
హీరోయిన్ నిత్యామీనన్ ఇప్పుడు టీచర్‌గా మారిపోయింది. ఇదేదో సినిమా షూటింగ్ కోసం కాదండోయ్. నిజంగానే పంతులమ్మగా మారిపోయి పిల్లలకు పాఠాలు చెప్పిందీ అందాల తార. ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న నిత్యామీనన్ షూటింగ్ అనంతరం దగ్గర్లోని గవర్నమెంట్ స్కూల్‌కి వెళ్లింది. అక్కడి పిల్లలతో కాసేపు సరదాగా మాట్లాడిన ఆమె ఆ తర్వాత వారికి పాఠాలు చెప్పింది.
దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. కృష్ణాపురం గ్రామంలోని ఈ పిల్లలతో న్యూ ఇయర్ డే ఆనందంగా గడిచిందంటూ నిత్యామీనన్ తన పోస్టులో రాసుకొచ్చింది.
పల్లెటూర్లలో ఉండే చిన్నారులు బాల్యాన్ని ఎంతో ఆనందంతో గడుపుతారని, వాళ్ల చుట్టూ ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉంటానంటూ పేర్కొంది. ఇక నిత్యామీనన్ టీచింగ్ క్లాసులు చూసి ఫిదా అయ్యామంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment