దసరా బరిలో సుధీర్‌ బాబు.. ఈ సారైనా హిట్ కొడతాడా? | Tollywood Hero Sudheer Babu Movie Ready To Join Dasara Boxoffice Race | Sakshi
Sakshi News home page

Sudheer Babu Movie: దసరా రేసులో సుధీర్‌బాబు.. సూపర్ హీరో అవుతాడా?

Published Wed, Aug 28 2024 10:15 AM | Last Updated on Wed, Aug 28 2024 10:41 AM

Tollywood Hero Sudheer Babu Movie Ready To Join Dasara Boxoffice Race

ఇటీవలే హరోం హర మూవీతో మెప్పించిన టాలీవుడ్ స్టార్ సుధీర్‌బాబు. తాజాగా మరోసారి అభిమానులను అలరించేందుకు వచ్చేస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'మా నాన్న సూపర్‌ హీరో'. ఇందులో  ఆర్ణ  హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వీసెల్యూలాయిడ్స్, క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి సునీల్‌ బలుసు నిర్మిస్తున్నారు.

తండ్రీ, తనయులు అనుబంధం నేపథ్యంలో ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని రూపొందించారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులతో బిజీగా ఉన్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీని దసరా సందర్భంగా విడుదల చేయనున్నట్లు పోస్టర్‌ను పంచుకున్నారు. అయితే రిలీజ్ డేట్‌ను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం మానాన్న హీరో అని చిత్రయూనిట్ తెలిపింది. కాగా.. చిత్రంలో సాయిచంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి జై క్రిష్ సంగీతం అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement