Indraganti Mohan Krishna
-
సక్సెస్ కోసమే సినిమా..
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం సినిమా వాణిజ్యపరమైన అంశమని, ఈ కారణం చేత సక్సెస్ కోసమే కమర్షియల్ హంగులతో నిర్మిస్తున్నారని ప్రముఖ భారతీయ నటులు, దర్శకులు అమోల్ పాలేకర్ అన్నారు. డిజిటల్ టెక్నాలజీ యుగంలో సినిమా దర్శకుడు ఇతర సినిమా బృందం కన్నా సాంకేతికత పైనే ఎక్కువ ఆధారపడుతోందన్నారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్‌లో భాగంగా ప్లీనరీలో అమోల్ పాలేకర్ తన సతీమణి సంధ్య గోఖలేతో కలిసి పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రముఖ టాలీవుడ్ దర్శకులు మోహనక్రిష్ణ ఇంద్రగంటితో తాను రాసిన నూతన పుస్తకం ‘వ్యూ ఫైండర్’ పై చర్చించారు.‘నా వరకూ సినిమా అంటే అందరిలా కాకుండా విభిన్నంగా తీయడమే నచ్చుతుందన్నారు. మెయిన్ స్ట్రీంలో సినిమా రంగానికి నియమాలు, నిబంధనలు, పరిమితులు వంటి సంస్కృతిలో ఇమడలేకపోయానన్నారు. ఎంత పెద్ద విజయం సాధించినా, నిర్మించగలిగినా ఆ క్రెడిట్ మొదట రచయితకే చెల్లుతుంది. ప్రస్తుత సినిమా వందల కోట్ల అంశంగా మారింది. ఒక పెద్ద నిర్మాత నాతో ఇలాంటి సినిమాలే తీయాలని సంప్రదించాడు, అలాంటి పది సినిమాల్లో 9 రిజక్ట్ చేసేవాడిని’ అని అన్నారు. ‘ఒక సినిమా షూట్లో భాగంగా తోటి నటి స్మితను నిజంగా కొట్టాల్సి వచ్చింది, దర్శకుడి ప్రోద్భలంతో ఆ సీన్ బాగా పండించడానికి ఇష్టం లేకున్నా కొట్టాల్సి వచ్చింది. ఆ సీన్లో స్మిత మంచి నటన కనబర్చింది. అనంతరం క్షమాపణ కోరినా, నేను కొట్టడం వల్లే మరింత వాస్తవంగా నటించగలిగానని ఆమె చెప్పడంతో ఆశ్చర్యపోయాను’ అన్నారు. ‘70లలో అద్భుతమైన మధ్య తరగతి సినిమాల ప్రస్తావన రావడంతో.. నాటి జీవితాలకు, ప్రస్తుత జీవన శైలికి తేడా ఉందని, ఇప్పుడు అలాంటి కథలను ఊహించలేం. కానీ ఈ మధ్య అలాంటి కథే ‘సత్యం సుందరం’ నన్నెంతో హత్తుకుంది. నా సినీ మిత్రుడు ఉత్పల్ దత్ ఎంత మంచివాడో నాకే తెలుసు, కానీ దేశంలోనే మొట్టమొదటి సెడేటివ్ కేసుతో అరెస్టు అయ్యాడు’ అని గుర్తు చేసుకున్నారు. నాస్తికులుగా బతకడం కష్టం.. ‘నా భార్యను కలవక ముందు జీవితం, ఆ తరువాతి జీవితం అనేంత ప్రభావం చూపించింది. సతీమణి సంధ్యను కలువక ముందు ఐదేళ్లకు ఒక సినిమా తీస్తే, ఆమెను కలిశాక ఏడాదికో సినిమా తీయగలిగాను. తన పుస్తకం వ్యూ ఫైండర్ మా ఇద్దరి ప్రయాణం క్లైమాక్స్ వంటిది’ అని మోహన క్రిష్ణ ఇంద్రగంటితో చమత్కరించారు. ‘నా చివరి ఎనిమిది సినిమాలకూ నా భార్యే రైటర్. మేమిద్దరమూ నాస్తికులమే, సామాజికంగా నాస్తికులుగా సాగడం అంత సులువు కాదు’ అన్నారు.. ‘నేను సినిమా రంగానికి చెందిన వ్యక్తిని కాదు, 2000 సంవత్సరంలో అమోల్ పాలేకర్ సినిమాకు మొదటి సారి పనిచేశాను’ అని సంధ్య తెలిపారు. -
‘సోషల్’ ఘోషలో స్నేహమే సమ్మోహనం
‘చరిత్రని మరచిపోని వాళ్ళు.. ఆ పొరపాట్లు కచ్చితంగా మళ్ళీ చేస్తారు’ అని ఎవరో పెద్దమనిషి అన్నాట్ట. గతం, వర్తమానం, భవిష్యత్తు అనేవి మన మనసు సృష్టించే భ్రమలే అనుకున్నా.. గతం గుర్తుంచుకోవడం మంచిదే. కొత్త భ్రమల్ని, అపోహల్ని సృష్టించుకోకుండా అది మనల్ని అదుపులో పెడుతుంది.ప్రతి సంవత్సరాంతంలో ఆ సంవత్సరం మనం ఏం సాధించాం, శోధించాం అని మనల్ని మనం ప్రశ్నించుకుంటాం. కొత్త సంవత్సరం కేవలం ఓ తారీఖు మారటమే అని హేతువాదులన్నా.. అదేదో కొత్తప్రారంభం అనుకోవడం మనకో ఉత్సాహాన్నిస్తుంది. అందుకే కొత్త నిర్ణయాలు, సరికొత్త ఆశయాలు, ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతాం. వాటిలో ఎన్ని అమలు చేస్తాం? ఎన్ని సాధిస్తాం? అనేది మళ్లీ ఆ సంవత్సరాంతంలో బేరీజు వేసుకుంటాం. ఈ చక్రం కొంత సరదాగా ఉంటుంది. కొంత నిజంగా ఉపయోగపడుతుంది.నా వరకూ నాకు ‘2023’ ఒక విచిత్రమైన సంవత్సరం. 2018లో కోవిడ్‌కి ముందు ‘సమ్మోహనం’ థియేటర్లలో విడుదలై ఘనవిజయాన్ని అందుకున్న తర్వాత, కోవిడ్‌లో 2020లో ఓటీటీలో విడుదలైన ‘వి’, ఆ తర్వాత 2022లో థియేటర్లలో విడుదలైన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ నన్ను కొంత గజిబిజికి గురి చేశాయి. ‘వి’ మిశ్రమ ఫలితాలు, ‘ఆ అమ్మాయి..’ వైఫల్యం నా కళా దృక్పథాన్ని గట్టిగా కుదిపాయి. అయితే ఆ సమయంలో సద్విమర్శకులు, శ్రేయోభిలాషులు కొన్ని విషయాలని గట్టిగా విమర్శిస్తూనే, కొన్ని విషయాలలో నాకు అండగా నిలిచి, నా అభిరుచిని బలపర్చారు. 2024లో మళ్లీ ఆత్మస్థైర్యంతో అడుగిడేలా చేశారు. నా 2023 అనుభవాలు 2024 లో నా నిర్ణయాలని గాఢంగా కానీ, ప్రొడక్టివ్ గా కానీ ప్రభావితం చేశాయి అనిపిస్తోంది.గతమైనా, వర్తమానమైనా, భవిష్యత్తైనా మనల్ని నిలబెట్టేది మన స్నేహితులు. నిష్కర్షగా, ద్వేషరహితంగా మన జీవితాన్ని మనకి ప్రతిబింబించగలిగే నిజమైన స్నేహితులు. అందుకే ఈ రోజుల్లో ఉన్న సామాజిక మాధ్యమాల్లో ఎగసిపడుతున్న అకారణ ద్వేషం, నెగిటివిటీ, సంచలనవాదం, పోటీతత్వం, వేలంవెర్రి సొంతడబ్బాల మధ్య నిజమైన స్నేహితుల్ని వెతుక్కోవడమే కొత్త సంవత్సరంలో మన నిర్ణయం, ఆశయం కావాలి. ఈ యూట్యూబ్ ట్రోల్స్, ఇన్‌స్టా రీల్స్, గొడవలు, అరుపులు, దైనందిన జీవితపు రణగొణధ్వని మధ్య నిజమైన నిష్కల్మషమైన స్నేహాన్ని వెతుక్కుని పట్టుకోవడం కష్టమే. ఉన్న స్నేహితుల్లో ఎవరు హితులో, ఎవరు శత్రువులో తెలుసుకుని, శత్రువుల్ని పాము కుబుసం విడిచినట్టు విడిచి కొత్త సంవత్సరంలో సరికొత్త సహచర్య సౌందర్యంలో ముందుకు వెళ్లడమే ఆశయం కావాలి. నిజానికి ప్రతి సంవత్సరం ఈ నిర్ణయాన్ని మళ్లీ మళ్లీ కొత్తగా తీసుకోవాలి. మన స్నేహసంపదని నలుగురికి పంచి, మన స్నేహిత సంపదని ప్రతి సంవత్సరం పెంచుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ, లార్జర్ దాన్ లైఫ్, వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ లాంటి నూతన ఆవిష్కారాలు, భావనలూ, ప్రచారాల నుండి మనల్ని మనం సంరక్షించుకోవాలంటే మంచి స్నేహితులే మనకి దిక్కు.2024లో ప్రతి సినిమాలో దాదాపు హీరో అంటే ఊచకోతకి మారుపేరయ్యాడు. నోట్లోంచి గొప్పగొప్ప ఉదాత్తమైన మానవత్వపు ఉపన్యాసాలిస్తూనే, రెండు చేతుల్తో వందలమందిని చంపుతున్నాడు. సున్నితమైన హాస్యం, ప్రేమ, సన్నిహితమైన సంభాషణలు, మానవ సంబంధాలు ట్రెండ్ కాదనే దుష్ప్రచారం మొదలై, బలం పుంజుకుంటోంది. ఈ సమయంలో ఈ కొత్త సంవత్సరంలో మనం ఆ ఒరవడికి కొంత అడ్డుకట్ట వేసి, మామూలు మనుషుల మానవత్వపు గుబాళింపు, తోటి మనిషి ఆనందాన్ని, అభ్యుదయాన్ని, కోరుకునే కొత్తరకం స్నేహితులని వెతుక్కుందాం. అలాంటి సరికొత్త కథానాయకుల్ని సృష్టిద్దాం, ఆదరిద్దాం. కొత్త సంవత్సరం కేవలం ఓ తారీఖు మారటమే అని హేతువాదులన్నా.. అదేదో కొత్తప్రారంభం అనుకోవడం మనకో ఉత్సాహాన్నిస్తుంది. అందుకే కొత్త నిర్ణయాలు, సరికొత్త ఆశయాలు, ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతాం. – ఇంద్రగంటి మోహన కృష్ణ, సినీ దర్శకుడు -
'సారంగపాణి జాతకం'లో ఫుల్ కామెడీ (టీజర్)
ప్రియదర్శి, రూపా కొడువాయూర్ జంటగా నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. పూర్తిగా నవ్వులు పూయించేలా టీజర్ ఉంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 20న విడుదల కానుంది. మనిషి భవిష్యత్తు అతని చేతి రేఖల్లో ఉంటుందా? లేదా చేసే చేతల్లో ఉంటుందా? అనే ప్రశ్నకు జవాబుగా ఓ పరిపూర్ణ హాస్యభరిత చిత్రంగా ‘సారంగపాణి జాతకం’ తెరకెక్కింది. తాజాగా విడుదలైన టీజర్ అందరినీ మెప్పించేలా ఉంది. -
నటిగా ఇంతకంటే ఏం కావాలి?
‘‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రంలో నా పాత్రకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. చాలా మంది ఫోన్ చేసి, ‘నన్ను నేను స్క్రీన్‌పై చూసుకున్నట్లు ఉంది’ అని చెప్పడం హ్యాపీ. ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?’’ అని కృతీశెట్టి అన్నారు. సుధీర్ బాబు హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో బి.మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదలైంది. ఈ సందర్భంగా హీరోయిన్ కృతీశెట్టి మాట్లాడుతూ–‘‘నేను డాక్టర్ కావాలనుకున్నాను. ఓ యాడ్ ఫిల్మ్ షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు ‘ఉప్పెన’ అవకాశం రావడం, ఆ తర్వాత మంచి పాత్రలు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను. నేను ప్రతి సినిమాకి, పాత్రకి హోమ్ వర్క్ చేస్తాను. కెరీర్ బిగినింగ్‌లోనే ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’లో ద్విపాత్రాభినయం చేయడం హ్యాపీ. ఇంతమంచి అవకాశం ఇచ్చిన ఇంద్రగంటిగారికి థ్యాంక్స్. ఈ సినిమా విజయం నాకు చాలా ప్రత్యేకం. సుధీర్ బాబుగారు సెట్లో సరదాగా ఉంటూ ఎదుటివారిలో చాలా స్ఫూర్తి నింపుతారు. ప్రస్తుతం తెలుగులో నాగచైతన్యతో ఓ చిత్రం, తమిళంలో సూర్యగారితో ‘అచలుడు’ అనే సినిమా చేస్తున్నా’’ అన్నారు. -
‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ప్రీరిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మనం సినిమా తీస్తున్నాం!
‘చేస్తాను.. నేను యాక్ట్ చేస్తాను’ అంటూ కృతీ శెట్టి ఫోన్లో సుధీర్‌బాబుతో మాట్లాతున్న సీన్‌తో మొదలవుతుంది ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా ట్రైలర్. సుధీర్‌బాబు, కృతీ శెట్టి జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. గాజులపల్లె సుధీర్‌బాబు సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, బెంచ్ మార్క్ స్టూడియోస్ పతాకాలపై బి. మహేంద్రబాబు, కిరణ్ బల్లపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 16న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు హీరో మహేశ్‌బాబు. ‘నేను ఈ సినిమా ఇక చేయలేనేమో అనిపిస్తుంది’ అన్న కృతీ శెట్టి డైలాగ్, ‘మనం సినిమా తీస్తున్నాం అని అనుకుంటుంటాం కానీ అప్పుడప్పుడు సినిమాయే మనల్ని తీస్తుంటుంది’ అనే సుధీర్‌బాబు డైలాగ్స్‌తో ట్రైలర్ సాగుతుంది. ‘‘అలేఖ్య (కృతీ పాత్ర)కు నటి కావాలనే ఆశ ఉన్నప్పటికీ ఆమె తల్లిదండ్రులు పూర్తి వ్యతిరేకం. అలేఖ్య ఆశ ఫైనల్‌గా ఏమైంది? ఇందుకు ఆ సినిమా దర్శకుడు (సుధీర్‌బాబు పాత్ర) ఏం చేశాడు? అనే అంశాల ఆధారంగా కథ సాగుతుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: వివేక్ సాగర్. -
ఆకట్టుకుంటున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ట్రైలర్
హీరో సుధీర్ బాబు, కృతిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో వస్తున్న మూడో ప్రేమకథా చిత్రమిది. ఇప్పటికే విడుదల చేసిన మూవీ ఫస్ట్‌లుక్, టీజర్, పాటలకు పాజిటివ్ బజ్ క్రియేట్ కావడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇక సెప్టెంబర్ 16న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. చదవండి: సినీ ప్రియులకు ‘ఐబొమ్మ’ బిగ్ షాక్.. ఆ రోజు నుంచి శాశ్వతంగా సేవలు బంద్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సోషల్ మీడియా వేదికగా మూవీ ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మహేశ్ మాట్లాడుతూ.. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ ట్రైలర్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. కామెడీ, లవ్, ఎమోషన్స్‌తో మలిచిన ఈ ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా చాలా ఆసక్తికరంగా ఉండేట్టుందన్నారు. ఈ సందర్భంగా ఈ మూవీ హీరోహీరోహీరోయిన్లు సుధీర్ బాబు, కృతి శెట్టి, డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణలతో పాటు చిత్రబృందానికి మహేశ్ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. చదవండి: జూ.ఎన్టీఆర్-కొరటాల చిత్రంలో అలనాటి లేడీ సూపర్ స్టార్? Happy to launch the trailer of #AaAmmayiGurinchiMeekuCheppali...looks like an interesting one! All the best to @isudheerbabu @IamKrithiShetty, #MohanaKrishnaIndraganti and the entire team!https://t.co/fGU4r3CraX@MythriOfficial @benchmarkstudi5 — Mahesh Babu (@urstrulyMahesh) September 5, 2022 -
‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్
‘‘కథకు న్యాయం చేసే దర్శకుడు ఇంద్రగంటిగారు. ఇప్పటివరకూ ఆయన చేసిన సినిమాల్లో బెస్ట్ మూవీ ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ప్రేమకథతో పాటు అద్భుతమైన ఫ్యామిలీ డ్రామా ఉన్న ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అని అన్నారు సుధీర్‌బాబు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్‌బాబు, కృతీ శెట్టి జంటగా నటించిన చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. గాజులపల్లె సుధీర్‌బాబు సమర్పణలో బి. మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 16న రిలీజ్ కానుంది. వివేక్ సాగర్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘మీరే హీరో లాగ..’ అనే పాటని దర్శకుడు హను రాఘవపూడి రిలీజ్ చేశారు. హీరో సుధీర్‌బాబు మాట్లాడుతూ– ‘‘నటీనటులు ఎంత ప్యాషనేట్‌గా సినిమాలు చేస్తారో జర్నలిస్ట్‌లు కూడా అంతే ప్యాషన్‌తో తమ పని చేస్తారు. అందుకే ‘మీరే హీరో లాగ..’ పాటని మీడియాకి అంకితం ఇస్తున్నాం. ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రిగారిని మనం మిస్ కాకుండా చూసుకునే బాధ్యత రామజోగయ్య శాస్త్రిగారిపై ఉంది’’ అన్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ– ‘‘నేను కూడా జర్నలిస్ట్‌గా పని చేశాను. ఒక ఇంటర్వ్యూ తరహాలో హీరో పరిచయ పాట ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి వచ్చిందే ‘మీరే హీరో లాగ..’. ఈ సాంగ్ క్రెడిట్ రామజోగయ్య శాస్త్రి, దినేష్, వివేక్‌లకు దక్కుతుంది’’ అన్నారు. రచయిత రామజోగయ్య శాస్త్రి, సంగీత దర్శకుడు వివేక్ సాగర్, కెమెరామేన్ పీజీ విందా, ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ మాట్లాడారు. -
సినిమా తీయాలంటే చాలా ధైర్యం కావాలి: నిర్మాత బన్నీ వాసు
‘‘కరోనా తర్వాత సమీకరణాలు మారిపోయాయి. ప్రతి ఒక్కరూ జీరో నుంచి మళ్లీ నేర్చుకోవాలి. ఈ రోజుల్లో ఒక సినిమా తీయాలంటే చాలా ధైర్యం కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ ఒక సినిమా మొదలు పెట్టడం గొప్ప విషయం’’ అని నిర్మాత బన్నీ వాసు అన్నారు. నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ నిర్మాతగా మారారు. ఆయన నిర్మిస్తున్న తొలి చిత్రానికి ‘యానం’ అనే టైటిల్ ఖరారు చేశారు. షేక్స్పియర్ రచనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కరుణాకర న్ దర్శకుడు. కేఎస్ఐ సినిమా అన్ లిమిటెడ్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ బ్యానర్ లోగోను బన్నీ వాసు, ‘యానం’ టైటిల్ లోగోను దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ విడుదల చేశారు. శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతూ–‘‘నేను దర్శకత్వం వహించిన నాటకాలు, యాడ్ఫిల్మ్స్కు కరుణాకరన్ వర్క్ చేశాడు. ‘యానం’ తో దర్శకునిగా తను మంచి పేరు తెచ్చుకోవాలి’’ అన్నారు. ‘‘శ్రీకాంత్‌గారు తొలిసారి నిర్మిస్తున్న ‘యానం’ మంచి విజయం సాధించాలి’’ అన్నారు ఇంద్రగంటి మోహనకృష్ణ. ‘‘దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చిన శ్రీకాంత్ అన్నకి థ్యాంక్స్’’ అన్నారు కరుణాకరన్. -
సుధీర్‌బాబు-కృతిశెట్టి సినిమా : ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్
Sudheer Babu Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Teaser Postponed: హీరో సుధీర్ బాబు, కృతిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలె విడుదల చేసిన మూవీ ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వచ్చింది. తాజాగా నేడు(సోమవారం) ఈ సినిమా టీజర్ విడుదల కావాల్సి ఉండగా సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని పేర్కొంది. కాగా 'ఉప్పెన','శ్యామ్ సింగ రాయ్', 'బంగార్రాజు' వంటి హిట్ సినిమాల అనంతరం కృతిశెట్టి చేస్తున్న నాలుగో చిత్రమిది. దీంతో అంచనాలు మరిన్ని పెరిగాయి. Hold on.. postponement in our teaser date but not in our excitement in showing it to you all.. It's worth the wait😎🤘#AaAmmayiGurinchiMeekuCheppali #AAGMCTeaser pic.twitter.com/J8X5DO6Cde — Sudheer Babu (@isudheerbabu) January 17, 2022 -
సినిమా దర్శకుడిగా చేస్తున్నా!
‘‘ఇంద్రగంటిగారి డైరెక్షన్లో చేసిన ‘సమ్మోహనం’లో సినిమాలు ఇష్టపడని వ్యక్తి పాత్ర చేశా. ఇప్పుడు ఆయన డైరెక్షన్లో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’లో సినిమా డైరెక్టర్ పాత్ర చేస్తున్నాను. ఇది రొమాంటిక్ ఎంటర్టైనర్’’ అన్నారు సుధీర్‌బాబు. గాజులపల్లె సుధీర్‌బాబు సమర్పణలో బి. మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి నిర్మిస్తున్న చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. సుధీర్‌బాబు, కృతీ శెట్టి జంటగా రూపొందుతున్న ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. శనివారం జరిగిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ఆవిష్కరణ వేడుకలో నిర్మాత వై. రవిశంకర్ మాట్లాడుతూ– ‘‘ఇంద్రగంటì గారు అన్ని జానర్స్‌లో సినిమాలు చేయగలరు. సుధీర్ టాలెంటెడ్ హీరో. ఇక ఆ అమ్మాయి (కృతి) ఎంత మంచి నటో ‘ఉప్పెన’ సినిమాలో చూపించాం. ‘ఆ అమ్మాయి..’ నిర్మాణంలో మేం భాగస్వాములు కావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ– ‘‘ఒక అబ్బాయి జీవితాన్ని ఒక అమ్మాయి ఎలా ప్రభావితం చేస్తుంది? వీళ్లు ఎలా ప్రేమలో పడ్డారు? ఆ ప్రేమకు ఫ్యామిలీ, సొసైటీ నుంచి ఎదురైన ఇబ్బందులను అధిగమించి ప్రేమతో పాటు వాళ్లు అనుకున్నది ఎలా సాధించారనేది ఈ చిత్రకథ’’ అన్నారు. ‘‘మన ఇరుగు పొరుగింట్లో జరిగినంత సహజంగా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు కృతి. మైత్రీ మూవీ మేకర్స్ సీఈవో చెర్రీ, ఛాయాగ్రాహకుడు పీజీ విందా పాల్గొన్నారు. -
అందుకే చిరంజీవిది లక్కీ హ్యాండ్ : సుధీర్‌బాబు
‘‘సూపర్‌స్టార్ మహేశ్‌బాబుగారి బ్యాగ్రౌండ్ ఉండి కూడా తనను తాను నిరూపించుకోవడానికి కష్టపడుతున్నారు సుధీర్‌బాబు. యాక్టింగ్, బ్యాడ్మింటన్, క్రికెటర్, ఫైటర్, డ్యాన్సర్.. ఇలా ప్రతి దాంట్లో నిరూపించుకుంటున్న సుధీర్‌ని ఆల్ రౌండర్ అంటాను. ‘భలే మంచి రోజు, యాత్ర, ఆనందో బ్రహ్మ’.. ఇప్పుడు ‘శ్రీదేవి సోడా సెంటర్’.. ఇలా వినూత్న సినిమాలు నిర్మిస్తున్న విజయ్, శశిలకు నా అభినందనలు’’ అని అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. సుధీర్‌బాబు, ఆనంది జంటగా ‘పలాస 1978’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ఈ నెల 27న ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ – ‘‘రిస్క్ తీసుకోవడానికి భయపడని సుధీర్‌లాంటి వ్యక్తులంటే నాకు ఇష్టం. విజయ్, శశి ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్’’ అన్నారు. ‘‘చిరంజీవిగారు ప్రమోట్ చేసిన నా ‘సమ్మోహనం’ హిట్. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ ఆయనతో ఆరంభమైంది. అందుకే చిరంజీవిగారు నాకు లక్కీ హ్యాండ్. ‘సుధీర్‌కు కరెక్ట్ సినిమా పడితే కెరీర్లో నెక్ట్స్ లెవల్‌కు వెళతాడు’ అని ఓ సందర్భంలో మహేశ్ అన్నారు. ఆ సినిమా ఇదే అవుతుందనుకుంటున్నాను’’ అన్నారు సుధీర్‌బాబు. ‘‘చాన్స్ ఇచ్చిన సుధీర్, విజయ్, శశిలకు థ్యాంక్స్’’ అన్నారు కరుణకుమార్. ‘‘పలాస’ చూసినప్పుడే కరుణకుమార్‌తో సినిమా చేయాలనుకున్నాం. సినిమా బాగా వచ్చింది. బిజినెస్ బాగా జరిగింది’’ అన్నారు విజయ్, శశి. కార్తికేయ, అజయ్ భూపతి, తమ్మారెడి భరద్వాజ, రాజ్ కందుకూరి తదితరులు పాల్గొన్నారు. చదవండి : మహిళల రక్షణకు దిశ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది: అడవి శేషు నా జీవితంలో జరిగినవే సినిమాలో చూపించా: డైరెక్టర్ -
Krithi Shetty: ఆ సినిమాపై ఫోకస్ పెట్టిన కృతీ శెట్టి
గ్యాప్ లేకుండా పని చేసేవాళ్లకి లాక్డౌన్ పెద్ద విలన్‌గా మారింది. అయితే ఇటీవలే మెల్లి మెల్లిగా షూటింగులు ఆరంభమవుతున్నాయి. అందుకే ‘ఉప్పెన’ ఫేమ్ కృతీ శెట్టి ఆనందంగా ఉన్నారు. తాజా చిత్రం ‘ఆ అమ్మాయి గురించి చెప్పాలని ఉంది’ చిత్రీకరణలో నేటి నుంచి పాల్గొంటున్నారు కృతి. సుధీర్‌బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతానికి తన పూర్తి దృష్టి ఈ సినిమా మీదే పెట్టాలనుకుంటున్నారు కృతి. రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వం వహించనున్న చిత్రంలో కృతీ శెట్టి కథానాయికగా నటించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం అయ్యేలోపు ‘ఆ అమ్మాయి గురించి...’ చిత్రంతో బిజీగా ఉంటారు కృతి. -
తెలంగాణ యాసలో అలరించనున్న ‘బేబమ్మ’
నటించిన తొలి సినిమా ‘ఉప్పెన’తోనే కుర్రాళ్ల హృదయాలను దోచేసుకుంది మంగళూరు బ్యూటీ కృతి శెట్టి. వైష్ణవ్ తేజ్‌కు జంటగా బేబమ్మ పాత్రలో తన అమాయకపు నటనతో మంచి మార్కులే కొట్టేసింది. సినిమా డైరెక్టర్, హీరోతో పోలిస్తే కృతి కాస్తా ఎక్కువ ప్రశంసలే అందుకుంది. ఉప్పెనతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నఈ చిన్నది వరుస అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా మారింది. ఈ క్రమంలో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఓ చిత్రంలో కృతీ శెట్టి ఫీమెయిల్ లీడ్ రోల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో కృతి హైదరాబాదీ అమ్మాయిగా కనిపించనుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రంలో కృతీ తెలంగాణ యాసలో మాట్లాడనుంది. ఉప్పెనలో క్యూట్ లుక్‌తో అలరించిన కృతిశెట్టి.. మరి తెలంగాణ మాండలికంలో డైలాగ్స్ చెప్తూ తనలోకి మరో యాంగిల్‌ను కూడా ప్రేక్షకులకు పరిచయం చేయబోతుందన్నమాట. మరి ఎంత వరకు తెలంగాణ యాసలో మెప్పించి.. ఆడియెన్స్‌కు దగ్గరవుతుందో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి ఉండాల్సిందే. ఇక ఈ మూవీతోపాటు నేచురల్ స్టార్ నానితో శ్యామ్ సింగరాయ్, రామ్ హీరోగా లింగుసామి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలోనూ నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లు ఫిల్మీ దునియాలో టాక్ వినిపిస్తోంది. ఇటు తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా కృతికి ఆఫర్లు వస్తున్నాయట. -
సుధీర్ తొలి ప్రేమ కథ తెలుసుకోవాలని ఉందా..
నటుడు సుధీర్‌బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్లో ఓ ప్రేమకథా చిత్రం తెరకెక్కనుంది. వీరిద్దరి కలయికలో రూపొందుతున్న మూడో సినిమా ఇది. దీనికంటే ముందు సమ్మోహనం, వీ చిత్రాలు రూపొందాయి. ఈ సినిమాలో సుధీర్‌కు జోడీగా ఉప్పెన బ్యూటీ కృతీ శెట్టి నటించనుంది. వివేక్ సాగర్ స్వరాలు సమకూరుస్తుండగా.. పీవీ వింద్యా సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం సుధీర్14 సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టైటిల్‌ను ఇంకా ఫిక్స్ చేయలేదు. ఈ నేపథ్యంలో సుధీర్‌బాబు శనివారం సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించిన అప్డేట్ను అందించారు. సుధీర్14గా రూపొందుతున్న ఈసినిమా టైటిల్‌ను మార్చి 1న ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు 90 సెకన్ల నిడివి ఉన్న వీడియోను ట్విటర్లో పోస్టు చేస్తూ.. ప్రేమ గురించి మాట్లాడుతూ తమ మొదటి ప్రేమ కథను అందరికి ఎలా వివరిస్తామో చెబుతామన్నారు. ‘‘ప్రేమకథలు నచ్చని మనుషులు ఉండరు కదా. ఎందుకంటే ప్రేమ లేని జీవితం ఉండదు కనుక!. అయితే నాలాంటి అబ్బాయి తను ప్రేమించిన అమ్మాయి గురించి మొట్టమొదటిసారి ఎవరికైనా చెప్పాల్సి వచ్చినప్పుడు ఎలా మొదలుపెడతాడు. అయితే, ఒక్కసారి అబ్బాయిలందరూ సరదాగా గుర్తుతెచ్చుకోండి. మొదటిసారి మీరు ప్రేమించిన అమ్మాయి గురించి ఎవరికైనా చెప్పాల్సి వచ్చినప్పుడు మీరు ఎలా మొదలుపెట్టారు? కింద కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. నాకు తెలిసి చాలామంది నాలాగే మొదలుపెట్టి ఉంటారు. అదేంటో తెలుసుకోవాలని ఉందా? మార్చి ఒకటో తేదీ వరకూ వేచి చూడండి’’ అంటూ ఆ వీడియోలో సుధీర్‌బాబు పేర్కొన్నారు. ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. అంతేగాక టైటిల్ ఖచ్చితంగా తొలి ప్రేమలో ఉండే సహజమైన ఫీలింగ్స్ తెలిపే విధంగా ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు. చదవండి:సోషల్ హల్చల్: ఈషా కవ్వింపు..చెమటలు పట్టిస్తున్న జాన్వీ -
మూడో సినిమాకి ముహూర్తం
‘సమ్మోహనం, ‘వి’ చిత్రాల తర్వాత హీరో సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందనున్న మూడో చిత్రానికి శ్రీకారం జరిగింది. గాజుల పల్లి సుధీర్‌బాబు సమర్పణలో బెంచ్ మార్క్ స్టూడియోస్ పతాకంపై బి.మహేంద్రబాబు, కిరణ్ బల్లపల్లి నిర్మించనున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన తొలి సీన్‌కి నిర్మాత వై. రవిశంకర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, డైరెక్టర్ వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత ‘దిల్’ రాజు గౌరవ దర్శకత్వం వహించగా, డైరెక్టర్ వెంకీ కుడుముల స్క్రిప్ట్‌ను చిత్రబృందానికి అందజేశారు. ‘‘రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనున్న చిత్రమిది. మోహనకృష్ణ ఇంద్రగంటి డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. కృతీ శెట్టి హీరోయిన్గా నటించనున్న ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, ‘వెన్నెల’ కిశోర్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, కెమెరా: పీజీ విందా. -
కాంబినేషన్ కుదిరింది
ప్రస్తుతం ‘లవ్‌స్టోరీ’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు నాగచైతన్య. ఆ తర్వాత ‘మనం’ దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ అనే సినిమా కమిట్ అయ్యారు. ఇది కాకుండా ఇంకో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాగచైతన్య నటించనున్నారని తెలిసింది. కొన్ని రోజులుగా ఈ కాంబినేషన్లో సినిమా ఉంటుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్ కుదిరిందన్నది తాజా సమాచారం. ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా ఉంటుందట. ప్రస్తుతం నాగచైతన్య చేస్తున్న సినిమాలు పూర్తయ్యాక ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుందని తెలిసింది. -
థమన్ కాపీ కొట్టలేదు: వి దర్శకుడు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "అల వైకుంఠపురం" మ్యూజికల్ హిట్ కావడంతో సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ కెరీర్‌పరంగా ఓమెట్టు పైకి ఎక్కారు. కానీ నాని 25వ సినిమా 'వి'తో రెండు మెట్లు కిందకు దిగారు. ఈ సినిమాకు థమన్ కేవలం బ్యాక్‌గ్రౌండ్ సంగీతం మాత్రమే అందించారు. అతను ఇచ్చిన బీజీఎమ్ అదిరిపోయింది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ సంగీతం రాక్షసన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ సహా మరికొన్ని సినిమాల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను గుర్తు చేస్తోంది. దీంతో థమన్ మరోసారి కాపీ చేశాడంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ ఆరోపణలపై వి దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ స్పందించారు. (చదవండి: నాని.. 'వి' సినిమా రివ్యూ) ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ "అన్నపూర్ణ స్టూడియోలో సౌండ్ ఇంజనీర్లు కూడా ఆల్రెడీ ఉన్న మ్యూజిక్‌నే వాడుతున్నారేంటి? అని అడిగారు. నిజానికి రాక్షసన్‌లో వచ్చే బీజీఎమ్, 'వి'లో థమన్ వాడిన బీజీఎమ్ రెండూ ఒకేలా కనిపించినా అది వేర్వేరు. కాకపోతే మనవాళ్లకు సంగీత పరిజ్ఞానం లేకపోవడంతో కాపీ అంటున్నారు. ఈ ఒక్క సినిమానే కాదు వేరే సినిమాల్లో కూడా సంగీత దర్శకులు కాపీ కొట్టకపోయినా వారిపై కాపీ నిందలు వేస్తారు. అతను సితార్ వాడాడు.. ఇతను సితార్ వాడాడు.. అతను వయొలిన్ వాయించాడు, ఇతను వయొలిన్ వాయించాడు.. సౌండ్స్ సేమ్ అనిపిస్తే చాలు.. కాపీ అనేస్తారు. థమన్ ఎంతో ప్రతిభావంతుడు. అతను కాపీ చేయకపోయినా ఇంత గొడవ చేస్తున్నారు. అలాంటిది నిజంగా చేసుంటే ఊహించలేమేమో" అని ఇంద్రగంటి చెప్పుకొచ్చారు. తనపై వస్తున్న ఆరోపణలను ఇంద్రగంటి ఖండించినందుకు తమన్ సంతోషంగా ఫీల్ అయ్యారు. సంగీత దర్శకులు కూడా ఇంత చక్కగా వివరణ ఇవ్వలేరని, లవ్యూ సర్.. అంటూ ట్వీట్ చేశారు. (చదవండి: పట్టు పట్టు ట్రెండే పట్టు.. మనసులు కొల్లగొట్టు!) -
ఎంతసేపు కనిపించామన్నది ముఖ్యం కాదు
‘‘ఈ లాక్డౌన్లో తెలుగు నేర్చుకుంటున్నాను. అలాగే ఈ ఆరు నెలలు సహనంతో ఎలా ఉండాలి? దయగా ఎలా ఉండాలి? అనేది నేర్పించాయి’’ అంటున్నారు అదితీ రావ్ హైదరీ. శుక్రవారం రాత్రి అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ‘వి’ చిత్రంలో ఆమె ఒక హీరోయిన్గా నటించారు. నాని విలన్‌గా, సుధీర్‌బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మించారు. ఆదివారం అదితీ రావ్ హైదరీ మీడియాతో మాట్లాడుతూ – ‘‘వి’ సినిమాలో నానీతో నా ప్రేమకథ చాలా ఉద్వేగంగా ఉంటుంది. సినిమాకు హార్ట్ లాంటి పాత్రలో నటించటం చాలా ఆనందంగా ఉంది. సినిమాలోని నా పాత్ర నిడివి తక్కువగా ఉండటం గురించి అందరూ మాట్లాడుతున్నారు. కానీ ఓ సినిమాలో ఎన్ని నిమిషాలు కనబడ్డాం అనేది ముఖ్యం కాదు.. ఆ పాత్రలో ఎంత బాగా నటించాం? దానికి ఎంత పేరొచ్చింది అనేది ఇంపార్టెంట్. ఇంద్రగంటి మోహనకృష్ణగారే నన్ను తెలుగు సినిమాకి పరిచయం చేశారు. ఆయన దర్శకత్వంలో సినిమా చేయటం బావుంటుంది. ఆయన సినిమాలో క్యారెక్టర్స్ మాట్లాడే విధానం కొత్తగా ఉంటుంది. ‘వి’ సినిమాని థియేటర్లలో ప్రేక్షకులతో కలిసి చూద్దామనుకున్నాను. అది మిస్సయ్యాను. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని డిజిటల్లో రిలీజ్ చేయాలన్నది మంచి నిర్ణయమే. ప్రస్తుతం నేను బాలీవుడ్ సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటున్నాను. మేం ఉంటున్న కార్వ్యాన్స్ను గంటకోసారి శానిటైజ్ చేయడంతో పాటు షూటింగ్ టైమ్‌లో తక్కువ మంది సెట్లో ఉండేటట్లు ప్లా¯Œ చేశారు. ప్రస్తుతం నా చేతిలో మూడు హిందీ సినిమాలు, రెండు తమిళ్ సినిమాలు, ఒక తెలుగు సినిమా.. మొత్తం ఆరు సినిమాలు ఉన్నాయి’’ అన్నారు. -
నాని.. 'వి' సినిమా రివ్యూ
టైటిల్: వి జానర్: క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ తారాగణం: నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితిరావు హైదరి, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి తదితరులు దర్శకుడు: ఇంద్రగంటి మోహనకృష్ణ నిర్మాత: దిల్ రాజు సంగీతం: అమిత్ త్రివేది నేపథ్య సంగీతం: థమన్ సినిమాటోగ్రఫీ: పి.జి. విందా విడుదల తేదీ: 5-9-2020, అమెజాన్ ప్రైమ్ 'అష్టా చమ్మా' చిత్రంతో హీరో నాని ప్రస్థానం మొదలైంది. తొలి చిత్రంతోనే నానికి బంపర్ హిట్‌ను అందించారు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. అయితే అనూహ్యంగా మళ్లీ ఆయన డైరెక్షన్లోనే నాని 25వ సినిమా చేయడం విశేషం. ఇక ఎప్పుడూ వైవిధ్యమైన పాత్రలకే మొగ్గు చూపే నాని ఈ సారి ప్రతినాయక పాత్రలో కనిపించడంతో 'వి' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నేడు(సెప్టెంబర్ 5న) అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అయింది. లాక్డౌన్ తర్వాత ఓటీటీలో విడుదలైన భారీ తెలుగు చిత్రం ఇదే కావడం గమనార్హం. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో యంగ్ హీరో సుధీర్‌బాబు, విలన్ ఛాయలున్న పాత్రలో నాని ప్రేక్షకులను మెప్పించారా? లేదా? ఈ ఇద్దరిలో చివరికి ఎవరు హీరో అయ్యారో చూసేద్దాం... కథ: డీసీపీ ఆదిత్య(సుధీర్ బాబు) దమ్మున్మ పోలీసాఫీసర్. గ్యాలంటరీ మెడల్ సహా ఎన్నో అవార్డులు అందుకున్న ఆయనకు అత్యంత కిరాతకంగా హత్యలు చేసే కిల్లర్ విష్ణు(నాని) దమ్ముంటే తననాపమని సవాలు విసురుతాడు. అతని డిపార్ట్మెంట్లోని ఓ పోలీసును ఆయన ఇంట్లోనే హత్య చేస్తాడు. ఆ తరువాత ఒక్కొక్కరిని రకరకాలుగా చంపుతూ నెక్స్ట్ ఏంటి? అనేది క్లూ ఇస్తాడు. ఈ క్లూ తెలుసుకోగలిగితే నేరస్థుడిని పట్టుకోవచ్చని డీసీపీ తన ప్రేయసి అపూర్వ (నివేదా థామస్) సాయం కోరతాడు. కానీ చివరికి అతని మెదడులోనే మెరుపులాంటి ఆలోచన చేరి అతనే పజిల్ విప్పుతాడు. వెంటనే నేరస్థుడిని, అదే నానిని పట్టుకునేందుకు పరుగెత్తుతాడు. కానీ విలన్ అంత వీక్ కాదు.. చిక్కినట్లే చిక్కి తప్పించుకుని మళ్లీ హత్యలు చేస్తుంటాడు. అసలు వీ ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు? డీసీపీ ఆదిత్యకు ఎందుకు చాలెంజ్ విసిరాడు? ఆదిత్య కిల్లర్‌ను పట్టుకున్నాడా? లేదా? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే! (చదవండి: నేను హ్యాపీ అని ‘దిల్’రాజు అన్నారు) విశ్లేషణ: సుధీర్‌బాబు ఎంట్రీ సీన్‌తోనే పోలీస్‌గా పర్ఫెక్ట్గా సూటయ్యారనిపిస్తుంది. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ హత్యతో కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు దర్శకుడు మోహనకృష్ణ. హంతకుడు ఎంతో సులువుగా ఒక్కొక్కరినీ చంపుకుంటూ వెళ్లడం, అతడి కోసం డీసీపీ గాలించడం వంటి సన్నివేశాలతోనే ఫస్టాఫ్ నడుస్తుంది. డీసీపీకి హంతకుడు కనిపించి, తప్పించుకోవడంతో ప్రథమార్థం ముగుస్తుంది. ద్వితీయార్థం మరింత రక్తికట్టిస్తారనుకుంటే అలా జరగలేదు. ఇక్కడ కథనం నెమ్మదించింది. హత్యల వెనక కారణాన్ని తెలుసుకునేందుకు డీసీపీ ప్రయత్నాలు మొదలు పెడతాడు. (చదవండి: పెంగ్విన్ మూవీ రివ్యూ) అలా విష్ణు ఫ్లాష్‌బ్యాక్ వస్తుంది.. ఇక్కడ సస్పెన్స్ రివీల్ కావడంతో సినిమా అంత ఆసక్తిగా సాగదు. ఇక హంతకుడి ఒప్పందం ప్రకారం అతడిని పట్టుకోనందుకు డీసీపీ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. ఆ తర్వాత క్లైమాక్స్‌లో వస్తుంది అసలు ట్విస్ట్. హత్యల వెనక కారణాన్ని హంతకుడే తెలియజేస్తాడు. కానీ ఈ తరహా కారణాలు చాలా సినిమాల్లో కనిపించాయి. అయితే అన్ని మెడల్స్ సాధించి, పెద్ద పేరు గడించిన డీసీపీ.. నేరస్థుడు క్లూ వదిలినా పట్టుకోలేకపోవడం కొంత లాజిక్‌గా అనిపించదు. దర్శకుడు రాసుకున్న కథ బాగానే ఉన్నా కథనం అంత బలంగా లేదు. క్రైమ్ థ్రిల్లర్ చిత్రం కాబట్టి కామెడీ చొప్పించే ప్రయత్నం చేయలేదు. కాకపోతే సీరియల్ కిల్లర్‌గా భయపెట్టిన నాని అక్కడక్కడా చిలిపి నానిగా కనిపించారు. ప్రతినాయక పాత్రలోనూ నాని సులువుగా నటించారు. హత్యలు చేసేటప్పుడు వచ్చే డైలాగులు బాగున్నాయి. చివరి రెండు హత్యలు వెన్నులో వణుకుపుట్టిస్తాయి. నవలా రచయితగా, డీసీపీ ఆదిత్య ప్రేయసిగా అపూర్వ పాత్రలో నివేదా థామస్ రాణించారు. కథకు మూలమైన సాహెబ్ పాత్రలో అదితిరావు హైదరి బాగా నటించారు. మిగతావారు తమ పాత్రలకు న్యాయం చేశారు. కొన్నిచోట్ల వచ్చే సంగీతం 'రాక్షసుడు' థీమ్ మ్యూజిక్‌ను గుర్తు చేస్తుంది. పాటలు పర్వాలేదు. పి.జి. విందా సినిమాటోగ్రఫీకి తిరుగులేదు. (చదవండి: ‘వి’ తర్వాత అభిమానులు పెరుగుతారనుకుంటున్నా!) ప్లస్: నాని, సుధీర్‌బాబుల నటన ఫస్టాఫ్ మైనస్: కథనం బలహీనంగా ఉండటం సెకండాఫ్ నెమ్మదించడం ఒక్కమాటలో: ఎక్స్పెక్టేషన్స్కు మ్యాచ్ అవలేదు. -
‘వి’ తర్వాత అభిమానులు పెరుగుతారనుకుంటున్నా!
నాని, సుధీర్‌బాబు, అదితీ రావు హైదరీ, నివేధా థామస్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘వి’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శనివారం అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానున్న సందర్భంగా నాని చెప్పిన విశేషాలు. ► కొత్త కంటñ ంట్‌తో వచ్చే సినిమా చూడాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ టైమ్‌లో ‘వి’ సినిమాను ఓటీటీలో విడుదల చేసే అవకాశం రావటం అదృçష్టంగానే భావించాలి. ఇంత మంచి సినిమాని థియేటర్లో చూస్తే బావుండేదే అనిపిస్తుంది. కానీ, తప్పదు. ఓటీటీ ఓ కొత్త ఎక్స్పీరియన్స్. నా ప్రతి సినిమాని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో ఉదయం 8.45 షోను కర్టెన్ పక్కన నిలబడి చూసేవాణ్ణి. అది మిస్ కాకూడదని థియేటర్ ఫీలింగ్ కోసం మా ఫ్యామిలీకి ఓ షో వేస్తున్నాను. ► ఇంద్రగంటిగారితో నా ఫస్ట్ సినిమా ‘అష్టా చమ్మా’ చేశాను. ఈ పన్నెండేళ్లలో నేను, ఆయన వ్యక్తిగతంగా కొంచెం కూడా మారలేదు. కానీ వృత్తిపర ంగా దర్శకునిగా ఇంద్రగంటిగారు, నటునిగా నేను, కెమెరామేన్‌గా విందా చాలా గొప్పగా ఎదిగాం అనిపించింది. ఈ ‘వి’ సినిమాకి హీరో ఇంద్రగంటిగారే. మా ‘అష్టా చమ్మా’ రిలీజ్ రోజునే ఈ సినిమా కూడా విడుదలవ్వటం అనుకోకుండా జరుగుతోంది. ► ‘వి’ సినిమా మొదలైన 20 నిమిషాల తర్వాత వస్తాను. ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అవుతుందనుకుంటున్నా (న వ్వుతూ). ఇప్పుడు జనరేషన్ ఆడపిల్లలు బ్యాడ్బాయ్స్నే ఇష్టపడుతున్నారు. కావాలంటే చూడండి రానా, సోనూ సూద్‌లకు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. ‘వి’ కథ చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది. చాలామంది చివరికి వచ్చేసరికి నాని హీరో అవుతాడు, సుధీర్ విలనవుతాడని రాస్తున్నారు. అసలు అలాంటిదేం లేదు. లైఫ్ అంతా సాఫీగా నడుస్తోన్న ఒక సెలబ్రిటీ పోలీస్ లైఫ్‌లోకి ఒకడొచ్చాడు. ఇంతే సినిమా. సినిమా చూసిన ప్రేక్షకులు ఆ పాత్రలకు కనెక్ట్ అయి చిన్న ఎమోషన్ ఫీలవుతారు. ► ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాను ఇలా (ఓటీటీలో) విడుదల చేస్తున్నందుకు ‘దిల్’ రాజుగారు చాలామందికి సమాధానం చెప్పాలి. ఆయన కూడా ఓ డిస్ట్రిబ్యూటర్. రాజుగారూ.. మీరు ఎలాంటి డెసిషన్ తీసుకున్నా మీతో పాటు మేమున్నాం అని నావైపు నుండి పూర్తిగా సపోర్ట్ చేశాను. నిర్మాతకు నష్టం రాకుండా చూసుకోవటం మన బాధ్యత. ► లాక్డౌన్ ముందు రాజమండ్రిలో 20 రోజులు, పళనిలో 15 రోజులు షూటింగ్ చేశాను. షూటింగ్ చేసొచ్చిన ప్రతిసారీ మా అబ్బాయి జున్ను కొత్తగా కనిపిస్తుంటాడు. త్వరగా పెరిగిపోతున్నాడే, ఇలాంటి క్యూట్ ఏజ్‌ను మిస్ అవుతున్నానే అనుకునేవాణ్ణి. ఈ లాక్డౌన్లో 24 గంటలూ వాడితో టైమ్ స్పెండ్ చేస్తున్నాను. ► నటులందరూ బాధ్యతగా ఉండి నిర్మాతకు డబ్బు రాకపోతే అసలు రూపాయి కూడా తీసుకోకుండా పని చేయొచ్చు. అంతేకానీ ఒక్కో నటునికి 20 శాతం, 30 శాతం కట్ చేయాలని చాంబర్ రూల్ పెట్టిందని కాకుండా ఎవరికి వారు తీసుకోవాల్సిన డెసిషన్ ఇది. అంతేకానీ ఈ సమస్యను జనరలైజ్ చెయ్యకూడదు. ► ‘టక్ జగదీష్’ సినిమా 50 శాతం పూర్తయింది. అక్టోబర్‌లో షూటింగ్ స్టార్ట్ చేస్తాం. ‘శ్యామ్‌సింగరాయ్’ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ‘టక్ జగదీష్’ పూర్తవ్వగానే అది మొదలవుతుంది. మరో రెండు కథలు ఓకే చేశాను. ఒకటి కొత్త దర్శకుడు, మరోటి ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్‌తో చేస్తాను. ► జనరల్‌గా నేను ఫిట్నెస్ మీద పెద్దగా శ్రద్ధ పెట్టను కాబట్టి ఇప్పుడొచ్చిన గ్యాప్‌లో ఫుల్‌గా ఫిట్నెస్ పెంచుకుని సిక్స్‌ప్యాక్ చేద్దామనుకున్నాను. అలాగే పియానో నేర్చుకుందామనుకున్నాను. మా అమ్మ దగ్గర వంట నేర్చుకుందామనుకున్నాను. కానీ ఏమీ చేయలేదు. తినడం.. పడుకోవటం.. మా జున్నుతో ఆడుకోవటంతోనే ఆరు నెలలు గడిచిపోయాయి. -
బ్రాడ్ పిట్లా ఉండాలన్నారు
నాని, సుధీర్‌బాబు నటించిన మల్టీస్టారర్ సినిమా ‘వి’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా సుధీర్‌బాబు చెప్పిన విశేషాలు ► ‘వి’ సినిమా రాక్షసునికి, రక్షకునికి మధ్య జరిగే పోరాటం. నేను హీరో, నాని విలన్. ఇద్దరం కొలతలేసుకుని నటించలేదు, క్యారెక్టర్ల ప్రకారం నడుచుకున్నాం. రెండు పాత్రలకూ సమాన ప్రాధాన్యం ఉంటుంది. నేను ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంటర్ అయ్యేటప్పటికే అక్కడ రాక్షసుడు (అప్పటికే నాని ఈ పాత్రకు కన్ఫార్మ్ అయ్యారు) ఉన్నాడు. అందుకే నేను రక్షకుడు అయ్యాను. ఒకవేళ రెండు పాత్రలు నాకు చెప్పి నన్ను ఎన్నుకోమన్నా నేను పోలీసాఫీసర్ పాత్రనే ఎన్నుకునేవాణ్ణి. అంటే... ఇదే బెటర్ రోల్ అని చెప్పడంలేదు. కానీ నాకు ఇది కొత్త, నానీకి అది కొత్తగా ఉంటుంది. ► ఇంద్రగంటి గారంటే మహేశ్‌గారికి ఫుల్ నమ్మకం. ‘సమ్మోహనం’ సమయంలో రాత్రి ఒంటి గంటకు ఫోన్ చేసి ఈ సినిమా బావుంటుందని ధైర్యం చెప్పారు. మొన్నీ మధ్య మహేశ్‌గారిని కలిసినప్పుడు కూడా ‘వి’లో యాక్షన్ సీక్వెన్స్ బాగుంది, యాక్షన్ కొరియోగ్రఫీ ఎవరు? అని అడిగారు. ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలని వెయిట్ చేస్తున్నారు మహేశ్. ఇందగ్రంటిగారు నాకు ఈ కథ చెప్పినప్పుడు ఫైట్స్ నేచురల్‌గా ఉండాలనుకుంటున్నాను అని నా బాడీ ఎలా ఉండాలో చెప్పారు. చూడటానికి లావుగా ఉండకూడదు, కానీ చొక్కా విప్పితే కండలు ఉండాలని చెప్పారు. ఉదాహరణకి బ్రాడ్ పిట్లా ఉండాలన్నారు. అదే నాకు మోటివేషన్‌లా అనిపించింది. ► లాక్డౌన్లో అందరిలానే ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసే అవకాశం వచ్చింది. చూడాలనుకున్న చాలా సినిమాలు చూసే తీరిక దొరికింది, చూశాను. అలానే చాలా కథలు విన్నాను. అందులో రెండు కథలకి ఓకే చెప్పాను. ఈ డిసెంబర్ నుండి పుల్లెల గోపిచంద్ బయోపిక్‌లో నటిస్తున్నాను. ఇది ప్యాన్ ఇండియా సినిమా. -
నేను హ్యాపీ అని ‘దిల్’రాజు అన్నారు
నాని, సుధీర్‌బాబు ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘వి’. ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ పలు విషయాలను పంచుకున్నారు. ► సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేయాలని దాదాపు ఐదు నెలలు ‘దిల్’ రాజుగారిని నేను, నాని బతిమాలి ఓ నాలుగునెలల పాటు లాక్కొచ్చాం. రాజుగారు ఓ రోజు ‘కరెక్ట్‌గా థియేటర్లు ఎప్పుడు ఓపెన్ చేస్తారో ఓ డేట్ చెప్ప’మన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కనుచూపు మేరలో ఆ పరిస్థితి కనపడటంలేదు. అందుకనే ఈ సినిమాని డిజిటల్లో విడుదల చేయటానికి మొగ్గుచూపాం. ► ప్రతి విషయానికి పాజిటివ్, నెగిటివ్ ఉన్నట్లే ఈ సినిమాకు డిజిటల్ రిలీజ్ కూడా ప్లస్ అవుతుందనుకుంటున్నా. ఎందుకంటే ‘వి’ చిత్రాన్ని శుక్రవారం రాత్రి 12గంటలకు విడుదల చేస్తున్నాం. దాదాపు 200 దేశాల్లో ఈ సినిమా విడుదల కానుంది. జనరల్‌గా మా అమ్మగారు, అత్తగారు లాంటి 70 ఏళ్ల వయసున్నవారు థియేటర్లకు వచ్చి సినిమా చూడరు. నా సినిమాకు అలాంటివాళ్లందరూ ఎక్స్ట్రా ఆడియన్స్. మొదటివారం సినిమా చూసే ప్రేక్షకులంతా మొదటిరోజే చూస్తారు. శనివారం హాలిడే కాబట్టి అందరూ నైట్ పాప్‌కార్న్, కూల్‌డ్రింక్‌ను పక్కన పెట్టుకుని ఇంట్లో సినిమాని ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. ఎటొచ్చీ ప్రేక్షకుల మధ్యలో కూర్చుని సినిమా చూడలేకపోతున్నామనే బాధ తప్ప మిగతా అన్నీ మంచి విషయాలే. కానీ, నాకు వ్యక్తిగతంగా థియేటర్ అంటేనే ఇష్టం. ఇదొక (ఒటీటీ) ఫేజ్ మాత్రమే అనుకుంటున్నా. ► ‘దిల్’ రాజుగారు ఈ సినిమాకు నిర్మాత అయినా ఆయన ఒక బయ్యర్, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఓటీటీలో రిలీజ్ చేయటం వల్ల ఆయనకు ఎన్నో సమస్యలు ఉండవచ్చు. ‘సార్ మీరు హ్యాపీయా’ అని అడిగితే, ‘హ్యాపీ మోహన్’ అన్నారు. లేకపోతే ఆయన అంత తేలిగ్గా ఓటీటీలో రిలీజ్ అనే నిర్ణయం తీసుకోరు. ► నానీతో నా అనుబంధం పుష్కరకాలం. నానీకి ఈ కథ చెప్పినప్పుడు ఇది తనకు 25వ సినిమా అని నాకు తెలియదు. ఆ తర్వాత తెలిసింది. అప్పుడు నానీని ‘ఇది నీ 25వ సినిమా కదా. ఈ పాత్ర (విలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్) ఏమైనా చేయడానికి ఇబ్బందా అంటే లేదన్నాడు. మొన్న సినిమా చూసిన తర్వాత ‘ఇది నా 25వది అయినందుకు, ఆ 25వ సినిమా మీతో చేసినందుకు హ్యాపీ’ అని నాని అన్నాడు. ► విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయాలి. అది ఎప్పుడు అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పలేను. ఇద్దరు, ముగ్గురు నిర్మాతలకు ఓ సినిమా చేసి, మళ్లీ ‘దిల్’ రాజుగారితో సినిమా చేస్తాను. ► ప్రస్తుత పరిస్థితుల్లో షూటింగ్ అంటే క్రియేషన్ మీద పెట్టాల్సిన శ్రద్ధ శానిటేజషన్ మీద పెట్టాల్సి వస్తుందేమో. సెప్టెంబర్, అక్టోబర్లలో కొన్ని సినిమాల షూటింగ్‌ను ప్రారంభిస్తున్నారట. చూద్దాం.. ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. రానున్న ఐదారు నెలల్లో నిర్మాతలు, దర్శకులు, నటులు సరికొత్త చాలెంజ్‌లను ఎదుర్కొనే పరిస్థితి రాబోతుంది. -
Vధి
-
‘వి’ డైరెక్టర్‌తో చైతూ చిత్రం?
నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు హీరోలుగా మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన ‘వి’చిత్రం విడుదలకు సిద్దంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తర్వాత డైరెక్టర్ మరో సినిమాను ప్రకటించలేదు. అయితే ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా గురించి అప్డేట్ వస్తుందని అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ విభిన్న చిత్రాల డైరెక్టర్ తన తదుపరి చిత్రం అక్కినేని నాగ చైతన్యతో తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. వాస్తవానికి నాగచైతన్యతో సినిమా తీయాలని మోహన్‌కృష్ణ ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారని టాలీవుడ్ టాక్. అయితే ఈమధ్య చైతూకు కథ చెప్పగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వకంలో తెరకెక్కుతున్న ‘లవ్ స్టోరీ’ చిత్రంతో నాగచైతన్య బిజీగా ఉన్నారు. సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్న విషయం తెలిసిందే. అన్నీ కుదరితే ‘లవ్ స్టోరీ’ తర్వాత ఈ చిత్రం పట్టాలెక్కె అవకాశం ఉంది. ఇక తన ప్రతీ సినిమాలో హీరోయిజాన్ని కొత్తగా చూపించే ఈ డైరెక్టర్ చైతూను ఎలా చూపిస్తాడో వేచి చూడాల్సిందే. చదవండి: ‘మా కోసం గడపదాటి వచ్చావయ్యా!’ క్రికెటర్ టు స్టూడెంట్! -
నాని సినిమాకు కరోనా ఫీవర్
నేచురల్ స్టార్ నాని, సుధీర్‌బాబు ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం ‘వి’. నివేదా థామస్, అదితిరావు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘అష్టాచమ్మా’, ‘జెంటిల్మన్’ సినిమాల దర్శకుడు మోహన్‌కృష్ణ ఈ సినిమాతో మరోసారి నానీతో జోడీ కట్టాడు. ఇది నానికి 26వ సినిమా. ఈ చిత్రాన్ని మార్చి 25న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ఈ పాటికే ప్రకటించింది. అయితే ప్రస్తుతం దేశమంతటా కరోనా టెన్షన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో సినిమా రిలీజ్ చేస్తే.. వైరస్ దెబ్బకు జనాలు థియేటర్ వరకు వస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ఇప్పటికే విడుదలైన నాని విలన్ లుక్, వి టీజర్‌కు మంచి స్పందన వస్తోంది (అష్టాచమ్మాలో నానికి అవకాశం ఎలా వచ్చిందంటే...) ఇలాంటి సమయంలో సినిమా రిలీజ్ చేసి చేతులు కాల్చుకోవడం ఎందుకని నిర్మాత దిల్ రాజు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఎందుకైనా మంచిదని, కాస్త కరోనా ఫీవర్ తగ్గిన తర్వాతే సినిమా విడుదల చేయడానికి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ చిత్రం ఉగాదికి కాకుండా మరికొద్ది రోజులు ఆలస్యంగా విడుదల కానుంది. కొత్త రిలీజ్ డేట్ తెలియాంటే చిత్ర యూనిట్ మరో డేట్‌ను ప్రకటించేవరకు ఓపిక పట్టాల్సిందే. కగా ఈ సినిమా నుంచి రిలీజైన ‘వస్తున్నా.. వచ్చేస్తున్నా..’ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సీతారామ శాస్త్రి రచించిన ఈ పాటను అమిత్ త్రివేది, శ్రేయా ఘోషల్ ఆలపించారు. (నాని విలన్ లుక్!) -
నేనే నానీనే!
‘ఈగ’ సినిమాని అంత సులువుగా మరచిపోలేం. ఈగగా పునర్జన్మ ఎత్తాక నాని పాత్ర తన ప్రేయసి దగ్గర ‘నేనే నానీనే..’ అని తన ఉనికిని చాటడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు ఇక్కడున్న నాని ఫొటో చూశారుగా! ఇన్నాళ్లూ మంచి అబ్బాయిగా కనిపించిన నానీయేనా ఇలా రౌడీ టైప్‌లో కనిపిస్తున్నాడు అనుకుంటున్నారా? ఇదే ప్రశ్న నానీని అడిగితే.. ‘అవును.. నేనే నానీనే’ అంటారేమో. ఇప్పటివరకూ మంచి అబ్బాయి పాత్రల్లో కనిపించిన నాని తొలిసారి విలన్ తరహా పాత్రలో కనిపించనున్న చిత్రం ‘వి’. ఈ సినిమాలోని లుక్‌నే మనం చూస్తున్నాం. నాని హీరోగా అష్టాచమ్మా, జెంటిల్మన్ చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ నానీని విలన్ని చేశారు. నాని హీరోగా నేను లోకల్, ఎంసీఎ వంటి సూపర్‌హిట్ చిత్రాలను నిర్మించిన ‘దిల్’ రాజు ఈ చిత్రానికి నిర్మాత. ఉగాది సందర్భంగా మార్చి 25న ఈ చిత్రం రిలీజ్ కానుంది. నాని, సుధీర్‌బాబు, నివేదా థామస్, అదితీరావు హైదరి తదితరులు నటించిన ఈ చిత్రానికి నిర్మాతలు: రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి. -
పవర్ఫుల్ ఆఫీసర్
నువ్వా? నేనా? అని పోటీపడ్డారు నాని, సుధీర్‌బాబు. నాని నేచురల్ స్టార్ అని ఎప్పుడో అనిపించుకున్నారు. ఆ తర్వాత వచ్చిన సుధీర్‌బాబు కూడా ఒక్కో సినిమాకి నిరూపించుకుంటూ మంచి నటుడు అనిపించుకున్నారు. ఈ ఇద్దరూ నువ్వా? నేనా? అంటూ ‘వి’ సినిమాలో పోటీపడి నటించారు. నానీతో ‘అష్టా చమ్మా, జెంటిల్‌మేన్’ వంటి హిట్ చిత్రాలను, సుధీర్‌బాబుతో ‘సమ్మోహనం’ వంటి హిట్ చిత్రాన్ని తీసిన ఇంద్రగంటి మోహనకృష్ణ ‘వి’ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి నిర్మించారు. నాని ఓ డిఫరెంట్ రోల్లో.. ఆ పాత్రకు దీటుగా ఉండే పవర్ఫుల్ ఐపీయస్ ఆఫీసర్ పాత్రలో సుధీర్‌బాబు నటించారు. సోమవారం సుధీర్ లుక్‌ని విడుదల చేశారు. ‘‘భారీ బడ్జెట్‌తో ఈ యాక్షన్ థ్రిల్లర్‌ని రూపొందించాం. ఇటీవలే షూటింగ్ పూర్తయింది. ఉగాది సందర్భంగా మార్చి 25న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. నివేదా థామస్, అదితీ రావ్ హైదరీ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్: అమిత్ త్రివేది, కెమెరా: పి.జి.విందా. -
వయొలెన్స్ కావాలన్నారుగా.. : నాని
వైవిధ్యమైన చిత్రాలతో వరుస విజయాలను సాధించి తనకంటూ ఓ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు హీరో నాని. తాజాగా ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో నాని ‘వి’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది నాని 25వ చిత్రం. నాని ఎక్కువగా యాక్షన్ సీన్స్ ఉండే సినిమాలు చేయడని.. కొందరు ఆయనపై విమర్శలు కూడా చేస్తుంటారు. అలాంటి వారి కోసమే నాని చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటుంది. వయొలెన్స్ కావాలన్నారుగా, ఇస్తా ఉగాదికి సాలిడ్‌గా ఇస్తా అని నాని ట్వీట్ చేశారు. అంతేకాకుండా గన్స్‌తో కూడిన ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌పై ‘ఈ క్షణం నుంచి నా శత్రువులకి నా దయా దాక్షిణ్యాలే దిక్కు’ అని విలియం షేక్స్పియర్ కోట్స్‌ను ఉంచారు. వచ్చే ఏడాది ఉగాది కానుగా మార్చి 25వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్నట్టు సమాచారం. కాగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో.. మరో హీరో సుధీర్‌బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. అదితిరావు హైదరీ, నివేదా థామస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. Violence kavalannaru ga :) Istha... UGADI ki SOLID ga istha ...🔥#VTheMovie ✌🏼@mokris_1772 @isudheerbabu @i_nivethathomas @aditiraohydari @ItsAmitTrivedi @SVC_official pic.twitter.com/Rc4KKAWhVD — Nani (@NameisNani) November 4, 2019 -
థాయిలాండ్ నుంచి ‘వ్యూహం’ కదిలింది!
సమ్మోహనం లాంటి కూల్ హిట్ కొట్టిన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. మరోసారి తనదైన శైలితో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఈ దర్శకుడు.. ఓ కొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించిన సంగతె తెలిసిందే. సుధీర్‌బాబు, నాని కాంబినేషన్లో ఇంద్రగంటి మోహనకృష్ణ ‘వీ’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో నాని నెగెటివ్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ థాయ్‌లాండ్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేసుకున్నట్లు సమాచారం. ఈమేరకు సుధీర్ బాబు ఓ ట్వీట్ చేశాడు. వెన్నెల కిషోర్, ఇంద్రగంటి, దిల్‌రాజు,సుధీర్ అందరూ కలిసి ఉన్న ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో నివేదా థామస్, అదితిరావ్ హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. And that's pack up from the #Phuket schedule ... Happy faces should tell you how good this turned out to be 😎☺ #VTheMovie pic.twitter.com/0xgLJG52pM — Sudheer Babu (@isudheerbabu) September 26, 2019 -
కారును తోస్తూ కసరత్తులు చేస్తున్న యంగ్ హీరో
-
కారును తోస్తున్న యంగ్ హీరో
సమ్మోహనం సినిమాతో కూల్ హిట్ కొట్టిన సుధీర్ బాబు.. నన్ను దోచుకుందువటే చిత్రంతో పలకరించాడు. ప్రస్తుతం సుధీర్ బాబు.. ప్రయోగాత్మక చిత్రాలను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. అందుకోసం భారీ కసరత్తులు చేస్తున్నాడు. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ బయోపిక్‌ను రూపొందించే పనిలో పడ్డాడు. స్వతహాగా బ్యాడ్మింటర్ ప్లేయర్ కావడంతో కొంచెం ఈజీ అయినా.. ఆ పాత్రకోసం సుధీర్ చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. సుధీర్ బాబు కసరత్తులు చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కారును ముందుకు తోస్తూ చాలా కష్టపడుతున్నాడు. పక్కనే ట్రైనర్ ఉండి సలహాలు ఇస్తున్నాడు. హైవేపై కారును తోస్తున్న సుధీర్.. తన శరీరాకృతిని మార్చుకునేందుకు భారీ కసరత్తులు చేస్తున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సుధీర్ బాబు ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘వీ’ చిత్రంలో నటిస్తున్నాడు. -
నాని విలన్ లుక్!
ఇప్పటికే విభిన్న పాత్రలతో నేచురల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నాని తన 25వ సినిమాలో మరో ప్రయోగం చేస్తున్నాడు. తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వి సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్ లీడర్ పనుల్లో బిజీగా ఉన్న నాని, వి సినిమా షూటింగ్‌ను ప్రారంభించాడు. ఆదివారం వి షూటింగ్‌కు హాజరయ్యాడు నాని. ఈ సినిమాలో నాని లుక్ సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో సుధీర్ బాబు మరో కీలక పాత్రలో నటిస్తుండగా అదితిరావ్ హైదరీ, నివేదా థామస్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సైరా ఫేం అమిత్ త్రివేది సంగీతమందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్నా నాని గ్యాంగ్ లీడర్ సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
పాపం, పుణ్యం, ప్రపంచ మార్గం
‘నా వ్యక్తిగత విశ్వాసాలు– నేను నా పఠనం ద్వారా, అనుభవాల ద్వారా, తర్కించుకొని ఏర్పరచుకొన్నవి. ఈ ప్రపంచంలో సర్వవిశ్వాసాలకి, చర్యలకి, ‘వ్యక్తి’ కేంద్రమని నేను నమ్ముతాను. సెయింట్ కావచ్చు; సిన్నర్ కావచ్చు. వ్యక్తి సమూహాలను శాసిస్తాడని నా విశ్వాసం. అయితే– ఏ ఒక్క విశ్వాసమూ పరిపూర్ణ సత్యం కాదు. సాపేక్ష సత్యమే’ అంటారు ఇంద్రగంటి శ్రీకాంతశర్మ(29 మే 1944 – 25 జూలై 2019). శ్రీకాంత శర్మ ప్రధానంగా కవి. అనుభూతి గీతాలు, సుపర్ణ, శిలామురళి, ఏకాంత కోకిల ఆయన కవితా సంపుటాలు. లలిత గీతాలు, యక్షగానాలు రాశారు. తూర్పున వాలిన సూర్యుడు, ఉపాసన, క్షణికం ఆయన నవలలు. కథలు, నాటకాలు, నాటికలు, సాహిత్య వ్యాసాలు, ఇట్లా అన్ని ప్రక్రియల్లోనూ కృషి చేశారు. ఆధునిక, ప్రాచీన సాహిత్యాల వారధి. పాత కావ్యాలకు నవలారూపం ఇచ్చారు. సినీ కవిగానూ పరిచితులే. పాత్రికేయుడిగానూ, ఆకాశవాణిలోనూ పనిచేశారు. ఆయన సాహిత్య సర్వస్వం 2014లో వెలువడింది. గతేడాది ‘ఇంటిపేరు ఇంద్రగంటి’ పేరుతో ఆత్మకథ వెలువరించారు. ఇంద్రగంటి వారిది సాహిత్య కుటుంబం. శ్రీకాంతశర్మ తండ్రి హనుమచ్ఛాస్త్రి, భార్య జానకీబాల ఇరువురూ రచయితలే. కొడుకు మోహనకృష్ణ సినిమా దర్శకుడు. కూతురు కిరణ్మయి డాక్యుమెంటరీ మేకర్. పై కథ ‘పాపం, పుణ్యం, ప్రపంచ మార్గం’కు సంక్షిప్త రూపం. దీని ప్రచురణ 1967. మనుషులు కదులుతూ– మనుషుల ఆవేదనలూ, ఆనందాలూ, అశ్రువులూ, కడుపున భరిస్తూ, గబగబా మలుపులు తిరిగిపోయే రైలుబండి, మానవ ప్రకృతి అనే పెద్ద ‘గ్రంథం’ తాలూకు సంక్షిప్త సంకలనంలాగ కనిపిస్తుంది. సమాజంలో ఉన్న అంతస్తులూ, ఎడం ఎడంగా బతికే ఆ లక్షణం– పేలవమైన ఆలోచనా తత్వం, ఆ ప్రయాణంలో ఎంత స్పష్టంగా కనిపిస్తాయని! రాజమండ్రి స్టేషన్లో, హౌరా నుండి మద్రాసు పోయే ఎక్స్‌ప్రెస్ ఆగింది. హరగోపాల్ భీమవరం దాకా కలిసివస్తా– స్టేషన్లో చూడమని ఉత్తరం రాశాడు. కంపార్ట్మెంట్లోంచి బయటకు తొంగి చూశాను. కనిపించలేదు. లోపల ఊపిరి ఆడటం లేదు. అసలే థర్డ్ క్లాస్. అందులో వేసవి కాలం. రైలు గంట కొట్టారు. ఇంతలో గబగబా ఓ తెలుగురాని– ముతక ఖద్దరు చొక్కా, పిలకా, మీసాలు ఉన్న మనిషి(అంత క్రితం బండిలోంచి దిగినవాడే) లోపలికి జొరబడి, తువాలు గుడ్డతో మొహం తుడుచుకొంటున్నాడు. జామకాయలేవో తినివస్తున్నాడు లాగుంది. మీసాల మీద గింజలు అంటుకున్నాయి. అంత క్రితం తను భద్రపరచుకొన్న సీట్లో కూర్చున్నాడు. ఊపిరాడని ప్రపంచ జనాభా ఆందోళన అంతా మా కంపార్ట్మెంట్లో అవతరించిందేమో అనిపించింది. నేనూ చొరవ చేసి ఒక పైబెర్త్ సంపాదించాను. రెండ్రోజులుగా హరగోపాల్ వాళ్ల నాటకం రిహార్సల్స్‌కి వెళ్లడంతో నిద్ర చెడింది. గుబులు, చిరాకు వ్యక్తమయ్యే థర్డ్ క్లాస్ ప్రయాణం మధ్యతరగతి జీవితం లాగుంది. గోదావరి, కొవ్వూరు, నిడదవోలు... నిద్ర తోసుకొచ్చింది కళ్ల మీదికి. హరగోపాల్ నిడదవోలులో గాని కనిపిస్తాడేమోనని, బలవంతాన కళ్లు తెరిచి ప్రయత్నించాను దిగుదామని. పై నుంచి ఒక కాలు కిందికి పెట్టానో లేదో, అరడజను కంఠాలు ముక్తకంఠంగా విరుచుకు పడ్డాయి. నోరు మూసుకుని ఒరిగాను, న్యూస్ పేపరుతో విసురుకుంటూ. ఎప్పుడు పట్టిందో– హరగోపాల్ కేకేసేవరకూ మెలకువే రాలేదు. తమ నాటకంలో వేసే హీరోయిన్ డైలాగ్ డెలివరీ నచ్చక ఇంకొకామెని గుడివాడ నుంచి తీసుకొచ్చే ప్రయత్నంలో హరగోపాల్ భీమవరంలో ఒక మిత్రుని కలియడానికి దిగుతానన్నాడు నాతో ఉత్తరంలో. సర్దుకుని కిందికి దిగాను. ఎవరో ఒకతను. టక్ అప్ చేసుకున్నాడు. ఖరీదైన వేషం. కళ్ల గాగుల్స్ తీసేసి, చేత్తో షోగ్గా ఊపుతూ, చటుక్కున మా కంపార్ట్మెంట్లో జొరబడి, సుతారంగా విసుక్కుంటూ చరచరా వెళ్లిపోయాడు. ‘‘చూడండి ఎంత చలాకీగా ఉన్నాడో అతడు!’’ రైలు కదిలింది. తొందరగా లోపలి కెక్కాను. హరగోపాల్ వెళ్లిపోయాడు. హరగోపాల్‌ని ఇంప్రెస్ చేసినతను, నా బెర్త్ కింద సీట్లో కూర్చుని, పెర్సీ మేసన్ డిటిక్టెవ్ నవల చదువుతున్నాడు. బండి ఊపుకి మళ్లీ కళ్లు మూతలు పడుతున్నాయి. అతని గొంతు వినిపిస్తోంది. డిటెక్టివ్ లిటరేచర్ ఆపోశన పట్టినవాడికి మల్లే లెక్చర్ దంచుతున్నాడు. మనిషి చామనఛాయ. చురుకైన కంఠం. కొంచెం సేపు మాట్లాడి, వెనకవైపు వరసల్లో కూర్చున్న ఎవళ్లనో పలకరిస్తూ, అక్కడికి వెళ్లిపోఊయాడు. చీకటి కమ్ముకుంటోంది. రైలు గుడివాడకీ, బెజవాడకీ మధ్య ఉందన్నారు. ఉండి ఉండి, ఉత్తరాది మనిషి గొల్లుమన్నాడు తన భాషలో. ఏం జరిగిందని అంతా ఆతృతగా అడిగారు. కళ్లనీళ్లు కుక్కుకుంటూ, లాల్చీ జేబు చూపించాడు. మధ్యకి తెగిపోయి ఉంది. అతని చేతిలో మధ్యకి తెగిపోయిన ఏడెనిమిది రెండు రూపాయల నోట్లూ ఒక పది రూపాయల నోటూ ముక్కలున్నాయి. పాతిక రూపాయలు పనికిరాకుండా పోయాయి. అతను ఏ ఒరిస్సా ప్రాంతం వాడిలాగో ఉన్నాడు. సంజ్ఞల్ని బట్టీ కొద్దిగా అర్థం అయింది. కటక్ జిల్లాలో ఏదో పల్లెటూరు. తెనాలి పోవాలట. చుట్టాలు ఎవరికో జబ్బు చేసిందట. టిక్కెట్టుకు పోగా, పాతిక రూపాయలుంచుకున్నాడు జేబులో. బెజవాడ వరకూ మాత్రమే టిక్కెట్టు తీశాడు. అక్కణ్ణించి ఇంకా ఎవర్నో తీసుకుని తెనాలి వెళ్లాలట. తను అటూ ఇటూ దిగడంలో ఎవళ్లో జేబు కొయ్యడంతో– సగం నోటుముక్కలు ఆ కోసినవాడికీ, మిగతా సగం ఇతనికీ దక్కాయి. జాలిగా చూశాడు అందరికేసి. మోసం కాదనిపించింది నాకు. మోసం చేసి సంపాదిద్దామని అనుకున్నా పోయినవి పాతిక రూపాయలు. జాలి వేసింది. ఓ అర్ధరూపాయిచ్చాను. ఇదంతా చూస్తున్న ఒక రైతు జాలిపడి, రైల్వే దొంగతనాల్ని తన పరిభాషలో తిట్టి, తన రొంటిన సంచీ తీసి చూశాడు. చిల్లరేమీ లేదు. ఒక రూపాయి నోటు ఇతని చేతిలో పెట్టాడు. వెనక నుంచి రకరకాల వ్యాఖ్యానాలు బయలుదేరాయి. హరగోపాల్‌ని ‘ఇంప్రెస్’ చేసిన వ్యక్తి తాలూకు ‘డిటెక్టివ్ గొంతు వేసే ప్రశ్నలూ, తెలుగురాని ఇతని తబ్బిబ్బూ వినిపించాయి. డిటెక్టివ్ గొంతు ఈ కేసుని ఇట్లా ‘ఎనలైజ్’ చేస్తోంది. ‘‘పది రూపాయల నోటు సంగతి చూడండి, నోటుని మధ్యకు మడిచి, మళ్లీ మధ్యకు మడిచాడు కదా. మడిచిన గుర్తు ఇదిగో, నోటు కూడా మరీ కొత్తది కాదు. రెండు రూపాయల నోట్లు కూడా రెండు మూడు దొంతర్లుగా పెట్టినట్టున్నాడు. మరి పదిరూపాయల నోటు అదే నాలుగు మడతల మీద కట్టినవై ఉండాలి. అప్పుడు నోటుకి ఈ పక్కా ఆ పక్కా చెరో అంగుళం ముక్కా ఇంచుమించు మడత స్వభావాన్ని బట్టి తెగిపోయి ఉండాలి. అయితే మిగిలేది మధ్యముక్క, అలాలేదే. రెండు రూపాయల నోటు మధ్యకి కట్ అయిపోయిన మాట నిజమే. మరి పదిరూపాయల నోటు కూడా మధ్య ఎలా తెగింది కొలిచినట్టుగా. ఇతను నోట్లు జేబులో పెట్టుకున్న పద్ధతి చూస్తే పది రూపాయల నోటు మధ్యకి మడిచి, దాన్ని మళ్లీ మధ్యకి మడిచి, మధ్యలో రెండు రూపాయల నోట్లు మడత పెట్టి ఉండాలి. ఇదంతా, ఇలా ఉండనివ్వండి– అయితే, ఎలా ఎందుకు చేశాడు! మోసగించి డబ్బు సంపాదించాలనుకునే వాడు పాతిక రూపాయలు చేతులారా నాశనం చేసుకుంటాడా? అని సందేహం కలగవచ్చు. దీన్ని ‘సాల్వ్’ చేయటం సింపుల్. ఈమధ్య ‘ఫేక్’ నోట్లు వస్తున్నాయి కదా– ఎలాగా మారవని ఎవరో చెప్పివుంటారు. వీటిని తెగ్గోసుకుని, డబ్బు చేసుకుందామన్న ఆలోచన పుట్టి ఉండవచ్చు.’’ అతను జుట్టు పైకి ఎగదోసుకుని, చుట్టూ చూశాడు. అంతా ముగ్ధులైపోయారు. ‘ఫేక్ నోట్స్’ అనగానే నాకూ అనుమానం వచ్చింది. రూపాయి దానం చేసిన రైతు బూడిదలో పన్నీరు పోసిన మొహం పెట్టాడు. హరగోపాల్ కాలిక్యులేషన్ సాధారణంగా దెబ్బ తినదు. హరగోపాల్‌ను ఇతను తన వేషం చేతే ఇంప్రెస్ చేసినా, నేను ఇతని తెలివిని చూస్తున్నాను. అంతా అవహేళన చేసి, తిట్టి, కొట్టినంత పని చేశారు ఆ పల్లెటూరి ఆసామిని. ఆ ఆసామి ఏడుస్తూ ఏదో తన భాషలో ఘోషిస్తున్నాడు. ఎవరి హృదయం కరగలేదు. ఛీ దేశద్రోహం కదూ? ఇలాంటి వాళ్లకి డబ్బిచ్చి పోషించడం? పరోక్షంగా వాళ్లు చేసే వెధవ పనుల్ని ప్రోత్సహించడం కదూ, అనిపించి సిగ్గుపడ్డాను. ‘‘పోలీసులకి అప్పగించండి’’ అన్నారెవరో. ‘‘మరే, అప్పుడుగాని బుద్ధిరాదు.’’ ఈ కేస్ నడిపిన డిటెక్టివ్ చెయ్యి ఆ వ్యక్తిని ఉరిమి చూసి ఫెడీఫెడీ మని లెంపకాయలు కొట్టింది. గొల్లుమన్నాడు అతను. మానవ మనస్తత్వం– అందులోనూ మధ్యతరగతి మనస్తత్వం– అదేం చిత్రమోకాని అంతగా దయనీ చూపించగలదు. అంతగా కక్షనూ సాధించగలదు. అందరి తరఫునా అతను చెయ్యి చేసుకుని, అందరి మనస్సుల్లో ఉన్న కోపానికీ శాంతిని కలిగించాడు. బెజవాడ వస్తోంది. ‘‘దూరదేశప్పీనుగ పోలీసులకు ఒప్పగించడం ఎందుకులెండి’’ అనేసి, పైని ఉన్న బాగ్ తీసుకుని కంపార్ట్మెంట్ గుమ్మం దగ్గరికి వెళ్లి, కుడిజేబులోంచి సిగరెట్ పెట్టితీసి, వెలిగించుకుని, ఖాళీ పెట్టి అవతల పారేశాడు. రాత్రి పది గంటలు దరిదాపవుతోంది. బెజవాడ స్టేషన్ జనంతో హడావుడిగా ఉంది. రైలాగింది. అతను దిగి తన దారిన తను గబగబ వెళ్లిపోయాడు. గుమ్మం దగ్గర అతని రుమాలు పడిపోయింది. బండి దిగుతున్న రైతు అతని పట్ల అత్యంత గౌరవం కలిగిన వాడవటం చేత, ఆ రుమాలు తీసి దులిపి, ‘‘బాబూ’’ అని కేకేసి, అంతలోనే తెల్లబోయి... ‘‘హారి దొంగ నాయనోయ్’’ అని అరిచాడు. ముక్కలైన పది రూపాయల నోటు, రెండు రూపాయల నోట్ల భాగాలు చెదిరిపడ్డాయి. నాకు కళ్లు తిరిగాయి. అయితే, అతను తనని తను కొట్టుకోలేక ఆ మనిషిని ఎందుకు కొట్టినట్టు? హరగోపాల్ వాళ్ల నాటకంలో పాత్రకి ఇతను సజీవమూర్తి. నటించక్కరలేదు– అనిపించింది.(సమాప్తం) పుట్టినప్పుడు సంక్రమించిన పటకుటీరం తనువు– మోసుకు తిరుగుతూ కలలు వండుకు తింటూ నేటి కిక్కడ రేపటి కెక్కడో! ఉత్సవాలు చూస్తూ ఉత్సాహాలు కొనుక్కుంటాం. పచ్చని లోకపు బయళ్లలో పగలంతా కోలాహలంగా గడుపుతూంటాం పరిపరి పరిచయాలతో నిద్దుర సంచుల్లో కలల అరల్ని నింపుకొంటాం. నీలాకాశం కత్తిరించి దుప్పటిగా కప్పుకుంటాం– ఎన్నో కోరికల కథలకి మనమే నాయకులమై కూర్చుంటాం. కొంత కాలానికొక గొంతు బెదిరిస్తుంది అంటుకొంటుందట పటకుటీరం అప్పుడీ సంచులు వెంటరావటకద! పోతే పోనీ– పిడికెడు బూడిదగా లేద్దాం మేఘాల్లో చరిద్దాం. చిటికెడు నీటితడి సోకి పువ్వులమై పుడదాం– మనకేం? ఆకాశాన్ని విసిరి పారేసి పొమ్మన్న చోటికే పోదాం పద. (శ్రీకాంత శర్మ ‘అనుభూతి గీతాలు’ లోంచి; ప్రచురణ– 1976) -
మరోసారి పోలీస్ పాత్రలో!
ఈ జనరేషన్ హీరోలు మల్టీస్టారర్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు. వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న నాని కూడా ఇటీవల ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే సీనియర్ హీరో నాగార్జునతో కలిసి దేవదాస్ సినిమాలో నటించిన నాని, ప్రస్తుతం సుధీర్ బాబుతో కలిసి మరో సినిమా చేస్తున్నాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వి అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చారు సుధీర్ బాబు. ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కిస్తున్న సినిమాలో తాను పోలీస్ పాత్రలో నటిస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే పోలీస్ పాత్రలో కనిపించి సుధీర్ బాబు మరోసారి అదే లుక్‌లో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అదే సమయంలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుల్లెల గోపీచంద్ బయోపిక్‌లోనూ నటిస్తున్నట్టుగా తెలిపారు. Elated to be working with 2 national award winners @mokris_1772 & @PraveenSattaru. #VTheFilm & #PullelaGopichand are exciting scripts with me playing a Police & Sports Legend. Will update again once I confirm the things in discussion. Love ur concern, queries & suggestions 😊😬🤗 — Sudheer Babu (@isudheerbabu) July 19, 2019 -
వ్యూహమా? విక్టరీయా?
నాని, ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ‘అష్టా చమ్మా, జెంటిల్ మన్’ చిత్రాలు ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అలాగే సుధీర్‌బాబు, ఇంద్రగంటి కలయికలో వచ్చిన ‘సమ్మోహనం’ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ ముగ్గురి కాంబినేషన్లో ‘వి’ పేరుతో ఓ సినిమా రూపొందనుంది. ‘వి’ అంటే విక్టరీ అని ఊహించవచ్చు. నాని, సుధీర్‌బాబు హీరోలుగా, అదితీరావు హైదరీ, నివేదా థామస్ హీరోయిన్లుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంలో 36వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. అనిత సమర్పణలో శిరీష్, లక్ష్మణ్, హర్షిత్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు త్రినాథరావు నక్కిన కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు శ్రీరామ్ వేణు క్లాప్ ఇచ్చారు. ‘ఎఫ్2’ డైరెక్టర్ అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. తనికెళ్ల భరణి, వి.కె. నరేష్, రోహిణి, ‘వెన్నెల’ కిశోర్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి పాటలు: ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, కెమెరా: పి.జి.విందా, సంగీతం: అమిత్ త్రివేది. -
వ్యూహం పన్నారా?
‘సమ్మోహనం’ సక్సెస్ తర్వాత దర్శకుడు మోహన్‌కృష్ణ ఇంద్రగంటి థ్రిల్లర్ కథాంశంతో ఓ సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. సుధీర్‌బాబు, నానిలతో ఈ మల్టీస్టారర్ రూపొందనుంది. ఇందులో నాని పాత్ర నెగటివ్ షేడ్స్‌లో ఉంటుందని సమాచారం. నాని సరసన అదితీరావ్ హైదరీ, సుధీర్‌కి జోడీగా నివేదా థామస్ నటించనున్నారట. ఈ సినిమాకు ‘వ్యూహం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని టాక్. ఈ నలుగురిలో ఎవరు వ్యూహం పన్నారో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ వేచి చూడాల్సిందే. ‘సమ్మోహనం’ తర్వాత సుధీర్, అదితీలను, ‘జెంటిల్‌మేన్’ తర్వాత నాని, నివేదా థామస్‌లను ఇంద్రగంటి రిపీట్ చేస్తున్నారు. జులైలో ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మించనున్నారు. -
నాని, ఇంద్రగంటిల ‘వ్యూహం’
నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే జెర్సీ సినిమా షూటింగ్ పూర్తి చేసిన నాని, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమాతో పాటు మరో సినిమాకు కూడా ఓకె చెప్పాడు నాని. తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలోనే తన 25వ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. మల్టీస్టారర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో సుధీర్ బాబు మరో హీరోగా నటించనున్నాడు. నాని జోడిగా అదితిరావ్ హైదరీ నటించనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. డిఫరెంట్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వ్యూహం అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. -
విలన్‌గా మారుతున్న యంగ్ హీరో
నేచురల్ స్టార్ నాని మరో ప్రయోగానికి రెడీ అయ్యాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ సినిమాలో నటిస్తున్న నాని, తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో గ్యాంగ్ లీడర్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ రెండు సినిమా తరువాత చేయబోయే సినిమాను కూడా ఇప్పటికే ప్రకటించాడు నాని. తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు. మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని ప్రతినాయక పాత్రలో నటించనున్నాడట. మరో యంగ్ హీరో సుధీర్ బాబు పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి స్థాయి నెగెటివ్ రోల్ అయినా కథా కథనాలు నచ్చటంతో నాని ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. అదితిరావ్ హైదరీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది, మణిశర్మ, సంతోష్ నారాయణన్లలో ఒకరిని సంగీత దర్శకుడిగా ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారు. -
నానికి జోడిగా అదితి!
నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ సినిమాలో నటిస్తున్న నాని తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో గ్యాంగ్ లీడర్ సినిమాను ఎనౌన్స్ చేశాడు. ఈ రెండు సినిమాల రిలీజ్‌కు ముందే మరో సినిమాను కూడా ఫైనల్ చేశారు నాని. తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మెహనకృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు నాని. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక కూడా జరుగుతోందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో నానికి జోడిగా అదితి రావ్ హైదరిని హీరోయిన్గా తీసుకున్నారట. గత చిత్రం సమ్మెహనంలో హీరోయిన్గా నటించిన అదితిని ఈ సినిమాలో తీసుకునే ఆలోచనలో ఉన్నాడట దర్శకుడు ఇంద్రగంటి. మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో హీరో సుధీర్ బాబు కీలక పాత్రలో నటించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. -
కాంబినేషన్ కుదిరింది
‘అష్టా చమ్మా, జెంటిల్మన్, అమీ తుమీ’ ఇటీవల ‘ సమ్మోహనం’ తదితర చిత్రాల విజయాలతో ఇండస్ట్రీలో తనదైన మార్క్ వేశారు దర్శకులు ఇంద్రగంటి మోహనకృష్ణ. ఆయన దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ మూవీకి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ‘దిల్’ రాజు నిర్మాత. ఈ సినిమాలో ఒక హీరోగా నాని, మరో హీరోగా సుధీర్‌బాబు నటించనున్నారు. ఇంద్రగంటి ఈ హీరోలిద్దరికీ మంచి అనుబంధం ఉంది. ‘అష్టాచమ్మా, జెంటిల్మన్’ వంటి చిత్రాలతో నానీకి, ‘సమ్మోహనం’తో సుధీర్‌బాబుకి ఇంద్రగంటి హిట్స్ ఇచ్చారు. నాని, సుధీర్లకి మల్టీస్టారర్ మూవీస్ చేయడం కొత్త కాదు. నాగార్జునతో కలిసి నాని ‘దేవదాస్’, సుధీర్‌బాబు ‘శమంతకమణి, వీరభోగ వసంతరాయలు’ వంటి మల్టీస్టారర్స్ చేశారు. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ కోసం ఇంద్రగంటి ఓ వెరైటీ కథ రెడీ చేశారట. ఈ సినిమాలో నాని క్యారెక్టర్లో నెగటివ్ షేడ్స్ ఉంటాయట. -
మరో మల్టీస్టారర్‌లో..!
దాదాపు మూడేళ్లుగా ఏడాదికి కనీసం మూడు సినిమాలను థియేటర్లో వేసేలా ప్లాన్ చేస్తున్నారు హీరో నాని. ఇదే స్పీడుని వచ్చే ఏడాది కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఆల్రెడీ ‘జెర్సీ’లో నటిస్తున్నారు. అలాగే విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించారు. ఇప్పుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించనున్న మల్టీస్టారర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ ఏడాది నాగార్జునతో కలిసి నాని ‘దేవదాసు’ అనే మల్టీస్టారర్ చిత్రంలో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. తాజా చిత్రంలో మరో కథానాయకుడిగా సౌత్‌లో కొందరు ప్రముఖ హీరోల పేర్లను పరిశీలిస్తున్నాట టీమ్. ఆ హీరో ఫైనలైజ్ కాగానే అధికారికంగా చిత్రవిశేషాలు ప్రకటించాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. దాదాపు పదేళ్ల క్రితం ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన ‘అష్టా చమ్మా’ చిత్రంతోనే నాని కెరీర్ మొదలైన సంగతి గుర్తుండే ఉంటుంది. నాని కెరీర్లో వన్నాఫ్ ది హిట్స్ ‘జెంటిల్మన్’కి కూడా ఇంద్రగంటినే దర్శకుడని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. గతేడాది నాని హీరోగా నటించిన ‘నేను లోకల్, ఎమ్సీఏ’ చిత్రాలు ‘దిల్’రాజు బ్యానర్లో రూపొందాయి. సో.. విడి విడిగా హిట్స్ ఇచ్చిన ఈ కాంబినేషన్లో ఇప్పుడు జాయింట్‌గా హిట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారని చెప్పొచ్చు. -
స్క్రీన్ ప్లే 10th August 2018
-
ఇంద్రగంటి మల్టిస్టారర్ మూవీ!
‘సమ్మోహనం’ సినిమాతో సమ్మర్ ఎండింగ్లో కూల్‌గా హిట్ కొట్టారు దర్శకులు ఇంద్రగంటి మోహనకృష్ణ. పదునైన మాటలు, హాస్యం, సున్నితమైన భావోద్వేగాలతో సినిమాను ఆకట్టుకునేలా తెరకెక్కించారు ఇంద్రగంటి. తన తదుపరి ప్రాజెక్ట్‌గా ఓ మల్టిస్టారర్ మూవీని తెరకెక్కించనున్నారు. ఇంద్రగంటి మల్టిస్టారర్ మూవీని దిల్ రాజు నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన హీరోలు, హీరోయిన్లు, తదితర వివరాలను త్వరలో ప్రకటించబోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దిల్ రాజు శ్రీనివాస కళ్యాణం, ఎఫ్2, మహేష్ బాబు- వంశీ పైడిపల్లి సినిమాలను నిర్మిస్తున్నారు. -
మేకప్ వెనక మనసు ఉంటుంది
‘‘ఒకరోజు ఇంద్రగంటిగారు ఫోన్ చేసి ‘సమ్మోహనం’ సినిమా గురించి చెప్పారు. పెద్దలు కథ చెబుతుంటే చిన్న పిల్లలు ఆసక్తిగా వింటారు కదా. అంత క్రమశిక్షణతో నేను కథ విన్నాను. చాలా నచ్చింది. నా వద్ద డేట్స్ లేకున్నా అడ్జెస్ట్ చేసి, ఈ సినిమా చేశా’’ అని అదితీరావు హైదరీ అన్నారు. సుధీర్‌బాబు, అదితీరావు హైదరీ జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సమ్మోహనం’. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా అదితీ చెప్పిన విశేషాలు. ► మణిరత్నం ‘కాట్రు వెలియిడై’ (చెలియా) సినిమా ద్వారా దక్షిణాదికి పరిచయమయ్యాను. తెలుగులో ‘సమ్మోహనం’ నా తొలి చిత్రం. కథ నచ్చితేనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నా. దక్షిణాదిలో మణిరత్నంగారితో సినిమా చేయాలన్నది నా కల. ‘కాట్రు వెలియిడై’తో అది నెరవేరింది. ఇప్పుడు ఆయనతో రెండో సినిమా కూడా చేస్తున్నాను. తెలుగులో శేఖర్ కమ్ముల, తమిళంలో మిస్కిన్, గౌతమ్‌మీనన్ వంటి దర్శకులతో పనిచేయాలనుకుంటున్నా. ► వాళ్లవి కాని ఎమోషన్స్‌ని మనసులోకి తెచ్చుకుని ప్రేక్షకులను రంజింపజేయడానికి హీరోయిన్లు కృషి చేస్తారు. దాన్ని అభినందించాలి. అంతేగానీ హీరోయిన్లంటే కేవలం రక్తం, మాంసం ముద్దగా చూడకూడదు. మేం స్క్రీన్ మీద మేకప్‌తో కనిపిస్తాం. దాని వెనక ఉన్న మనసును చూడాలి. అందరూ మనలాంటి అమ్మాయిలే అనుకోవాలి. నేనైతే స్త్రీ, పురుషులు సమానమే అనుకుంటా. మావాళ్లు అలాగే పెంచారు. ► ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్నానని చెప్పడం కాదు. నన్ను ఎప్పుడు ఎవరు అడిగినా నేను హైదరాబాదీనే అని చెప్పుకుంటా. అలా చెప్పుకోవడానికి గర్వపడతాను. ఇంట్లో ఉర్దూ, తెలుగు మాట్లాడమని మా తాత చెప్పేవారు. కానీ నేను వినలేదు. ‘సమ్మోహనం’ కోసం తెలుగు నేర్చుకుని డబ్బింగ్ చెబుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. ► ‘సమ్మోహనం’ షూటింగ్లో అందరూ బాగా చూసుకోవడంతో అలసిపోయినట్టు అనిపించలేదు. ఈ సినిమా చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. ఈ చిత్రంలో లవ్‌స్టోరీ స్పెషాలిటీ తెరమీదే చూడాలి. ‘చెలియా’ సినిమా తెలుగులో సరిగ్గా ఆడలేదేమో కానీ, తమిళంలో బాగా ఆడింది. నేను అంత త్వరగా నెగటివ్ విషయాల గురించి ఆలోచించను. ► సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్‌తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో ఆస్ట్రోనాట్‌గా చేస్తున్నాను. ఉదయాన్నే రోప్ వర్క్స్ నేర్చుకుంటున్నా. రాత్రి మణిరత్నం సినిమా షూటింగ్లో పాల్గొంటున్నా. నేను బాగా కష్టపడతాను. ఎదుటివారిని గౌరవిస్తాను. నన్ను గౌరవించాలనుకుంటాను. మనకి ఎవరో వచ్చి గౌరవాలు ఇవ్వరు. ముందు మనల్ని మనం గౌరవించుకుంటే, ఎదుటివాళ్లు కూడా గౌరవిస్తారని నమ్ముతా. -
‘అందుకే చైతూ సినిమా పక్కన పెట్టేశాం’
అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్ లాంటి విభిన్న చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ. ఇటీవల జెంటిల్మన్ సినిమాతో తన కెరీర్లోనూ బిగెస్ట్ కమర్షియల్ సక్సెస్‌ను అందుకున్నారు. తరువాత అమీతుమీ సినిమాతో మరో మంచి విజయం అందుకున్న మోహనకృష్ణ ప్రస్తుతం సుధీర్ బాబు హీరోగా సమ్మోహనం చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమాకన్నా ముందే నాగచైతన్య హీరోగా ఓ సినిమా తెరకెక్కించాల్సి ఉన్నా ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. జెంటిల్మన్ సక్సెస్ తరువాత మోహనకృష్ణ దర్శకత్వంలో నటించేందుకు స్టార్ హీరోలు కూడా ఆసక్తి కనబరిచారు. సాయి కొర్రపాటి నిర్మాతగా నాగచైతన్య హీరోగా ఓ సినిమాను ప్రకటించారు. అయితే పూర్తి యాక్షన్ కథాంశంగా కావటంతో అప్పటికే నాగచైతన్య యాక్షన్ జానర్లో సవ్యసాచి సినిమాకు ఓకె చెప్పటంతో మోహనకృష్ణ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేశారట. ఈ విషయాన్ని సమ్మోహనం ప్రమోషన్ కార్యక్రమాల్లో దర్శకుడు వెల్లడించారు. త్వరలోనే మరో మంచి కథతో నాగచైతన్య హీరోగా సినిమా చేస్తానని చెప్పారు ఇంద్రగంటి మోహనకృష్ణ. సుధీర్ బాబు, అదితిరావు హైదరీ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సమ్మోహనం ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
వెళ్లగానే రెడ్ కార్పెట్ వేస్తారనుకోను
‘‘నేను హీరోని దృష్టిలో పెట్టుకుని కథ తయారు చేయను. కథ పూర్తయ్యాక హీరోగా ఎవరు సరిపోతారా అని ఆలోచిస్తాను’’ అని దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి అన్నారు. సుధీర్‌బాబు, అదితీరావు హైదరీ జంటగా ఆయన దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ‘సమ్మోహనం’ ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇంద్రగంటి పంచుకున్న విశేషాలు... ► స్టార్ హీరోలకు కథలు చెబుతున్నా. వారి మైండ్‌సెట్ తెలుసుకోకుండా రిజెక్ట్ చేస్తున్నారనుకోవడంలో అర్థం లేదు. వాళ్లను కలవగానే నాకు రెడ్ కార్పెట్ వేస్తారనుకోను. స్టార్స్‌తో సినిమా చేస్తే ఆ మజా వేరు. ఎక్కువమందికి రీచ్ అవుతుంది. ► ఈ చిత్రంలో నరేశ్గారిది సుధీర్ తండ్రి పాత్ర. సినిమా గొప్ప కళ అనే భావనలో ఉంటాడు నరేశ్. చిన్న పిల్లల ఇల్లస్ట్రేటర్ పాత్ర సుధీర్‌ది. తనకు సినిమా వాళ్లంటే పెద్దగా ఇష్టం ఉండదు. వీరి మధ్య జరిగే సంఘర్షణలో అమ్మాయి పాత్ర ఎలా ఎంటర్ అయ్యిందన్నదే కథ. నరేశ్‌గారి పాత్రకు తొలుత రావు రమేశ్, తనికెళ్ల భరణిగార్లను అనుకున్నా. సుధీర్ పాత్రకు ముందు విజయ్ దేవరకొండ, నానీని అనుకున్నా. ► సినిమా గురించి తృణీకార భావనతో (గడ్డిపోచలాగా తీసిపడేయడం) మాట్లాడేవారు చాలామంది ఉన్నారు. ఇందులో సినిమా రంగం గురించి చెడుగా చూపించలేదు. ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది గొప్పవారు ఉన్నారు. ఈ చిత్రం చూశాక ఇండస్ట్రీలో మంచి వారున్నారనే ఆలోచన రావాలి. ► ఈ చిత్రంలో హీరో, హీరోయిన్ కలుసుకునే బ్యాక్‌డ్రాప్ కొత్తగా ఉంటుంది. అనుహ్యమైన పరిస్థితుల్లో వారు ఎలా ప్రేమించుకున్నారు? ఎలా విడిపోయారు? మళ్లీ ఎలా కలుసుకున్నారనే దాన్ని ఎంటర్టైనింగ్ వేలో చక్కగా చెప్పాం. ► రామ్‌చరణ్‌లాంటి హీరో ‘రంగస్థలం’లో చెవిటివాడి పాత్రలో మెప్పించడం గొప్ప విషయం. ‘మహానటి’లో స్టార్ హీరోలు లేకున్నా గొప్ప విజయం అందుకుంది. ప్రేక్షకులు కొత్తదనం కోసం ఎదురు చూస్తున్నారు. వారిని చేరుకోవడానికి మనమే ఆలస్యం చేస్తున్నాం. ► ఆడవాళ్లను చులకనగా చూపించకూడదు. హీరోయిజమ్‌ను ఎలివేట్ చేయాలని హీరోయిన్ని దద్దమ్మను చేయనక్కర్లేదు. ‘రంగస్థలం’లో సమంత, ‘మహానటి’లో కీర్తీసురేశ్ పాత్రలు ఎంత బావుంటాయి. మనం సినిమా సరిగ్గా తీయకుంటే అర్థం కాదు. ► వరుసగా ‘జెంటిల్మెన్, అమీతుమీ, సమ్మోహనం’ చిత్రాలు చేశా. కాస్త రెస్ట్ తీసుకుని తదుపరి సినిమాలు చేయాలనుకుంటున్నా. నెక్ట్స్ సినిమా కథ తయారు చేసుకోవాలంటే నాకు కనీసం ఏడాది పడుతుంది. -
సమ్మోహనం సెన్సార్ పూర్తి
ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాలంటే ఫ్యామిలీ అంతా హాయిగా కూర్చొని చూడొచ్చు. సుదీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం సమ్మోహనం. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ అన్నింటికి పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. సినిమాలోని మాటలు, పాటలు, లొకేషన్లు, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, వినోదం ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. జూన్ 15న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ఇటీవలె సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యుల కత్తెరకు ఎలాంటి పని చెప్పకుండా.. ఈ సినిమా క్లీన్ యూ సర్టిఫికెట్‌ను పొందింది. జూన్ 10న జరుగుబోతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సూపర్‌స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సుధీర్‌బాబుకు జోడీగా అదితి రావు హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు వివేక్‌సాగర్ సంగీతాన్ని అందించారు. It's clean U for #Sammohanam #SammohanamOnJune15th https://t.co/fBG7BSsMqX — Sudheer Babu (@isudheerbabu) June 7, 2018 -
నాన్‌వెజ్ మీల్స్ మాతోనే మొదలైంది
మావయ్యా... మీరు యాక్ట్ చేసిన సినిమాల్లో మీకేది ఇష్టం?... అల్లుడు సుధీర్‌బాబు మామగారు కృష్ణ ముందుంచిన ప్రశ్న ఇది. ఇంతకీ అల్లుడు ఎందుకు జర్నలిస్ట్‌గా మారారు? అంటే.. ఆయన నటించిన ‘సమ్మోహనం’ చిత్రం ట్రైలర్‌ను కృష్ణ విడుదల చేశారు. గురువారం సూపర్ స్టార్ కృష్ణ బర్త్‌డే. ఈ సందర్భంగా ‘సమ్మోహనం’ ట్రైలర్‌ను దర్శక– నిర్మాతలు మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్‌లు కృష్ణతో రిలీజ్ చేయించి, కొన్ని ప్రశ్నలడిగారు. ఆ చిన్న చిట్ చాట్ ఈ విధంగా.... ఇంద్రగంటి: ‘సమ్మోహనం’ అనగానే మీకు ఏవైనా జ్ఞాపకాలు గుర్తొచ్చాయా? కృష్ణ: ‘సమ్మోహనం’ టైటిల్ ఇప్పటివరకూ ఎవరూ పెట్టలేదు. అచ్చ తెలుగు టైటిల్స్ బాగుంటాయి. మేం తీసిన సినిమాలన్నిటికీ తెలుగు టైటిల్స్ పెట్టామే కానీ, వేరే భాషవి పెట్టలేదు. ‘మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, అల్లూరి సీతారామరాజు, పాడిపంటలు, ప్రజారాజ్యం, ఈనాడు... ఇలా అన్నీ తెలుగు మాటలతోనే పెట్టాం. సుధీర్: మీరు చేసిన సినిమాల్లో మీకు నచ్చిన లవ్ స్టోరీ? కృష్ణ: ‘పండంటి కాపురం’లో రొమాంటిక్ అంశాలు చాలా ఉంటాయి. ప్రజలకు బాగా నచ్చింది. విడుదల చేసిన 37 సెంటర్లలోనూ వంద రోజులాడింది. 14 సెంటర్లలో 25 వారాలు ఆడింది. సుధీర్: మహేశ్ పుట్టినరోజుని చిన్నప్పుడు ఎలా చేసేవారు? కృష్ణ: మద్రాసులో చాలా బాగా చేసేవాళ్లం. ఇప్పుడు స్టార్ అయిన తర్వాత పుట్టినరోజు చేసుకోవడం మానేశాడు. అభిమానులు చేస్తున్నారు. శివలెంక: మీ సంస్థ ఎంతోమందికి భోజనం పెట్టింది.. అప్పట్లో పద్మాలయాలో భోజనం చేయని వాళ్లు ఉండేవారు కాదు. కృష్ణ: మేం ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు మద్రాసులో లంచ్ అంటే సాంబార్ సాదమ్, తయిర్ సాదమ్ (పెరుగు అన్నం) అని పెట్టేవారు. కానీ, మా కంపెనీ పెట్టినప్పుడు ‘అగ్నిపరీక్ష’ నుంచే నాన్ వెజిటేరియన్‌తో ఫుల్లుగా భోజనం పెట్టడం అలవాటు చేశాం. ఆ తర్వాత మిగిలినవాళ్లు కూడా పెట్టారు. సుధీర్: ఇటీవల ‘మహానటి’ వచ్చింది కదా.. మీ బయోపిక్ వస్తే హీరో ఎవరో తెలుసు. ఎవరు దర్శకత్వం చేస్తే బావుంటుంది? కృష్ణ: పరిశ్రమలో ఎప్పటికప్పుడు కొత్త రక్తం వస్తూనే ఉంది. ఎప్పుడో తీయబోయే సినిమాకు ఇప్పుడే ఎలా చెప్పగలం.. -
సమ్మోహనం ట్రైలర్ రిలీజ్
-
‘మన రేటింగ్ కోసం పొర్లుదండాలు పెట్టాలిరా..!’
సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సమ్మోహనం. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా టీజర్‌ను లాంచ్ చేయించారు. చిరును ఇంటర్వ్యూ చేసి మెగా అభిమానులను అట్రాక్ట్ చేశాడు సుధీర్‌బాబు. సమ్మోహనం టీజర్‌ను చాలా కొత్తగా, గ్రాండ్ లొకేషన్స్‌లో చూపించేసరికి ప్రేక్షకుల్లో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. నేడు (గురువారం) సూపర్‌స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సమ్మోహనం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. కామెడీ, ప్రేమ, ఎమోషన్స్‌తో కూడుకున్న ఈ ట్రైలర్లో సుధీర్‌బాబు, హీరోయిన్ అదితీ రావు అందంగా కనిపించారు. ట్రైలర్లోనే సినిమా కథేంటో రివీల్ చేసినట్టుగా కనిపిస్తోంది. వివేక్ సాగర్ సంగీతమందించగా.. ఇంద్రగంటి మోషనకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా జూన్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. -
తెలుగు పలుకులు
అదితీరావు హైదరీ.. పేరుకు బాలీవుడ్ కథానాయిక అయినా తెలుగు మూలాలున్న అమ్మాయే. మలయాళం, తమిళ్, హిందీ భాషల్లో నటించిన ఈ బ్యూటీ తాజాగా తెలుగులో తొలిసారి ‘సమ్మోహనం’ చిత్రంలో నటిస్తున్నారు. తొలి సినిమాకే తెలుగు నేర్చుకుని తన పాత్రకు అదితీ డబ్బింగ్ చెబుతుండటం విశేషం. సుధీర్‌బాబు, అదితీరావు జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తోన్న ‘సమ్మోహనం’ జూన్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ –‘‘ఇంద్రగంటి ఎప్పుడూ దాదాపుగా తెలుగమ్మాయిలనే హీరోయిన్లుగా ఎంపిక చేసుకుంటారు. అదితీరావు హైదరి తెలుగు మూలాలున్న అమ్మాయి. మా సినిమా కోసం తెలుగు నేర్చుకుని, సొంతంగా డబ్బింగ్ చెబుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. ‘‘కొత్త ఎత్తుగడ, కొత్త పోకడ ఉన్న నవతరం కథ ‘సమ్మోహనం’. రొమాన్స్, హాస్యం సమ్మిళితమై ఉంటాయి. మంచి కథ, కథనానికి చక్కటి నిర్మాణ విలువలు తోడయ్యాయి. టైటిల్‌కి తగ్గట్టుగానే సినిమా మొత్తం అందమైన ఫీల్ క్యారీ చేశాం’’ అన్నారు ఇంద్రగంటి మోహనకృష్ణ. ఈ చిత్రానికి కెమెరా: పి.జి.విందా, సంగీతం: వివేక్ సాగర్. -
సుధీర్ బాబుకు ‘చిరు’ సహాయం
-
‘చిరు’ సమ్మోహనం
చిన్న సినిమా, పెద్ద సినిమా అంటూ తేడా లేకుండా పిలిస్తే పలుకుతా అన్నట్లు... ఎవరు పిలిచినా వచ్చి తన సపోర్టును ఇస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మధ్య చాలా సినిమా ఫంక్షన్లకు హాజరైన చిరు తాజాగా సుధీర్ బాబు నటిస్తున్న ‘సమ్మోహనం’ సినిమా టీజర్‌ను చిరంజీవి రేపు ( మే 1) విడుదల చేయనున్నారు. ఇలా తన వంతు సహాయాన్ని చిరు చేస్తున్నారు. ఆయన కూడా ఇలాంటి వాటికి రావడానికి శ్రద్ధ చూపిస్తున్నట్లు సమాచారం. తను హీరోగా ఎదుగుతున్న సమయంలో ఒక పెద్ద హీరోను తన సినిమా ఫంక్షన్‌కు పిలిస్తే రాలేదని...అప్పుడు చాలా బాధపడ్డానని... ఆ బాధేంటో తనకు తెలుసునని, ఒక పెద్ద హీరో ఇలా వచ్చి ప్రమోట్ చేస్తే ఆ సినిమాకు బూస్ట్‌ను ఇచ్చినట్టు అవుతుందని ఇటీవలే హాజరైన ఓ ఆడియో ఫంక్షన్లో చిరంజీవి చెప్పారు. సమ్మోహనం సినిమా టీజర్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ కానుంది. సరైన హిట్ లేక సతమతమవుతున్నసుధీర్ బాబు ఈ సినిమాతో ఎలాగైన విజయం సాధించాలనుకుంటున్నాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించగా..శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందించాడు. సుధీర్‌బాబుకు జంటగా అదితి రావు నటిస్తోంది. -
సుధీర్, ఇంద్రగంటిల ‘సమ్మోహనం’
సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న సుధీర్‌బాబు, సక్సెస్ జోరు మీదున్న ఇంద్రగంటి మోహన్‌కృష్ణ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతోంది. హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రయూనిట్ త్వరలో మరో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించనున్నారు. సోలో హీరోగా మల్టీ స్టారర్ సినిమాలతో టాలీవుడ్ బిజీగా ఉన్న సుధీర్ బాబు.. బాలీవుడ్లో ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. హిందీలో ‘బాగీ’(తెలుగులో వర్షం సినిమా) సినిమాలో విలన్‌గా నటించి మెప్పించాడు. జెంటిల్ మన్ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రం తరువాత గ్యాప్ తీసుకున్న ఇంద్రగంటి తరువాత సుధీర్ తో సినిమాను ప్రారంభించారు. మరోసారి ఒక అందమైన ప్రేమకథను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ ఇద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాకు ‘సమ్మోహనం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో సుధీర్ పక్కింట అబ్బాయిలా, సరదాగా ఉండే పాత్రలో నటిస్తున్నారు. మణిరత్నం, కార్తీ కాంబినేషన్ లో రూపొందిన చెలియా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయిన అదితిరావ్ హైదరీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. -
కొత్త తరం ప్రేమ
సుధీర్‌బాబు హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నటుడు, రచయిత తనికెళ్ల భరణి క్లాప్ ఇచ్చారు. నటుడు అవసరాల శ్రీనివాస్ గౌరవ దర్శకత్వం వహించారు. మణిరత్నం ‘చెలియా’ ఫేమ్ అదితిరావు హైదరీ ఇందులో సుధీర్‌బాబుకి జోడీగా నటిస్తున్నారు. శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఈ నెల 23 వరకు ఫస్ట్ షెడ్యూల్ జరుగుతుంది. జనవరి 2 నుంచి 10 వరకు, 20 నుంచి ఫిబ్రవరి 8 వరకు హైదరాబాద్‌లోనే షూటింగ్ చేస్తాం. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్, ముంబైలో షూటింగ్ జరపనున్నాం. మేలో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. కొత్త తరం ప్రేమకథతో తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు మోహనకృష్ణ ఇంద్రగంటి. నరేశ్, తనికెళ్ల భరణి, నందు, రాహుల్ రామకృష్ణ, హరితేజ, పవిత్ర లోకేష్, హర్షిణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పి.జి.విందా, సంగీతం: వివేక్ సాగర్, కో డైరెక్టర్: కోట సురేశ్ కుమార్. -
కొత్త తరం ప్రేమకథ
‘జెంటిల్మెన్’ వంటి హిట్ మూవీతో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ల కాంబినేషన్ మొదలైంది. శ్రీదేవి మూవీస్ పతాకంపై మళ్లీ ఇంద్రగంటితో శివలెంక ఓ సినిమా మొదలుపెట్టారు. సుధీర్‌బాబు హీరోగా నటించనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు గురువారం హైదరాబాద్‌లో జరిగాయి. మణిరత్నం ‘చెలియా’ సినిమాలో నాయికగా నటించిన బాలీవుడ్ భామ అదితీరావు హైదరీ ఇందులో కథానాయిక. శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ– ‘‘స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది. సుధీర్‌బాబుకి పర్ఫెక్ట్ సినిమా అవుతుంది. డిసెంబర్ 11 నుంచి షూటింగ్ మొదలుపెడతాం. మార్చితో చిత్రీకరణ పూర్తవుతుంది. మేలో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘అనూహ్యమైన కథాంశంతో ఆద్యంతం వినోదాత్మకంగా నడిచే ఒక కొత్త తరం ప్రేమకథా చిత్రమిది’’ అన్నారు ఇంద్రగంటి. నరేశ్, తనికెళ్ల భరణి, రోహిణి, నందు, కేదార్ శంకర్, కాదంబరి కిరణ్, హరితేజ, రాహుల్ రామకృష్ణ, శిశిర్‌శర్మ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు కెమెరా: పీజీ విందా, సంగీతం: వివేక్ సాగర్, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేశ్. -
పాంచ్ పటాకా
ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా ఐదు సినిమాలు... కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రకటించి, అందర్నీ సర్ప్రైజ్ చేశారు సుధీర్‌బాబు. అందులో రెండు సినిమాల ద్వారా కొత్త దర్శకుల్ని పరిచయం చేస్తున్నారు. ఐదు సినిమాల్లో ఓ సోషల్ థ్రిల్లర్‌తో ఇంద్రసేన దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఫాదర్ సెంటిమెంట్‌తో కూడిన ఓ ప్రేమకథతో సుధీర్ మరో సినిమా చేయనున్నారు. రాజశేఖర్ దర్శకుడిగా పరిచయం కానున్న ఈ సినిమాను సుధీర్ స్వయంగా నిర్మించనున్నారు. అలాగే, ‘శ్రీదేవి మూవీస్’ సంస్థలో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు తెలిపారు. మరో సినిమా వివరాలను నిర్మాణ సంస్థ వెల్లడిస్తుందన్నారు. అది ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటించనున్న పుల్లెల గోపీచంద్ బయోపిక్ అయ్యుంటుందని ఊహిస్తున్నారంతా. నటుడు–రచయిత హర్షవర్థన్ దర్శకత్వంలో అమెరికా నేపథ్యంలో లవ్ థ్రిల్లర్‌గా ఓ సినిమా చేయనున్నారు. ఇది బైలింగ్వల్ అట! మొత్తం మీద కార్తీక పౌర్ణమి రోజున పాంచ్ పటాకా పేల్చారు సుధీర్‌బాబు. ఈ ఐదు సినిమాల్లో రెండు పూర్తి కావచ్చాయని సుధీర్ తెలిపారు. డిసెంబర్లో స్టార్ట్ ‘జెంటిల్మెన్, అమీతుమీ’ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్‌బాబు హీరోగా రూపొందనున్న చిత్రం షూటింగ్ డిసెంబర్లో స్టార్ట్ కానుంది. అదితీ రావ్ హైదరీ కథానాయిక. ఇంద్రగంటితో ‘జెంటిల్మెన్’ వంటి హిట్ తీసిన శ్రీదేవి మూవీస్ ప్రొడక్షన్స్ శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రం నిర్మించనున్నారు. ‘‘ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వినోదాత్మకంగా నడిచే కొత్త తరం ప్రేమకథా చిత్రమిది అన్నారు’’ ఇంద్రగంటి మోహనకృష్ణ. ‘‘డిసెంబర్లో షూటింగ్ స్టార్ట్ చేసి, వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. త్వరలో ఇతర వివరాలను వెల్లడిస్తాం’’ అన్నారు నిర్మాత. -
'అమీ తుమీ' మూవీ రివ్యూ
టైటిల్ : అమీ తుమీ జానర్ : కామెడీ ఎంటర్టైనర్ తారాగణం : అడవిశేష్, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్, ఈషా, అదితి మైకల్, తనికెళ్ల భరణి సంగీతం : మణిశర్మ దర్శకత్వం : మోహనకృష్ణ ఇంద్రగంటి నిర్మాత : కె.సి. నరసింహారావు జంధ్యాల తరువాత తెలుగు వెండితెరపై అలాంటి ఆరోగ్యకరమైన కామెడీ పండిస్తున్న అతి కొద్ది మంది దర్శకుల్లో మోహనకృష్ణ ఇంద్రగంటి ఒకరు. మధ్యలో జెంటిల్‌మేన్ లాంటి సీరియస్ సినిమా చేసినా మరోసారి తన మార్క్ హెల్దీ కామెడీతో ఆడియన్స్‌కు కితకితలు పెట్టేందుకు అమీ తుమీతో రెడీ అయ్యారు. అడవి శేష్, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్‌లు కీలక పాత్రల్లో నటించిన అమీ తుమీ మోహనకృష్ణ గత చిత్రాల మాదిరిగా ఆకట్టుకుందా..? సీరియస్ స్టైలిష్ రోల్స్ చేసే అడవి శేష్ కామెడీ పండించాడా..? కామెడీ చేసే వెన్నెల కిశోర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రకు ఎంత వరకు సూట్ అయ్యాడు..? అవసరాల శ్రీనివాస్ మరోసారి తన టైమింగ్‌తో ఆకట్టుకున్నాడా..? కథ : అమీ తుమీ మూడు జంటల ప్రేమకథ. సినిమా మొదలవ్వటానికి ముందే ప్రేమలో ఉన్న అనంత్(అడవి శేష్), దీపిక(ఈషా)ల పెళ్లికి దీపిక తండ్రి జనార్థన్(తనికెళ్ల భరణి) ఒప్పుకోడు, తాను చూసిన శ్రీ చిలిపి( వెన్నెల కిశోర్)నే పెళ్లి చేసుకోవాలని చెప్పి దీపికను గదిలో బంధిస్తాడు. అంతేకాదు తనకు వ్యాపారంలో నమ్మకద్రోహం చేసిన గంగాధర్ కూతురు మాయ(అదితి మైకల్)ను తన కొడుకు విజయ్(అవసరాల శ్రీనివాస్) ప్రేమిస్తున్నాడని తెలిసి కొడుకుని ఇంట్లో నుంచి బయటకు పంపేస్తాడు. గదిలో ఉన్న దీపిక, పనిమనిషి కుమారి(శ్యామల) సాయంతో తప్పించుకొని పారిపోతుంది. అదే సమయంలో గంగాధర్ కూతురు.. మాయ కూడా ఆస్తి కోసం సవతి తల్లి పెట్టే బాధలు భరించలేక ఇల్లు వదిలి బయటకు వచ్చేస్తుంది. తరువాత వీరిద్దరు తమ ప్రేమను ఎలా గెలిపించుకున్నారు..? దీపిక ను చేసుకోవడానికి వచ్చిన పెళ్లి కొడుకు శ్రీ చిలిపి ఏమయ్యాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : హీరోలుగా అడవి శేష్, అవసరాల శ్రీనివాస్ కనిపించినా.. సినిమా అంతా వెన్నెల కిశోర్ షోలా నడిచింది. తన బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్‌తో ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించాడు కిశోర్. తాను సీరియస్ గా ఉంటూనే కామెడీ చేసి బ్రహ్మానందం లాంటి సీనియర్లను గుర్తు చేశాడు. సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ తనికెళ్ల భరణి, తన మార్క్ తెలంగాణ యాసలో కితకితలు పెట్టాడు. కూతురి ప్రేమను కాదని తన స్వార్థం కోసం తనకు నచ్చిన వాడికే ఇచ్చి పెళ్లి చేయాలనే క్రూరమైన తండ్రి పాత్రలో కూడా మంచి కామెడీ పండించాడు. అడవి శేష్, వెన్నెల కిశోర్, ఈషా, అదితి మైకేల్, కేదార్ శంకర్లు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మరోసారి తనదైన హాస్య కథతో అలరించాడు. హాస్యం అంటే డబుల్ మీనింగ్ డైలాగ్స్, పేరడీలే అనుకుంటున్న సమయంలో కుటుంబసమేతంగా చూడదగ్గ ఆరోగ్యకరమైన హాస్య కథా చిత్రాలతో అలరిస్తున్న మోహన కృష్ణ, మరోసారి అదే తరహా ప్రేమ కథలతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా డైలాగ్స్ ఈ సినిమా స్థాయిని పెంచాయి. తెలంగాణ యాసలో తనికెళ్ల భరణి, ఇంగ్లీష్, తెలుగు కలిపి వెన్నెల కిశోర్ చెప్పిన డైలాగ్స్‌కు థియేటర్లో విజిల్స్ పడతాయి. మణిశర్మ మ్యూజిక్ సినిమాకు మరో ఎసెట్. సాధారణ సన్నివేశాలతో కూడా మణి తన మ్యూజిక్ మరింత ఫన్నీగా మార్చేశాడు. పిజీ విందా సినిమాటోగ్రఫి, మార్తాండ్ కె వెంటేష్ ఎడిటింగ్ సినిమాను రిచ్‌గా ప్రెజంట్ చేశాయి. అమీ తుమీ.. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఆరోగ్యకరమైన కామెడీ ఎంటర్టైనర్. - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
జీవనసారం పలికే పాట..!
మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకుడు చిత్రం: అష్టా చమ్మా రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం: శ్రీకృష్ణ సంగీతం: కల్యాణి మాలిక్ దర్శకత్వం: ఇంద్రగంటి మోహనకృష్ణ అష్టాచమ్మా చిత్రానికి సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాట ‘ఆడించి అష్టాచమ్మా...’. నా సినిమాలన్నింటిలో నాకు బాగా నచ్చిన పాటలలో ఇది టాప్‌లో ఉంటుంది. సన్నివేశాన్ని మాత్రమే రంజింపచేసినట్లు కాకుండా, కథలో... ఆ సందర్భంలో పాత్రల మధ్యన జరుగుతున్న సంఘర్షణకు కొంచెం హాస్యం జోడించారు. ప్రేమ తత్వం అంటే ఏంటి, ప్రేమ అంటే ఎలా ఉండాలి, ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఎలా ఉండాలి, ఆ ప్రేమలో త్యాగం అనేది ఎంత ముఖ్యమైనది... అనే విషయాలకు, గుప్పెడంత హాస్యాన్ని జోడించి ఆయన అద్భుతంగా అందంగా చెప్పారు ఈ పాటలో. అందుకే ఈ పాట ఎన్నటికీ మరచిపోలేని ఆణిముత్యమని నేను భావిస్తాను. సంగీతసాహిత్యాల పరంగా ఈ పాటను నేను బాగా ఇష్టపడతాను.‘నిజంగా నెగ్గడమంటే ఇష్టంగా ఓడడం అంతే...’ అంటూ జీవిత సారాన్ని ఒక్క వాక్యంలో అద్భుతంగా మలిచారు. ఈ పాట మొత్తానికి ఈ వాక్యం తలమానికంగా ఉంటుంది. ‘ఊరంతా ముంచేస్తూ హంగామా చేస్తావేంటే గంగమ్మా... ’ అని సాగే మొదటి చరణంలోనే వరదలు వచ్చి గంగమ్మ ఊళ్లను ముంచేస్తుందనే విషయానికి కొద్దిపాటి హాస్యం జోడిస్తూ హంగామా చేస్తావే అంటూ సున్నితమైన హాస్యాన్ని పండించారు. ‘నువ్వేసే గవ్వలాటలో మెలేసే గళ్ల బాటలో... నీ దాకా నన్ను రప్పించింది నువ్వేలేవమ్మా...’ అంటూ గవ్వలతో ఆడే అష్టా చమ్మా అట గురించి చెబుతూ మానవ జీవితాన్ని తాత్విక ధోరణిలో చూపారు. కోపాన్ని మందారంతోను, రూపాన్ని పువ్వుతోను, నాజూగ్గా గిల్లిందని, కోపాన్ని ముళ్లతోను... ఎంతో మధురంగా, అందంగా పోల్చారు శాస్త్రిగారు. ఏ పాటలోనైనా అసభ్యతకు తావు లేకుండా, వీలైనంతవరకు వేదాంతాన్ని చొప్పించడం ఆయన ప్రత్యేకత. ఈ పాటకు కల్యాణిమాలిక్ సంగీతం మరింత అందం చేకూర్చింది. – సంభాషణ: డా. వైజయంతి -
'అమీ తుమీ' ఫస్ట్ లుక్
రొటీన్ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా సినిమాలను తెరకెక్కించే ఇంద్రగంటిమోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన మరో సినిమా అమీ తుమీ. అవసరాల శ్రీనివాస్, అడవి శేష్, వెన్నెల కిశోర్ లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఉగాది సందర్భంగా రిలీజ్ చేశారు. గ్రీన్ టీ ప్రొడక్షన్స్ పతాకం పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఈషా, అదితి మాయకల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. -
31 రోజుల్లో షూట్ చేసేశాడు..!
అష్టా చమ్మా, అంతకు ముందు ఆతరువాత, జెంటిల్మన్ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. జెంటిల్మన్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఇంద్రగంటి నాగచైతన్య హీరోగా ఓ సినిమాను తెరకెక్కించాలని భావించాడు. అయితే చైతు డేట్స్ కాలీ లేకపోవటంతో ఈ గ్యాప్ లో ఓ కామెడీ ఎంటర్టైనర్ ను రెడీ చేస్తున్నాడు. అమీ తుమీ పేరులో అవసరాల శ్రీనివాస్, అడవి శేష్, వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రల్లో ఓ సినిమాను రూపొందించాడు. ఈ సినిమాను దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ కేవలం 31 రోజుల్లో పూర్తి చేశాడు. ఈ సందర్భంగా తనకు సహకరించిన నటీనటులకు యూనిట్ సభ్యులకు సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపాడు. గ్రీన్ టీ ప్రొడక్షన్స్ పతాకం పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఈషా, అదితి మాయకల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. IT'S A WRAP FOR 'AMI TUMI'👍 IN THIRTY ONE DAYS FLAT😊 THANKS TO THE ZANY AND BRILLIANT CAST AND THE DEDICATED CREW👏👏 NOW OFF TO POST😊 — Mohan Indraganti (@mokris_1772) 22 March 2017 -
అమీ తుమీ
అవసరాల శ్రీనివాస్ – అడివి శేష్ హీరోలుగా ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రానికి ‘అమీ తుమీ’ అనే టైటిల్ నిర్ణయించారు. ‘వెన్నెల’ కిషోర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో ఈషా, అదితీ మ్యాకల్ కథానాయికలు. కహాన్–కన్నవ్ సమర్పణలో కె.సి.నరసింహారావు నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్ లోగోను హైదరాబాద్‌లో విడుదల చేశారు. కె.సి.నరసింహారావు మాట్లాడుతూ –‘‘హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రమిది. ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకునేలా ఉంటుంది. అందరూ తెలుగు ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో ఈ చిత్రాన్ని నిర్మించడం సంతోషంగా ఉంది. ఈ నెల 23తో టాకీ పార్ట్ చిత్రీకరణ పూర్తవుతుంది. త్వరలో పాటలు, సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. తనికెళ్ల భరణి, అనంత్, మధుమణి, శ్యామల, తనికెళ్ల భార్గవ్, తడివేలు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా పి.జి.విందా, సంగీతం: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వినయ్. -
మల్టీస్టారర్ మూవీకి టైటిల్ ఫిక్స్
హైదరాబాద్: మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీకి టైటిల్ ఖరారైంది. ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై అవసరాల శ్రీనివాస్, అడివి శేష్ హీరోలుగా నటిస్తున్న ఈ మూవీకి 'అమీ తుమీ' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని కహాన్-కన్నవ్ సమర్పణలో కె.సి.నరసింహారావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ లోగోను ఆదివారం సాయంత్రం ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో జరిగిన వేడుకలో చిత్ర బృందం సమక్షంలో విడుదల చేసారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నరసింహారావు మాట్లాడుతూ.. 'ఈనెల 23వ తేదీతో టాకీ పార్ట్ చిత్రీకరణ పూర్తవుతుంది. హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఇంద్రగంటి తెరకెక్కిస్తున్న 'అమీ తుమీ' తెలుగు ప్రేక్షకులను మనస్ఫూర్తిగా నవ్వుకొనేలా చేస్తుంది. ఈషా, అదితి మ్యాకల్ పాత్రలు చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి. పాటల చిత్రీకరణను త్వరలోనే పూర్తి చేసి ఆడియోతో పాటు సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తాం. అందరూ తెలుగు ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మించడం చాలా సంతోషంగా ఉంది' అని చెప్పారు. అవసరాల శ్రీనివాస్, అడివి శేష్, ఈషా, అదితి మ్యాకల్, తనికెళ్లభరణి, అనంత్, మధుమణి, కేదార్ శంకర్, వేణుగోపాల్, శ్యామల, తనికెళ్ల భార్గవ్, తడివేలు తదితరులు నటించారు. ఈ చిత్రానికి మేకప్ చీఫ్‌గా సి.హెచ్.దుర్గాబాబు, కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఎన్.మనోజ్ కుమార్, ప్రొడక్షన్ కంట్రోలర్‌గా మోహన్ పరుచూరి, ప్రొడక్షన్ అడ్వైజర్‌గా డి.యోగానంద్, కో-డైరెక్టర్ గా కోటా సురేష్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: ఎస్.రవీందర్, ఎడిటర్‌గా మార్తాండ్ కె.వెంకటేష్, సినిమాటోగ్రాఫర్‌గా పి.జి.విందా పనిచేశారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్, ప్రొడ్యూసర్ కె.సి.నరసింహారావు నిర్మిస్తున్నారు. -
అంతా తెలుగుమయం!
సాధారణంగా తెలుగు సినిమా తెర పైన, తెర వెనకా పరభాషా నటీనటులు, సాంకేతిక నిపుణులు పని చేస్తుంటారు. కళాకారులకు భాషాబేధం లేదు కాబట్టి, తెలుగు ప్రేక్షకులు అందర్నీ ఆదరిస్తారు. కానీ, ఓ సినిమాకి 24 శాఖల్లోనూ తెలుగువారే పని చేశారంటే కాస్త ఎక్కువ ఆనందిస్తారు. ఇంద్రగంటి మోహనకృష్ణ అలాంటి ఆనందాన్ని ఇవ్వ నున్నారు. అవసరాల శ్రీనివాస్, అడివి శేష్ హీరోగా ఆయన దర్శకత్వంలో కేసీ నరసింహారావు నిర్మిస్తున్న సినిమాకి 24 శాఖల్లోనూ తెలుగువారిని ఎంపిక చేశారు. సినిమా అంతా తెలుగుమయం. ‘వెన్నెల’ కిశోర్ ముఖ్యపాత్ర చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్లు ఈష, అదితీ మ్యానికల్ లు తెలుగమ్మా యిలే. ఈ నెల 1న ప్రారంభమైన ఈ చిత్రం షెడ్యూల్ నేటితో పూర్తవు తుంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వినయ్, సంగీతం: మణిశర్మ. -
ముగ్గురూ ముగ్గురే
అవసరాల శ్రీనివాస్ మంచి నటుడే కాదు.. రచయిత కూడా. ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ చిత్రాల్లో రచయితగా అవసరాల చమత్కారాలు చూశాం. నటుడు అడివి శేష్ కూడా రచయితే. గతేడాది సూపర్‌హిట్ ‘క్షణం’కి కథ, స్క్రీన్‌ప్లే అందించింది ఆయనే. ఇప్పుడీ ఇద్దరూ కలసి హీరోలుగా ఓ సినిమా చేయనున్నారు. ‘అష్టా చమ్మా’, ‘అంతకు ముందు ఆ తర్వాత’, ‘జెంటిల్మన్’ చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. ‘ఎ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్’ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించనున్న కేసీ నరసింహారావు మాట్లాడుతూ – ‘‘అవసరాల, అడివి శేష్, ఇంద్రగంటి... ముగ్గురూ ముగ్గురే. ఈ కాంబినేషన్‌కి తగ్గట్టు స్క్రూబాల్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందనుంది. నిర్మాతగా నా తొలి సినిమాని ఇంద్రగంటి దర్శకత్వంలో చేయడం ఆనందంగా ఉంది. ఫిబ్రవరి 1న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ‘వెన్నెల’ కిశోర్ ముఖ్య పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి కెమేరా: పీజీ విందా, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వినయ్, సంగీతం: మణిశర్మ. -
కాంబినేషన్ కుదిరింది
అక్కినేని నాగచైతన్య ఓ కొత్త చిత్రానికి పచ్చ జెండా ఊపారు. ‘జెంటిల్మన్’తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. సాయి కొర్రపాటి వారాహి చలన చిత్రం సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. సోమవారం దర్శకుడు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ‘గ్రహణం’తో జాతీయ అవార్డు అందుకున్న ఇంద్రగంటి, ఆ తర్వాత ‘అష్టా చమ్మా’తో అందర్నీ నవ్వించారు. తాజాగా ‘జెంటిల్మన్’తో ఉత్కంఠనూ కలిగించారు. ‘ఈగ’, ‘అందాల రాక్షసి’, ‘ఊహలు గుసగుసలాడే’, తాజాగా ‘మనమంతా’, ‘జ్యో అచ్యుతానంద’.. ఇలా సకుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన వారాహి సంస్థలో తెరకెక్కబోయే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఫేమ్ కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో నటించబోయే సినిమా పూర్తయిన తర్వాత ఇంద్రగంటి సినిమా ప్రారంభం కానుందని వినికిడి. చైతూ నటించిన తాజా చిత్రం ‘ప్రేమమ్’ ఈ దసరాకు ప్రేక్షకుల ముందుకొస్తోంది. గౌతమ్ మీనన్ ‘సాహసం శ్వాసగా సాగిపో’ విడుదలకు రెడీగా ఉంది. -
అక్కినేని హీరోతో ఇంద్రగంటి సినిమా..?
జెంటిల్మన్ సినిమాతో సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చిన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌కు రెడీ అవుతున్నాడు. అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య హీరోగా తన నెక్ట్స్ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే చైతూకు లైన్ వినిపించిన ఇంద్రగంటి కథకు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు. ఈ సినిమాను వారాహి చలనచిత్ర బ్యానర్‌పై సాయి కొర్రపాటి నిర్మించే అవకాశం ఉంది. ఇప్పటికే తన నెక్ట్స్ సినిమా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఉంటుందంటూ ప్రకటించిన నాగచైతన్య, రెండు సినిమాలను ఒకేసారి పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. చైతన్య హీరోగా తెరకెక్కిన సాహసం శ్వాసగా సాగిపో, ప్రేమమ్ సినిమాలు అక్టోబర్ నవంబర్ నెలల్లో రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. -
అలాంటి సినిమాలు చేయను!
‘‘అందం, అభినయం.. నాకు రెండూ ముఖ్యమే. నటనలో రెండూ భాగమే. కథానాయికను కేవలం అందాల బొమ్మగా చూపించే చిత్రాలు, గ్లామర్ పాత్రలు చేయను’’ అని కథానాయిక సురభి స్పష్టం చేశారు. నాని, సురభి, నివేదా థామస్ నటీనటులుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన చిత్రం ‘జెంటిల్మన్’. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి వస్తున్న స్పందన పట్ల సురభి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ - ‘‘ నాని పక్కన నటిస్తే మన నటన మెరుగవుతుంది. అందుకే తనతో మరిన్ని చిత్రాల్లో నటించాలని అనుకుంటున్నాను. ఈ సినిమా చిత్రీకరణలో నివేద, నేను మంచి స్నేహితులయ్యాం. మా ఇద్దరి మధ్య ఎటువంటి పోటీ లేదు. మరో కథానాయికతో కలసి తెరను పంచుకోవడానికి నాకు అభ్యంతరం లేదు. నాకు ఎటువంటి పాత్రలు సూటవుతాయో.. అవే ఎంపిక చేసుకుంటున్నాను. నా చిత్రాలన్నీ వరుసగా విజయం సాధించడం సంతోషంగా ఉంది. నటనతో పాటు నాకు పెయింటింగ్ అంటే ఇష్టం. ఖాళీ సమయాల్లో బొమ్మలు గీస్తుంటా. పెయింటింగ్‌లో కోర్స్ కూడా చేశాను’’ అన్నారు. -
ఇష్టపడటమే కాదు.. తోకలు కూడా తగిలిస్తున్నారు!
‘‘హైదరాబాద్‌లోని అమీర్‌పేట సత్యం థియేటర్లో సినిమాలు చూస్తూ పెరిగాను. ఏదైనా సినిమా ఒప్పుకునే ముందు, ‘ఈ సినిమా చేస్తే అదే సత్యం థియేటర్లో కూర్చొని ప్రేక్షకుడిగా ఎంజాయ్ చేస్తానా? లేదా?’ అని ఆలోచిస్తా. ఓ ప్రేక్షక్షుడిగా ఆలోచించి కథలు ఎంచుకుంటా’’ అని హీరో నాని అన్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఆయన హీరోగా శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ‘జెంటిల్మన్’ ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాని చెప్పిన విశేషాలు... ఇందులో నా పాత్ర పేరు జై. కన్స్ట్రక్షన్ కంపెనీ యజమాని. నా పాత్రలో రొమాంటిక్ యాంగిల్‌తో పాటు మరో యాంగిల్ కూడా ఉంది. అదేంటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. నా పాత్ర చూస్తే వీడు మంచా? చెడా? అన్నది తెలియదు. ఈ రెండు కోణాలకు చక్కటి ముగింపు ఉంటుంది. నేనింతకుముందు చేసిన చిత్రాలతో పోల్చితే కథాబలమున్న చిత్రమిది. అందుకే ప్రేమించి చేశా. వాస్తవానికి కథ విన్నప్పుడు ఈ పాత్ర చేయగలనా? లేదా? అనే సందేహం కలిగింది. తెలుగు పరిశ్రమలో ఎంటర్టైన్మెంట్, కామెడీ, కమర్షియల్ ఫార్మాట్ చిత్రాలెక్కువ. ఇవన్నీ ఉంటూనే, ఇందులో బలమైన కథ కూడా ఉంది. వదులుకుంటే మళ్లీ ఇలాంటి సినిమాలో నటించే అవకాశం రాదనిపించి చేశా. ఈ సినిమాకి ఏ టైటిల్ అయితే బాగుంటుందా? అని డిస్కస్ చేసుకునేవాళ్లం. శివలెంక కృష్ణప్రసాద్‌గారు ‘జెంటిల్మన్’ వంటి టైటిల్ పెడితే బాగుంటుందని చెప్పారు. అప్పుడు అవసరాల శ్రీనివాస్‌ని ‘జెంటిల్మన్’ పదానికి తెలుగులో మరో పదం ఏదైనా ఉందా? అని అడిగితే, ‘జెంటిల్మన్’ అని ఎందుకు పెట్టకూడదని అన్నాడు. అందరికీ నచ్చింది. సినిమా చూస్తే ఈ టైటిల్ కరెక్ట్ అని ప్రేక్షకులు అంటారు. మోహనకృష్ణ ఇంద్రగంటిగారు నాతో ‘అష్టా చమ్మా’ సినిమా తీస్తుంటే.. ‘వీళ్లు అమాయకుల్లా ఉన్నారు. నాతో సినిమా తీస్తున్నారు, ఎవరు చూస్తారులే’ అనుకున్నా. అంటే దర్శక- నిర్మాతలకు నాపై నమ్మకం ఉన్నా, నాపై నాకే నమ్మకం లేదు. ‘అష్టా చమ్మా’ చేసేసి, మళ్లీ అసిస్టెంట్ డెరైక్టర్‌గా వెళ్లిపోదాం అనుకున్నా. ఫ్యూచర్లో ఓ ఇరవై ఏళ్ల తర్వాత వయసులో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడినో చూసుకోవాలంటే ‘అష్టా చమ్మా’ డీవీడీ ఉంటుందనే ఆలోచనతో ఆ సినిమా చేశా. ఆ చిత్రం సక్సెస్ కావడంతో, ప్రేక్షకులు నన్ను కూడా ఇష్టపడుతున్నార నే నమ్మకం పెరిగింది. న్యాచురల్ స్టార్ అని తోకలు కూడా పెట్టేస్తున్నారు. ‘అష్టా చమ్మా’ చేస్తున్నప్పుడు ఇంద్రగంటిగారు ఓ మంచి రైటర్. ఆ తర్వాతే డెరైక్టర్. బట్, ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఆయన అంతే మంచి రైటర్, అంతకుమించి మంచి డెరైక్టర్. టెక్నికల్ నాలెడ్జ్ అప్పటికీ ఇప్పటికీ చాలా పెరిగింది. నా క్లోజ్ ఫ్రెండ్స్‌లో అవసరాల శ్రీనివాస్ ఒకరు. ‘అష్టా చమ్మా’, ‘పిల్ల జమీందార్’, ‘ఎవడే సుబ్రమణ్యం’ తర్వాత మేం కలిసి చేసిన సినిమా ఇదే. త్వరలో మేమిద్దరం మరో సినిమా చేయబోతున్నాం. శ్రీను చాలా మంచి నటుడు. తనకు తగ్గ పాత్ర ఇప్పటికీ దొరకలేదు. శివలెంక కృష్ణప్రసాద్గారంటే ముందు నాకు ఎవరో తెలియదు. మోహనకృష్ణ గారు ఫోన్ చేసి ఆయన గురించి చెప్పారు. ఓ సందర్భంలో ‘ఆదిత్య 369’ చిత్రం గురించి చెప్పడంతో.. ఆ రోజుల్లోనే అంత రిచ్‌గా ఆ చిత్రం చేశారంటే... ఇప్పుడైతే ఇంకెంత బాగా తీస్తారో అనిపించింది. నాకు స్టయిలిష్‌గా కంటే సింపుల్‌గా ఉండటమే ఇష్టం. కానీ, మా ఇంట్లో వాళ్ల ప్రభావంతో నా పంథా మార్చుకుని ఇకపై చేసే చిత్రాల్లో స్టయిలిష్‌గా కనిపించాలని అనుకుంటున్నా. విరించి వర్మ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్స్ నిర్మించే ప్రేమకథా చిత్రం చేయబోతున్నా. ఆ తర్వాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించే చిత్రం చేస్తా. -
సరైన సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టా!
‘‘ ‘చిన్నోడు-పెద్దోడు’ సినిమాతో మా శ్రీదేవి మూవీస్ బ్యానర్‌ను స్థాపించాను. ఇప్పటికి 28 ఏళ్లు అయింది. ఆ తర్వాత నేను కొన్ని సినిమాలు చేసినా ‘ఆదిత్య-369’ సినిమా నిర్మాతగా ఇప్పటికీ గుర్తుపట్టడం నా అదృష్టం. ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావా లనే ఉద్దేశంతో ఇన్నాళ్లూ నా బేనర్లో సినిమా తీయలేదు. సెకండ్ ఇన్నింగ్స్‌ను మంచి సినిమాతో ప్రారంభించాననే అనుకుంటున్నా’’ అని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ అన్నారు. నాని, సురభి, నివేదా థామస్ ముఖ్యతారలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఏడేళ్ల విరామం తర్వాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన చిత్రం ‘జెంటిల్మన్’. ఈ శుక్రవారం చిత్రం విడుదల కానున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘ ‘జెంటిల్మన్’ కథను తమిళ రచయిత డేవిడ్ నాథన్ కొన్నేళ్ల క్రితం చెప్పారు. బాగా నచ్చింది. ఎప్పటినుంచో నా మైండ్‌లో ఈ కథ నలుగుతూనే ఉంది. మోహనకృష్ణ ‘బందిపోటు’ సినిమా అంగీకరించక ముందే నేనాయనతో సినిమా చేయాలనుకున్నాను. కానీ, ఆ సినిమా మొదలైంది. సర్లే.. తర్వాత చేద్దా మనుకున్నా. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడంతో రిస్క్ అవుతుందని మోహన్ అన్నారు. కానీ ఫ్లాప్‌లు ఎవరికైనా సహజం. అందుకే పర్లేదని చెప్పగానే కొన్ని కథలు వినిపించారు. అప్పుడు చాన్నాళ్ల క్రితం విన్న కథ గురించి ఆయనకు చెప్పా. నిజానికి మోహనకృష్ణకు సొంతగా కథలు రాసుకోవడం ఇష్టం. అందుకే అయిష్టంగానే వినడానికి అంగీకరించారు. కానీ కథ నచ్చి, సినిమాకు తగ్గట్టుగా తీర్చిదిద్దారు. నాని చేసిన నెగటివ్ షేడ్ పాత్ర కథకు కీలకం. రొమాంటిక్ థ్రిల్లర్‌గా సాగే ఈ సినిమాలోని ప్రతి సీన్ అందర్నీ ఆకట్టుకుంటుంది. సినిమా నిర్మాణంలో చాలా మార్పులు వచ్చాయి. ఎంతో సాంకేతికత పెరిగింది. ప్రేక్షకుల అభిరుచిలో కూడా చాలా మార్పు వచ్చింది. వాళ్లు కొత్తదనం కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టే మంచి సినిమాలు తీయాలన్నది నా ఆలోచన’’ అని చెప్పారు. -
మంచోడే కానీ...!
‘భలే భలే మగాడివోయ్’లో మతిమరుపు లక్కీగా నవ్విస్తే, ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’లో ప్రేమ కోసం ధైర్యంగా పోరాడే కృష్ణగా నవ్వించి, ఏడ్పించారు నాని. ఇప్పుడు జెంటిల్మన్గా అలరించడానికి రెడీ అయ్యారు. అప్పట్లో సహాయ దర్శకునిగా ఉన్న నానీతో ‘అష్టా-చమ్మా’ ఆడించేసి, అతన్ని హీరోని చేశారు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘జెంటిల్మన్’. పేరుకి జెంటిల్మన్ అయినా హీరో వ్యక్తిత్వానికి నెగటివ్ షేడ్ కూడా ఉంది. మరి.. జెంటిల్మన్ ఎలా అవుతాడు అనుకుంటున్నారా? ఆ ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ నెల 17న విడుదల కానున్న ‘జెంటిల్మన్’ సినిమా చూడాల్సిందే. శ్రీదేవి మూవీస్ పతాకంపై నాని, సురభి, నివేదా థామస్ ముఖ్యతారలుగా శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభిస్తోంది. అందమైన రొమాంటిక్ ప్రేమకథ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ ఇది’’అని చెప్పారు. ఈ చిత్రానికి కథ: డేవిడ్ నాథన్, కెమేరా: పీజీ విందా. -
పెళ్లి చేసుకోవాలి... చంపాలి!
అతను చాలా స్మార్ట్ అండ్ సింపుల్...పెద్ద పెద్ద కళ్లద్దాలు పెట్టుకుని పక్కింటి అబ్బాయిలా.. చెప్పాలంటే పక్కా జెంటిల్మన్లా ఉంటాడు.. పైకి మంచిగా కనిపించే ఈ కుర్రాడికి ఓ లక్ష్యం ఉంటుంది. ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. తర్వాత ఆమెను తెలివిగా చంపాలి? ఇంతకీ ఆమె ఎవరు...? ఎందుకు చంపాలనుకున్నాడు? అసలు ఈ కుర్రాడు ఈ కథకు హీరోనా... విలనా...? అని ట్రైలర్ ద్వారా ‘జెంటిల్మన్’ సినిమాలోని నాని పాత్రకు నెగటివ్ టచ్ కూడా ఉందని చూపించేశారు ఇంద్రగంటి మోహనకృష్ణ. ఆయన దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై నాని, నివేదా థామస్, సురభి ముఖ్య తారలుగా శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రం సినిమాపై మరిన్ని అంచనాలను పెంచింది. అందమైన ప్రేమకథ నేపథ్యంలో సాగే థ్రిల్లర్‌గా ఈ చిత్రం సాగుతుంది. మణిశర్మ స్వరపరిచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: పీజీ విందా, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్. -
నాలో హీరోనీ... విలన్నీ గుర్తించింది ఆయనే!
‘‘2007లో అసిస్టెంట్ డెరైక్టర్‌గా ఉన్న నాలో హీరోను చూసింది ఇంద్రగంటి మోహన్‌కృష్ణ గారే. మళ్లీ 2016లో విలన్‌ను చూసింది కూడా ఆయనే. నాలో ఏదైనా కొత్త యాంగిల్ బయటకు రావాలంటే ఆయనతోనే సినిమా చేయాలేమో’’ అని హీరో నాని అన్నారు. నాని, సురభి, నివేదా థామస్ ముఖ్యతారలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన చిత్రం ‘జెంటిల్మన్’. మణిశర్మ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను హీరో రానా హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ- ‘‘చిన్నతనంలో ఓ సారి రెండు ఆడియో సీడీలు కొనడానికి వెళ్లాను. ఒకటి మణిశర్మ, ఇంకోటి ఏ.ఆర్.రెహమాన్ స్వరపరచిన పాటల సీడీ. ఏ.ఆర్.రెహమాన్‌గారి సీడీ రేట్ పెంచేయడంతో నా దగ్గర ఉన్న డబ్బులు చాల్లేదు. అప్పుడు మణిశర్మగారి సీడీ దొంగతనం చేశా. నా ఫేవరేట్ మూవీ ‘ఆదిత్య 369’ నిర్మించిన కృష్ణప్రసాద్గారితో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. నేనేదో టైమ్ మెషీన్ ఎక్కి, ఈ సినిమా చేసినట్లు అనిపిస్తోంది. ఈ సినిమాలో నేను హీరోనా? విలనా? అని అందరికీ కన్ఫ్యూజన్గా ఉంది. అదేంటో తెలియాలంటే జూన్ 17 వరకూ వెయిట్ చే యాల్సిందే’’ అని అన్నారు. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ- ‘‘ఈ కథ రాసుకున్నప్పుడు ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా చూశాను. ‘అష్టాచమ్మా’ తర్వాత నానీతో మళ్లీ సినిమా చేయాలంటే ఇంకా మంచి కథ కావాలి. అతన్నీ, నన్ను బాగా ఎగ్జైట్ చేయాలి. గత ఏడాది మార్చిలో నానీకి ఈ కథ వినిపించాను. ఈ సినిమా నానీకే సెట్ అవుతుందని నమ్మి అతని కోసం డిసెంబరు వరకూ వెయిట్ చేశాను. నేనెందుకు వెయిట్ చేశానో ఈ సినిమా చూశాక మీకే అర్థమవుతుంది. మణిశర్మగారితో పని చేయడం ఇదే తొలిసారి. చాలా మంచి పాటలిచ్చారు’’ అని చెప్పారు. రానా మాట్లాడుతూ- ‘‘ఇంత పాజిటివ్‌గా ఉండే నాని విలన్‌గా ఎలా చేస్తాడో అని డౌట్ వచ్చింది. కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ వేడుకలో శివలెంక కృష్ణప్రసాద్, మణిశర్మ, సురభి, నివేదా థామస్, ఈషా, దర్శకులు ఎస్.వి.కృష్ణారెడ్డి, మారుతి, అవసరాల శ్రీనివాస్, నిర్మాత కె.అచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పాటలతో సిద్ధమైన థ్రిల్లర్
నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో వచ్చిన ‘అష్టా చమ్మా’ ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఎనిమిదేళ్ల తర్వాత వీరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘జెంటిల్మన్’. బాలకృష్ణతో ‘ఆదిత్య 369’, ‘వంశానికొక్కడు’ వంటి విజయవంతమైన చిత్రాలు తీసిన శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ చాలా విరామం తర్వాత ఈ సినిమా నిర్మిస్తున్నారు. సురభి, నివేదా థామస్ కథానాయికలు. ఇటీవలే ఈ చిత్రం టీజర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘అందమైన రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రమిది. అన్నివర్గాల ప్రేక్షకులూ చూసేలా తీర్చిదిద్దుతున్నాం. ఇటీవల విడుదలైన మా చిత్రం తొలి టీజర్‌కు అనూహ్యమైన స్పందన వస్తోంది. ప్రస్తుతం రీ రికార్డింగ్ జరుగుతోంది. మణిశర్మ స్వరపరచిన పాటలు ఈ సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయి. ఈ నెల 22న పాటలు విడుదల చేస్తాం. జూన్‌లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. అవసరాల శ్రీనివాస్, తనికెళ్ల భరణి, ‘వెన్నెల’ కిశోర్, రోహిణి, ‘సత్యం’ రాజేష్, రమాప్రభ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: పీజీ విందా. -
నారి నారి నడుమ నాని!
నాని మంచి ఫ్యామిలీ హీరో. పిల్లలూ, పెద్దలూ అందరూ ఇష్టపడతారు. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి హాయిగా సాగే కుటుంబ కథాచిత్రాలు తీస్తారు. యువతరం కూడా ఆయన చిత్రాలను ఆస్వాదిస్తారు. ఇలా యూత్‌కీ, ఫ్యామిలీస్‌కి దగ్గరైన ఈ ఇద్దరి కాంబినేషన్లో ఓ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ వస్తే, కచ్చితంగా విభిన్నంగా ఉంటుందని చెప్చొచ్చు. ‘అష్టా చమ్మా’ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో ఓ థ్రిల్లింగ్ మూవీ రూపొందుతోంది. ‘ఆదిత్య 369’, ‘వంశానికొక్కడు’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత. ఇందులో నాని ఇద్దరు కథానాయికలతో రొమాన్స్ చేస్తారు. ఆ పాత్రలను సురభి, నివేదా థామస్ చేస్తున్నారు. ఈ చిత్రం చివరి షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. నిర్మాత మాట్లాడుతూ- ‘‘మంచి రొమాంటిక్ కథతో సాగే థ్రిల్లర్ మూవీ ఇది. సెంటిమెంట్, కామెడీ, రొమాన్స్ సమాహారంతో సాగే ఈ చిత్రంలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆసక్తికరంగా ఉంటాయి. ఈ నెల 6 వరకూ సాగే షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుంది. త్వరలో డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెడతాం. మే నెలాఖరున లేక జూన్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. -
మరోసారి 'అష్టాచమ్మా'
'భలే భలే మొగాడివోయ్' సక్సెస్ యంగ్ హీరో నానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. చాలా రోజులుగా స్టార్ ఇమేజ్ కోసం ఎదురుచూస్తున్న ఈ యంగ్ హీరో, ఈ సినిమా సక్సెస్ తో ఆ క్రేజ్ అందుకున్నాడు. ప్రస్తుతం 'అందాల రాక్షసి' ఫేం హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో నటిస్తున్న నాని, ఆ సినిమా తరువాత మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు రెడీ అవుతున్నాడు. తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఏడేళ్ల క్రితం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన 'అష్టాచమ్మా' సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు నాని. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో పాటు హీరోగా నానికి మంచి బ్రేక్ ఇచ్చింది. అప్పటి నుంచి ఈ కాంబినేషన్లో మరో సినిమా ఉంటుందన్న టాక్ వినిపిస్తూనే ఉంది. అష్టాచమ్మా సినిమా తరువాత 'గోల్కొండ హైస్కూల్', 'అంతకుముందు ఆ తరువాత' లాంటి సక్సెస్ఫుల్ చిత్రాలను అందించిన మోహనకృష్ణ 'బందిపోటు'తో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. దాదాపు ఏడేళ్ల విరామం తరువాత తన తొలి చిత్ర హీరో నానితో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు మోహనకృష్ణ. ఈ సినిమాతో మరోసారి అష్టాచమ్మా మ్యాజిక్ రిపీట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు. ఈ విషయాన్ని నాని స్వయంగా తన అఫీషియల్ ట్విట్టర్ పేజ్‌లో వెల్లడించారు. After 7 years :) will always be indebted to him . https://t.co/EnGLy6oyAw — Nani (@NameisNani) November 17, 2015 -
మహేశ్... ఆ పేరులోనే ఓ మత్తు ఉంది!
అష్టా చమ్మా సినిమా వెనుక స్టోరీ- 9 ఒక విత్తనం మొక్కగా ఎదగడానికి ఎంత టైమ్ పడుతుంది? ఈ ప్రశ్నకు జవాబు ఇంద్రగంటి మోహనకృష్ణ చెబుతాడు. ఎందుకంటే ఇప్పుడతని దగ్గర ఓ విత్తనం రెడీగా ఉంది.అప్పుడు మోహనకృష్ణ విజయవాడ - ఆంధ్రా లయోలా కాలేజీలో బి.ఎ. ఇంగ్లిష్ లిటరేచర్ చదువుతున్నాడు. రూమ్‌లో కన్నా లైబ్రరీలోనే ఎక్కువుంటున్నాడు. ఫిక్షన్ - నాన్ఫిక్షన్... ఏదీ వదలడం లేదు. ఏదో దాహం వేసినట్టుగా, ఆకలి వేసినట్టుగా ఇంగ్లిషు పుస్తకాలు నమిలి మింగేస్తున్నాడు. ‘‘ఒరేయ్ అబ్బాయ్! ఆస్కార్ వైల్డ్ రచనలు చదివావా? ముఖ్యంగా ‘ది ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్’ నాటకం చదివావా?’’ అడిగాడో ప్రొఫెసర్. ఆ మరుక్షణమే మోహనకృష్ణ చేతిలో ఆ నాటకం ప్రతి ఉంది. రాత్రంతా నిద్ర మానేసి మరీ చదివాడు. ఏవో ఊహలు... ఏవో కలలు... భలే ఉందే కాన్సెప్ట్. ఇలా మన తెలుగు సినిమాలు ఎందుకు రావు? మోహనకృష్ణ మనసులో విత్తనం పడింది. కెనడాలోని యార్క్ యూనివర్సిటీలో ఫిలిం అండ్ వీడియోలో రెండేళ్ల ఎమ్మెస్ పూర్తిచేసి, ఇండియా తిరిగొచ్చాడు మోహనకృష్ణ. ఇప్పుడేం చేయాలి? సినిమా తీయాలి. ఎవరిస్తారు ఆఫర్? రకరకాల ప్రయత్నాలు... ఆలోచనలు. రాత్రి నిద్రపోయే ముందు పుస్తకం చదివే అలవాటు. బుక్ ర్యాక్‌లో చేయి పెడితే ‘ది ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్’ తగిలింది. ఇంతకు ముందు చదివిన పుస్తకమే. మళ్లీ చదివాడు. పుస్తకమంతా పూర్తయ్యాక డైరీలో రాసుకున్నాడు. ‘‘ఈ కాన్సెప్ట్‌తో సినిమా తీయాలి’’ అనుకుంటూ వరుసగా పాయింట్స్ రాసుకున్నాడు. విత్తనం మొలకెత్తడం మొదలైంది. రాజా, భూమిక కాంబినేషన్లో ‘మాయాబజార్’ (2006) సినిమా. తొలి చిత్రం ‘గ్రహణం’ తర్వాత మోహనకృష్ణ రెండో ప్రయత్నం. ప్చ్... నిరాశపరిచింది. ఏంటి తన పరిస్థితి? ఏమీ అర్థం కావడం లేదు. అలాంటి టైమ్‌లో ఇంటికొచ్చాడు రామ్మోహన్. బిజినెస్ మేనేజ్మెంట్ చదివి, సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నాడు. ఇద్దరికీ ముందు నుంచీ పరిచయం. ‘‘మనమో సినిమా చేద్దాం మోహన్! నేనే ప్రొడ్యూసర్ని’’ చెప్పాడు రామ్మోహన్. మోహనకృష్ణ మొహం వెలిగిపోయింది. ‘‘నా దగ్గర రెడీగా రెండు కథలున్నాయి. నీ ఇష్టం’’ చెప్పాడు మోహనకృష్ణ. ఓ కథ ఎంచుకున్నాడు రామ్మోహన్. ఆ కథకు బేస్... ‘ది ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్’. మొక్క మొలవడం మొదలైంది. ‘ది ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్’ నాటకం ప్రపంచమంతా పాపులర్. ఇందులో హీరో పేరు జాక్. పల్లెటూరి మనిషి. లైఫ్ బోర్ కొట్టేసి అప్పుడప్పుడూ లండన్ వెళ్లి వస్తుంటాడు. అక్కడతని పేరు ఎర్నెస్ట్. గ్వెండోలిన్ అనే అమ్మాయికి ఎర్నెస్ట్ అనే పేరంటే పిచ్చి. అలా వాళ్లిద్దరూ ప్రేమలో పడతారు. జస్ట్... ఈ ఇతివృత్తాన్ని పట్టుకొని మోహనకృష్ణ కథ రెడీ చేశాడు. ఈ కథలో హీరోక్కూడా పల్లెటూరి జీవితమంటే మొహం మొత్తేసి హైదరాబాద్ వస్తాడు. పేరు రాంబాబు. యాక్... కొత్త పేరు కావాలి... అదిరిపోవాలి. మోహనకృష్ణ ఆలోచిస్తూనే ఉన్నాడు. అప్పుడే ‘పోకిరి’ సినిమా రిలీజైంది. అమ్మాయిలంతా మహేశ్బాబంటే పడిచచ్చిపోతున్నారు. ఎస్... పేరు దొరికేసింది. రాంబాబు కాస్తా మహేశ్ అని పేరు మార్చుకుంటాడు. లావణ్య దృష్టిలో మహేశ్ అనే పేరే ఓ మత్తుమందు. కథ రెడీ. హీరోయిన్ భూమిక కథ వింది. ‘‘ఇప్పుడు చేస్తున్న ‘అనసూయ’ సినిమా కంప్లీట్ కాగానే డేట్స్ నీకే’’ అని చెప్పేసింది ఇమ్మీడియట్‌గా. ఒక్కడు’లో మహేశ్, భూమిక కలిసి పనిచేశారు కదా! హిట్ కాంబినేషన్. అలాంటి భూమిక ఈ సినిమాలో మహేశ్ పేరు స్మరిస్తుంటే థియేటర్లో రెస్పాన్స్ ఎలా ఉంటుందో మోహనకృష్ణ ఊహించుకుంటున్నాడు. ఇప్పుడు హీరో కావాలి. గోపీచంద్‌ను కలిశాడు... నో. దయకిరణ్ను కలిశాడు... నో. ఇద్దరిదీ ఒకే మాట. ‘‘కథ బాగుంది. కానీ మేము సూట్ కాము!’’అయ్యో... మరిప్పుడెలా? ‘సంపంగి’లో చేసిన హీరో దీపక్ లైన్లోకొచ్చాడు. అతను చేయడానికి రెడీ. వీళ్లకే సంశయం. ఈ సినిమాలో సెకండ్ పెయిర్ కావాలి. కథలోని పాత్రలు ఆనంద్... వరలక్ష్మి... ఎక్కడున్నారమ్మా మీరు? వరలక్ష్మి చాలా ఈజీగా దొరికేసింది. ‘కలర్స్’ స్వాతి. ‘మా’ టీవీలో ‘కలర్స్’ ప్రోగ్రామ్‌తో పాపులరైపోయి, కృష్ణవంశీ డెరైక్షన్‌లో ‘డేంజర్’ సినిమా చేసింది. లేటెస్ట్గా వెంకటేశ్ మూవీ ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’లో యాక్ట్ చేసింది. పల్లెటూరి పిల్ల పాత్రకు స్వాతి చాలా బాగుంటుంది. ఫిక్స్. ఆనంద్ పాత్రకు కొత్త కుర్రాడు కావాలి. అడిగినవారికీ అడగనివారికీ ఇదే చెబుతున్నారు. ఆ రోజు రామ్మోహన్ ఆఫీసుకి నందినీరెడ్డి వచ్చింది. రమ్యకృష్ణ తో ‘జర మస్తీ... జరధూమ్’ అనే టీవీ ప్రోగ్రామ్ చేస్తోంది తను. ‘‘నాకు తెలిసిన కుర్రాడొకడున్నాడు. బాపు, కె.రాఘవేంద్ర రావుల దగ్గర అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేశాడు. మా ప్రోమోలో కూడా యాక్ట్ చేశాడు’’ అని ప్రోమో చూపించిందామె. ఆ అబ్బాయే నాని. అందరికీ ఓకే. మ్యూజిక్ డెరైక్టర్ కల్యాణీమాలిక్. కెమెరామ్యాన్ పీజీ విందా... ఇలా టీమ్ అంతా రెడీ. ఇక్కడ స్క్రిప్టేమో 245 పేజీలై కూర్చుంది. బాగా తగ్గించాలి. రాత్రింబవళ్లు కుస్తీ పడి ఓ 60 పేజీలు తగ్గించారు. ఇక షూటింగ్‌కు వెళ్లడమే తరువాయి. షాకింగ్ న్యూస్. భూమిక సినిమా చేయలేని పరిస్థితి. ఆమెకు భరత్ ఠాకూర్‌తో పెళ్లి కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ అర్జెంట్‌గా హీరో హీరోయిన్లు కావాలి. కథ మొదటి కొచ్చింది. మోహనకృష్ణ తలపట్టు కున్నాడు. ‘‘ఓ పని చేద్దామా? సెకండ్ పెయిర్‌గా తీసుకున్న నాని, స్వాతి జంటనే మెయిన్ లీడ్ చేద్దామా?’’... రామ్మోహన్ సలహా. నాని, స్వాతిల టైమ్ బాగుంది. మెయిన్ లీడ్‌గా ప్రమోషన్. మరి సెకండ్ పెయిర్? సెర్చింగ్ స్టార్ట్. వందల ఫొటోలొస్తున్నాయి. ఒక్కడూ తగలడే! ఫారిన్ నుంచి ఒకతను టచ్‌లో కొచ్చాడు. అవసరాల శ్రీనివాస్. తెలుగు కుర్రాడే. ఫొటోలు పంపించాడు కానీ, మోహనకృష్ణకు నచ్చలేదు. కానీ అతను పట్టువదలని విక్రమార్కుడిలాగా వీడియో పంపించాడు. మనిషి చాలా ఎత్తుగా, తమాషాగా ఉన్నాడు. ఆనంద్ పాత్రకు అవసరాల శ్రీనివాస్ ఓకే. మోహనకృష్ణ ఇంట్లోవాళ్లందరికీ స్క్రిప్టు తెలుసు. వరలక్ష్మి పాత్ర కోసం తెగ వెతుకుతున్నారనీ తెలుసు. ‘‘‘అమృతం’ టీవీ సీరియల్లో భార్గవి అనే అమ్మాయి చేస్తోంది. ఒకసారి చూడరాదూ!’’... మోహనకృష్ణకు అత్తగారి సలహా. భార్గవికి కబురెళ్లింది. లంగా ఓణీలో ఆఫీసుకు రమ్మన్నారు. ఫస్ట్ ఫ్లోర్లో మోహనకృష్ణ, పీజీ విందా ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు. గజ్జెల చప్పుడు. ఎవరో అమ్మాయి పైకి వస్తోంది. ‘‘అచ్చం మన వరలక్ష్మిలా లేదూ’’ అనేశాడు పీజీ విందా. ఆ వచ్చింది ఎవరో కాదు... భార్గవి. మేకప్ టెస్ట్ చేయకుండానే వరలక్ష్మి పాత్రకు భార్గవి ఖరారైంది. ‘హలో హలో ఓ అబ్బాయి’ ...ఇది వర్కింగ్ టైటిల్. ఇంకా అట్రాక్టివ్ టైటిల్ కావాలి. ‘‘ ‘కథ కంచికి...’ ఈ టైటిల్ ఎలా ఉంది?’’ అడిగాడు కల్యాణీమాలిక్. ‘‘ఏం బాలేదు’’ మొహం మీదే చెప్పేశాడు మోహనకృష్ణ. ‘‘మరి... ‘అష్టా చమ్మా’?’’ మళ్లీ చెప్పాడు కల్యాణీమాలిక్. ‘‘అరె... భలే ఉందే’’ అందరికీ నచ్చేసింది. హైదరాబాద్... అమలాపురం... గూడాల... బొప్పాయిలంక... ఇవే లొకేషన్లు. టాకీ పార్ట్‌కి 29 రోజులు. పాటలకు 14 రోజులు. కోటీ 60 లక్షల బడ్జెట్. ఫస్ట్ కాపీ వచ్చి రెండు నెలలైపోయింది. నిర్మాత రామ్మోహన్‌లో మాత్రం నో టెన్షన్. ఇలాంటి చిన్న సినిమాకు మంచి టైమ్ దొరకాలి. దొరికేసింది. 2008 సెప్టెంబర్ 5... డేట్ అనౌన్స్ చేసేశారు. రామ్మోహన్కో ఐడియా వచ్చింది. రిలీజ్‌కు వారం ముందే వైజాగ్, విజయవాడల్లో పబ్లిక్ ప్రీమియర్ షో వేస్తే...!? చాలా రిస్కు... ఏ మాత్రం అటూ ఇటూ అయినా మొదటికే మోసం. అయినా రామ్మోహన్ డేర్ చేశారు. వైజాగ్ ప్రీమియర్ సూపర్‌హిట్. విజయవాడ ప్రీమియర్ సూపర్ డూపర్ హిట్. ఫలితం తేలిపోయింది. రిలీజ్ రోజు కూకట్పల్లి నుంచి దిల్సుఖ్నగర్ వెళ్తుంటే ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ దగ్గర మోహనకృష్ణకు ఫోన్ వచ్చింది. ‘‘కంగ్రాట్స్ అండీ! ఇప్పుడే మా ఫ్యామిలీ అంతా సినిమా చూశాం. చాలా ఫ్రెష్‌గా ఉంది. మా అందరికీ నచ్చింది’’... ఆ ఫోన్ డెరైక్టర్ రాజమౌళిది. ఇక ఆ తర్వాత మోహనకృష్ణకు వరుసపెట్టి ఫోన్లు, ఎస్సెమ్మెస్‌లు వస్తూనే ఉన్నాయి. ‘అష్టా చమ్మా’ స్వీక్వెల్ చేయొచ్చుగా?... మోహనకృష్ణను అందరూ తరచుగా అడిగే ప్రశ్న. ఆయనలోనూ విత్తనం పడింది. ఎప్పుడు మొలకెత్తుతుందో వెయిట్ చేయాల్సిందే. వెరీ ఇంట్రస్టింగ్... తొలుత అనుకున్న స్క్రిప్టులో ఝాన్సీ పోషించిన ‘మందిరా దేవి’ పాత్రకు ఓ లవ్ ట్రాక్ ఉంటుంది. లావణ్యను ఇష్టపడే ఓ కుర్రాడు, పేరు లేకుండా ఉత్తరాలు రాస్తుంటాడు. అది తనకే అనుకుని మందిర భ్రమించి, తను కూడా రిప్లై ఇస్తుంటుంది. మెయిన్ స్టోరీకి ఈ ట్రాక్ అడ్డుగా ఉంటుందని భావించి స్క్రిప్టు దశలోనే ఎడిట్ చేసేశారు. ఈ సినిమా అంతా ‘మహేశ్’ పేరు చుట్టూనే తిరుగుతుంది. అందుకే చిత్రీకరణ కంటే ముందే హీరో మహేశ్‌బాబును కలిసి అనుమతి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో ఈ సినిమాపై కేస్ స్టడీ నిర్వహించారు. ఆన్లైన్ మార్కెటింగ్‌లో కొత్త పోకడలు పోవడం, నిర్మాత వ్యయ నియంత్రణపై పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లడం... తదితర కారణాల రీత్యా ఈ చిత్రాన్ని ఎంచుకున్నారు. - పులగం చిన్నారాయణ -
వెండితెరపై చలం ‘త్యాగం’
తెలుగు సాహిత్యంలో చలం రచనలకు ఇప్పటికీ అగ్రతాంబూలమే. ఆయన రచన ‘దోషగుణం’ ఆధారంగా ఇంద్రగంటి మోహనకృష్ణ ‘గ్రహణం’ అనే సినిమా తీసి జాతీయ పురస్కారం గెలుచుకున్నారు. చలం ప్రసిద్ధ నవల ‘మైదానం’ వెండితెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు చలం మరో నవల ‘త్యాగం’ ఇప్పుడు తెరకెక్కుతోంది. ‘అనుష్టానం’ పేరుతో రూపొందుతోన్న ఈ చిత్రంలో మాధవీ లత ఓ పల్లెటూరి అమ్మాయిగా నటి స్తోంది. దీని గురించి ఆమె చెబుతూ - ‘‘చలం రచన ఆధారంగా తీస్తోన్న ఈ చిత్రంలో నేను పల్లెటూరు అమ్మాయిగా నటిస్తున్నాను. ఈ సినిమాలో నా పాత్రను ప్రతి అమ్మాయీ ఇష్టపడుతుంది’’ అన్నారు. ఎంపీ రవిరాజ్ రెడ్డి నిర్మాతగా కృష్ణ వాసా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘గజల్’ శ్రీనివాస్ ఇందులో ముఖ్య పాత్రధారి. -
‘అల్లరి’ నరేశ్‌ను కొత్తగా చూపించాం : మోహనకృష్ణ ఇంద్రగంటి
సున్నితమైన కథాంశాలతో మానవీయ అనుబంధాలకు పెద్దపీట వేస్తూ సినిమాలు తెరకెక్కించే ఓ దర్శకుడు.... మోహనకృష్ణ ఇంద్రగంటి. తీసింది తక్కువ సినిమాలే అయినా... అభిరుచి గల దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొన్నారు. ‘అష్టా చమ్మా’, ‘గోల్కొండ హైస్కూల్’, ‘అంతకుముందు... ఆ తరువాత’ చిత్రాలతో విజయాలు సొంతం చేసుకొన్నారు. స్వచ్ఛమైన వినోదంతో సినిమాలు తీస్తారనే పేరున్న ఇంద్రగంటి తాజాగా ‘అల్లరి’ నరేశ్‌తో ‘బందిపోటు’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈవీవీ సినిమా పతాకంపై రాజేశ్ ఈదర నిర్మించిన ఆ చిత్రం ఇటీవలే విడుదలై ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఈ సందర్భంగా మోహనకృష్ణ ఇంద్రగంటి ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ వివరాలివీ.... ‘‘అల్లరి నరేశ్‌తో ఓ సినిమా చేయాలని మూడేళ్ళక్రితమే నిర్ణయించుకొన్నా. అయితే ఆ చిత్రం ఇటు నాకు, అటు నరేశ్కీ ఇద్దరికీ కొత్తగా ఉండాలనుకొన్నాం. ఆ ఆలోచనల మేరకే ‘బందిపోటు’ కథను తయారు చేసుకొన్నా. ఇప్పటిదాకా నేను ఇలాంటి కోవలోని సినిమా చేయలేదు. ‘అల్లరి’ నరేశ్‌కి కూడా ఇది కొత్త కథ. ఆయన దాదాపుగా ప్రతీ సినిమాలోనూ స్పూఫ్‌లు చేస్తూ వినోదం పండిస్తుంటారు. అలా కాకుండా కథలోని సన్నివేశాలతోనే వినోదం పండించేలా స్క్రిప్టును తీర్చిదిద్దా. ఈ సినిమాతో నరేశ్ బాడీ లాంగ్వేజ్‌ని కూడా మార్చాలనుకొన్నాం. తెరపై ఎప్పట్లా హైపర్ యాక్టివ్‌గా కాకుండా కాస్త నింపాదిగా, కూల్‌గా కనిపించేలా జాగ్రత్తలు తీసుకొన్నాం. మా ప్రయత్నాలన్నీ మంచి ఫలితాల్ని తీసుకొచ్చాయి. ‘అల్లరి’ నరేశ్‌ని కొత్తగా చూపించారనే అభిప్రాయం అన్ని వర్గాల నుంచీ వ్యక్తమవుతోంది.’’ ఆ ప్రభావం చాలా ఉంది! ‘‘దొంగల్ని దోచుకొనే బందిపోటుగా నరేశ్‌ని చూపించా. ఇందులో ఆయన నిజమైన హీరోగా కనిపిం చాడు. డ్రామా పండించడంలో, సన్నివేశాలకు అను గుణంగా వినోదం పండించడంలో ఆయన తన మార్కును చూపించారు. ఇలాంటి ఒక కథతో చిత్రాన్ని చేయాలనే ఆలోచన నాకు ఎప్పటి నుంచో ఉంది. ‘ద స్టింగ్’, ‘హైస్ట్’, ‘మాచ్‌స్టిక్ మెన్’ తదితర ఆంగ్ల చిత్రాలకు నేను పెద్ద అభిమానిని. రేమండ్ చాండ్లర్, ఎడ్జర్ వాలెస్ తదితర రచయిత నవలల ప్రభావం కూడా నాపై ఎంతో ఉంది. వాళ్లకు ఓ నివాళిలా ఈ చిత్రం తీశా. కథలోని డ్రామా, వినోదం ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకొంటోంది. ‘అల్లరి’ నరేశ్‌తో పాటు సంపూర్ణేశ్‌బాబు, పోసాని కృష్ణమురళి, రావు రమేశ్, తనికెళ్ల భరణి తదితరులు తమ పాత్రలతో రక్తి కట్టించారు. భారీ తారాగణంతో తీసిన ఈ చిత్రం దర్శకుడిగా నాకు ఎంతో సంతృప్తినిచ్చింది.’’ గర్వంగా ఉంది..! ‘‘ఈవీవీ సినిమా సంస్థలో సినిమా చేయడం గర్వకారణంగా భావిస్తుంటా. తండ్రి స్థాపించిన నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న చిత్రం కాబట్టి ఆర్యన్ రాజేశ్, ‘అల్లరి’ నరేశ్‌లు ఇద్దరూ కూడా నిర్మాణ విలువలకు ప్రాధాన్యమిస్తూ ఈ సినిమాను తీశారు. ప్రమోషన్ విషయంలోనూ వాళ్లు చూపిన శ్రద్ధ చూసి, చాలా ఆనందమేసింది. ఈ సినిమా మరింతమంది ప్రేక్షకులకు చేరువవుతుందన్న నమ్మకం నాకుంది. ఇలాగే ఎప్పటికప్పుడు కొత్త జానర్లలో సినిమాలు చేస్తూ ప్రయాణం చేయాలన్నదే నా ముందున్న లక్ష్యం.’’