వాళ్ల మాటల వల్ల ఇప్పటికీ బాధపడుతున్నా: ప్రియమణి | Priyamani Interview Comments On Her Interfaith Marriage | Sakshi
Sakshi News home page

Priyamani: నిశ్చితార్థం అప్పటినుంచి విమర్శలు ఎదుర్కొంటున్నా

Oct 5 2024 3:23 PM | Updated on Oct 5 2024 3:47 PM

Priyamani Interview Comments On Her Interfaith Marriage

ప్రస్తుత జనరేషన్‌లో సినిమా సెలబ్రిటీలకు మనశ్శాంతి అనేది లేకుండా పోయింది. సినిమా, వ్యక్తిగత జీవితం.. ఏదైనా సరే ట్రోలింగ్ బారిన పడుతున్నారు. తెలుగులో స్టార్ హీరోల దగ్గర చిన్న నటుల వరకు ఈ బాధ తప్పట్లేదు. తాజాగా తాను చాన్నాళ్ల అనుభవిస్తున్న బాధ గురించి హీరోయిన్ ప్రియమణి బయటపెట్టింది. తాజాగా ఫిల్మ్‌ఫేర్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనపై ఎలాంటి ట్రోలింగ్ జరుగుతుందో చెప్పింది.

(ఇదీ చదవండి: నటి వనితా విజయకుమార్ నాలుగో పెళ్లి.. అసలు నిజం ఇది)

'ముస్తాఫా రాజ్ నాకా చాలాకాలంగా తెలుసు. మా ఇష్టాయిష్టాలు కలవడంతో పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. 2016లో మాకు నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి నేను ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నాను. వేరే మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని నన్ను ట్రోల్ చేశారు. ఇప్పటికీ చేస్తున్నారు. కొన్నిసార్లు వాటిని అంతగా పట్టించుకోను. కానీ వాళ్ల మాటల వల్ల మాత్రం చాలా బాధపడ్డాను. కులమతాలకతీతంగా పెళ్లి చేసుకున్న స్టార్లు ఎందరో ఉన్నారు. కానీ ఈ విషయంలో నన్ను ఎక్కువగా టార్గెట్ చేశారు' అని ప్రియమణి చెప్పుకొచ్చింది.

కన్నడకు చెందిన ప్రియమణి.. 2003 నుంచి ఇండస్ట్రీలో ఉంది. మధ్యలో కెరీర్ ఇక అయిపోయిందని అన్నారు. అలాంటి టైంలో 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌డమ్ సొంతం చేసుకుంది. ఓవైపు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ, మరోవైపు షారుక్ తదితర స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.

(ఇదీ చదవండి: మణికంఠ గాలి తీసేసిన నాగార్జున.. స్ట్రాటజీలన్నీ బయటపెట్టేసి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement