Santhosh Varki Reaction To Nithya Menen Allegations Of Mental Harassment, Details Inside - Sakshi
Sakshi News home page

Nithya Menen-Santhosh Varkey Issue: 'ఆమె గురించి ముందే తెలిస్తే ప్రేమలో పడే వాడినే కాదు'

Published Sun, Aug 7 2022 3:00 PM | Last Updated on Sun, Aug 7 2022 4:06 PM

Santhosh Varki Reply To Nithya Menen After Her Allegations Of Mental Harassment - Sakshi

ప్రేమిస్తున్నానంటూ సంతోష్‌ వర్కీ అనే వ్యక్తి తనను ఆరేళ్ల నుంచి వేధిస్తున్నాడని హీరోయిన్‌ నిత్యామీనన్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఓ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తన పెళ్లిపై జరిగిన ప్రచారంపై ఆమె స్పందించింది. సంతోష్‌ వర్కీ తనకు 30కి పైగా నంబర్స్‌ నుంచి కాల్‌ చేస్తూ విసిగించేవాడని పేర్కొంది. తాజాగా తనపై నిత్యామీనన్‌ చేస్తున్న ఆరోపణలపై సంతోష్‌ వర్కీ స్పందించాడు.

ఇందులో వాస్తవం లేదని, ఒకే వ్యక్తి పేరు మీద ఎన్ని సిమ్‌కార్డులు కొనగలడో జనాలకే వదిలేస్తున్నాడని చెప్పాడు. నిత్యామీనన్‌కు వేరే వ్యక్తితో నిశ్చితార్థం జరిగిందని వాళ్ల తల్లి చెబితే, జరగలేదని తండ్రి చెప్పారు. అంతేకాకుండా వాళ్లు నాపై లైంగిక వేధింపుల కేసు కూడా పెట్టాలని చూస్తున్నారు.

'గతంలో నిత్యామీనన్‌ అంటే తనకు ఇష్టం ఉండేది. తనను పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నా. కానీ ఇప్పుడు చచ్చినా ఆమెను పెళ్లిచేసుకోను. అసలు నిత్యామీనన్‌ గురించి ఇవన్నీ ముందే తెలిస్తే ప్రేమించి ఉండే వాడినే కాదు'. అంటూ కామెంట్స్‌ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు అసలు నువ్వు నిత్యామీనన్‌ను రిజెక్ట్‌ చేయడమేంటి?నీకంత సీన్‌ ఉందా? అంటూ హీరోయిన్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

ఎవరీ సంతోష్‌ వర్కీ?
నిత్యామీనన్‌ పెళ్లి వార్తలతో ఒక్కసారిగా పాపులర్ అయిన సంతోష్‌ వర్కీ ఓ యూట్యూబర్‌. సినిమాల రివ్యూస్‌ చెప్పడంలో మలయాళంలో గుర్తింపు పొందాడు. చదవండి: ఆ వ్యక్తి ఆరేళ్లుగా వేధించాడు.. నిత్యామీనన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement