రామ్‌చరణ్‌ను హీరోగా అందలం ఎక్కించిన సినిమా మగధీర. ఈ మూవీ చరణ్ జీవితంలోనే ఒక మైలురాయి వంటిది. ఇందులో కాళభైరవగా మెప్పించిన చెర్రీ గుర్రం స్వారీ చేస్తాడు. సినిమా అయిపోయాక తను స్వారీ చేసిన గుర్రాన్ని మర్చిపోలేక ఇంటికి తీసుకుపోయాడు. దానికి కాజల్ అని పేరు పెట్టుకుని తన ఫాంలో పెంచుతున్నాడు. ఈ ఒక్కటే కాదు అతడి ఫామ్‌హౌస్‌లో దాదాపు 15 గుర్రాలున్నాయి.
గుర్రాలంటే ఇష్టం
దీని గురించి రామ్ చరణ్ ఇటీవల ఓ వేదికపై మాట్లాడుతూ.. 'నాకు మూగజీవాలంటే ఎంతో ఇష్టం. అలా నా ఫామ్‌హౌస్‌లో పెంచుకుంటున్న గుర్రాలపై ఎనలేని ప్రీతి. మగధీరలో నేను ఎక్కిన గుర్రం పేరు బాద్‌షా. షూటింగ్ అయిపోయాక ఆ గుర్రం కావాలని రాజమౌళిని అడిగి ఇంటికి తెచ్చేసుకున్నాను. ఈ మధ్యే అది బిడ్డకు జన్మనిచ్చింది. దాన్ని నా కూతురికి బహుమతిగా ఇచ్చాను. ఇంత చిన్నవయసులోనే క్లిన్‌కారా ఆ చిన్న గుర్రంపై ఎక్కి స్వారీ చేసేందుకు ప్రయత్నిస్తోంది.
సినిమా..
గుర్రపు స్వారీ విషయంలో నాది, నా కూతురి అభిరుచి ఒకేలా ఉంది' అని చరణ్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. కియారా అద్వానీ, ఎస్‌జే సూర్య, సముద్రఖని, అంజలి, జయరామ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ క్రిస్మస్‌కు విడుదల కానుంది.
చదవండి: యానిమల్.. టైటిల్ చూస్తే తెలియట్లేదా?: బాలీవుడ్ నటుడు
Comments
Please login to add a commentAdd a comment