ప్రియమణి 'డాక్టర్ 56' మోషన్ పోస్టర్ రిలీజ్‌ | Priyamani Dr 56 Motion Poster Out And Hits in Theatres on December 9, 2022 | Sakshi
Sakshi News home page

Priyamani: ప్రియమణి 'డాక్టర్ 56' మోషన్ పోస్టర్ రిలీజ్‌

Nov 11 2022 4:49 PM | Updated on Nov 11 2022 4:50 PM

Priyamani Dr 56 Motion Poster Out And Hits in Theatres on December 9, 2022 - Sakshi

ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం డాక్టర్‌ 56.  రాజేష్‌ ఆనందలీల దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. ఇక తమిళ స్టార్‌ నటుడు విజయ్‌ సేతుపతి ఈ సినిమాను ప్రమోట్‌ చేయడంతో ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా  ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ వదిలారు మేకర్స్‌. ప్రస్తుతం షూటింగ్‌ చివరి దశకు చేరుకున్న ఈ మూవీని డిసెంబర్‌ 9న విడుదల చేయబోతున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది.

చదవండి: హీరోయిన్‌పై బహిరంగ కామెంట్స్‌.. నటుడిపై సీరియస్‌ అయిన చిన్మయి

ఈ సందర్భంగా ఈ మూవీ మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో సినిమా కాన్సెప్ట్ ఏంటో చెప్పేశారు. ఇండియాలో ఐదేళ్లలో 2163 మంది అంటూ అలా సస్పెన్స్‌గా వదిలేశారు. మోషన్ పోస్టర్లో చూపించిన ఈ సంఖ్య, ప్రియమణి గన్నుపట్టుకున్న తీరు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి.  చిత్రానికి నోబిన్ పాల్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియమణితో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో ప్రవీణ్, దీపక్ రాజ్‌శెట్టి, రమేష్‌ భట్, యతిరాజ్, వీణా పొన్నప్ప, మంజునాథ్ హెగ్డే, స్వాతి తదితరులు నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement