avasarala Srinivas
-
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మూవీ
టాలీవుడ్ నటుడు అవసరాల శ్రీనివాస్.. ఆ మధ్య పిండం సినిమాతో హిట్ అందుకున్నాడు. ఈగల్లోనూ ముఖ్య పాత్రలో కనిపించాడు. కిస్మత్లోనూ కీలక పాత్రలో మెరిశాడు. ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిస్మత్ మూవీ థియేటర్లలో పెద్దగా సౌండ్ చేయలేదు. ఈ చిత్రంలో నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వదేవ్, రియా సుమన్ ప్రధాన పాత్రలు పోషించారు. బీటెక్ బాధితులను దృష్టిలో పెట్టుకుని తీసినట్లుగా ఉంటుందీ సినిమా. వారికైతే కచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఈ మూవీ ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కథేంటంటే? ముగ్గురు స్నేహితులు బీటెక్ చదువు పూర్తి చేసుకుని ఊరికి వచ్చేస్తారు. తమ జీవితంలో ఏదైనా అద్భుతం జరగాలని ఆశిస్తుంటారు. విశ్వదేవ్ నమ్మకం కోల్పోయి ఉంటాడు. రియా సుమన్‌తో నరేశ్ అగస్త్య ప్రేమలో ఉంటాడు. అభినవ్ గోమఠానికి సినీ రచయిత అవ్వాలన్నది కల. ఇంట్లో వాళ్ల పోరు తట్టుకోలేక హైదరాబాద్ వచ్చి ఉద్యోగం కోసం వేట మొదలుపెడతారు. ఆ తర్వాత జరిగిన ఓ సంఘటన వల్ల ఈ ముగ్గురి కిస్మత్ (అదృష్టం) ఎలా మారిందనేదే కథ! ఇక ఈ చిత్రాన్ని శ్రీనాథ్ బాదినేని దర్శకత్వంలో కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీ, అధీరా ప్రొడక్షన్స్ పతాకాలపై రాజు నిర్మించారు. మార్క్ కె రాబిన్ సంగీతం అందించాడు. చదవండి: కావాలయ్యా.. సాంగ్‌పై దారుణ ట్రోల్స్.. మైండ్‌సెట్ మారాలన్న మిల్కీబ్యూటీ -
ఇండస్ట్రీకి 'అవసరాల' బుల్లోడి అరుదైన ఫోటోలు..
-
ఓటీటీలో దూసుకెళ్తున్న ‘పిండం’
ప్రముఖ నటుడు శ్రీరామ్ అలాగే శ్రీనివాస్ అవసరాల, సీనియర్ నటి ఈశ్వరి రావు ముఖ్య పాత్రల్లో దర్శకుడు సాయి కిరణ్ దైదా తెరకెక్కించిన హారర్ థ్రిల్లర్ చిత్రం “పిండం”. ఇటీవల మంచి ప్రమోషన్స్ నడుమ అలాగే మోస్ట్ స్కేరియెస్ట్ సినిమాగా థియేటర్స్ లో విడుదలై థియేటర్ ఆడియాన్స్ తో ప్రశంశలు పొందింది. తాజాగా ఈ చిత్రం అయితే ఇప్పుడు ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. పిండం సినిమా ఇప్పుడు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమ్ అవుతొంది. అలాగే తెలుగు, తమిళ్ భాషల్లో ఆహలో అందుబాటులో ఉంది. ఇక ఈ చిత్రానికి కృష్ణ శౌరబ్ సూరంపల్లి సంగీతం అందించగా యశ్వంత్ దగ్గుమాటి నిర్మాణం వహించారు. థియేటర్స్ లో మిస్ ఆయన ప్రేక్షకులు ఇంట్లో ఫ్యామిలీ మొత్తం తో కలిసి చూడొచ్చు. హర్రర్ ఎలిమెంట్స్ తో పాటు అన్ని ఏజ్ గ్రూప్స్ కిలిసి చూసే విధంగా సినిమాను తెరకెకించారు సాయి కిరణ్ దైదా. ‘పిండం’ కథేంటంటే.. క్రైస్తవ మతానికి చెందిన ఆంథోని(శ్రీరామ్) రైస్ మిల్లులో ఓ అకౌంటెంట్. భార్య మేరి(ఖుషి రవి), ఇద్దరు కూతుళ్లు(సోఫియా, తార), తల్లి సూరమ్మతో కలిసి శుక్లాపేటలోని ఓ ఇంట్లో నివాసం ఉంటాడు. అది పురాతమైన ఇల్లు. తక్కువ ధరకు వస్తుందని భావించి ఆ ఇంటిని కొనుగోలు చేస్తాడు ఆంథోని. ఆ ఇంట్లోకి వెళ్లిన తర్వాత ఆంథోని ప్యామిలీకి ఉహించని సంఘటనలు ఎదురవుతాయి. గర్భవతిగా ఉన్న భార్య మేరి ఆస్పత్రి పాలవుతుంది. మూగదైన చిన్నకూతురు తారను ఓ ఆత్మ ఆవహిస్తుంది. ఆ ఫ్యామిలీని చంపేందుకు క్షుద్రశక్తులు ప్రయత్నిస్తాయి. అలాంటి సమయంలో వారికి సాయం చేయడానికి అన్నమ్మ(ఈశ్వరీరావు) రంగంలోకి దిగుతుంది. ఆంథోని ఫ్యామిలీని వేధిస్తుంది ఒక ఆత్మ కాదని..ఆ ఇంట్లో చాలా ఆత్మలు ఉన్నాయని అన్నమ్మ గుర్తిస్తుంది. అసలు ఆ ఆత్మల కథేంటి? వాళ్లు ఎలా చనిపోయారు? ఆంథోని ఆ పురాతన ఇంటిని ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఆ ఇంట్లో అంతకు ముందు ఏం జరిగింది? ఆ ఇంటి నుంచి ఆత్మలను తొలగించేందుకు అన్నమ్మ ఏం చేసింది? చిన్న కూతురు తారను ఆవహించిన ఆత్మను విదిలించేక్రమంలో అన్నమ్మకు ఎదురదైన సమస్యలు ఏంటి? చివరకు ఆంథోని ఫ్యామిలీని అన్నమ్మ ఎలా రక్షించింది? 1932లో జరిగిన ఈ సంఘటన గురించి తెలుసుకునేందుకు లోక్‌నాథ్(అవసరాల శ్రీనివాస్)ఎందుకు ఆసక్తి చూపాడు? అనేది తెలియాలంటే ‘పిండం’సినిమా చూడాల్సిందే. -
2023లో బాగా భయపెట్టిన చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తుంది
టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల అయి బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి కలెక్షన్స్ రాబట్టింది. టైటిల్, ఫస్ట్‌లుక్‌తోనే ఆసక్తి కలిగించిన ఈ చిత్రం 1930, 1990.. వర్తమానం.. ఇలా మూడు కాలక్రమాల్లో జరిగే కథగా అద్భుతంగా డైరెక్టర్ చూపించారు. ఇందులో అవసరాల శ్రీనివాస్, ఈశ్వరీ రావు, రవివర్మ కీలకపాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే ఈ హారర్ మూవీ పిండం ఇప్పుడు ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేటర్లలో ప్రేక్షకులను బాగా భయపెట్టిన పిండం చిత్రాన్ని వచ్చే ఏడాది అంటే 2024 జనవరి మొదటి వారంలో నెట్‌ఫ్లిక్స్‌లోకి రానున్నట్లు సమాచారం. 2023లో బాగా భయపెట్టిన చిత్రంగా పిండం గుర్తింపు పొందింది. ఈ సినిమా టైటిల్ 'పిండం' అని ఎందుకు పెట్టారో దర్శకుడు గతంలో ఇలా చెప్పారు. మొదటి సినిమానే ఇలాంటి పేరుతో ఎందుకు తీస్తున్నావని అందరూ ప్రశ్నించారు. అది నెగెటివ్ పదమని అంతా అనుకుంటారు. కానీ, పిండం అంటే ఆరంభం.. అంతం రెండూ ఉంటాయి. అందుకే ఆ పేరు పెట్టాను.' అని ఆయన అన్నారు. సినిమా చూశాక ఇదే సరైన టైటిల్ అని అందరికీ అనిపించింది.. హరర్ సినిమాలను అమితంగా ఇష్టపడే వారు తప్పక చూడాల్సిన సినిమా అని చెప్పవచ్చు. -
నాతో నేనే ప్రయోగాలు చేయాలనుకుంటున్నాను: అవసరాల శ్రీనివాస్
‘‘దర్శకత్వం, నటనల కంటే నాకు రైటింగ్ అంటే ఎక్కువ ఇష్టం. నేను ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా తీసినప్పుడు ఆ తరహా చిత్రాలు అప్పుడు రాలేదు. అలానే ‘జో అచ్యుతానంద’ కూడా. ఇలా నా కథలతో నాతో నేనే ప్రయోగాలు చేయాలనుకుంటున్నా’’ అని అన్నారు రచయిత, దర్శక–నటుడు అవసరాల శ్రీనివాస్. శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన హారర్ ఫిల్మ్ ‘పిండం’లో అవసరాల శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. సాయికిరణ్ దైదా దర్శకత్వంలో యశ్వంత్ దగ్గుమాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘సాయికిరణ్ చేసిన ‘స్మోక్’ షార్ట్ ఫిల్మ్ చూసి, తనలో రచన, దర్శకత్వ ప్రతిభ ఉందని గ్రహించాను. తను చెప్పిన ‘పిండం’ కథ నచ్చింది. ఈ సినిమాలో అతీంద్రియ శక్తులపై పరిశోధనలు చేసే లోక్‌నాథ్ పాత్ర చేశాను. ‘ప్రేమకథా చిత్రమ్’ చూసినప్పుడు కొంచెం భయపెడితే ప్రేక్షకులు సినిమాను శ్రద్ధగా చూస్తారని అర్థమైంది. కానీ కథలో హారర్‌తో పాటు భావోద్వేగ సన్నివేశాలు కూడా ఉండాలి. అప్పుడే కనెక్ట్ అవుతారు. ఇక ప్రస్తుతం ‘ఈగల్’, ‘కిస్మత్’, ‘కన్యాశుల్కం’ సినిమాల్లో నటిస్తున్నాను. రైటర్‌గా, దర్శకుడిగా ఓ మర్డర్ మిస్టరీ సినిమా స్క్రిప్ట్ రాస్తున్నాను. నా తర్వాతి చిత్రం ఇదే కావొచ్చు. అలాగే ‘కుమారి శ్రీమతి’ వెబ్ సిరీస్ సీజన్ 2 ఉంటుంది’’ అని చెప్పుకొచ్చారు. -
'మరణించిన తర్వాత అసలేం జరుగుతుంది?'.. ఆసక్తిగా ట్రైలర్!
శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం పిండం. ఈ చిత్రానికి సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించారు. హారర్ ఫిల్మ్‌గా తెరకెక్కించిన ఈ మూవీ ది స్కేరియస్ట్ ఫిల్మ్ అనేది ఉప శీర్షిక. ఆరోహి దైదా సమర్పణలో యశ్వంత్ దగ్గుమాటి నిర్మించారు. ఈ సినిమాను డిసెంబరు 15న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. అయితే తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూడగానే ప్రేక్షకులను భయపెట్టడమే లక్ష్యంగా సినిమా తీసినట్లు తెలుస్తోంది. నిజంగానే దెయ్యాలు, ఆత్మలు ఉన్నాయా? అనే కోణంలోనే చిత్రాన్ని తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. ఈ చిత్రంలో ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు కృష్ణ సౌరభ్ సూరంపల్లి సంగీతం అందించారు. ఈనెల 15న మిమ్మల్ని భయపెట్టేందుకు వస్తోంది. -
'ఇది అన్ని కుక్కల్లా లేదు.. ఏదో తేడాగా ఉంది'
శ్రీకాంత్ శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటిస్తోన్న తాజా చిత్రం పిండం. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, ఈశ్వరీ రావు, రవివర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు. టైటిల్, ఫస్ట్‌లుక్‌తోనే ఆసక్తి పెంచేశారు మేకర్స్. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్ రిలీజ్ చేస్తూ..'ఇప్పటి వరకూ చూడని భయంకరమైన చిత్రం’ అనే ట్యాగ్‌లైన్‌తో విడుదల చేశారు. టీజర్ చూస్తే ఈ చిత్రం ఓ ఆత్మ చూట్టు తిరిగే కథాంశంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 1930, 1990.. వర్తమానం.. ఇలా మూడు కాలాల్లో జరిగే కథనే ఈ మూవీలో చూపించనున్నారు. టీజర్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ..'చిన్నప్పుడు విన్న ఓ కథను హారర్ జోనర్లో తెరకెక్కించాలని అనిపించింది. ఈ మూవీ స్క్రీన్‌ప్లే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. టైటిల్ పేరు వినగానే అందరూ ఈ పేరు ఎందుకు పెట్టావని అన్నారు. మీ మొదటి సినిమానే ఇలా ఎందుకు తీస్తున్నావని ప్రశ్నించారు. అది నెగెటివ్ పదమని అంతా అనుకుంటారు. కానీ, పిండం అంటే ఆరంభం.. అంతం రెండూ ఉంటాయి. అందుకే ఆ పేరు పెట్టా. సినిమా చూశాక టైటిల్ సరైందే అని మీకందరికీ అనిపిస్తుంది.' అన్నారు. -
PAPA Review: 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' రివ్యూ
టైటిల్: 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' నటీనటులు - నాగ శౌర్య, మాళవిక నాయర్, శ్రీనివాస్ అవసరాల, మేఘ చౌదరి, అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి, శ్రీ విద్య తదితరులు నిర్మాణ సంస్థలు : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి దర్శకుడు: శ్రీనివాస్ అవసరాల సంగీతం: కళ్యాణి మాలిక్, వివేక్ సాగర్(కాఫీఫై సాంగ్) సినిమాటోగ్రఫీ: సునీల్ కుమార్ నామ ఎడిటర్ : కిరణ్ గంటి విడుదల తేది: మార్చి 17, 2023 Rating: 2.5/5 Phalana Abbayi Phalana Ammayi Review: 'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' లాంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత నాగశౌర్య, శ్రీనివాస అవరాల కాంబినేష్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు(మార్చి 17) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించడంతో పాటు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ఈ సినిమా కథంతా 2000 నుంచి 2010 మధ్యకాలంలో సాగుతుంది. బీటెక్‌లో జాయిన్ అయిన సంజయ్‌ని సీనియర్స్ ర్యాగింగ్ చేస్తుంటే.. అతన్ని సేవ్ చేస్తుంది అనుపమ(మాళవికా నాయర్). అప్పటి నుంచి ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఇక ఎంఎస్ కోసం ఇద్దరు కలిసి యూకేకి వెళ్తారు. అక్కడ ఇద్దరు ప్రేమలో పడతారు. సహజీవనం కూడా చేస్తారు. ఎంఎస్ పూర్తవ్వగానే అనుపమకు వేరే సిటీలో ఉద్యోగం వస్తుంది. తనకు చెప్పకుండా ఉద్యోగానికి అప్లై చేసిందని అనుపమపై కోపంగా ఉంటాడు సంజయ్. అదే సమయంలో అతనికి పూజ(మేఘా చౌదరి)దగ్గరవుతుంది. ఆమె కారణంగా సంజయ్, అనుపమల మధ్య దూరం పెరుగుతుంది. ఇద్దరు విడిపోతారు. కొన్నాళ్ల తర్వాత అనుకోకుండా ఇద్దరు కలుస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? పూజ ప్రేమను సంజయ్ అంగీకరించాడా? అనుపమ జీవితంలోకి గిరి(అవసరాల శ్రీనివాస్) ఎలా వచ్చాడు? చివరికి సంజయ్, అనుపమలు కలిశారా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. సినిమా భాషలో కాంబినేషన్ అనే మాటకి విలువెక్కువ. ఓ హీరో, డైరెక్టర్ కలిసి చేసిన సినిమా హిట్ అయితే.. అదే కాంబోలో వస్తున్న కొత్త చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడటం సహజం. కానీ ఆ అంచనాలను దర్శకుడు అవసరాల శ్రీనివాస్ నిలబెట్టుకోలేకపోయాడు. ‘ఉహాలు గుస గుస లాడే , జ్యో అచ్యుతానంద’ బ్లాక్‌బస్టర్స్ తర్వాత నాగశౌర్యతో కలిసి చేసిన హ్యాట్రిక్ మూవీ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ఆ స్థాయిలో ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. కథలో చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. ఎలాంటి ట్విస్టులు లేకుండా చాలా రొటీన్‌గా కథనం సాగుతుంది. కొన్ని సీన్లలో శ్రీనివాస అవసరాల మార్క్ కామెడీ కనిపిస్తుంది. కానీ మొత్తంగా ఎక్కడో క్లారిటీ మిస్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో మొత్తం ఏడు చాప్టర్లు ఉంటాయి. ఒక్కో చాప్టర్ ఒక్కో థీమ్ తో ఉంటుంది. ప్రేమ, ద్వేషం, హాస్యం ఇలా అన్ని భావోద్వేగాలు ఉంటాయి. కానీ వాటిని ఆకట్టుకునే విధంగా తెరకెక్కించడంతో దర్శకుడు విఫలమయ్యాడు. కాలేజీలో హీరోహీరోయిన్ల స్నేహం.. ప్రేమ.. సహజీవనం తదితర సన్నివేశాలతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇక సెకండాఫ్ ఇద్దరి మధ్య మనస్పర్థలు.. విడిపోవడం.. ఇలా భావోద్వేగాల చుట్టూ తిరుగుతుంది. అయితే కలిసి జీవించాలనుకున్న ఈ జంట.. విడిపోవడానికి గల కారణాలను బలంగా చూపించలేకపోయారు. పార్ట్ పార్ట్‌లుగా చూస్తే కొన్ని సీన్స్ ఆకట్టుకుంటాయి. కానీ ఓవరాల్‌గా మాత్రం అంతగా మెప్పించదు. ఎవరెలా చేశారంటే... సంజయ్గా నాగశౌర్య మెప్పించాడు. లుక్స్ పరంగా చాలా మార్పులు ఉన్న పాత్ర తనది. ఇలాంటి రొమాంటిక్ ఫీల్ గుడ్ సినిమాలు.. పాత్రలు నాగశౌర్యకు కొత్తేమి కాదు. గత సినిమాల్లో మాదిరే లవర్ బాయ్‌గా సంజయ్ చక్కగా నటించాడు. ఇక అనుపమగా మాళవికా నాయర్ తనదైన నటనతో ఆకట్టుకుంది. సినిమా మొత్తం వీరిద్దరి పాత్రల చుట్టే తిరుగుతుంది. గిరిగా అవసరాల శ్రీనివాస్ ఉన్నంతలో మెప్పించాడు. వాలెంటైన్ గాఅభిషేక్ మహర్షి తనదైన కామెడీతో నవ్వించాడు, కీర్తిగా శ్రీవిద్య, పూజగా మేఘ చౌదరితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. కళ్యాణి మాలిక్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు కథకి తగ్గట్టుగా ఉన్నాయి. సునీల్ కుమార్ నామ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. -అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
ఈ సినిమాలో వచ్చే ఎమోషన్ ఏ తెలుగు సినిమాలోనూ చూడలేదు: అవసరాల
నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. టీజీ విశ్వప్రసాద్, దాసరి పద్మజ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కోసం మేం చాలా కష్టపడ్డాం. మా కష్టం థియేటర్స్‌లో తెలుస్తుంది. నా కెరీర్లో ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాల గురించి ఎలా చెప్పుకున్నానో ‘ఫలానా..’ సినిమా గురించి అంతే బాగా చెప్పుకుంటాను. ఈ సినిమా విజయం పట్ల నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలోని పాత్రలు నిజజీవితంలో చూసినట్లుగా ఉంటాయి. ఎమోషనల్ మూవీ ఇది. నటనపై ఆధారపడ్డ సినిమా కాబట్టే సింక్ సౌండ్ ఉండాలని నిర్ణయించుకున్నాను. ఈ సినిమాలోని సంజయ్ పాత్రకు నాగశౌర్య బాగా సరిపోయాడు. ఏడు చాప్టర్లు ఉండే ఈ సినిమాలోని నాలుగో చాప్టర్ నాకు చాలా ఇష్టం. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే ఈ చాప్టర్లో వచ్చే ఎమోషన్ ఇంతవరకు నేను తెలుగు సినిమాల్లో చూడలేదనేది నా అభిప్రాయం’’ అన్నారు అవసరాల శ్రీనివాస్. ‘‘నాగశౌర్య, మాళవికల సహజ నటన కోసం ఈ సినిమా చూడొచ్చు’’ అన్నారు చిత్ర సహనిర్మాత వివేక్ కూచిభొట్ల.‘‘ఇంత మంచి సినిమాలో మమ్మల్ని భాగం చేసిన విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్లగారికి థ్యాంక్స్’’ అన్నారు దాసరి ప్రసాద్. -
ముద్దు సీన్ గురించి మాళవికకు ముందే చెప్పాను: అవసరాల శ్రీనివాస్
‘‘నటీనటుల నుంచి సహజమైన నటనను రాబట్టుకోవడం అనేది దర్శకుడిగా నాకున్న బలం. ఫ్రేమ్‌లో నటీనటులు ఎలా యాక్ట్ చేస్తున్నారనే విషయాన్నే నేను ముందు చూస్తాను. నన్ను, నా కథను, నా కొత్త ప్రయోగాన్ని మా నిర్మాతలు నమ్మారు. ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమా విజయం సాధిస్తుంది’’ అన్నారు రచయిత, దర్శక–నటుడు అవసరాల శ్రీనివాస్. నాగర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. ఈ చిత్రంలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటించారు. టీజీ విశ్వప్రసాద్, దాసరి పద్మజ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకర్ల సమావేశంలో చిత్రదర్శకుడు అవసరాల శ్రీనివాస్ పంచుకున్న విశేషాలు. ► ఈ సినిమాలో ఏడు అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి అధ్యాయం నిడివి దాదాపు 20 నిమిషాలు ఉంటుంది. కథ రీత్యా 18 ఏళ్ల నుంచి 28 ఏళ్ల వయసు వరకు నాశౌర్య, మాళవిక పాత్రల ప్రయాణం ఉంటుంది. ఏడు చాప్టర్లూ ఈ పదేళ్ల వ్యవధిలోనే జరుగుతాయి. ► వయసుకి తగ్గట్లుగా పాత్ర తాలూకు ప్రవర్తన, ఆహార్యంలో వ్యత్యాసం చూపించడానికి నాగశౌర్య ఎంతో కష్టపడ్డారు. నిజజీవితంలో నేను చూసిన కొన్ని ఘటనల ఆధారంగా ఈ సినిమా కథ రాసుకున్నాను. పాత్రలు, సంభాషణలు చాలా సహజంగా ఉంటాయి. మనకు తెలిసిన కథలా, మనలో ఎవరో ఒకరి కథలా ఈ సినిమా ఉంటుంది. ► నాకు ఇష్టమైన యాక్టర్స్‌లో నాగశౌర్య ఒకరు. ఈ సినిమా యూకే షెడ్యూల్ కోసం 40 మందికి వీసాలు అప్లయ్ చేస్తే పదిమందికే ఓకే అయ్యాయి. దీంతో షూటింగ్ కోసం కొన్ని ఇబ్బందులు పడ్డాం. కానీ సెట్స్‌లో తన యాక్టింగ్‌తో నాగశౌర్య ఆ ఇబ్బందులను మర్చిపోయేలా చేసేవారు. ఈ సిని మాలో నాగశౌర్య పెర్ఫార్మెన్స్ ఎంత బాగుందనేది థియేటర్స్‌లో చూస్తారు. అలాగే ఈ సినిమాలో ముద్దు సీన్ ఉన్నట్లు మాళవికకు ముందే చెప్పాను. ఓ సన్నివేశానికి సరైన కారణాలు ఉంటే, కథకి ఖచ్చితంగా అవసరం అనిపిస్తే నటీనటులు ఆ సీన్లో యాక్ట్ చేయడానికి ఓకే అంటారన్నది నా అభిప్రాయం. ‘అష్టా చమ్మా’ చిత్రం నుంచే నాకు సంగీత దర్శకుడు కళ్యాణీ మాలిక్ తెలుసు. ఈ సినిమాకు ఆయన మంచి మ్యూజిక్ ఇచ్చారు. ‘కనుల చాటు..’ పాటను కీరవాణిగారు మెచ్చుకోవడంతో కళ్యాణీగారు ఇంకా సంతోషంగా ఉన్నారు. ► హిందీ ‘బ్రహ్మాస్త్రం’ టీమ్ ఓ సారి నాకు ఫోన్ చేసి తెలుగు డైలాగ్స్ రాస్తారా? అని అడిగారు. అప్పటికే ఆ సినిమా గురించి నాకు అవగాహన ఉండటంతో సరే అన్నాను. అలా ‘అవతార్ 2’కూ అవకాశం వచ్చింది. అయితే ఇంగ్లిష్ సినిమాలకు తెలుగు డైలాగ్స్ రాయడం చాలా కష్టం. కానీ చాలెంజ్‌గా తీసుకుని రాశాను. ఇక నటుడిగా ‘కన్యాశుల్కం’ వెబ్ సిరీస్ చేశాను. దర్శకుడిగా నా తర్వాతి చిత్రం గురించి త్వరలో అధికారికంగా చెబుతాను. -
అవతార్-2కి డైలాగ్స్ రాసిన అవసరాల శ్రీనివాస్
ప్రపంచ సినీ ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం ‘అవతార్ 2: ది వే ఆఫ్ వాటర్’. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగులోనూ అదే తేదీన థియేటర్స్‌కి రానుంది. అవతార్ 2 కి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఉన్న థియేటర్స్ లో 90 శాతం అవతార్ 2 కి కేటాయిస్తున్నారు..స్టార్ హీరో సినిమాకి కాకుండా ఒక హాలీవుడ్ డబ్ చిత్రానికి ఈ రేంజ్ రిలీజ్ రావడం ఇదే తొలిసారి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా తెలుగు వెర్షన్‌కి రచయిత–దర్శకుడు, నటుడు శ్రీనివాస్ అవసరాల డైలాగ్స్ రాశారు. విలక్షణ నటుడిగా, రచయితగా, డైరెక్టర్‌గా తన మార్క్‌ని చూపించిన అవసరాల ఇప్పుడు అవతార్-2తో ఏ విధంగా మెప్పిస్తారన్నది చూడాల్సి ఉంది. -
లండన్‌లో ‘ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి’ టీం సందడి
నాగశౌర్య హీరోగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,దాసరి ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాళవిక నాయర్ కథానాయిక. ప్రస్తుతం ఈ మూవీ లండన్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. అక్కడ హీరోహీరోయన్లపై కీలక సన్నివేశాలతో పాటు పాటలను చిత్రీకరిస్తున్నారు. అంతేకాదు ప్రధాన తారాగణం కూడా ఈ షూటింగ్ షెడ్యూల్ పాల్గొంది. గతంలో నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా నటించిన కళ్యాణ వైభోగమే ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. అలాగే శ్రీనివాస్ అవసరాల, నాగశౌర్య కాంబినేషన్లో రూపొందిన ఊహలు గుసగుసలాడే, జో అచ్చుతానంత చిత్రాలు కూడా మంచి విజయం సాధించాయి. ఇప్పుడు వీరి కాంబినేషన్లో అంటే.. కథానాయకుడిగా నాగశౌర్య, ఆయనకు జోడీగా మాళవిక నాయర్, దర్శకునిగా అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ఇలాంటి విజయవంతమైన చిత్రాల నాయకనాయికలు, దర్శకుడుతో పాటు ప్రతిభ కలిగిన సాంకేతిక వర్గంతో మా ఈ చిత్రం నిర్మించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. -
అదే జరిగితే నేను ఫ్లాప్ అయినట్టే: అవసరాల శ్రీనివాస్
Srinivas Avasarala Comments On Nootokka Jillala Andagadu ‘‘నా రచన, నటన, దర్శకత్వం నన్ను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాయి. సినిమాలన్నీ రైటింగ్ అండ్ ఎడిటింగ్ టేబుల్‌పైనే జరుగుతాయని నా ఫీలింగ్. అందుకే నాకు రచనే సంతృప్తినిస్తుంది. దర్శకత్వం నన్ను ఒత్తిడికి గురి చేస్తుంది’’ అన్నారు రచయిత, నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్. రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వంలో అవసరాల శ్రీనివాస్, రుహానీ శర్మ జంటగా నటించిన చిత్రం ‘నూటొక్క జిల్లాల అందగాడు’. ‘దిల్’ రాజు, క్రిష్ సమర్పణలో శిరీష్, రాజీవ్‌రెడ్డి, క్రిష్ జాగర్లమూడి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ చిత్రానికి కథ అందించి, హీరోగా నటించిన అవసరాల శ్రీనివాస్ చెప్పిన విశేషాలు. ► హిందీలో వచ్చిన ‘బాల’ చిత్రానికి మా ‘నూటొక్క జిల్లాల అందగాడు’ రీమేక్ కాదు. 2019 అక్టోబరులో మా సినిమా ఓపెనింగ్ జరిగింది. అప్పటికి ‘బాల’ రాలేదు. తర్వాత ‘బాల’ వస్తుందని తెలిసి వీలైనంత తొందరగా పూర్తి చేసి, ‘బాల’కు పోటీగా ఈ సినిమాను విడుదల చేద్దామనే ప్రయత్నం చేశాం.. కుదర్లేదు. 2020 ఏప్రిల్‌లో విడుదల చేద్దామనుకుంటే.. మార్చిలోనే లాక్డౌన్ విధించారు. అయితే ‘బాల’ సినిమా ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి మా సినిమాలో ఏమైనా మార్పులు అవసరం అవుతాయా? అని నేనా సినిమా చూశాను. మార్పులేవీ అవసరం లేదనిపించింది. మా సినిమా కథ వేరేలా ఉంటుంది. ► పక్కవారిలో ఏదైనా లోపం ఉంటే దాన్ని ఎత్తి చూపిస్తూ కొందరు కామెడీగా, హేళనగా మాట్లాడుతుంటారు. దీనివల్ల ఆల్రెడీ తాము బాగోలేమనే ఆత్మన్యూనతాభావంలో ఉన్నవారి ఆత్మవిశ్వాసం మరింత దెబ్బ తింటుంది. ఇలాంటి ఓ అంశం ఆధారంగా సినిమా చేసే ఆలోచన ఉందని క్రిష్‌గారితో చెబితే ఐడియా బాగుందన్నారు. ఇది ఎమోషన్‌తో కూడిన హ్యూమర్ మూవీ. ఇలాంటి కామెడీ ఎక్కువ కాలం నిలిచిపోతుందన్నది నా నమ్మకం. ► నేను డైరెక్షన్ చేస్తున్న ‘ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’ (వర్కింగ్ టైటిల్) సినిమా యాభై శాతం పూర్తయింది. మిగతా భాగం అమెరికాలో షూట్ చేయాలి. టీమ్‌కి వీసాలు కావాలి. అందుకు కాస్త ఆలస్యం అవుతుంది. ఈ లోపు ఓ సినిమా చేద్దామని ‘నూటొక్క జిల్లాల..’లో నటించాను. నా డైరెక్షన్లో ఓ సినిమా సెట్స్‌పై ఉన్నప్పుడు మరో సినిమాకు నేను దర్శకత్వం వహించడం నాకు కరెక్ట్ కాదనిపించింది. అందుకే నా అసోసియేట్ డైరెక్టర్ విద్యాసాగర్ ‘నూటొక్క జిల్లాలకు..’ డైరెక్షన్ చేస్తే బాగుంటుందని నిర్మాతలతో చెప్పాను. ► ఒక్క సినిమాతో ప్రపంచంలో సమస్యలు పరిష్కారం కావు. సందేశం ఇవ్వాలని ఈ సినిమా చేయలేదు. అయితే ఎవరికైనా సందేశంలా అనిపిస్తే ఓకే. ఎవర్నీ కించపరచాలనో, అవహేళన చేయాలనో ఈ సినిమా తీయలేదు. నిజంగా మా సినిమాలోని సన్నివేశాలు, హ్యూమర్ ఎవరి మనోభావాలను అయినా దెబ్బతీసినట్లయితే.. ఒకవేళ సినిమా సక్సెస్ అయినా కూడా నేను ఫ్లాప్ అయినట్లే. ఏ పాయింట్‌ని అయినా కాస్త నవ్విస్తూ చెబితే ప్రేక్షకులకు బాగా రీచ్ అవుతుందని నా నమ్మకం. ► నా కెరీర్ గురించి నాకు కంగారు లేదు. నా సినిమా కథలను నేనే రాసుకుంటున్నా. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా రాయడానికి మూడేళ్లు పట్టింది. ‘జో అచ్యుతానంద’ చిత్రాన్ని రెండేళ్లల్లో రాశాను. ఆ నెక్ట్స్ సినిమాకి రెండేళ్లు పట్టింది. ఈ కథ నాది కాదనే ఫీలింగ్ ఉంటే ఆ సినిమాకు నేను డైరెక్షన్ చేయలేను. ► యాక్టర్‌గా నన్ను నేను భిన్నమైన పాత్రల్లో చూడాలనుకుంటాను. అందుకే ‘జెంటిల్‌మేన్’లో విలన్‌గా చేశా. అలాగే బాగా నచ్చి చేసిన ‘బాబు బాగా బిజీ’ ఆడకపోయినా చేసినందుకు రిగ్రేట్ ఫీల్ కావడం లేదు. ► నేను రాసిన కథలకు ఇప్పటివరకు ఏ ప్రాబ్లమ్ రాలేదు. హింసాత్మక చిత్రాలు నాకు పెద్దగా నచ్చవు. ఇప్పట్నుంచి ఎక్కువగా రచన, దర్శకత్వంపైనే ఫోకస్ పెడదామని అనుకుంటున్నాను. ఓటీటీలో నిత్యా మీనన్ లీడ్ రోల్ చేయనున్న ‘కుమారి శ్రీమతి’ అనే షోకి రన్నర్‌గా చేయనున్నాను. -
సైకో పాత్ర చేయాలని ఉంది: హీరోయిన్
‘‘మనకు బాహ్యసౌందర్యం మాత్రమే ముఖ్యం కాదు.. మన అంతర్గత వ్యక్తిత్వం, స్వభావం కూడా ఉన్నతంగా ఉండాలి. మనల్ని మనంగా ఒప్పుకునే తత్వమే అందం’’ అన్నారు రుహానీ శర్మ. అవసరాల శ్రీనివాస్, రుహానీ శర్మ జంటగా రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు, క్రిష్ సమర్పణలో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. ఈ సినిమా సెప్టెంబరు 3న విడుదల కానుంది. (చదవండి: టాలీవుడ్ డ్రగ్ కేసు: ముగిసిన పూరి జగన్నాథ్ విచారణ) ఈ సందర్భంగా రుహానీ శర్మ మాట్లాడుతూ – ‘‘బట్టతల ఉన్న ఓ యువకుడు తనను తాను ఇష్టపడడు. కానీ ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. తన ప్రేమను గెలిపించుకోవడానికి అతను ఏం చేశాడు? ఫైనల్‌గా తనను తాను ఎలా ప్రేమించుకున్నాడు? అన్నదే కథ. శ్రీని (అవసరాల శ్రీనివాస్) బ్రిలియంట్ డైరెక్టర్, యాక్టర్ అండ్ రైటర్. లవ్లీ కోస్టార్. డైరెక్టర్ విద్యాసాగర్ బాగా హెల్ప్ చేశారు’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘తెరపై ఎంతసేపు కనపడతామన్నది నాకు ముఖ్యం కాదు. పాత్ర ప్రాధాన్యం ముఖ్యం. హిందీ, మలయాళం, తమిళ భాషల్లోనూ సినిమాలు చేస్తున్నాను. అయితే ఎక్కువ ఫోకస్ తెలుగు చిత్రాలపైనే. నాని నిర్మిస్తున్న ‘మీట్ క్యూట్’ ఆంథాలజీలో సత్యారాజ్తో కలిసి ఓ భాగంలో యాక్ట్ చేశాను. తెలుగులోనే మరో ఆంథాలజీలో కూడా నటించాను. వ్యక్తిగతంగా నాకు లవ్‌స్టోరీలు, సైకో థ్రిల్లర్స్ ఇష్టం. సైకో పాత్రలో నటించాలని ఉంది’’ అన్నారు రుహాని. -
ఈ నటుడు '101 జిల్లాలకు అందగాడు'
నటుడిగా, దర్శకుడి గుర్తింపు పొందిన అవసరాల శ్రీనివాస్ ఇప్పుడు కథానాయకుడిగానూ అలరించేందుకు రెడీ అవుతున్నారు. అవసరాల శ్రీనివాస్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘101 జిల్లాల అందగాడు’ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఆగస్ట్ 27న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, ఎస్వీసీ-ఎఫ్ఈఈ బ్యానర్స్‌పై ‘దిల్’ రాజు, డైరెక్టర్ క్రిష్ సమర్పణలో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మించారు. బట్టతల ఉండే యువకుడి పాత్రలో అవసరాల నటించగా, ఆయన ప్రేయసి పాత్రలో రుహానీ శర్మ నటించారు. శక్తికాంత్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. -
101 జిల్లాల అందగాడు: నిజాన్ని దాచేస్తే..!
అవసరాల శ్రీనివాస్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. రాచకొండ విద్యాసాగర్ దర్శకుడు. రుహానీ శర్మ కథానాయికగా నటించారు. ‘దిల్’ రాజు, డైరెక్టర్ క్రిష్ సమర్పణలో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమాలోని ‘మనసా వినవా..’ అనే పాట బుధవారం విడుదలయింది. ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా, శ్రీరామచంద్ర, ధన్య బాలకృష్ణ పాడారు. రచయిత భాస్కర భట్ల మాట్లాడుతూ– ‘‘ప్రేమలో నిజాయతీ ఉండాలనుకునే అమ్మాయి... దొరక్క దొరికిన ప్రేమను, ప్రేయసిని వదులుకోకూడదనుకునే యువకుడు కొన్ని నిజాలను దాస్తాడు. ఆ నిజం బయటపడితే వారి ప్రేమలో ఎలాంటి పరీక్షలు ఎదురవుతాయి? వారి మధ్య ఊసులు కరువై ఊహలే ఊసులైన వేళ ఎలా ఉంటుంది? తన ప్రేమలో నిజాయతీ ఉందని, తాను ఊరకనే మోసం చేయలేదని ప్రేమికుడు.. తెలిసి నిజాన్ని దాచి పెట్టడం తప్పు అనే ప్రేయసి పాడుకునే పాట ‘మనసా వినవా..’’ అన్నారు. చదవండి: వైరల్: కూతుర్ని గుండెలపై ఎక్కించుకున్న అల్లు అర్జున్ -
అవసరాల శ్రీనివాస్ బట్టతల వీడియో.. అసలు విషయం ఇదే!
రెండు రోజుల నుంచి నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్‌కు సంబంధించిన ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతున్న విషయం తెలిసిందే. అతని దగ్గర మూడేళ్లుగా పనిచేస్తున్న కోడైరెక్టర్ మహేశ్ ఓ వీడియో బయటపెట్టడం చర్చనీయాంశంగా మారింది. అవసరాల శ్రీనివాస్‌కు మహేశ్ మధ్య గొడవలు రావడంతో అతన్ని తిట్టి ఆఫీస్ నుంచి బయటకు పంపించేశాడు. దీంతో శ్రీనివాస్‌పై కక్ష పెంచుకున్న మహేశ్.. అతని ఆఫీస్‌కి వెళ్లి నానా హంగామా చేశాడు. అవసరాల నిజస్వరూపాన్ని అందరికీ చూపిస్తానంటూ.. ఫొటో షూట్ చేయించుకుంటున్న అవసరాల దగ్గరకు వెళ్లి, నన్నెందుకు తిట్టావ్ అని ప్రశ్నిస్తూ వీడియో రికార్డింగ్ చేశాడు. వీడియో బయటకెళ్తే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని అవసరాల శ్రీనివాస్, మహేష్ కు వార్నింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే మహేష్ ఫొటో షూట్ చేయించుకుంటున్న అవసరాల శ్రీనివాస్ క్యాప్‌ను తీసేయగా.. అతను బట్టతలతో కనిపించడం నెటిజన్లకు షాక్ ఇచ్చింది. అయితే ఈ వీడియో చూసి ఎంతో మంది షాక్‌కు గురవ్వగా.. కొంతమంది సందేహం వ్యక్తం చేశారు. ఇది నిజంగానే జరిగిందా లేక సినిమా ప్రమోషన్ కోసమా అనే కన్ఫ్యూజన్లో ఉండిపోయారు. తాజాగా, ఆ సందేహాలే నిజమనేలా అవసరాలకు సంబంధించిన ఓ అప్డేట్ వచ్చింది. అవసరాల శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న చిత్రం.. ‘నూటొక్క జిల్లాల అందగాడు’. ఈ సినిమా పోస్టర్‌ను తాజాగా విడుదల చేసింది చిత్రయూనిట్. త్వరలో టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొన్న ఈ పోస్టర్‌ను చూసిన ఎవరికైనా బట్టతల వీడియోపై స్పష్టత వచ్చేస్తుంది. ఇందులో రెండు విభన్నగెటప్లో ఉన్న అవసరాల శ్రీనివాస్.. ఒక ఫ్రేమ్‌లో పూర్తి జుట్టుతో చేతిలో బట్టతలతో ఉన్న బొమ్మను పట్టుకొని ఉండగా. మరోపక్క బట్టతలతో ఉండి చేతిలో జుట్టున్న బొమ్మను పట్టుకొని కనిపిస్తున్నాడు. దీంతో బట్టతల వీడియో సినిమా ప్రమోషన్‌కు అని తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో అవసరాల గొత్తి సూర్యనారాయణగా అలరించనున్నాడు. వైవిధ్యమైన కథాంశంతో ఫన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు తానే స్వయంగా కథ రాసుకున్నాడు. చి.ల.సౌ ఫేమ్ రుహనీ శర్మ హీరోయిన్గా నటిస్తుండగా.. దిల్ రాజు నిర్మిస్తున్నాడు. రామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి స్వీకార్ అగస్తి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను త్వరలోనే విడుదల చేసేందుకు నిర్మాత దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నారు. చదవండి: షాకింగ్ వీడియో.. అవసరాల శ్రీనివాస్ గుట్టు రట్టు! తను నాతో ఎక్కువ టైం ఉండట్లేదు..: కాజల్ Introducing GSN - గొత్తి సూర్యనారాయణ! #101JAFirstLook#GottiSuryaNarayana from #NootokkaJillalaAndagadu. Teaser Coming Soon!#SrinivasAvasarala @iRuhaniSharma #SagarRachakonda #DilRaju @DirKrish #Shirish @YRajeevReddy1 #JSaiBabu @SVC_official @FirstFrame_Ent @MangoMusicLabel pic.twitter.com/eZKSGjccnU — BARaju (@baraju_SuperHit) March 25, 2021 -
షాకింగ్ వీడియో.. అవసరాల శ్రీనివాస్ గుట్టు రట్టు!
నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్‌కు సంబంధించిన ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతని దగ్గర మూడేళ్లుగా పనిచేస్తున్న కోడైరెక్టర్ మహేశ్ ఈ వీడియో బయటపెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మహేశ్‌కి శ్రీనివాస్‌కి మధ్య గొడవలు రావడంతో అతన్ని తిట్టి ఆఫీస్ నుంచి గెంటేశాడు. దీంతో కక్ష పెంచుకున్న మహేశ్.. శ్రీనివాస్ ఆఫీస్‌కి వెళ్లి రచ్చ రచ్చ చేశాడు. అవసరాల శ్రీనివాస్ నిజస్వరూపం బయటపెడతానంటూ అతని ఒరిజినల్ ఫేస్ చూపించి షాకిచ్చాడు. సినిమాల్లో ఉంగరాల జట్టుతో అందంగా కనిపించే శ్రీనివాస్‌కు బట్టతల ఉంది. ఈ విషయాన్ని మహేశ్ బహిర్గతం చేసే వరకు ఎవరికీ తెలియదు. వీడియోలో మహేశ్ ఏమన్నారంటే.. ‘అందరికీ ఒక విషయం చెప్పాలని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా.. ఇండస్ట్రీలో అవసరాల శ్రీనివాస్ అనే ఆర్టిస్ట్ కమ్ డైరెక్టర్ ఉన్నాడుగా.. అతని దగ్గర నేను గత మూడేళ్లుగా పనిచేస్తున్నాను. నేను ఎలాంటి తప్పు చేయకపోయినా.. ఈరోజు నన్ను అందరి ముందు నిలబెట్టి తిట్టి ఆఫీస్ నుంచి బయటకు పంపించేశాడు. ఒక్క రీజన్ కూడా లేదు. అతని నిజస్వరూపం మీకు చూపిస్తా చూడండి’ అంటూ ఫోటో షూట్లో ఉన్న శ్రీనివాస్ దగ్గరకు వెళ్లి తలపై ఉన్న క్యాప్‌ని బలవంతంగా తీసేశాడు. క్యాప్ తీయడంతో శ్రీనివాస్ బట్టతల బయటపడింది. దీంతో ఆగ్రహానికి లోనైన శ్రీనివాస్.. మహేశ్‌ని బూతులు తిడుతూ.. ఈ వీడియో బయటకు వెళ్తే.. నిన్ను ఇండస్ట్రీలో లేకుండా చేస్తా అంటూ బెదిరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇది సినిమా ప్రమోషన్ కోసమే చేసి ఉండొచ్చని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చదవండి: అల్లు అర్జున్ కొత్త బిజినెస్: మహేష్‌కు పోటీగా! చాన్స్ కోసం నిర్మాత గదిలోకి వెళ్లమన్నారు: నటి -
వారిద్దరూ జంటగా '101 జిల్లాల అందగాడు'
అవసరాల శ్రీనివాస్, రుహానీ శర్మ జంటగా తెరకెక్కిన చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. ఈ సినిమాతో రాచకొండ విద్యాసాగర్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. నిర్మాత ‘దిల్’ రాజు, డైరెక్టర్ క్రిష్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్స్‌పై శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. ఈ సినిమాను మే 7న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘‘వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ చిత్రంలో హీరోగా నటించడంతో పాటు కామెడీ పంచ్‌లతో ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా మంచి ఎంటర్టైనింగ్ కథను అందించారు అవసరాల శ్రీనివాస్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: రామ్, సంగీతం: శక్తికాంత్ కార్తీక్. -
50 శాతం పూర్తి.. వీసా కోసం వెయిటింగ్
కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి తరువాత దర్శకుడిగా మారిన యువ నటుడు అవసరాల శ్రీనివాస్. అష్టా చమ్మా సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన అవసరాల కొద్ది రోజుల్లోనే ఊహలు గుస గుసలాడే సినిమాతో దర్శకుడిగా మారాడు. రెండో ప్రయత్నంగా జ్యో అచ్చుతానంద సినిమా డైరెక్ట్ చేసిన అవసరాల శ్రీనివాస్ లాంగ్ గ్యాప్ తర్వాత యంగ్ హీరో నాగశౌర్యతో మరో సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఆగిపోయిందంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అనేకవార్తలు వస్తున్నాయి. బడ్జెట్ పెరిగిపోవడం, ఇప్పటివరకు వచ్చిన అవుట్‌పుట్‌పై దర్శకనిర్మాతలు అసంతృప్తిగా ఉండటంతో సినిమాను ఆపేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తమ అధికారిక ట్విటర్ ద్వారా స్పందించింది. ‘నాగశౌర్య, అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్ర షూటింగ్ 50 శాతం పూర్తయింది. చాలా అద్భుతంగా సినిమా రూపొందుతోంది. మిగతా షూటింగ్ యూఎస్ఏలో ప్లాన్ చేశాం. వీసాల కోసం వేచి చూస్తున్నాం. యూఎస్ఏ షెడ్యూల్ కూడా త్వరగానే పూర్తిచేస్తాం. ఈ సినిమా ఆగిపోయిందంటూ వస్తున్న వార్తలు నిరాధారమైనవి. పుకార్లను నమ్మకండి’అంటూ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, నిర్మాత వివేక్ కూచిభొట్ల ట్వీట్ చేశారు. ఇక అశ్వథ్థామతో హిట్ ట్రాక్‌లో వచ్చిన యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలో జోరుపెంచాడు. అవసరాల శ్రీనివాస్‌తో ఓ సినిమా రూపొందుతుండగానే.. లక్ష్మీసౌజన్య అనే కొత్త దర్శకురాలితో మరో సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. చదవండి: ‘అశ్వథ్థామ’ మూవీ రివ్యూ 'ముద్దు సన్నివేశం నాకు తెలియకుండానే తీశారు' -
నూటొక్క జిల్లాలకే అందగాడు
ఒక వ్యక్తి బాగా అందంగా ఉంటే నూటొక్క జిల్లాల అందగాడు అని సంబోధిస్తారు. అప్పట్లో నూతన్ ప్రసాద్‌ని అలా పిలిచేవారు. ఇప్పుడు తాజా సినిమా కోసం అవసరాల శ్రీనివాస్ నూటొక్క జిల్లాల అందగాడిగా మారనున్నారు. అవసరాల శ్రీనివాస్, రుహానీ శర్మ జంటగా తెరకెక్కనున్న చిత్రం ‘నూటొక్క జిల్లాల అందగాడు’. ‘దిల్’ రాజు, దర్శకుడు క్రిష్ సంయుక్తంగా ఈ సినిమాను సమర్పించడం విశేషం. శిరీష్, రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలు. సాగర్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం శనివారం జరిగింది. ఈ చిత్రానికి రచయిత: అవసరాల శ్రీనివాస్, సంగీతం: స్వీకార్ అగస్తీ. -
వెనక్కి వెళ్లేది లేదు
‘‘హీరోతో పోలిస్తే ఎడిటర్ జాబ్ కొంచెం సులభం అని నా అభిప్రాయం. ఎడిటర్‌గా ఒక చోట కూర్చుని మన పని మనం చేసుకోవచ్చు. కానీ హీరోగా ఉండటం కష్టం. ప్రేక్షకులు, మీడియా ఫోకస్ అంతా నటులపైనే ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం? మన యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ అన్నీ గమనిస్తూనే ఉంటారు’’ అన్నారు నవీన్ విజయకృష్ణ. ఎడిటర్ నుంచి హీరోగా మారిన నవీన్.. సీనియర్ నటుడు నరేశ్ తనయుడనే విషయం తెలిసిందే. బాలాజీ సనాల దర్శకత్వంలో నవీన్ విజయ కృష్ణ, శ్రీనివాస్ అవసరాల, మేఘా చౌదరి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఊరంతా అనుకుంటున్నారు’. శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పీఎల్ఎన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ– ‘‘నాకు 16ఏళ్ల వయసులో రానా వాళ్ల యాడ్ కంపెనీలో చేరాను. నా ఎడిటింగ్ స్కిల్స్ చూసి కృష్ణవంశీగారు ‘డేంజర్’ సినిమాకు అవకాశం ఇచ్చారు. ‘రాఖీ, చందమామ’ మరికొన్ని సినిమాలకు ఎడిటర్‌గా పని చేశాను. ఆ తర్వాత హీరోగా మారాలనుకున్నప్పుడు మా నాన్నగారు కష్టం అన్నారు. దానికి కారణం నేను చాలా లావుగా ఉండేవాణ్ణి. శ్రమించి బరువు తగ్గాను. నా కెరీర్‌కు సంబంధించిన ప్రతి విషయం నాన్నగారితో చర్చించి, ఆయన్ను ఇబ్బంది పెట్టను. కానీ నాన్న విలువైన సలహాలు ఇస్తుంటారు. మహేశ్ అన్న కూడా బాగా సపోర్ట్ చేస్తారు. ప్రతీ సినిమా ఫంక్షన్‌కు ఆయన్ను పిలవడం కరెక్ట్ కాదు. 16 ఏళ్లకు ఎడిటింగ్ మొదలుపెట్టాను. 32 ఏళ్లకు హీరోగా మారాను. ఈ సినిమా విషయానికి వస్తే ప్రేక్షకుడి దృష్టిలో పడాలంటే టైటిల్ భిన్నంగా ఉండాలి. అందుకే ‘ఊరంతా అనుకుంటున్నారు’ అనే టైటిల్ పెట్టాం. రెండు జంటల ప్రేమ, వాళ్ల ఊరి కట్టుబాట్లకు మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా. మళ్లీ ఎడిటింగ్ వైపు వెనక్కి వెళ్లను. భవిష్యత్తులో దర్శకత్వం చేసే ఆలోచ నలు ఉన్నాయి’’ అన్నారు. -
ఆగస్ట్ 9న అనసూయ ‘కథనం’
అనసూయ ప్రధాన పాత్రలో రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కథనం’. ఈ సినిమాను ది గాయత్రి ఫిల్మ్స్ , ది మంత్ర ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై బి.నరేంద్రరెడ్డి, శర్మచుక్కా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రోషన్ సాలూరి సంగీతం సమకూరుస్తుండగా, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అవసరాల శ్రీనివాస్, రణధీర్, ధన్‌రాజ్, వెన్నెలకిషోర్, పెళ్లి పృధ్వీలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చెసుకున్న ఈ మూవీ ఆగస్టులో విడుదలకు సిద్దమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాల గురించి నిర్మాత నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ... ‘అనసూయగారు ఫుల్ లెంగ్త్ రోల్ చేసిన చిత్రమిది. ఆవిడ కెరీర్లో ఇదొక బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకం ఉంది. సెన్సార్ పూర్తయింది. యు/ఎ సర్టిఫికేట్ లభించింది. సెన్సార్ సభ్యుల ప్రశంసలు లభించాయి. ఆగస్ట్ 9న సినిమా విడుదల చేస్తున్నాం’ అన్నారు. దర్శకుడు రాజేష్ నాదెండ్ల మాట్లాడుతూ... ‘ఇది నా మొదటి చిత్రం.. క్షణం, రంగస్థలం తర్వాత అనసూయ చేస్తున్న ఈ కథనం సినిమాతో హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. తప్పకుండ ఆమె తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. నరేంద్రరెడ్డిగారు పంపిణీదారునిగా ఏ సినిమా చేసిన హిట్. నిర్మాతగా కూడా సక్సెస్ అవుతారన్నారన్న నమ్మకం ఉంది’ అన్నారు. -
విలువలు.. బంధాలు.. వెటకారం
నవీన్ విజయకృష్ణ, శ్రీనివాస్ అవసరాల, మేఘా చౌదరి, సోఫియా సింగ్ హీరో హీరోయిన్లుగా బాలాజి సానల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఊరంతా అనుకుంటున్నారు’. శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్.ఎన్. రెడ్డి, ఎ. పద్మనాభరెడ్డి నిర్మించారు. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, హీరో సాయిధరమ్ తేజ్ ముఖ్య అతిథులుగా హాజరై ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ఇంద్రగంటి మాట్లాడుతూ– ‘‘నవీన్ మంచి నటుడే కాదు బ్రిలియంట్ ఎడిటర్ కూడా. ఈ సినిమా పోస్టర్ చూస్తుంటే నాకు ‘అష్టా చమ్మా’ రోజులు గుర్తుకు వస్తున్నాయి. పల్లెటూరి ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న ఈ సినిమా టీమ్‌కి ఆల్ ది బెస్ట్. రాధాకృష్ణన్ మంచి సంగీతం ఇచ్చారు. నిర్మాత శ్రీహరిగారు మూడు పాటలు రాశారని తెలిసింది’’ అన్నారు. ‘‘నవీన్ మా ఫ్యామిలీ మెంబర్‌లాంటి వాడు. నేను లో ఫేజ్‌లో ఉన్నప్పుడు నాకో పిల్లర్‌లా ఉన్నాడు. మంచి సినిమా చేశారు. ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు సాయిధరమ్ తేజ్. ‘‘ఈ సినిమా నాకు ఆశీర్వాదంలా వచ్చింది. ఒక కుటుంబంలా కలిసి ఈ సినిమా చేశాం’’ అన్నారు నవీన్. ‘‘నవీన్, అవసరాల ఇద్దరూ బాగా నటించారు. బాబు కెమెరా వర్క్, రాధాకృష్ణన్ సంగీతం ఓ ఆకర్షణ’’ అన్నారు బాలాజి. ‘‘నవీన్‌తో వర్క్ చేయడం హ్యాపీ. ప్రేక్షకులు మంచి సంగీతాన్ని ఆస్వాదిస్తారు’’ అన్నారు రాధాకృష్ణన్. ‘‘మంచి సినిమా చేసే అవకాశం వచ్చింది’’ అన్నారు శ్రీహరి. ‘‘పల్లెటూరి విలువలు, బంధాలు, వెటకారం ఇలా అన్ని అంశాలను సినిమాలో వడ్డించాం’’ అన్నారు నిర్మాత పద్మనాభరెడ్డి. ‘‘బాలాజీ గొప్ప దర్శకుడు అవుతాడు’’ అన్నారు పి.ఎల్.ఎన్ రెడ్డి. -
మరో ఇంట్రస్టింగ్ టైటిల్‌తో అవసరాల
కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి తరువాత దర్శకుడిగా మారిన యువ నటుడు అవసరాల శ్రీనివాస్. అష్టా చమ్మా సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన అవసరాల కొద్ది రోజుల్లోనే ఊహలు గుస గుసలాడే సినిమాతో దర్శకుడిగా మారాడు. రెండో ప్రయత్నంగా జ్యో అచ్చుతానంద సినిమా డైరెక్ట్ చేసిన అవసరాల శ్రీనివాస్ లాంగ్ గ్యాప్ తరువాత మూడో సినిమాకు రెడీ అవుతున్నాడు. నాగశౌర్య హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కూడా తన మార్క్ ఇంట్రస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశాడు. అచ్చమైన తెలుగు టైటిల్స్‌ను ఎంచుకున్న ఈ యువ దర్శకుడు తదుపరి చిత్రాన్ని పలానా అబ్బాయి.. పలానా అమ్మాయి అనే టైటిల్‌ను ఫిక్స్ చేశాడు. ఈ సినిమాలో నాగశౌర్యకు జోడిగా మాళవిక నాయర్ నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.