అంతా తెలుగుమయం! | All telugu actors and technicians in indraganti mohan krishna movie | Sakshi
Sakshi News home page

అంతా తెలుగుమయం!

Published Sun, Feb 19 2017 11:16 PM | Last Updated on Sun, Aug 11 2019 12:30 PM

అంతా తెలుగుమయం! - Sakshi

అంతా తెలుగుమయం!

సాధారణంగా  తెలుగు సినిమా తెర పైన, తెర వెనకా పరభాషా నటీనటులు, సాంకేతిక నిపుణులు పని చేస్తుంటారు. కళాకారులకు భాషాబేధం లేదు కాబట్టి, తెలుగు ప్రేక్షకులు అందర్నీ ఆదరిస్తారు. కానీ, ఓ సినిమాకి 24 శాఖల్లోనూ తెలుగువారే పని చేశారంటే కాస్త ఎక్కువ ఆనందిస్తారు. ఇంద్రగంటి మోహనకృష్ణ అలాంటి ఆనందాన్ని ఇవ్వ నున్నారు.

అవసరాల శ్రీనివాస్, అడివి శేష్‌ హీరోగా ఆయన దర్శకత్వంలో కేసీ నరసింహారావు నిర్మిస్తున్న సినిమాకి 24 శాఖల్లోనూ తెలుగువారిని ఎంపిక చేశారు. సినిమా అంతా తెలుగుమయం. ‘వెన్నెల’ కిశోర్‌ ముఖ్యపాత్ర చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్లు ఈష, అదితీ మ్యానికల్‌ లు తెలుగమ్మా యిలే. ఈ నెల 1న ప్రారంభమైన ఈ చిత్రం షెడ్యూల్‌ నేటితో పూర్తవు తుంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వినయ్, సంగీతం: మణిశర్మ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement