హీరో సుధీర్ బాబు, కృతిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో వస్తున్న మూడో ప్రేమకథా చిత్రమిది. ఇప్పటికే విడుదల చేసిన మూవీ ఫస్ట్‌లుక్, టీజర్‌కు పాజిటివ్ బజ్ క్రియేట్ కావడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.
తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్‌పై అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. సెప్టెంబర్ 16న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను వదిలారు.మైత్రీ మూవీ మేకర్స్, బెంచ్‌మార్క్ స్డూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కల్యాణి నటరాజన్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
#AaAmmayiGurinchiMeekuCheppali in Theatres from SEP 16 🤩
— Benchmark Studios (@benchmarkstudi5) August 10, 2022
Get ready to fall in love with a beautiful tale on the Big Screens ❤️
#AAGMConSEP16 @isudheerbabu @IamKrithiShetty #MohanaKrishnaIndraganti @MythriOfficial @mahendra7997 pic.twitter.com/KqZ4X1JkMQ
Comments
Please login to add a commentAdd a comment