101 Jillala Andagadu Movie
-
‘నూటొక్క జిల్లాల అందగాడు’ మూవీ రివ్యూ
టైటిల్ : నూటొక్క జిల్లాల అందగాడు జానర్ : కామెడీ డ్రామా నటీనటులు : అవసరాల శ్రీనివాస్, రుహానీ శర్మ, రోహిని, రాకెట్ రాఘవ తదితరులు నిర్మాతలు : శిరీష్, రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి కథ: అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం : రాచకొండ విద్యాసాగర్ సంగీతం : శక్తికాంత్ కార్తీక్ విడుదల తేది : సెప్టెంబర్ 3, 2021 Nootokka Jillala Andagadu Movie Review: ‘అష్టాచెమ్మా’తో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అవసరాల శ్రీనివాస్.. మంచి నటుడిగా, దర్శకుడిగా, రచయితగా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నటుడిగా ఒకే జానర్‌కు పరిమితం కాకుండా డిఫరెంట్ పాత్రలతో నటిస్తూ ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. .‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’సినిమాలతో ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడిగా మారిపోయారాయన. తాజాగా ఆయన రచయితగా, హీరోగా ‘నూటొక్క జిల్లాల అందగాడు’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బట్టతల వల్ల ఒక యువకుడు ప్రేమ, పెళ్లి విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. 2020లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా, కరోనా కారణంగా వాయిదా పడుతూ... శుక్రవారం(సెప్టెంబర్ 3)న థియేటర్లలో విడుదలైంది. . టీజర్, ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలు ఈ ‘నూటొక్క జిల్లాల అందగాడు’ ఏ మేరకు అందుకున్నాడో రివ్యూలో చూద్దాం. నూటొక్క జిల్లాల అందగాడి కథేంటంటే..? గొత్తి సత్యనారాయణ అలియాస్ జీఎస్ఎన్(అవసరాల శ్రీనివాస్) వంశ పారంపర్యంగా వచ్చిన బట్టతలతో బాధపడుతూ ఉంటాడు. బట్టతల ఉంటే ఏ అమ్మాయి ఇష్టపడదని, జీవితంలో తనకు పెళ్లి కూడా కాదనే అభద్రతాభావంతో జీవిస్తుంటాడు. బట్టతల ఉందనే విషయం తెలిస్తే ఎక్కడ తనను హేళన చేస్తారోనన్న భయంతో విగ్ పెట్టి కవర్ చేస్తుంటాడు. ఇలా తనని తనను ఇష్టపడని జీఎస్ఎన్.. తను పని చేసే ఆఫీస్‌లో అంజలి(రుహానీ శర్మ)ని ఇష్టపడతాడు. అంజలి కూడా జీఎస్ఎన్ని ఇష్టపడుతుంది. అయితే ఒకరోజు అనుకోకుండా జీఎస్ఎస్ విగ్ మ్యాటర్ అంజలికి తెలిసిపోతుంది. ఆ తర్వాత వీరి మధ్య బంధం ఎలా కొనసాగింది? బట్టతల ఉంటే ఎవరూ ఇష్టపడరనుకునే జీఎస్ఎన్ అనుమానం నిజం అయిందా? ఆ నిజం బయటపడ్డాక వారి ప్రేమలో ఎలాంటి పరీక్షలు ఎదురయ్యాయి? చివరకు ఈ జంట ఎలా కలిశారనేదే మిగత కథ. ఎవరెలా చేశారంటే? బట్టతలతో బాధపడే యువకుడు జీఎస్ఎన్ పాత్రలో అవసరాల శ్రీనివాస్ అద్భుతంగా నటించాడు.. తనదైన మేనరిజమ్స్‌తో నవ్విస్తూనే.. ఎమోషనల్ సీన్స్‌ని కూడా అద్భుతంగా పండించాడు. సినిమా భారం మొత్తం తన భూజాల మీద వేసుకొని కథని నడిపించాడు. ఇక అంజలి పాత్రలో రుహానిశర్మ జీవించేసింది. తెరపై అందంగా కనిపిస్తూనే తనదైన నటనతో ఆకట్టుకుంది. అలాగే హీరో తల్లిపాత్రలో రోహిణి ఎప్పటి మాదిరే ఒదిగిపోయింది. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? పక్కవారిలో ఏదైనా లోపం ఉంటే దాన్ని ఎత్తి చూపిస్తూ కొందరు కామెడీగా, హేళనగా మాట్లాడుతుంటారు. దీనివల్ల ఆల్రెడీ తాము బాగోలేమనే ఆత్మన్యూనతాభావంలో ఉన్నవారి ఆత్మవిశ్వాసం మరింత దెబ్బ తింటుంది. ఇలాంటి ఓ అంశం ఆధారంగా చేసిన సినిమానే ‘నూటొక్క జిల్లాల అందగాడు’.తన అందానికి, ఆనందానికి బట్టతల అడ్డంగా మారిందని తనను తాను అసహ్యించుకునే ఓ యువకుడి కథ ఇది. నేటి సమాజంలో చాలా మంది బట్టతల వస్తే నామోషీగా ఫీలవుతుంటారు. జీవితంలో ఏదో కోల్పోయినట్లు బాధపడుతుంటారు. అందం అంటే శరీరానికి సంబంధించినది కాదని మనసు సంబంధించినది ఈ సినిమా ద్వారా మరోసారి గుర్తు చేశారు. అందరికి కనెక్ట్ అయ్యే విషయాన్ని.. కాస్త ఫన్నీగా, ఎమోషనల్‌గా తెరపై చూపించాడు దర్శకుడు విద్యాసాగర్. అయితే బట్టతల కాన్సెప్ట్‌తో హిందీలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా ‘బాలా’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ‘నూటొక్క జిల్లాల అందగాడు’కూడా దాదాపు అలాంటి కథే. కానీ తెలుగు ప్రేక్షకులకు ఇది కొత్త కథ. కోట్లాది మందికి ఈజీగా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. అయితే ఈ కథను ఇంకాస్త పకడ్భందీగా తీర్చిదిద్దితే బాగుండేది. ఫస్టాఫ్ అంతా చాలా వినోదాత్మకంగా నడిపించిన దర్శకుడు.. సెకండాఫ్‌లో ఎమోషనల్ టర్న్ తీసుకున్నాడు. అయితే అక్కడ కూడా కామెడీ మిస్ కాకుండా జాగ్రత్త పడ్డాడు. ఇంటర్వెల్ టిస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. కానీ కథనంలో కొత్తదనం లేకపోడం, హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ కూడా అంత హాట్ టచింగ్‌గా అనిపించకపోవడం సినిమాకు కాస్త మైనస్. ఇక క్లైమాక్స్ కూడా అందరూ ఊహించినట్టుగా రొటీన్‌గా ఉంటుంది. డైలాగ్స మాత్రం ఆకట్టుకుంటాయి. ఇక సాంకేతిక విషయాకొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధాన బలం శక్తికాంత్ కార్తీక్ సంగీతం. పాటలు అంతంతమాత్రమే అయినా నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది. ఎమోషనల్ సీన్లను తన రీరికార్డింగ్‌తో మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
అదే జరిగితే నేను ఫ్లాప్ అయినట్టే: అవసరాల శ్రీనివాస్
Srinivas Avasarala Comments On Nootokka Jillala Andagadu ‘‘నా రచన, నటన, దర్శకత్వం నన్ను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాయి. సినిమాలన్నీ రైటింగ్ అండ్ ఎడిటింగ్ టేబుల్‌పైనే జరుగుతాయని నా ఫీలింగ్. అందుకే నాకు రచనే సంతృప్తినిస్తుంది. దర్శకత్వం నన్ను ఒత్తిడికి గురి చేస్తుంది’’ అన్నారు రచయిత, నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్. రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వంలో అవసరాల శ్రీనివాస్, రుహానీ శర్మ జంటగా నటించిన చిత్రం ‘నూటొక్క జిల్లాల అందగాడు’. ‘దిల్’ రాజు, క్రిష్ సమర్పణలో శిరీష్, రాజీవ్‌రెడ్డి, క్రిష్ జాగర్లమూడి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ చిత్రానికి కథ అందించి, హీరోగా నటించిన అవసరాల శ్రీనివాస్ చెప్పిన విశేషాలు. ► హిందీలో వచ్చిన ‘బాల’ చిత్రానికి మా ‘నూటొక్క జిల్లాల అందగాడు’ రీమేక్ కాదు. 2019 అక్టోబరులో మా సినిమా ఓపెనింగ్ జరిగింది. అప్పటికి ‘బాల’ రాలేదు. తర్వాత ‘బాల’ వస్తుందని తెలిసి వీలైనంత తొందరగా పూర్తి చేసి, ‘బాల’కు పోటీగా ఈ సినిమాను విడుదల చేద్దామనే ప్రయత్నం చేశాం.. కుదర్లేదు. 2020 ఏప్రిల్‌లో విడుదల చేద్దామనుకుంటే.. మార్చిలోనే లాక్డౌన్ విధించారు. అయితే ‘బాల’ సినిమా ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి మా సినిమాలో ఏమైనా మార్పులు అవసరం అవుతాయా? అని నేనా సినిమా చూశాను. మార్పులేవీ అవసరం లేదనిపించింది. మా సినిమా కథ వేరేలా ఉంటుంది. ► పక్కవారిలో ఏదైనా లోపం ఉంటే దాన్ని ఎత్తి చూపిస్తూ కొందరు కామెడీగా, హేళనగా మాట్లాడుతుంటారు. దీనివల్ల ఆల్రెడీ తాము బాగోలేమనే ఆత్మన్యూనతాభావంలో ఉన్నవారి ఆత్మవిశ్వాసం మరింత దెబ్బ తింటుంది. ఇలాంటి ఓ అంశం ఆధారంగా సినిమా చేసే ఆలోచన ఉందని క్రిష్‌గారితో చెబితే ఐడియా బాగుందన్నారు. ఇది ఎమోషన్‌తో కూడిన హ్యూమర్ మూవీ. ఇలాంటి కామెడీ ఎక్కువ కాలం నిలిచిపోతుందన్నది నా నమ్మకం. ► నేను డైరెక్షన్ చేస్తున్న ‘ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’ (వర్కింగ్ టైటిల్) సినిమా యాభై శాతం పూర్తయింది. మిగతా భాగం అమెరికాలో షూట్ చేయాలి. టీమ్‌కి వీసాలు కావాలి. అందుకు కాస్త ఆలస్యం అవుతుంది. ఈ లోపు ఓ సినిమా చేద్దామని ‘నూటొక్క జిల్లాల..’లో నటించాను. నా డైరెక్షన్లో ఓ సినిమా సెట్స్‌పై ఉన్నప్పుడు మరో సినిమాకు నేను దర్శకత్వం వహించడం నాకు కరెక్ట్ కాదనిపించింది. అందుకే నా అసోసియేట్ డైరెక్టర్ విద్యాసాగర్ ‘నూటొక్క జిల్లాలకు..’ డైరెక్షన్ చేస్తే బాగుంటుందని నిర్మాతలతో చెప్పాను. ► ఒక్క సినిమాతో ప్రపంచంలో సమస్యలు పరిష్కారం కావు. సందేశం ఇవ్వాలని ఈ సినిమా చేయలేదు. అయితే ఎవరికైనా సందేశంలా అనిపిస్తే ఓకే. ఎవర్నీ కించపరచాలనో, అవహేళన చేయాలనో ఈ సినిమా తీయలేదు. నిజంగా మా సినిమాలోని సన్నివేశాలు, హ్యూమర్ ఎవరి మనోభావాలను అయినా దెబ్బతీసినట్లయితే.. ఒకవేళ సినిమా సక్సెస్ అయినా కూడా నేను ఫ్లాప్ అయినట్లే. ఏ పాయింట్‌ని అయినా కాస్త నవ్విస్తూ చెబితే ప్రేక్షకులకు బాగా రీచ్ అవుతుందని నా నమ్మకం. ► నా కెరీర్ గురించి నాకు కంగారు లేదు. నా సినిమా కథలను నేనే రాసుకుంటున్నా. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా రాయడానికి మూడేళ్లు పట్టింది. ‘జో అచ్యుతానంద’ చిత్రాన్ని రెండేళ్లల్లో రాశాను. ఆ నెక్ట్స్ సినిమాకి రెండేళ్లు పట్టింది. ఈ కథ నాది కాదనే ఫీలింగ్ ఉంటే ఆ సినిమాకు నేను డైరెక్షన్ చేయలేను. ► యాక్టర్‌గా నన్ను నేను భిన్నమైన పాత్రల్లో చూడాలనుకుంటాను. అందుకే ‘జెంటిల్‌మేన్’లో విలన్‌గా చేశా. అలాగే బాగా నచ్చి చేసిన ‘బాబు బాగా బిజీ’ ఆడకపోయినా చేసినందుకు రిగ్రేట్ ఫీల్ కావడం లేదు. ► నేను రాసిన కథలకు ఇప్పటివరకు ఏ ప్రాబ్లమ్ రాలేదు. హింసాత్మక చిత్రాలు నాకు పెద్దగా నచ్చవు. ఇప్పట్నుంచి ఎక్కువగా రచన, దర్శకత్వంపైనే ఫోకస్ పెడదామని అనుకుంటున్నాను. ఓటీటీలో నిత్యా మీనన్ లీడ్ రోల్ చేయనున్న ‘కుమారి శ్రీమతి’ అనే షోకి రన్నర్‌గా చేయనున్నాను. -
సైకో పాత్ర చేయాలని ఉంది: హీరోయిన్
‘‘మనకు బాహ్యసౌందర్యం మాత్రమే ముఖ్యం కాదు.. మన అంతర్గత వ్యక్తిత్వం, స్వభావం కూడా ఉన్నతంగా ఉండాలి. మనల్ని మనంగా ఒప్పుకునే తత్వమే అందం’’ అన్నారు రుహానీ శర్మ. అవసరాల శ్రీనివాస్, రుహానీ శర్మ జంటగా రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు, క్రిష్ సమర్పణలో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. ఈ సినిమా సెప్టెంబరు 3న విడుదల కానుంది. (చదవండి: టాలీవుడ్ డ్రగ్ కేసు: ముగిసిన పూరి జగన్నాథ్ విచారణ) ఈ సందర్భంగా రుహానీ శర్మ మాట్లాడుతూ – ‘‘బట్టతల ఉన్న ఓ యువకుడు తనను తాను ఇష్టపడడు. కానీ ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. తన ప్రేమను గెలిపించుకోవడానికి అతను ఏం చేశాడు? ఫైనల్‌గా తనను తాను ఎలా ప్రేమించుకున్నాడు? అన్నదే కథ. శ్రీని (అవసరాల శ్రీనివాస్) బ్రిలియంట్ డైరెక్టర్, యాక్టర్ అండ్ రైటర్. లవ్లీ కోస్టార్. డైరెక్టర్ విద్యాసాగర్ బాగా హెల్ప్ చేశారు’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘తెరపై ఎంతసేపు కనపడతామన్నది నాకు ముఖ్యం కాదు. పాత్ర ప్రాధాన్యం ముఖ్యం. హిందీ, మలయాళం, తమిళ భాషల్లోనూ సినిమాలు చేస్తున్నాను. అయితే ఎక్కువ ఫోకస్ తెలుగు చిత్రాలపైనే. నాని నిర్మిస్తున్న ‘మీట్ క్యూట్’ ఆంథాలజీలో సత్యారాజ్తో కలిసి ఓ భాగంలో యాక్ట్ చేశాను. తెలుగులోనే మరో ఆంథాలజీలో కూడా నటించాను. వ్యక్తిగతంగా నాకు లవ్‌స్టోరీలు, సైకో థ్రిల్లర్స్ ఇష్టం. సైకో పాత్రలో నటించాలని ఉంది’’ అన్నారు రుహాని. -
అవసరాల.. నవరసాల శ్రీనివాస్ అయ్యారు
‘‘కంచె’ సినిమా అప్పుడు అవసరాలగారు.. ‘హైట్‌గా లేననో, జుట్టు లేదనో, కలర్‌గా లేననో అనేకమైన ఇన్‌సెక్యూరిటీస్‌తో కొందరు తమ జీవితాలను నరకప్రాయంగా మార్చుకుంటారు. దాన్ని హిలేరియస్‌గా చూపిస్తాను’ అంటూ ఓ ఇరవై నిమిషాల కథ చెప్పారు. ఆ పాయింట్ నాకు, రాజీవ్‌గారికి బాగా నచ్చింది’’ అన్నారు దర్శకుడు జాగర్లమూడి క్రిష్. రాచకొండ విద్యాసాగర్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, అవసరాల శ్రీనివాస్, రుహానీ శర్మ హీరో హీరోయిన్లుగా ‘దిల్’రాజు, క్రిష్ సమర్పణలో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. సెప్టెంబర్ 3న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో క్రిష్ మాట్లాడుతూ – ‘‘2017లో దర్శకుడు సాగర్ ఓ థ్రిల్లర్ కథ చెప్పారు. ఆ కథను అవసరాలతో చేద్దామని నేను, రాజీవ్‌గారు అనుకున్నాం. అయితే ‘కంచె’ అప్పుడు చెప్పిన కథ గురించి అవసరాలను అడిగితే, ఆ కథకు ‘నూటొక్క జిల్లాల అందగాడు’ అనే టైటిల్ పెట్టానని చెప్పారు. ఆ సినిమా చేద్దామను కున్నాం. అవసరాల అంకితభావం ఉన్న నటుడు. టెక్నాలజీ సాయంతో బట్టతల కనిపించేలా చేస్తామన్నాం.. కానీ బట్టతల కనిపించేలా షేవ్ చేసుకుని ఓ నాలుగైదు నెలలు ఆయన అలానే ఉన్నారు. అందంగా, కొత్తగా అవసరాల శ్రీనివాస్.. నవరసాల శ్రీనివాస్ అయ్యారు. నిర్మాతలుగా ఎవరూ చెప్పని కథలను చెప్పాలని కంకణం కట్టుకున్న మాకు ‘దిల్’ రాజు, శిరీష్ వంటి నిర్మాతలు తోడయ్యారు. ఈ సినిమా కథ వెండితెరపైకి రావడానికి కృషి చేసిన రాజీవ్ రెడ్డిగారికి థ్యాంక్స్’’ అన్నారు. రాచకొండ విద్యాసాగర్ మాట్లాడుతూ– ‘‘నాకు చిన్న ఫిజికల్ ప్రాబ్లమ్ ఉంది (సరిగా నడవలేకపోవడం, చేయి సరిగా ఉండకపోవడం). నేను డిఫరెంట్‌గా నడుస్తుంటే అందరూ ఏమనుకుంటారో అని బాధపడేవాడిని. నా ఇబ్బందిని యాక్సెప్ట్ చేయడానికి భయపడ్డాను. అమేజింగ్ కథ రాశారు శ్రీని (అవసరాల శ్రీనివాస్). సినిమా తీసిన రెండేళ్లకు అర్థమైంది.. అది నా కథ కూడా అని. ఈ సినిమా కథ చాలామందిని ఆలోచింపజేస్తుంది. నన్ను చూసి అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, నా డైరెక్షన్ టీమ్, చిత్రయూనిట్‌తో పాటు నా లైఫ్‌లో నన్ను సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘ఫస్ట్ ఈ సినిమా ఐడియా వచ్చినప్పుడు నా ఐడియా అనుకున్నాను. స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టి క్రిష్‌గారికి చెప్పిన తర్వాత అది మా ఐడియా అయింది. ఆ తర్వాత ఆ ఐడియా సినిమాగా మారింది. సినిమా మీలోని నిజమైన మిమ్మల్ని మీకు పరిచయం చేస్తుంది’’ అన్నారు అవసరాల శ్రీనివాస్. -
నాలుగు అక్షరాలు.. ఇది ఉంటే వివాహానికి ఇబ్బంది.. ఏంటది?
అవసరాల శ్రీనివాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. రుహానీశర్మ హీరోయిన్. రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వం వహిస్తున్నారు. శిరీష్, రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలు. దిల్‌రాజు, జాగర్లమూడి క్రిష్ సమర్పిస్తున్నారు. సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది చిత్ర యూనిట్. బుధవారం ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు.ఆద్యంతం అలరించేలా, నవ్వులు పంచేలా సినిమాను తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. (చదవండి: ఒక్క రోజు లేట్ అయితే చచ్చిపోయేవాడ్ని.. చిరంజీవి కాపాడాడు : బండ్ల గణేశ్) అవసరాల శ్రీనివాస్ తన బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్‌తో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. తన పెళ్ళికి బట్టతల అడ్డంకిగా మారడం వంటి ఎమోషన్ సీన్స్ తో సినిమాపై ఆసక్తిని పెంచేశారు. నాలుగు అక్షరాలు.. ఇది ఉంటే వివాహానికి ఇబ్బంది ఏంటది అని తల్లి పజిల్ వేయగా.. బట్టతల అని శ్రీనివాస్ జవాబుఇవ్వడం హిలేరియస్‌గా ఉంది. ‘ఏ జుట్టు దువ్వుకుంటే దువ్వెనలకు పళ్లు సైతం రాలతాయని భయమేస్తుందో.. ఏ జుట్టు ముడిస్తే, కొండలు సైతం కదలుతాయో.. అటువంటి బలమైన, దట్టమైన, అందమైన జుట్టు ఇచ్చి, నన్ను ఈ కేశ దారిద్ర్యం నుంచి బయటపడేసి..ఈ క్షవర సాగరం దాటించు స్వామి’, అని హీరో వేడుకోవడం నవ్వులు పూయిస్తుంది. కాగా, గతంలో సినిమా ప్రమోషన్లో భాగంగా అవసరాల శ్రీనివాస్ బట్టతల వీడియోను చిత్ర యూనిట్ వైరల్ చేసిన సంగతి తెలిసిందే. -
101 జిల్లాల అందగాడు: నిజాన్ని దాచేస్తే..!
అవసరాల శ్రీనివాస్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. రాచకొండ విద్యాసాగర్ దర్శకుడు. రుహానీ శర్మ కథానాయికగా నటించారు. ‘దిల్’ రాజు, డైరెక్టర్ క్రిష్ సమర్పణలో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమాలోని ‘మనసా వినవా..’ అనే పాట బుధవారం విడుదలయింది. ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా, శ్రీరామచంద్ర, ధన్య బాలకృష్ణ పాడారు. రచయిత భాస్కర భట్ల మాట్లాడుతూ– ‘‘ప్రేమలో నిజాయతీ ఉండాలనుకునే అమ్మాయి... దొరక్క దొరికిన ప్రేమను, ప్రేయసిని వదులుకోకూడదనుకునే యువకుడు కొన్ని నిజాలను దాస్తాడు. ఆ నిజం బయటపడితే వారి ప్రేమలో ఎలాంటి పరీక్షలు ఎదురవుతాయి? వారి మధ్య ఊసులు కరువై ఊహలే ఊసులైన వేళ ఎలా ఉంటుంది? తన ప్రేమలో నిజాయతీ ఉందని, తాను ఊరకనే మోసం చేయలేదని ప్రేమికుడు.. తెలిసి నిజాన్ని దాచి పెట్టడం తప్పు అనే ప్రేయసి పాడుకునే పాట ‘మనసా వినవా..’’ అన్నారు. చదవండి: వైరల్: కూతుర్ని గుండెలపై ఎక్కించుకున్న అల్లు అర్జున్