రాజ్ కార్తికేన్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన చిత్రం 'రాజ్ కహాని'. భార్గవి క్రియేషన్స్ పతాకంపై భాస్కర రాజు, ధార్మికన్ రాజు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ సంగీతం సమకూర్చారు. చంద్రికా అవస్తి, సోనియా సాహా, ప్రియా పాల్, సాయి, జబర్దస్త్ ఫణి తదితరులు నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది.
చిత్ర దర్శకులు, హీరో రాజ్ కార్తికేన్ మాట్లాడుతూ..'అమ్మ ప్రేమను అంతర్లీనంగా, అమ్మాయి ప్రేమను బాహ్యవలయంగా చేసుకుని అసలైన ప్రేమకు అర్థం చెప్పే మంచి కథ ఉన్న సినిమా ఇది. ఈ సినిమాను ప్రేక్షక లోకం తప్పక ఆదరిస్తారని నమ్మకంగా ఉన్నా.' అని అన్నారు.
చిత్ర నిర్మాతలు భాస్కర రాజు, ధార్మికేన్ రాజు మాట్లాడుతూ.. 'మంచి సబ్జెక్టు ఉన్న సినిమా ఇది. ఎంతో ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాను చేశాం. తొందరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. యూత్, ఫ్యామిలీని అకట్టుకునే అన్ని అంశాలు ఉన్నాయని' తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment