‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ నుంచి లిరికల్‌ సాంగ్‌ రిలీజ్‌ | Aa Ammayi Gurinchi Meeku Cheppali Lyrical Song Release | Sakshi
Sakshi News home page

Sudheer Babu: ‘మీరే హీరో లాగ..’ పాటను జర్నలిస్టులకు అంకితం చేసిన సుధీర్‌ బాబు

Aug 18 2022 9:21 AM | Updated on Aug 18 2022 9:22 AM

Aa Ammayi Gurinchi Meeku Cheppali Lyrical Song Release - Sakshi

‘‘కథకు న్యాయం చేసే దర్శకుడు ఇంద్రగంటిగారు. ఇప్పటివరకూ ఆయన  చేసిన సినిమాల్లో బెస్ట్‌ మూవీ ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ప్రేమకథతో పాటు అద్భుతమైన ఫ్యామిలీ డ్రామా ఉన్న ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అని అన్నారు సుధీర్‌బాబు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్‌బాబు, కృతీ శెట్టి జంటగా నటించిన చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. గాజులపల్లె సుధీర్‌బాబు సమర్పణలో బి. మహేంద్రబాబు, కిరణ్‌ బళ్లపల్లి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 16న రిలీజ్‌ కానుంది.

వివేక్‌ సాగర్‌ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘మీరే హీరో లాగ..’ అనే పాటని దర్శకుడు హను రాఘవపూడి రిలీజ్‌ చేశారు. హీరో సుధీర్‌బాబు మాట్లాడుతూ– ‘‘నటీనటులు ఎంత ప్యాషనేట్‌గా సినిమాలు చేస్తారో జర్నలిస్ట్‌లు కూడా అంతే ప్యాషన్‌తో తమ పని చేస్తారు. అందుకే ‘మీరే హీరో లాగ..’ పాటని మీడియాకి అంకితం ఇస్తున్నాం. ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రిగారిని మనం మిస్‌ కాకుండా చూసుకునే బాధ్యత రామజోగయ్య శాస్త్రిగారిపై   ఉంది’’ అన్నారు.

ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ– ‘‘నేను కూడా జర్నలిస్ట్‌గా పని చేశాను. ఒక ఇంటర్వ్యూ తరహాలో హీరో పరిచయ పాట ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి వచ్చిందే ‘మీరే హీరో లాగ..’. ఈ సాంగ్‌ క్రెడిట్‌ రామజోగయ్య శాస్త్రి, దినేష్, వివేక్‌లకు దక్కుతుంది’’ అన్నారు. రచయిత రామజోగయ్య శాస్త్రి, సంగీత దర్శకుడు వివేక్‌ సాగర్, కెమెరామేన్‌ పీజీ విందా, ఆర్ట్‌ డైరెక్టర్‌ సాహి సురేష్‌ మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement