
‘‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రంలో నా పాత్రకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. చాలా మంది ఫోన్ చేసి, ‘నన్ను నేను స్క్రీన్‌పై చూసుకున్నట్లు ఉంది’ అని చెప్పడం హ్యాపీ. ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?’’ అని కృతీశెట్టి అన్నారు. సుధీర్ బాబు హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో బి.మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదలైంది.
ఈ సందర్భంగా హీరోయిన్ కృతీశెట్టి మాట్లాడుతూ–‘‘నేను డాక్టర్ కావాలనుకున్నాను. ఓ యాడ్ ఫిల్మ్ షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు ‘ఉప్పెన’ అవకాశం రావడం, ఆ తర్వాత మంచి పాత్రలు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను. నేను ప్రతి సినిమాకి, పాత్రకి హోమ్ వర్క్ చేస్తాను.
కెరీర్ బిగినింగ్‌లోనే ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’లో ద్విపాత్రాభినయం చేయడం హ్యాపీ. ఇంతమంచి అవకాశం ఇచ్చిన ఇంద్రగంటిగారికి థ్యాంక్స్. ఈ సినిమా విజయం నాకు చాలా ప్రత్యేకం. సుధీర్ బాబుగారు సెట్‌లో సరదాగా ఉంటూ ఎదుటివారిలో చాలా స్ఫూర్తి నింపుతారు. ప్రస్తుతం తెలుగులో నాగచైతన్యతో ఓ చిత్రం, తమిళంలో సూర్యగారితో ‘అచలుడు’ అనే సినిమా చేస్తున్నా’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment