
నటించిన తొలి సినిమా ‘ఉప్పెన’తోనే కుర్రాళ్ల హృదయాలను దోచేసుకుంది మంగళూరు బ్యూటీ కృతి శెట్టి. వైష్ణవ్ తేజ్‌కు జంటగా బేబమ్మ పాత్రలో తన అమాయకపు నటనతో మంచి మార్కులే కొట్టేసింది. సినిమా డైరెక్టర్, హీరోతో పోలిస్తే కృతి కాస్తా ఎక్కువ ప్రశంసలే అందుకుంది. ఉప్పెనతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నఈ చిన్నది వరుస అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా మారింది. ఈ క్రమంలో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఓ చిత్రంలో కృతీ శెట్టి ఫీమెయిల్ లీడ్ రోల్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో కృతి హైదరాబాదీ అమ్మాయిగా కనిపించనుంది.
ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రంలో కృతీ తెలంగాణ యాసలో మాట్లాడనుంది. ఉప్పెనలో క్యూట్ లుక్‌తో అలరించిన కృతిశెట్టి.. మరి తెలంగాణ మాండలికంలో డైలాగ్స్ చెప్తూ తనలోకి మరో యాంగిల్‌ను కూడా ప్రేక్షకులకు పరిచయం చేయబోతుందన్నమాట. మరి ఎంత వరకు తెలంగాణ యాసలో మెప్పించి.. ఆడియెన్స్‌కు దగ్గరవుతుందో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి ఉండాల్సిందే. ఇక ఈ మూవీతోపాటు నేచురల్ స్టార్ నానితో శ్యామ్ సింగరాయ్, రామ్ హీరోగా లింగుసామి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలోనూ నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లు ఫిల్మీ దునియాలో టాక్ వినిపిస్తోంది. ఇటు తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా కృతికి ఆఫర్లు వస్తున్నాయట.
Comments
Please login to add a commentAdd a comment