
హీరోయిన్ నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. విభిన్నమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీ పెళ్లి వార్తలపై గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీటిపై ఆమె క్లారిటీ ఇచ్చినా రూమర్స్ మాత్రం ఆగడం లేదు. తాజాగా దీనిపై స్పందించిన నిత్యామీనన్ తన పెళ్లి గురించి వస్తోన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చేసింది. చదవండి: కవల పిల్లలకు జన్మనిచ్చిన హీరోయిన్ నమిత..
'కాలు బాలేక రెస్ట్ తీసుకుంటే.. పెళ్లి చేసుకుంటుంది కాబట్టే కథలు వినట్లేదు అని రూమర్స్ పుట్టించారు' అని తెలిపింది. మరి పెళ్లి చేసుకోమని దుల్కర్ మీకు సూచించారట కదా అని అడగ్గా..'తను నాకు మంచి ఫ్రెండ్. అందుకే పెళ్లి చేసుకొని ఫ్యామిలీతో సంతోషంగా ఉండమని నాకు చెబుతుంటాడు. ప్రస్తుతానికి నాకు పెళ్లి ఆలోచన లేదు కానీ భవిష్యత్తులో చేసుకుంటానేమో తెలీదు' అంటూ చెప్పుకొచ్చింది.
ఇక ఇటీవలి కాలంలో తనపై వస్తున్న రూమర్స్‌పై స్పందిస్తూ..నేను ఇండస్ట్రీలో ఎప్పుడూ ఎదుర్కొనే ఇబ్బంది ఏంటంటే..''నన్ను ఇండస్ట్రీ బ్యాన్ చేసిందనే వార్తలు పుట్టించారు. కావాలనే తప్పుగా ప్రచారం చేశారు. మనం మంచి స్థాయిలో ఉన్నప్పుడు మనల్ని కిందకి లాగాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు. అందరి గురించి నేను ఆలోచిస్తూ పోతే నా పనులు చేసుకోవడానికి సమయం దొరకదు’’ అన్నారు.చదవండి: అందుకే నిత్యామీనన్‌ను వద్దనుకున్నారా? రివీల్ చేసిన నిర్మాత
Comments
Please login to add a commentAdd a comment