‘‘మనకు బాహ్యసౌందర్యం మాత్రమే ముఖ్యం కాదు.. మన అంతర్గత వ్యక్తిత్వం, స్వభావం కూడా ఉన్నతంగా ఉండాలి. మనల్ని మనంగా ఒప్పుకునే తత్వమే అందం’’ అన్నారు రుహానీ శర్మ. అవసరాల శ్రీనివాస్, రుహానీ శర్మ జంటగా రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు, క్రిష్ సమర్పణలో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. ఈ సినిమా సెప్టెంబరు 3న విడుదల కానుంది.
(చదవండి: టాలీవుడ్ డ్రగ్ కేసు: ముగిసిన పూరి జగన్నాథ్ విచారణ)
ఈ సందర్భంగా రుహానీ శర్మ మాట్లాడుతూ – ‘‘బట్టతల ఉన్న ఓ యువకుడు తనను తాను ఇష్టపడడు. కానీ ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. తన ప్రేమను గెలిపించుకోవడానికి అతను ఏం చేశాడు? ఫైనల్‌గా తనను తాను ఎలా ప్రేమించుకున్నాడు? అన్నదే కథ. శ్రీని (అవసరాల శ్రీనివాస్) బ్రిలియంట్ డైరెక్టర్, యాక్టర్ అండ్ రైటర్. లవ్లీ కోస్టార్. డైరెక్టర్ విద్యాసాగర్ బాగా హెల్ప్ చేశారు’’ అన్నారు.
ఇంకా మాట్లాడుతూ– ‘‘తెరపై ఎంతసేపు కనపడతామన్నది నాకు ముఖ్యం కాదు. పాత్ర ప్రాధాన్యం ముఖ్యం. హిందీ, మలయాళం, తమిళ భాషల్లోనూ సినిమాలు చేస్తున్నాను. అయితే ఎక్కువ ఫోకస్ తెలుగు చిత్రాలపైనే. నాని నిర్మిస్తున్న ‘మీట్ క్యూట్’ ఆంథాలజీలో సత్యారాజ్‌తో కలిసి ఓ భాగంలో యాక్ట్ చేశాను. తెలుగులోనే మరో ఆంథాలజీలో కూడా నటించాను. వ్యక్తిగతంగా నాకు లవ్‌స్టోరీలు, సైకో థ్రిల్లర్స్ ఇష్టం. సైకో పాత్రలో నటించాలని ఉంది’’ అన్నారు రుహాని.
Comments
Please login to add a commentAdd a comment