
అవసరాల శ్రీనివాస్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. రాచకొండ విద్యాసాగర్ దర్శకుడు. రుహానీ శర్మ కథానాయికగా నటించారు. ‘దిల్’ రాజు, డైరెక్టర్ క్రిష్ సమర్పణలో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమాలోని ‘మనసా వినవా..’ అనే పాట బుధవారం విడుదలయింది. ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా, శ్రీరామచంద్ర, ధన్య బాలకృష్ణ పాడారు.
రచయిత భాస్కర భట్ల మాట్లాడుతూ– ‘‘ప్రేమలో నిజాయతీ ఉండాలనుకునే అమ్మాయి... దొరక్క దొరికిన ప్రేమను, ప్రేయసిని వదులుకోకూడదనుకునే యువకుడు కొన్ని నిజాలను దాస్తాడు. ఆ నిజం బయటపడితే వారి ప్రేమలో ఎలాంటి పరీక్షలు ఎదురవుతాయి? వారి మధ్య ఊసులు కరువై ఊహలే ఊసులైన వేళ ఎలా ఉంటుంది? తన ప్రేమలో నిజాయతీ ఉందని, తాను ఊరకనే మోసం చేయలేదని ప్రేమికుడు.. తెలిసి నిజాన్ని దాచి పెట్టడం తప్పు అనే ప్రేయసి పాడుకునే పాట ‘మనసా వినవా..’’ అన్నారు.
చదవండి: వైరల్: కూతుర్ని గుండెలపై ఎక్కించుకున్న అల్లు అర్జున్
Comments
Please login to add a commentAdd a comment