![Tollywood Movie Sangharshana Released On This Date](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/07/29/san.jpg.webp?itok=0dRf8XrM)
చైతన్య పసుపులేటి, రషీద భాను ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం సంఘర్షణ. ఈ సినిమాకు చిన్న వెంకటేష్ దర్శకత్వం వహిస్తున్నారు. మహీంద్ర పిక్చర్స్ బ్యానర్‌పై శ్రీనివాస రావు నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించారు.
అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ప్రేక్షకులకు నచ్చే సినిమాతో రావడం సంతోషంగా ఉందని నిర్మాత వల్లూరి శ్రీనివాస్ రావు తెలిపారు. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 9న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీని వన్ మీడియా ద్వారా పార్థు రెడ్డి థియేట్రికల్ విడుదల చేస్తున్నారు. ఆదిత్య శ్రీ రామ్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment