ్ కుమార్ ఎమ్. -
హిట్ షురూ
వైవిధ్యమైన చిత్రాలతో వరుస విజయాలను సాధించి తనకంటూ ఓ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు హీరో నాని. కొత్త ప్రతి¿¶ ను ప్రోత్సహించాలని ‘వాల్‌పోస్టర్ సినిమా’ అనే బ్యానర్‌ను ప్రారంభించారు. తొలి ప్రయత్నంలోనే ‘అ!’ వంటి వైవిధ్యమైన సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించి నిర్మాతగా సక్సెస్‌ను సాధించిన నాని రెండో సినిమాకి గురువారం కొబ్బరికాయ కొట్టారు. వాల్‌పోస్టర్ సినిమా ప్రొడక్షన్ నెం.2గా తెరకెక్కనున్న ‘హిట్’ చిత్రం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇటీవల విడుదలైన ‘ఫలక్‌నుమాదాస్’ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ ఈ చిత్రంలో కథానాయకునిగా నటిస్తున్నారు. రుహానీ శర్మ హీరోయిన్. ఈ చిత్రం ద్వారా శైలేష్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. నాని సమర్పణలో ప్రశాంతి త్రిపిర్నేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, కెమెరా: ఎస్.మణికందన్. -
నూటొక్క జిల్లాలకే అందగాడు
ఒక వ్యక్తి బాగా అందంగా ఉంటే నూటొక్క జిల్లాల అందగాడు అని సంబోధిస్తారు. అప్పట్లో నూతన్ ప్రసాద్‌ని అలా పిలిచేవారు. ఇప్పుడు తాజా సినిమా కోసం అవసరాల శ్రీనివాస్ నూటొక్క జిల్లాల అందగాడిగా మారనున్నారు. అవసరాల శ్రీనివాస్, రుహానీ శర్మ జంటగా తెరకెక్కనున్న చిత్రం ‘నూటొక్క జిల్లాల అందగాడు’. ‘దిల్’ రాజు, దర్శకుడు క్రిష్ సంయుక్తంగా ఈ సినిమాను సమర్పించడం విశేషం. శిరీష్, రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలు. సాగర్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం శనివారం జరిగింది. ఈ చిత్రానికి రచయిత: అవసరాల శ్రీనివాస్, సంగీతం: స్వీకార్ అగస్తీ. -
అంజలి మరో యాంగిల్
క్లాస్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ‘చి ల సౌ’ మంచి టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన ఈ సినిమాతో రుహాని శర్మ హీరోయిన్గా పరిచయం అయ్యారు. అంజలి పాత్రలో తొలి సినిమాతోనే నటిగా ఫుల్ మార్క్స్ సాధించిన ఈ బ్యూటీ ఆడియన్స్‌ను హోమ్లీ లుక్‌లో ఫిదా చేశారు. సినిమా అంతా ఒకే రోజులో జరిగే కథ కావటంతో లుక్ పరంగా రుహానికి వేరియేషన్స్ చూపించే అవకాశం దక్కలేదు. క్యారెక్టర్ పరంగా మిడిల్ క్లాస్ అమ్మాయిగా చుడిదార్‌లో పద్దతిగా కనిపించి ఆకట్టుకున్నారు. అయితే ఈ సినిమాతో వచ్చిన ఇమేజ్ నుంచి బయటపడేందుకు రుహాని శర్మ ఓ హాట్ ఫొటో షూట్ చేశారు. తనలో గ్లామర్ యాంగిల్ కూడా ఉందని హింట్ ఇచ్చారు. మరీ ఈ ఫొటోషూట్‌తో రుహాని ఇమేజ్ మారుతుందేమో చూడాలి.