![Nithya Menen Shares a photo from Her Latest Movie Look Goes Viral - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/28/nithya.jpeg.webp?itok=lS6_TLfC)
అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన నటి నిత్యామీనన్. ఆ తర్వాత నితిన్ సరసన ఇష్క్ సినిమాతో గుర్తింపు దక్కించుకుంది. ఆమె తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళంలో దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో గుండెజారి గల్లంతయ్యిందే, జనతా గ్యారేజ్, 100 డేస్ ఆఫ్ లవ్, ఒక్క అమ్మాయి తప్ప, ఇంకొక్కడు లాంటి చిత్రాల్లో నటించింది. నిత్యా మీనన్ ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తోంది.
తాజాగా మరో ఆసక్తికర స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టాలో పంచుకుంది. ఓ యువతి ప్రేమకథా ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రంలో ఆమె నటిస్తున్నట్లు కనిపిస్తోంది. గతంలో సత్యజిత్ రే.. ఠాగూర్ చిన్న కథ ఆధారంగా తెరకెక్కించిన సమాప్తి పేరుతో సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో మృణ్మోయి అనే యువతి పాత్రను చూపించారు. తాజాగా నిత్యా మీనన్ పోస్టర్ చూస్తే అదే కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment