Actress Nithya Menen Open Comments About Her Marriage Plans In Latest Interview - Sakshi
Sakshi News home page

Nithya Menen: 'అంతకంటే గొప్పగా ఆలోచించాలి'.. పెళ్లిపై నిత్యామీనన్ ఆసక్తికర కామెంట్స్..!

Published Mon, Nov 21 2022 6:48 PM | Last Updated on Mon, Nov 21 2022 7:30 PM

Nithya Menen Open About Her Marriage Plans In Interview - Sakshi

దక్షిణాది సినిమాల్లో నటి నిత్యామీనన్‌కు ఫేమ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆమె ఏ పాత్ర పోషించినా అందులో సహజత్వం ఉట్టి పడుతుంది. అలాగే ఏది పడితే ఆ పాత్ర ఒప్పుకోదు. అదే ఆమెలో ప్లస్, మైనస్‌ కూడా. నటనకు అవకాశం ఉన్న పాత్రలే అంగీకరించి పేరు తెచ్చుకుంటోంది. స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో 'ఒకే బంగారం' సినిమాలో కూడా నటించింది భామ. ప్రస్తుతం ఆమె 'వండర్ ఉమెన్ అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సమాజంలో ఉన్న సంప్రదాయాలను మనం గౌరవించాలంటూ చెప్పుకొచ్చింది. 

నిత్యామీనన్ మాట్లాడుతూ.. 'నేను పక్కా ట్రేడిషనల్. నేను మన సంస్కృతిని గౌరవిస్తా. ఇండియా వేదిక్ కల్చర్‌ను గట్టిగా నమ్ముతా. పెళ్లంటే అది ఒక సోషల్ సెటప్. అంటే ఫైనాన్షియల్‌గా ముడిపడి ఉన్న సెటప్‌. నాకు అలాంటి సెక్యూరిటీ అవసరం లేదు. అంతకు మించి ఏదైనా ఉంటే ఆలోచిస్తా. ఎవరైనా దానికి మించి ఆలోచించేవాళ్లు దొరికితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటా.' అంటూ నవ్వుతూ చెప్పింది. నిత్యా మీనన్ నటించిన పాపులర్ వెబ్ సిరీస్ బ్రీత్: ఇన్‌టు ది షాడోస్‌. ఈ వెబ్ సిరీస్ రెండో సీజన్‌లో అభా పాత్రలో కనిపించనుంది. ఈ డ్రామాలో అభిషేక్ బచ్చన్, డా. అవినాష్ సబర్వాల్ కూడా ఉన్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement