Latest Movie
-
ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ రెండు స్పెషల్!
డార్లింగ్ ప్రభాస్ 'కల్కి' సినిమా థియేటర్లలోకి వచ్చే వారమే రానుంది. దీంతో ఈ వారం థియేటర్లలోకి చెప్పుకోదగ్గ మూవీస్ అయితే రిలీజ్ కావడం లేదు. నింద, హనీమూన్ ఎక్స్‌ప్రెస్, ఓ మంచి ఘోస్ట్, సీతా కల్యాణ వైభోగమే, ప్రభుత్వ జూనియర్ కళాశాల లాంటి చిన్న చిత్రాలు మాత్రమే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరోవైపు ఓటీటీలో మాత్రం పలు ఇంట్రెస్టింగ్ మూవీస్ స్ట్రీమింగ్ కానున్నాయి.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు లేటెస్ట్ హారర్ మూవీ)ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ విషయానికొస్తే.. ఓవరాల్‌గా 20 వరకు సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో బాక్, నడికల్ తిలకం, మహారాజ్ చిత్రాలతో పాటు హౌస్ ఆఫ్ డ్రాగన్ రెండో సీజన్ ఉన్నంతలో ఆసక్తి రేపుతున్నాయి. ఇవి కాకుండా ఏవైనా తెలుగు స్ట్రెయిట్ మూవీస్ సడన్‌గా ఓటీటీలో రిలీజ్ కావొచ్చు. ఇంతకీ ఏయే ఓటీటీల్లో ఏయే మూవీస్ రాబోతున్నాయి? వాటి లిస్ట్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం.ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ లిస్ట్ (జూన్ 17 - 23 వరకు)నెట్ఫ్లిక్స్ఏజెంట్స్ ఆఫ్ మిస్టరీ (కొరియన్ సిరీస్) - జూన్ 18ఔట్ స్టాండింగ్: ఏ కామెడీ రివల్యూషన్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 18క్లెక్స్ అకాడమీ (పోలిష్ మూవీ) - జూన్ 19లవ్ ఈజ్ బ్లైండ్ బ్రెజిల్ సీజన్ 4 (పోర్చుగీస్ సిరీస్) - జూన్ 19మహారాజ్ (హిందీ చిత్రం) - జూన్ 19అమెరికన్ స్వీట్ హార్ట్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 20కోటా ఫ్యాక్టరీ సీజన్ 3 (హిందీ సిరీస్) - జూన్ 20గ్యాంగ్స్ ఆఫ్ గలీషియా (స్పానిష్ సిరీస్) - జూన్ 21నడికర్ తిలకం (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 21ద విక్టిమ్స్ గేమ్ సీజన్ 2 (మాండరిన్ సిరీస్) - జూన్ 21ట్రిగ్గర్ వార్నింగ్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 21రైజింగ్ ఇంపాక్ట్ (జపనీస్ సిరీస్) - జూన్ 22హాట్‌స్టార్బాక్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూన్ 21బ్యాడ్ కాప్ (హిందీ సిరీస్) - జూన్ 21ద బేర్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 21ఆహాసీరగన్ (తమిళ సినిమా) - జూన్ 18అమెజాన్ మినీ టీవీఇండస్ట్రీ (హిందీ సిరీస్) - జూన్ 19జియో సినిమాహౌస్ ఆఫ్ డ్రాగన్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 17బిగ్ బాస్ ఓటీటీ (హిందీ రియాలిటీ షో) - జూన్ 21బుక్ మై షోలాస్ట్ నైట్ ఆఫ్ అమోర్ (ఇటాలియన్ మూవీ) - జూన్ 21(ఇదీ చదవండి: కూతురు ఐశ్వర్య ప్రేమ పెళ్లి.. హీరో అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్) -
నవ్వుతారేమో అనుకున్నా: లాపతా లేడీస్ ప్రతిభ ఇంట్రస్టింగ్ జర్నీ
బాలీవుడ్ దర్శకురాలు కిరణ్‌రావు (బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ మాజీ భార్య) దర్శకత్వంలో వచ్చిన లాపతా లేడీస్ ఓటీటీలో మంచి ఆదరణ సంపాదించుకుంది. కుటుంబం, వైవాహిక వ్యవస్థలో మహిళల స్థితిగతులు, అమ్మాయిల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా జరిగే బాల్య వివాహాలు, అమ్మాయిల తెగవును పట్టి ఇచ్చిన సినిమా ఇది. ముఖ్యంగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన ప్రతిభా రాంటా తన అధ్బుతమైన నటనతో ఆకట్టుకుంది. సిమ్లా టూ బాలీవుడ్ ప్రతిభ రాంటా ఇంట్రస్టింగ్ జర్నీ ఒక సారి చూద్దాం.ఖుర్బాన్ హువా టీవీ సీరియల్‌తో వెలుగులోకి వచ్చింది ప్రతిభా రాంటా. ఆ తరువాత వెబ్ సిరీస్ చేస్తుండగా కిరణ్ రావు దృష్టిలో పడింది. అలాలాపతా లేడీస్‌లో అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని తానేమిటో నిరూపించుకుంది. బాలీవుడ్‌కి పరిచయం అయిన కొత్త ముఖాల్లో ప్రతిభ రాంటా. నిజంగా తన యాక్టింగ్ ప్రతిభ, ఒకదాని తర్వాత ఒకటి తన ఆన్-స్క్రీన్ పెర్ఫార్మెన్స్తో, ముఖ్యంగా లాపతా లేడీస్ 'జయ' పాత్రలో సత్తా చాటింది. ఇటీవల విడుదలైన వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్లో 'వహీదా' (సంజీదా షేక్) కుమార్తె 'షామా' పాత్రను పోషించింది. 24 ఏళ్ల వయసులో చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అయితే ఈ ప్రయాం అంత సాఫీగా సాగలేదు.ఎవరీ ప్రతిభా రాంటాసందేశనా రాంటా,, రాజేశ్ రాంటా దంపతుల కుమార్తె ప్రతిభా రాంటా. సిమ్లాలో పెరిగింది. చిన్నప్పటి నుంచీ డాన్స్ అంటే ఇష్టం. డాన్స్‌లో గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసింది. అలా నటించాలనే ఆసక్తి పెరిగింది. ఆ మాటే ఇంట్లో చెబితే యాక్టింగ్ అంటే ఏంటి? అని అడిగారట. ఎందుకంటే కుటుంబంలో చాలా మంది ఉపాధ్యాయులు, అందుకే వారికి నటన గురించి ఏమీ తెలియదట. ఇంజనీర్, డాక్టర్ లేదా మరేదైనా ఇతర ప్రొఫెషనల్‌గా ప్రతిభను చూడాలని ఆశించారు. దీంతో యాక్టింగ్‌లో చేరడం చాలా కష్టమేమో , తనను చూసి నవ్వుతారేమో అనిపించిందని ఒక ఇంటర్య్వూలో వెల్లడించింది.పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత, ప్రతిభ ఎలాగోలా తన తల్లిదండ్రులను ఒప్పించి ఉన్నత చదువుకోసం ముంబైకి చేరింది. ఆడిషన్లు ఇవ్వడం మొదలు పెట్టింది. అందాల పోటీలో పాల్గొంది. 2018లో మిస్ ముంబై టైటిల్‌ను గెలుచుకుంది. నిస్సందే 2018 మిస్ ముంబై అందాల పోటీల్లో మిస్ ముంబై కిరీటం గెలుచుకుంది. దీంతో కేవలం ఆరు నెలలకే ‘ఖుర్బాన్ హువా’ టీవీ సీరియల్ 'చాహత్' పాత్రలో తొలి ఆఫర్ వచ్చింది. తరువాత,ఆధా ఇష్క్ అనే వెబ్ షోలో కూడా కనిపించింది. View this post on Instagram A post shared by Pratibha Rantta (@pratibha_ranta)ఇక లాపతా లేడీస్ ఆఫర్ గురించి మాట్లాడుతూ మొదట్లో కాస్త భయమేసిందని, అయితే సినిమాలో ‘జయ’ కథ ఒక విధంగా నిజ జీవితానికి సరిగ్గా సరిపోతుందని, అందుకే ఆ పాత్రలో పూర్తిగా లీనమైపోయానని చెప్పుకొచ్చింది. మొత్తానికి తన జర్నీ అంతా ఒక మ్యాజిక్‌లా సాగిపోయిందని వెల్లడించింది మెరిసే కళ్లతో. -
అలాంటి కథతో వస్తోన్న నిత్యా మీనన్.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్!
అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన నటి నిత్యామీనన్. ఆ తర్వాత నితిన్ సరసన ఇష్క్ సినిమాతో గుర్తింపు దక్కించుకుంది. ఆమె తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళంలో దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో గుండెజారి గల్లంతయ్యిందే, జనతా గ్యారేజ్, 100 డేస్ ఆఫ్ లవ్, ఒక్క అమ్మాయి తప్ప, ఇంకొక్కడు లాంటి చిత్రాల్లో నటించింది. నిత్యా మీనన్ ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తోంది. తాజాగా మరో ఆసక్తికర స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టాలో పంచుకుంది. ఓ యువతి ప్రేమకథా ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రంలో ఆమె నటిస్తున్నట్లు కనిపిస్తోంది. గతంలో సత్యజిత్ రే.. ఠాగూర్ చిన్న కథ ఆధారంగా తెరకెక్కించిన సమాప్తి పేరుతో సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో మృణ్మోయి అనే యువతి పాత్రను చూపించారు. తాజాగా నిత్యా మీనన్ పోస్టర్ చూస్తే అదే కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) -
ఎట్టకేలకు నెరవేరుతున్న శంకర్ డ్రీమ్...? గేమ్ ఛేంజర్ స్టోరీ అదేనా..?
-
మర్డర్ మిస్టరీ
‘సత్యం’ రాజేశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టెనెంట్’. వై. యుగంధర్ దర్శకత్వంలో మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ఇది. ‘‘ఫ్యామిలీ ఎమోషనల్ మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. ఆడవాళ్లు చూడాల్సిన సినిమా ఇది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. మేఘా చౌదరి, చందన పయ్యావుల, భరత్ కాంత్, తేజ్ దిలీప్, ‘ఆడుకాలం’ నరేన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాహిత్య సాగర్, సహ–నిర్మాత: ఎన్. రవీందర్ రెడ్డి. -
విజయ్ ఆంటోనీ లేటెస్ట్ మూవీ.. ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది!
విజయ్ ఆంటోనీ టాలీవుడ్ అభిమానులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇటీవలే బిచ్చగాడు -2 సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. తాజాగా ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. విజయ్ ఆంటోనీ హీరోగా 'విక్రమ్ రాథోడ్' సినిమా తెలుగులోనూ రాబోతోంది. (ఇది చదవండి: ప్రభాస్ 'ఆదిపురుష్'.. వెండితెరపై మెప్పించిన టాలీవుడ్ రాముళ్లు వీరే!) అపోలో ప్రొడక్షన్స్, ఎస్ఎన్ఎస్ మూవీస్ సంయుక్త సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాబు యోగేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. రావూరి వెంకటస్వామి, కౌసల్య రాణి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో ముఖంపై గాయాలతో కనిపిస్తున్నారు విజయ్ ఆంటోనీ. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్. ఈ చిత్రంలో సురేష్ గోపి, రమ్య నంబీశన్, సోను సూద్, సంగీత ముఖ్య పాత్రలు పోషిస్తుండగా.. ఛాయా సింగ్, యోగి బాబు, రాధ రవి, కస్తూరి శంకర్, రోబో శంకర్, మనీష్ కాంత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. (ఇది చదవండి: అచ్చిరాని సమ్మర్.. ఈసారి తెలుగు సినిమాలన్నీ కూడా!?) -
మీమర్స్ తో రచ్చ చేసిన గోపిచంద్,దింపులే హయాతి...
-
ఉగ్రం సినిమా చూసి నా కూతురు అన్న మాటకి...
-
చావో రేవో తేల్చుకుందాం అని సినిమా చేశాను.. యాక్షన్ సీన్స్ లో నరేష్ ఇరగదీశాడు
-
ఈ సినిమాలో ఆరుగురు హీరోయిన్స్
-
బింబిసార 2 కి చిరంజీవి బ్రేక్!
-
డిరైక్టర్ శ్రీవాస్ స్పెషల్ ఇంటర్వ్యూ
-
రాఘవ లారెన్స్ తో యాంకర్ శ్యామల స్పెషల్ చిట్ చాట్
-
ఈసారి గట్టిగా ఇచ్చి పడేద్దాం: యంగ్ హీరో విశ్వక్ సేన్
యంగ్ హీరో విశ్వక్సేన్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా 'దాస్ కా దమ్కీ'. నివేదా పేతురాజు ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, ట్రైలర్ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తియింది. ఇంతకుముందే ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 17న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమా కోసం విశ్వక్ సేన్ అభిమానులకు షాక్ ఇచ్చారు. ఈనెల 17న దాస్ కా ధమ్కీ థియేటర్లలో రిలీజ్ కావడం లేదని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇంకా కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. త్వరలోనే విడుదల కొత్త తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు. ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. 'దాస్ కా ధమ్మీ సినిమాకు సంబంధించిన కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయి. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం. ఈసారి థియేటర్లలో గట్టిగా ఇచ్చిపడేద్దాం.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో రావు రమేశ్, పృథ్విరాజ్, హైపర్ ఆది ప్రధాన పాత్రలు పోషించారు. లియోన్ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. View this post on Instagram A post shared by Vishwaksen (@vishwaksens) -
వారీసు సినిమా చూశా.. త్వరలోనే గుడ్ న్యూస్: లోకేశ్
తమిళ స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం వారిసు. భారీ అంచనాల మధ్య ఈనెల 11న ఈ చిత్రం విడుదలైంది. అయితే విజయ్.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటించడానికి విజయ్ సిద్ధమైనట్లు సమాచారం. వీరిద్దరి కాంబినేషన్లో ఇంతకు ముందు మాస్టర్ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా తెరకెక్కుతున్న చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇది విజయ్ 67వ చిత్రం కాగా.. ఇందులో త్రిష హీరోయిన్గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీన్ని 7 స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై లలిత్‌కుమార్ నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ గ్యాంగ్‌స్టర్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రేజీ చిత్రానికి సంబంధింన పూర్తి వివరాలు ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. దర్శకుడు లోకేశ్ కనకరాజ్ కూడా ఈ చిత్రంపై మౌనం వహిస్తున్నారు. కాగా బుధవారం విడుదలైన వారిసు చిత్రాన్ని దర్శకుడు లోకేశ్ కనకరాజ్ చెన్నైలోని థియేటర్లో ప్రేక్షకుల మధ్య చూశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..'వారిసు చిత్రం విడుదల కోసం ఎంతో అత్రుతగా ఎదురు చూశా. ఇకపై విజయ్ 67వ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ వరుసగా వస్తూనే ఉంటాయి. ఇది విజయ్ అభిమానుల్లో జోష్ నింపుతుంది.' అని అన్నారు. గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్‌గా ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. మాస్టర్ భారీ విజయం తర్వాత దళపతి విజయ్‌తో లోకేష్ కనగరాజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో విజయ్ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రముఖ బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ ప్రాజెక్ట్‌తో తమిళ సినిమా రంగ ప్రవేశం చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్‌లో దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్, అర్జున్ దాస్ సహా స్టార్ తారాగణం నటిస్తున్నారు. -
కేజీయఫ్ కార్మికులతో హీరో విక్రమ్
పాత్రలకు జీవం పోయడానికి ఎంతటి రిస్క్ అయినా చేసే అతి కొద్దిమంది నటుల్లో చియాన్ విక్రమ్ ఒకరు. చిత్రం సక్సెస్ అయినా, ప్లాప్ అయినా నటుడిగా విక్రమ్ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ఇటీవల ఆయన నటించిన కోబ్రానే తీసుకుంటే ఆ చిత్రం ఆశించిన విధంగా ఆడలేదన్నది నిజం. అయితే ఆ చిత్రానికి విక్రమ్ పెట్టిన ఎఫర్ట్‌కు హ్యాట్సాప్ చెప్పాల్సిందే. చిత్రంలో గెటప్‌ల కోసమే ఎంతో సమయాన్ని కేటాయించారు. ప్రస్తుతం నటిస్తున్న తంగలాన్ చిత్రం విషయానికి వస్తే మరోసారి విక్రమ్ తన మార్కు చూపనున్నారని ఆయన గెటప్ చూస్తేనే తెలిసిపోతోంది. దీనికి పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆయన చిత్రాలు కచ్చితంగా ఇతర చిత్రాలకు భిన్నంగా ఉంటాయన్నది తెలిసిందే. ‘తంగలాన్’ చిత్రానికి ఆయన 18వ శతాబ్దం కాలపు నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకోవడం విశేషం. దీంతో ఆ కథకు తగ్గట్టుగా విక్రమ్ మారిపోయారు. నటి పార్వతి, మాళవికా మోహన్ నాయికలుగా నటిస్తున్న ఇందులో నటుడు పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటివలె సెట్స్‌పైకి వచ్చి శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇది కర్ణాటకలోని కేజీఎఫ్ గనుల్లో బానిసలుగా పని చేస్తున్న కార్మికులకుల ప్రధానాంశంతో తెరకెక్కిస్తున్నట్లు యూనిట్ వర్గాలు వెల్లడించారు. కాగా ప్రస్తుతం కేజీఎఫ్ గనుల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. కాగా షూటింగ్ అనంతరం విక్రమ్ కేజీఎఫ్ గనుల్లో పనిచేసే తమిళ కార్మికులను కలిసి వారితో ముచ్చటించారు. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Vikram (@the_real_chiyaan) -
విడుదలకు సిద్ధమైన 'రాజ్ కహాని' చిత్రం.. త్వరలోనే డేట్ ఫిక్స్..!
రాజ్ కార్తికేన్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన చిత్రం 'రాజ్ కహాని'. భార్గవి క్రియేషన్స్ పతాకంపై భాస్కర రాజు, ధార్మికన్ రాజు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ సంగీతం సమకూర్చారు. చంద్రికా అవస్తి, సోనియా సాహా, ప్రియా పాల్, సాయి, జబర్దస్త్ ఫణి తదితరులు నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. చిత్ర దర్శకులు, హీరో రాజ్ కార్తికేన్ మాట్లాడుతూ..'అమ్మ ప్రేమను అంతర్లీనంగా, అమ్మాయి ప్రేమను బాహ్యవలయంగా చేసుకుని అసలైన ప్రేమకు అర్థం చెప్పే మంచి కథ ఉన్న సినిమా ఇది. ఈ సినిమాను ప్రేక్షక లోకం తప్పక ఆదరిస్తారని నమ్మకంగా ఉన్నా.' అని అన్నారు. చిత్ర నిర్మాతలు భాస్కర రాజు, ధార్మికేన్ రాజు మాట్లాడుతూ.. 'మంచి సబ్జెక్టు ఉన్న సినిమా ఇది. ఎంతో ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాను చేశాం. తొందరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. యూత్, ఫ్యామిలీని అకట్టుకునే అన్ని అంశాలు ఉన్నాయని' తెలిపారు. -
ప్రియమణి 'డాక్టర్ 56' మోషన్ పోస్టర్ రిలీజ్
ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం డాక్టర్ 56. రాజేష్ ఆనందలీల దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్‌లుక్ పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. ఇక తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి ఈ సినిమాను ప్రమోట్ చేయడంతో ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వదిలారు మేకర్స్. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీని డిసెంబర్ 9న విడుదల చేయబోతున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. చదవండి: హీరోయిన్‌పై బహిరంగ కామెంట్స్.. నటుడిపై సీరియస్ అయిన చిన్మయి ఈ సందర్భంగా ఈ మూవీ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో సినిమా కాన్సెప్ట్ ఏంటో చెప్పేశారు. ఇండియాలో ఐదేళ్లలో 2163 మంది అంటూ అలా సస్పెన్స్‌గా వదిలేశారు. మోషన్ పోస్టర్లో చూపించిన ఈ సంఖ్య, ప్రియమణి గన్నుపట్టుకున్న తీరు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. చిత్రానికి నోబిన్ పాల్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియమణితో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో ప్రవీణ్, దీపక్ రాజ్‌శెట్టి, రమేష్ భట్, యతిరాజ్, వీణా పొన్నప్ప, మంజునాథ్ హెగ్డే, స్వాతి తదితరులు నటిస్తున్నారు. -
ఆర్జీవీ మరో సంచలన ట్వీట్.. ఆయన వ్యూహమేంటో చెప్పేశారు..!
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అంటే ఓ సంచలనం. ఆయన ఏం చేసినా అందరి కంటే భిన్నంగా ఉంటుంది. ఇటీవల కాలంలో ట్విటర్లో యాక్టివ్‌గా ఉండే వర్మ మరో సంచలనానికి తెరతీశాడు. అతి త్వరలోనే రాజకీయాలపై ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. వ్యూహం పేరుతో ఓ రాజకీయ సినిమా తీయనున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఇది బయోపిక్ కాదు … బయో పిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయో పిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ ,రియల్ పిక్ లో నూటికి నూరు శాతం నిజాలే ఉంటాయని స్పష్ట చేశారు. తాజాగా ఈ ఆయన తీయబోయే సినిమాపై చేసిన మరో ట్వీట్ తెగ వైరలవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌పై వివరణ ఇచ్చారు ఆర్జీవీ. రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఇటీవలే ఆర్జీవీ ప్రకటించారు. వంగవీటి సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన దాసరి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇవాళ ట్వీట్లో ఆర్జీవీ ప్రస్తావిస్తూ.. 'BJP ÷ PK x CBN - LOKESH + JAGAN = వ్యూహం' అంటూ కొత్త అర్థం చెప్పారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మొదటి పార్ట్ “వ్యూహం” , రెండోది “శపథం” .రెండింటిలోనూ రాజకీయ ఆరాచకీయాలు పుష్కలంగా ఉంటాయి. రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం “వ్యూహం “ షాక్ నుంచి తెరుకునే లోపే వాళ్ళకి ఇంకో ఎలెక్ట్రిక్ షాక్ , పార్ట్ 2 “శపథం “ లో తగులుతుందంటూ అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచారు. BJP ÷ PK x CBN - LOKESH + JAGAN = వ్యూహం — Ram Gopal Varma (@RGVzoomin) October 28, 2022 -
ప్రియమణి లేటెస్ట్ మూవీ.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'డాక్టర్ 56.' ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి చేతుల మీదుగా ప్రియమణి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు ఈ సినిమాను సౌత్‌లోని అన్ని భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకు కథ, కథనాలను ప్రవీణ్ అందిస్తుండగా.. రాజేష్ ఆనందలీల దర్శకత్వం వహిస్తున్నారు. హరిహర పిక్చర్స్‌పై ఈ సినిమాను ప్రవీణ్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి నోబిన్ పాల్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియమణితో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో ప్రవీణ్, దీపక్ రాజ్‌శెట్టి, రమేష్ భట్, యతిరాజ్, వీణా పొన్నప్ప, మంజునాథ్ హెగ్డే, స్వాతి తదితరులు నటిస్తున్నారు. -
'ఒక నిర్మాత బ్లాంక్ చెక్ ఇస్తే.. నాకు అదే ముఖ్యమని చెప్పా'
బాలీవుడ్ యంగ్ హీరోల్లో ఆయుష్మాన్ ఖురానా ఒకరు. విక్కీ డోనర్, అంధాదున్, ఆర్టికల్ 15, డ్రీమ్ గర్ల్, బాలా, చంఢీగర్ కరే ఆషికీ వంటి తదితర చిత్రాలతో క్రేజ్ సంపాదించాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం డాక్టర్ జి. అయితే ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఒక నిర్మాత తనకు బ్లాంక్ చెక్ ఇస్తే తిరస్కరించినట్లు చెప్పారు. 'లక్ష్మీ సే పహలే సరస్వతి ఆతీ హై' (లక్ష్మి కంటే సరస్వతి ముఖ్యం) అని అన్నట్లు తెలిపారు. ఒక సినిమాకు ఒప్పుకున్నాక అదే నాకు ముఖ్యమని ఆయన వెల్లడించారు. ఒక నిర్మాత ఆయనను సంప్రదించి బ్లాంక్ చెక్ ఇచ్చి మూడు సినిమాలు చేయమని అభ్యర్థించారని తెలిపారు. ఆయుష్మాన్ మాట్లాడుతూ.. 'ఒకప్పుడు నాకు బ్లాంక్ చెక్ ఇచ్చి.. ‘ఎంత కావాలంటే అంత తీసుకోండి. మాతో మూడు సినిమాలు చేయండి' అని ఆఫర్ చేశారని అన్నారు. దీనికి వెంటనే నాకు డబ్బుల కంటే స్క్రిప్ట్ చాలా ముఖ్యమని ఆయనతో తేల్చి చెప్పానని వివరించారు. తన హిట్ సినిమాలన్నీ ఫస్ట్ టైమ్ డైరెక్టర్స్‌తో చేసినవే అని ఆయుష్మాన్ ఖురానా చెప్పారు. మొదటిసారి దర్శకులు చాలా బాగా సహకారంతో ఉంటారని చెప్పుకొచ్చారు. కాబట్టి అలాంటి వారితో పని చేయడం చాలా సులభంగా, సరదాగా ఉంటుందని అన్నారు. -
యథార్థ ఘటనల ఆధారంగా వస్తున్న 'చెంచల'.. ఆసక్తికరంగా టైటిల్ లోగో
యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'చెంచల'. ఈ సినిమాలో ఓ ప్రముఖ కథానాయిక కనిపించబోతున్నారు. తాజాగా విజయ దశమి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగోను విడుదల చేసింది చిత్రబృందం. ఈ మూవీకి జగదీష్ అచార్ దర్శకత్వం వహిస్తుండగా.. కేజీయఫ్ ఫేమ్ రవి బస్రూర్, సుజిత్ శెట్టిలు సంగీతాన్ని అందిస్తున్నారు. శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత ఏఎన్ బాలాజీ నిర్మిస్తున్నారు. 'చెంచల' మూవీ కూర్గ్ ప్రాంతంలో పాము చుట్టూ జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమా కథ చెంచల పాత్రకు, ఓ పాముకు మధ్య సాగుతుంది. చెంచల కుటుంబం ఎలా హత్యకు గురైంది? తన గతం ఏంటి? పాముతో తనకున్న సంబంధం ఏంటి? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తామని నిర్మాత ఏఎన్ బాలాజీ తెలిపారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున నిర్మిస్తున్నామని.. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారభిస్తామని ఆయన ప్రకటించారు. -
అజిత్ 61 మూవీ టైటిల్ ఇదే.. ఆకట్టుకుంటున్న ఫస్ట్‌లుక్ పోస్టర్
నటుడు అజిత్ చిత్రానికి సంబంధించిన ఎలాంటి విషయం వెలువడినా ఆయన అభిమానుల్లో పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఇంతకీ కారణం చెప్పలేదు కదూ! నటుడు అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న 61వ చిత్రం పేరేమిటి? అది ఎలా ఉండబోతోంది, ఎప్పుడు తెరపైకి రాబోతోంది అన్న విషయాల గురించి తెలుసుకోవడానికి అభిమానులు చాలా ఆత్రుత గా ఎదురుచూస్తున్నారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ తన 61వ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనిని బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, జీ సీనిమాతో కలిసి నిర్మిస్తున్నారు. ప్రముఖ మలయాళం నటి మంజు వారియర్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్ర టైటిల్, పస్ట్ లుక్ పోస్టర్లను బుధ, గురువారాల్లో వరుసగా విడుదల చేసి సర్ప్రైజ్ ఇచ్చారు. ఇక ఈ చిత్రానికి ‘తునివు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీనికి నో గట్స్ నో గ్లోరి అనే ట్యాగ్ లైన్ జోడించారు. #THUNIVU first look #Ajith #ajithkumarfans #Ajithkumar𓃵 pic.twitter.com/Dpl3b2n13B — Narinder Saini (@Narinder75) September 21, 2022 -
వివక్షకు విరుగుడు ప్రశ్నించడమే!
ఎన్నిసార్లు మాట్లాడినా ఎంతోకొంత మిగిలిపోయే అంశం – కుల వివక్ష. అది దేశమంతా వేళ్లూనుకుని ఉన్న జాడ్యం. దాన్ని తెగ నరకాలంటే ఆధిపత్య కులాలు తమ ధోరణిని పరిశీలించుకోవాలి. అణిచివేతకు గురయ్యే వాళ్లు ప్రశ్ననే అస్త్రంగా మలుచుకోవాలి. అలా ఎక్కుపెట్టిన ఒక ప్రశ్నారూపమే ‘జై భీమ్’. అయితే విమర్శకులనూ, ప్రేక్షకులనూ ఏకరీతిలో స్పందింపజేసిన ఈ సినిమా తమిళనాడులోని ఒక వర్గాన్ని మాత్రం ఆగ్రహానికి గురిచేసింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసిన ఈ చిత్రం మీద రాజకీయంగా శక్తిమంతులైన వణ్ణియర్ల కుల సంఘం లేవనెత్తిన అభ్యంతరాల వల్ల... ఆదివాసీ ఇరుళ తెగ, ఇంకా అలాంటి సామాజిక వెలివేతకు గురవుతున్నవారి జీవితం గురించి చేయాల్సిన ఆలోచన పక్కదారి పడుతోంది. అది కీరపాక్కం గ్రామం. తమిళనాడులోని చెంగల్పట్ జిల్లాలోని ఒక పల్లెటూరు. ఆ ఊరికి దగ్గర ఒక గుడిసెల సముదాయం. గుడిసెలపై కప్పి ఉన్న పాలిథీన్ కవర్లు, ప్లాస్టిక్ పేపర్లు వాళ్ళ కటిక దారిద్య్రాన్ని విప్పి చెబుతున్నాయి. ఆ ఇళ్ళల్లోని ఒక ఇంట్లో నాగమ్మ అనే యాభై ఐదేళ్ళ మహిళ ఉంటున్నది. ఆ గూడెం ఊరిలో భాగం కాదు. అక్కడికి వెళ్ళ డానికి రోడ్డు పెద్ద మాట, ఎటువంటి దారీ తెన్నూ లేని వారి జీవితంలానే ఉంటుంది తొవ్వ. ఒక రోజు కొందరు వ్యక్తులు ఏడుపులు, పెడబొబ్బలతో ఒక మనిషిని మోసుకొచ్చారు. ఆ వ్యక్తి చావుకు దగ్గరవుతున్నట్టు వాళ్ళ ఏడుపులని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆ గుంపు నాగమ్మ గుడిసె ముందు ఆగింది. నాగమ్మకు వెంటనే విషయం అర్థమైంది. మోసు కొచ్చిన వ్యక్తిని పట్టుకొని చూసింది. పాము కాటు వేసినట్టు గమనించింది. దగ్గర్లో ఉన్న పొదల్లోకి వెళ్ళి ఆకులను తీసుకొచ్చింది. తన వద్ద ఉన్న కొన్ని వేళ్ళు, బెరడులు, ఆకుల్ని కలిపి నూరింది. పసరు పాము కాటు వేసిన చోట పిండింది. నూరిన ముద్దను గాయంపైన కట్టింది. అట్లా రెండు మూడుసార్లు చేసిన తర్వాత ఆ వ్యక్తి కళ్ళు తెరిచాడు. ఈ వైద్యం చేసింది తమిళనాడులోని ఇరుళ ఆదివాసీ తెగకు చెందిన మహిళ. తమిళనాడులో ఉన్న ప్రాచీన ఆదివాసీ తెగలలో ఇది ఒకటి. తమిళనాడులో ముఖ్యంగా యాక్షన్ సినిమాల్లో రాణిస్తున్న సూర్య తీసిన ‘జై భీం’ చిత్రం ఇటీవల ఒక సంచలనాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. మానవత్వం ఉన్న ప్రతి మనిషీ ఈ సినిమాను ఇష్టపడ్డారు. ఆ సినిమాలో ఒక ఆదివాసీ వ్యక్తిపై, దొంగతనం నేరం మోపి, పోలీ సులు చిత్రహింసలు పెట్టి చంపేశారు. అయితే ఇది కథ కాదు. నిజంగా జరిగింది. ఆ వ్యక్తి పేరు రాజాకన్నన్. ఆయన ఇరుళ తెగకు చెందిన వాడు. జై భీం చిత్రం కొందరికి కొరకరాని కొయ్యగా కూడా తయారయ్యింది. కోడిగుడ్డుపైన ఈకలు పీకినట్టు ఏదో చేయాలని ప్రయత్నం చేశారు. కొన్ని సన్నివేశాలు, పేర్లు తమ ప్రతిష్టను దెబ్బతీశాయనీ, ఐదు కోట్ల పరువునష్టం చెల్లించాలనీ కోర్టును ఆశ్ర యించారు. వాళ్ళే వణ్ణియర్ కుల సంఘం పెద్దలు. ఆ కుల సంఘానికి మరో పేరు పీఎంకే. పాట్టాళి మక్కళ్ కట్చి. దాని నాయకుడు ఎస్. రామదాసు. ఆయన కూడా ఈ చిత్రంపైన విరుచుకుపడ్డారు. వణ్ణియర్ కుల ప్రతిష్టకూ ఈ చిత్రానికీ ఉన్న సంబంధం ఏమిటి? నిజానికి దీనిని ఎవ్వరూ అంతగా గమనించలేదు. సినిమాలో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు. ఆయన పేరు సినిమాలో గురుమూర్తి. ఆ పేరు పెట్టడమే వాళ్ళ తొలి అభ్యంతరం. గురుమూర్తి అనే పేరు వాళ్ల ఒక నాయకుడిని గుర్తు చేస్తుందన్నది వాళ్ళ వాదన. అయితే వాళ్ళ నాయకుడి పేరు జె.గురు. ఆ ఇన్స్పెక్టర్ క్రూరంగా ప్రవర్తిస్తాడు. అందువల్ల తమ నాయకుడి జ్ఞాపకాలు వస్తాయని ఆ సంఘం ఆరోపణ. జె. గురు అనే నాయకుడు రెండుసార్లు శాసనసభ్యుడు. అరియాబారు జిల్లా, జయకొండు నియోజకవర్గం నుంచి పీఏంకే నుంచి ఎన్నికయ్యారు. ఆయనది వణ్ణియర్ సంఘంలో కీలక భూమిక. వీళ్లు ఉత్తర తమిళనాడులో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీ సామాజిక వర్గం. జె.గురు అనే వ్యక్తి పదుల కొద్దీ దాడుల్లో పాల్గొన్నాడనడానికి ఆయన మీద నమోదైన కేసులే సాక్ష్యం. ఈ చిత్రంపై వణ్ణియర్ సంఘం చేసిన రెండో ఆరోపణ... సిని మాలో పోలీస్ ఇన్స్పెక్టర్ గురుమూర్తి మాట్లాడుతున్నప్పుడు ఆయన వెనుక ఒక క్యాలెండర్ ఉందనీ, అందులో తమ కుల చిహ్నమైన కలశం ఉన్నదనీ (దీన్ని ఇటీవల సినిమా నుంచి తొలగించారు). నిజా నికి ఈ రెండు విషయాలను ప్రేక్షకులను గమనించనే లేదు. కానీ ఈ సంఘం ఈ చిత్రాన్ని ఎందుకు టార్గెట్ చేసింది అంటే అందుకు తమిళనాడు కుల చరిత్రను తడిమి చూడాల్సిందే. తమిళనాడులో జరుగుతున్న కుల ఘర్షణలు, దళితుల, ఆదివాసులపైన దాడులు చాలా కిరాతకంగా ఉంటున్నాయి. ఉత్తర తమిళనాడులో వణ్ణియర్లు సామాజిక, రాజకీయ ఆధిపత్యాన్ని కలిగివున్నారు. వణ్ణియర్లు అధికంగా ఉన్నచోటే ఇరుళ ఆదివాసీ తెగ కూడా ఉంది. ఇరులు అత్యంత వెనుకబడిన ఆదివాసీ తెగ. ఈ తెగ దేశానికీ, సమాజానికీ ఎంతో మేలు చేసిన విషయం ఎవరికీ తెలియదు. పాము కాటుకు విరుగుడు ఇంజెక్షన్ తయారు చేయడానికి ప్రాథమికమైన ముడిపదార్థం పాము విషం. పామును పట్టుకొని, ప్రాణాలకు తెగించి పాము కోరల నుంచి పాము విషాన్ని తీసి ఇస్తే, దానిని వివిధ పద్ధతుల ద్వారా ప్రాసెస్ చేసి, విషం విరుగుడు ఇంజక్షన్ తయారు చేస్తారు. అంతేకాకుండా, ఈ తెగ గొప్ప వైద్య సాంప్రదాయాన్ని ప్రకృతి నుంచి పుణికి పుచ్చుకుంది. దాదాపు 300 రకాల మందులను తయారు చేసే జ్ఞానం వీరి సొంతం. అయితే ఇప్పటికీ వీరు గ్రామాల్లో నివాసముండరు. నూటికి తొంభై మందికి చదువులేదు. సరైన జీతాలు లేని పద్ధతుల్లో, ఇటుక బట్టీల్లో, రైస్ మిల్లుల్లో పని చేస్తున్నారు. ఇవన్నీ పోను గ్రామాల్లో ఎక్కడ దొంగతనమైనా ముందు ఇరుళ సామాజిక వర్గం వారిని పట్టుకొచ్చి, హింసించడం తమిళనాడులో పాతుకు పోయిన కులాధిపత్యానికి తార్కాణం. ప్రతి సంవత్సరం కొన్ని వందల కేసులు వీళ్ళ మీద నమోదవుతుంటాయి. మగ వాళ్ళ కోసం వచ్చిన పోలీసులు మహిళలను పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళి అత్యా చారాలు జరిపిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇది జై భీం సినిమాలో కూడా చూశాం. ఇరుళ ఆదివాసీ హక్కుల సంఘాలు ఈ విషయాలను ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. ఒకవైపు పోలీసులు, రెండో వైపు పల్లెల్లోని ఆధిపత్య కులాలు ఇరుళ తెగ ప్రజలను పెడుతున్న హింస చెప్పనలవి కానిది. వణ్ణియర్ సంఘం నాయకులు ఎటువంటి భయ సంకోచాలు లేకుండా, చట్టాలను, రాజ్యాంగాన్ని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. పదేళ్ళ క్రితమే పీఏంకే అధ్యక్షుడు రామదాసు ‘కులాంతర వివాహాలను జరగనివ్వం. ఎవరైనా వణ్ణియర్ కులం పిల్లలతో సంబంధాలు పెట్టుకుంటే తగిన శిక్ష అనుభవిస్తారు’ అని ప్రకటించారు. ఈ సంవత్సరం, సెప్టెంబర్ పదవ తేదీన ఇరుళ తెగకు చెందిన రమేష్, వణ్ణియర్ కులానికి చెందిన మోహన ప్రేమ వివాహం చేసుకున్నారు. ధర్మపురి జిల్లాలోని ఒక గ్రామంలో ఈ సంఘటన జరిగింది. అయితే అమ్మాయి తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి, అబ్బాయి తల్లిదండ్రులను పట్టుకొని ఊరికి తీసుకొచ్చి, అబ్బాయి తండ్రిమీద ఆ ఊరిలోని ఆ కులపోళ్ళు బహిరంగంగా మూత్రం పోసిన దారుణ ఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. ధర్మపురి పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అంటే జై భీం చిత్రంలో మనం చూసింది ఒక్క ఘటన మాత్రమే. ఈ చిత్రం వల్ల తాము చేసిన ఎన్నో దురంతాలు ప్రజల మెదళ్లలోకి వెళతాయని భయపడిన కులోన్మాదులు ఈ చిత్రాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. నిజానికి తమిళనాడులో పంటలను దెబ్బతీస్తున్న ఎలుకలను, గ్రామాల్లో ప్రజల ప్రాణాలకు హానికరంగా మారిన పాములను పట్టుకొని తరతరాలుగా రైతులకు మిత్రులుగా ఉన్న ఇరుళ తెగ మీద జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వాళ్ళు కుల మతోన్మాదాన్ని తుదముట్టించాలి. మానవీయతకు ప్రాణం పోయాలని తపిస్తున్న వాళ్లంతా మరొక్కసారి దళితులు, ఆదివాసీలు ఈ దేశానికీ, సమాజానికీ చేసిన నిస్వార్థమైన సేవలను, అని తరసాధ్యమైన త్యాగాలను గుర్తించాలి. - మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు -
రానా సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చేశాడుగా !
సాక్షి, హైదరాబాద్ : భల్లాల దేవుడు రానా దగ్గుబాటి తన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘అరణ్య’ సంబంధించి తన అభిమానులకు ఉత్సాహాన్నిచ్చే వార్తను షేర్ చేశారు. త్వరలోనే అరణ్య సినిమా థియేటర్లను పలకరించనుందని ప్రకటించారు. నిరీక్షణ ఇక చాలు..‘అరణ్య’ సినిమాను 2021 సంక్రాంతికి థియేటర్లలో విడుదల చేయబోతున్నామని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీనికి సంబంధించి ఒక వీడియోను ట్విటర్లో రిలీజ్ చేశారు. అంతేకాదు ప్రస్తుతం కోవిడ్ మహమ్మారిపై మన పోరాటం.. మానవ విధ్వంసంపై అడవుల పోరును సూచిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ విధ్వంసం ఎప్పుడు ఆగుతుంది!? అరణ్య సినిమాతో అవగాహన పెంచుకుందాం అంటూ రానా కమెంట్ చేశారు. రానా ప్రధాన పాత్రలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ రూపొందిస్తున్న వైవిధ్యమైన చిత్రం ‘అరణ్య’. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. జోయా హుస్సేన్, కల్కి కణ్మిణీ, పులకిత్ సామ్రాట్, విష్ణు విశాల్, శ్రియా పిలగోన్కర్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సాల్మన్ ప్రభు దర్శకుడు. హిందీలో ‘హథీ మేరే సాథి’, తమిళంలో ‘కాండన్’ పేరుతో ప్రేక్షకులను పలకరించనుంది. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ అద్భుతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. విలక్షణ పాత్రలతో తనదైన శైలిలో ఆకట్టుకుంటున్న రానా ‘అరణ్య’లో కూడా అదే తరహాలో అలరించడం ఖాయం అంటున్నారు. అలాగే జంతు ప్రేమికుడు, నేషనల్ అవార్డ్ గ్రహీత ప్రభు సాల్మన్ దర్శకత్వ ప్రతిభ, ‘లైఫ్ ఆఫ్ పై’లాంటి సినిమాలకు గ్రాఫిక్స్ అందించిన ప్రాణ స్టూడియో వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్నాయని అంచనా. హాలీవుడ్ రేంజ్ లో అదరగొడుతున్న బీజీఎం ఈ అంచనాలను మరింత పెంచేస్తోంది.