ప్రభాస్-అర్షద్ వివాదం.. సెటిల్ చేస్తున్న నాగ్ అశ్విన్ | Director Nag Ashwin Tweets On Prabhas And Arshad Warsi Issue | Sakshi
Sakshi News home page

Nag Ashwin: సోషల్ మీడియాలో ట్రోల్స్.. నాగ్ అశ్విన్ వరస ట్వీట్స్

Published Sat, Aug 24 2024 9:36 AM | Last Updated on Sat, Aug 24 2024 10:00 AM

Director Nag Ashwin Tweets On Prabhas And Arshad Warsi Issue

గత కొన్నిరోజుల నుంచి ప్రభాస్-అర్షద్ వార్సీ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. 'కల్కి'లో ప్రభాస్ లుక్ జోకర్‌లా ఉందని హిందీ నటుడు అర్షద్ కామెంట్ చేయడం.. దీనికి ప్రతిగా నాని, సిద్ధు, శర్వానంద్ తదితర తెలుగు హీరోలు కౌంటర్స్ వేయడంతో ప్రస్తుతం ట్విటర్‌లో నార్త్-సౌత్ అనే రచ్చ అవుతోంది. ఇప్పుడు ఈ కాంట్రవర్సీపై 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించాడు. మంట చల్లార్చే ప్రయత్నం చేస్తున్నాడు.

(ఇదీ చదవండి: 'మిస్టర్ బచ్చన్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయిందా?)

'కల్కి' సినిమా క్లైమాక్స్‌లో ప్రభాస్, కర్ణుడిగా ఎంట‍్రీ ఇచ్చే సీన్ ని ట్విటర్‌లో పోస్ట్ చేసి.. బాలీవుడ్ మొత్తం కంటే ఇది బెటర్ అని ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన నాగ్ అశ్విన్.. 'మళ్లీ పాతకాలంలోకి వెళ్లొద్దు. సౌత్ వర్సెస్ నార్త్, బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ అనేవి లేవు. ఇప్పుడంతా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అర్షద్ సాబ్ మీరు కాస్త చూసుకుని మాట్లాడాల్సింది. కానీ ఓకే. మీ నలుగురు పిల్లలకు బుజ్జి బొమ్మలు పంపిస్తున్నాను. అలానే కల్కి 2లో ప్రభాస్ మరింత బెస్ట్‌గా కనిపిస్తాడు' ఓ ట్వీట్‌కి రిప్లై ఇచ్చాడు.

'ఇప్పటికే ప్రపంచం చాలా ద్వేషంతో నిండిపోయింది. మనం దాన్ని పెంచే పనిచేయొద్దు. నేనే కాదు ప్రభాస్ కూడా ఇలానే చెబుతాడు' అని మరో ట్వీట్‌లో నాగ్ అశ్విన్ రాసుకొచ్చాడు. మరో ట్విటర్ యూజర్.. అర్షద్ వార్సి కంటే బెస్ట్ యాక్టర్ సౌత్‌లో ఎవరైనా ఉన్నారా? అని పోస్ట్ పెట్టాడు. దీనిపై ఫైర్ అయిన నాగ్ అశ్విన్.. 'అసలు నువ్వు ఎవర్రా? ఇంత ద్వేషం ఎందుకు? ఇలా వేరు చేసి ఎందుకు మాట్లాడుతున్నావ్? మేమంతా ఒక్కటే. కావాలంటే బుజ్జి బొమ్మ ఒకటి పంపనా?' అని గొడవని చల్లార్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. 

(ఇదీ చదవండి: కూతురికి రామ్‌చరణ్‌ బహుమతి.. ఆ గిఫ్ట్‌కు మగధీరతో లింక్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement