అమీ తుమీ | Indraganti Mohanakrishna's film titled 'Ami Tumi' | Sakshi
Sakshi News home page

అమీ తుమీ

Published Tue, Mar 14 2017 12:46 AM | Last Updated on Sun, Aug 11 2019 12:30 PM

అమీ తుమీ - Sakshi

అమీ తుమీ

అవసరాల శ్రీనివాస్‌ – అడివి శేష్‌ హీరోలుగా ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రానికి ‘అమీ తుమీ’ అనే టైటిల్‌ నిర్ణయించారు. ‘వెన్నెల’ కిషోర్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో ఈషా, అదితీ మ్యాకల్‌ కథానాయికలు. కహాన్‌–కన్నవ్‌ సమర్పణలో కె.సి.నరసింహారావు నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ లోగోను హైదరాబాద్‌లో విడుదల చేశారు. కె.సి.నరసింహారావు మాట్లాడుతూ –‘‘హిలేరియస్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకునేలా ఉంటుంది.

 అందరూ తెలుగు ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో ఈ చిత్రాన్ని నిర్మించడం సంతోషంగా ఉంది. ఈ నెల 23తో టాకీ పార్ట్‌ చిత్రీకరణ పూర్తవుతుంది. త్వరలో పాటలు, సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. తనికెళ్ల భరణి, అనంత్, మధుమణి, శ్యామల, తనికెళ్ల భార్గవ్, తడివేలు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా పి.జి.విందా, సంగీతం: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: వినయ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement