
'అలా మొదలైంది' సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన మలయాళ ముద్దుగుమ్మ నిత్యా మీనన్. చేసినవి కొన్ని సినిమాలే అయినా అందం, నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న నిత్యా మీనన్ రీసెంట్‌గా భీమ్లా నాయక్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఓ షోకు జడ్జిగానూ వ్యవహరిస్తోంది. ఇప్పుడీ మల్టీ ట్యాలెంటెడ్ హీరోయిన్ తాజాగా సొంతంగా యూట్యూబ్ చానల్ మొదలుపెట్టింది.
నిత్య అన్‌ఫిల్టర్డ్’(Nithya Unfiltered)పేరుతో యూట్యూబ్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చేసింది. తన 12ఏళ్ల సినీ కెరీర్‌కి సంబంధించిన విషయాలను ఫస్ట్ వీడియోలో షేర్ చేస్తూ తన వ్యక్తిగత,వృత్తిపరమైన జీవిత విశేషాలపై మరిన్ని వీడియోలతో త్వరలోనే మీ ముందుకు రాబోతున్నానంటూ పేర్కొంది. ఇక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన కాసేపటికే వేలమంది ఫాలోవర్లు వచ్చి చేరారు.
Comments
Please login to add a commentAdd a comment