బోల్డ్ సీన్స్‌ వైరల్.. నన్ను జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు: రుహానీ శర్మ | Ruhani Sharma Latest Statement On Agra Movie | Sakshi
Sakshi News home page

Ruhani Sharma: 'ఆగ్రా' సినిమాపై విమర్శలు.. రుహానీ శర్మ స్ట్రాంగ్ కౌంటర్

Aug 24 2024 10:47 AM | Updated on Aug 24 2024 11:04 AM

Ruhani Sharma Latest Statement On Agra Movie

'చిలసౌ' అనే తెలుగు సినిమాతో రుహానీ శర్మ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. దీని తర్వాత టాలీవుడ్‌లో అడపాదడపా మూవీస్ చేస్తూనే ఉంది. అయితే ఈమె ప్రధాన పాత్రలో నటించిన 'ఆగ్రా' అనే హిందీ సినిమా.. గతేడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ప్రశంసలతో పాటు అవార్డులు కూడా వచ్చాయి. తాజాగా ఈ బోల్డ్ కంటెంట్ ఉన్న మూవీ.. అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చింది.

'ఆగ్రా' సినిమాలో శ్రుతిమించిన శృంగార సన్నివేశాలు ఉండటంతో మన దగ్గర స్ట్రీమింగ్‌లోకి రాలేదు. కానీ పైరసీ సైట్ల‌లో కనిపించింది. దీంతో కొందరు ప్రేక్షకులు ఈ సినిమాలో బోల్డ్ సన్నివేశాలు చూసి షాకయ్యారు. రుహానీ శర్మ ఇలా చేసిందేంటి అని ఆమెని విమర్శిస్తూ తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయం ఈమె వరకు వెళ్లడంతో స్పందించింది. పెద్ద నోట్ రిలీజ్ చేసింది.

(ఇదీ చదవండి: 'మిస్టర్ బచ్చన్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయిందా?)

'అందరికీ హాయ్. నేను నటించిన 'ఆగ్రా' సినిమా లీక్ అయింది. నెలల తరబడి మేం పడ్డ కష్టం ఇలా వృథా అవుతుందనుకోలేదు. అప్పటి నుంచి ఓ విషయం మాట్లాడాలనుకుంటున్నాను. నేను చాలా అసంతృప్తికి గురయ్యాను. ఆర్ట్ ఫిల్మ్ తీయడమంటే ఆషామాషీ కాదు. ఎన్నో నిద్రలేని రాత్రులు, ఇబ్బందులు ఉంటాయి. ఇవేవి చూడకుండా నా గురించి నోటికొచ్చినట్లు మాట్లాడటం, నన్ను జడ్జ్ చేయడం నిజంగా దారుణం'

''ఆగ్రా' అనే రోజూ చేసే మరో సినిమా కాదు. గతేడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. నటిగా ఇది నాకెంతో గర్వ కారణమైన విషయం. అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకుని, అవార్డులు పొందిన ఈ చిత్రం విషమయై నా నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. ఫిల్మ్ మేకింగ్ గురించి మీకేం తెలియకపోతే ఏది పడితే అనొద్దు. కాస్త గౌరవమిచ్చి మాట్లాడండి. అవసరమైతే ప్రోత్సాహించండి కానీ మేం పడ్డ శ్రమని తక్కువ చేసి చూడొచ్చు' అని రుహానీ శర్మ భావోద్వేగానికి లోనైంది.

(ఇదీ చదవండి: ప్రభాస్-అర్షద్ వివాదం.. సెటిల్ చేస్తున్న నాగ్ అశ్విన్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement