
మాస్ మహారాజ రవితేజకు సర్జరీ జరిగింది. ఇటీవల తన 75వ సినిమా చిత్రీకరణ సమయంలో అతడు స్వల్పంగా గాయపడ్డాడు. కుడిచేతికి గాయమైనప్పటికీ లెక్క చేయకుండా షూట్ కొనసాగించాడు. దురదృష్టవశాత్తూ నొప్పి తీవ్రతరం కావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. అతడిని పరీక్షించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయాలని సూచించారు. అనంతరం విజయవంతంగా సర్జరీ పూర్తి చేశారు. హీరోను ఆరువారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
సినిమాల విషయానికి వస్తే.. రవితేజ ఇటీవలే మిస్టర్ బచ్చన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టలేకపోయింది. ప్రస్తుతం ఈ మాస్ హీరో తన 75వ సినిమాపై ఫోకస్ పెట్టాడు. ‘సామజవరగమన’ వంటి హిట్ సినిమాకు ఓ రచయితగా చేసిన భాను బోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీని సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. దీనికి కోహినూర్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment