రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'మిస్టర్ బచ్చన్'. అప్పుడెప్పుడో 2018లో హిందీలో వచ్చిన 'రైడ్' అనే చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని దీన్ని తీశారు. కాకపోతే కమర్షియల్ హంగులు అని చెప్పి అసలు కథని సైడ్ చేయడంతో మూవీ ఫెయిలైంది. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజైతే తొలిరోజే నుంచి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
(ఇదీ చదవండి: హీరోయిన్ ప్రణీత బేబీ షవర్ సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్)
రిలీజ్‌కి ముందు దర్శకుడు హరీశ్ శంకర్ హైప్ పెంచేలా కామెంట్స్ చేశాడు. దీంతో సినిమాపై ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఘోరమైన రిజల్ట్ కనిపించింది. హీరోయిన్ తప్పితే చూడటానికి సరైన కంటెంట్ లేదని ప్రేక్షకుల నుంచి విమర్శలు వచ్చాయి. అలానే సినిమాకు భారీ నష్టాలు తప్పవని ట్రేడ్ పండితుల అంచనా. ఈ క్రమంలోనే అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలోకి రాబోతుందని తెలుస్తోంది.
'మిస్టర్ బచ్చన్' డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సినిమా ఫలితం పాజిటివ్‌గా వచ్చుంటే కాస్త లేటుగా ఆరు వారాల్లో స్ట్రీమింగ్‌కి వచ్చి ఉండేదేమో? కానీ రిజల్ట్ తేడా కొట్టేయడంతో థియేటర్లలో రిలీజైన నెలలోనే ఓటీటీలోకి తీసుకొచ్చేయబోతున్నారని తెలుస్తోంది. అంటే వినాయక చవితికి సెప్టెంబరు 6 లేదా 7న లేదంటే ఆ తర్వాత వారంలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
(ఇదీ చదవండి: షూటింగ్ లో గాయపడ్డ రవితేజ.. ఆరు వారాలు విశ్రాంతి)
Comments
Please login to add a commentAdd a comment