Mahesh Babu Launch Sudheer Babu Aa Ammayi Gurinchi Meeku Cheppali Trailer - Sakshi
Sakshi News home page

Aa Ammayi Gurinchi Meeku Cheppali Trailer: ఆకట్టుకుంటున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ట్రైలర్‌

Published Mon, Sep 5 2022 7:16 PM | Last Updated on Mon, Sep 5 2022 7:54 PM

Mahesh Babu Launch Sudheer Babu Aa Ammayi Gurinchi Meeku Cheppali Trailer - Sakshi

హీరో సుధీర్‌ బాబు, కృతిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సుధీర్‌ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో వస్తున్న మూడో ప్రేమకథా  చిత్రమిది. ఇప్పటికే విడుదల చేసిన మూవీ ఫస్ట్‌లుక్‌, టీజర్‌, పాటలకు పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ కావడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇక సెప్టెంబర్‌ 16న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు మేకర్స్‌.

చదవండి: సినీ ప్రియులకు ‘ఐబొమ్మ’ బిగ్‌ షాక్‌.. ఆ రోజు నుంచి శాశ్వతంగా సేవలు బంద్‌

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు సోషల్‌ మీడియా వేదికగా మూవీ ట్రైలర్‌ లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా మహేశ్‌ మాట్లాడుతూ.. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ ట్రైలర్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. కామెడీ, లవ్‌, ఎమోషన్స్‌తో మలిచిన ఈ ట్రైలర్‌ చూస్తుంటే ఈ సినిమా చాలా ఆసక్తికరంగా ఉండేట్టుందన్నారు. ఈ సందర్భంగా ఈ మూవీ హీరోహీరోహీరోయిన్లు సుధీర్ బాబు, కృతి శెట్టి, డైరెక్టర్‌ ఇంద్రగంటి మోహనకృష్ణలతో పాటు చిత్రబృందానికి మహేశ్‌ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. 

చదవండి: జూ.ఎన్టీఆర్‌-కొరటాల చిత్రంలో అలనాటి లేడీ సూపర్‌ స్టార్‌?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement