ప్రియమణి లేటెస్ట్ మూవీ.. ఫస్ట్‌ లుక్ పోస్టర్ రిలీజ్ | Priyamani Latest Movie Doctor 56 First Look Poster Released | Sakshi
Sakshi News home page

Priyamani First Look Poster: ప్రియమణి ఫస్ట్ లుక్ పోస్టర్ అదుర్స్

Published Mon, Oct 17 2022 7:53 PM | Last Updated on Mon, Oct 17 2022 7:55 PM

Priyamani Latest Movie Doctor 56 First Look Poster Released  - Sakshi

ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'డాక్టర్ 56.'  ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి చేతుల మీదుగా ప్రియమణి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు  ఈ సినిమాను సౌత్‌లోని అన్ని భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

ఈ సినిమాకు కథ, కథనాలను ప్రవీణ్‌ అందిస్తుండగా.. రాజేష్‌ ఆనందలీల దర్శకత్వం వహిస్తున్నారు. హరిహర పిక్చర్స్‌పై ఈ సినిమాను ప్రవీణ్‌ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి నోబిన్ పాల్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియమణితో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో ప్రవీణ్, దీపక్ రాజ్‌శెట్టి, రమేష్‌ భట్, యతిరాజ్, వీణా పొన్నప్ప, మంజునాథ్ హెగ్డే, స్వాతి తదితరులు నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement