![Priyamani Reacts On Trolls On Her Marriage With Musthafa - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/26/priyamani_0.jpg.webp?itok=F-heBPxc)
సీనియర్ నటి ప్రియమణి పేరు చెప్పగానే యమదొంగ సినిమానే గుర్తుకు వస్తుంది. అమాయకంగా తనదైన నటనతో అభిమానులను ఆకట్టుకుంది. పెళ్లైన కొత్తలో, గోలీమార్ చిత్రాల్లోనూ తన నటనతో మెప్పించింది. టాలీవుడ్‌లో స్టార్ హీరోలందరితో నటించింది ముద్దుగుమ్మ. ఇటీవలే నాగచైత్యన కస్టడీ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించింది ప్రియమణి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి తాను చాలా సందర్భాల్లో ట్రోల్స్‌కు గురైనట్లు వెల్లడించింది. ముఖ్యంగా తన పెళ్లి సమయంలో నెటిజన్స్ తీవ్రంగా విమర్శలు చేశారని తెలిపింది.
(ఇది చదవండి: పరువు తీసుకుంటున్న బాలీవుడ్.. చివరకి ఆ పాట!)
ప్రియమణి మాట్లాడుతూ.' నేను ట్రోల్స్‌ను పెద్దగా పట్టించుకోను. బాడీ షేమింగ్, కలర్ గురించి ఇప్పటికీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాను ముస్తఫాను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. ఆ సమయంలో సోషల్‌మీడియాలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. నువ్వేందుకు వేరే మతం వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నావు?' అంటూ అసభ్యకరమైన కామెంట్స్ చేశారు.' అని అన్నారు.
ట్రోల్స్‌పై స్పందిస్తూ.. నా జీవితాన్ని ఎవరితో కొనసాగించాలనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని ప్రియమణి అన్నారు. ట్రోల్స్‌ను పెద్దగా పట్టించుకోనని.. మీ అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని తెలిపారు. ట్రోల్స్‌కు ప్రాధాన్యత ఇచ్చి.. వాటి వల్ల బాధపడటం తనకు నచ్చదని పేర్కొన్నారు. కాగా.. 2017లో వ్యాపారవేత్త ముస్తఫారాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక.. నారప్ప, భామా కలాపం, విరాటపర్వం చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం షారూక్ ఖాన్ నటిస్తోన్న జవాన్‌లో కనిపించనున్నారు.
(ఇది చదవండి: వాల్తేరు వీరయ్య భామకు అరుదైన అవార్డ్.. ఆడేసుకుంటున్న నెటిజన్స్!)
Comments
Please login to add a commentAdd a comment