Musthafa
-
వాళ్ల మాటల వల్ల ఇప్పటికీ బాధపడుతున్నా: ప్రియమణి
ప్రస్తుత జనరేషన్లో సినిమా సెలబ్రిటీలకు మనశ్శాంతి అనేది లేకుండా పోయింది. సినిమా, వ్యక్తిగత జీవితం.. ఏదైనా సరే ట్రోలింగ్ బారిన పడుతున్నారు. తెలుగులో స్టార్ హీరోల దగ్గర చిన్న నటుల వరకు ఈ బాధ తప్పట్లేదు. తాజాగా తాను చాన్నాళ్ల అనుభవిస్తున్న బాధ గురించి హీరోయిన్ ప్రియమణి బయటపెట్టింది. తాజాగా ఫిల్మ్‌ఫేర్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనపై ఎలాంటి ట్రోలింగ్ జరుగుతుందో చెప్పింది.(ఇదీ చదవండి: నటి వనితా విజయకుమార్ నాలుగో పెళ్లి.. అసలు నిజం ఇది)'ముస్తాఫా రాజ్ నాకా చాలాకాలంగా తెలుసు. మా ఇష్టాయిష్టాలు కలవడంతో పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. 2016లో మాకు నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి నేను ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నాను. వేరే మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని నన్ను ట్రోల్ చేశారు. ఇప్పటికీ చేస్తున్నారు. కొన్నిసార్లు వాటిని అంతగా పట్టించుకోను. కానీ వాళ్ల మాటల వల్ల మాత్రం చాలా బాధపడ్డాను. కులమతాలకతీతంగా పెళ్లి చేసుకున్న స్టార్లు ఎందరో ఉన్నారు. కానీ ఈ విషయంలో నన్ను ఎక్కువగా టార్గెట్ చేశారు' అని ప్రియమణి చెప్పుకొచ్చింది.కన్నడకు చెందిన ప్రియమణి.. 2003 నుంచి ఇండస్ట్రీలో ఉంది. మధ్యలో కెరీర్ ఇక అయిపోయిందని అన్నారు. అలాంటి టైంలో 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్డమ్ సొంతం చేసుకుంది. ఓవైపు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ, మరోవైపు షారుక్ తదితర స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.(ఇదీ చదవండి: మణికంఠ గాలి తీసేసిన నాగార్జున.. స్ట్రాటజీలన్నీ బయటపెట్టేసి) -
YSRCP Bus Yatra: చిలకలూరిపేటలో ప్రజలు బ్రహ్మరథం
వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చిలకలూరిపేటలో నిర్వహించిన సాధికార బస్సు యాత్రలో ప్రజాప్రతినిధులకు అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. బస్సుయాత్రలో భాగంగా నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అలాగే సంక్షేమ పథకాల లబ్ధిదారులతోనూ ముచ్చటించారు. అనంతరం నిర్వహించిన భారీ బైక్ ర్యాలీతో చిలకలూరిపేటలో బహిరంగ సభా వేదిక వద్దకు బస్సు యాత్ర చేరుకుంది. వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయడానికే వెళ్తున్నా: మంత్రి విడుదల రజిని ఈ భారీ బహిరంగ సభలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజిని మాట్లాడుతూ, వై.ఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సామాజికంగా, ఆర్థికంగా చేసిన అభివృద్ధిని చాటి చెప్పేందుకే సామాజిక సాధికార యాత్రను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. చిలకలూరిపేట నుంచే వై.ఎస్ జగన్మోహన్రెడ్డి సామాజిక న్యాయానికి శ్రీకారం చుట్టారని, ఇక్కడ నుంచే బీసీ మహిళను అసెంబ్లీకి పంపించడమే కాకుండా మంత్రి పదవి కూడా ఇచ్చి చరిత్రలో ఎన్నడూలేని విధంగా వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం కల్పించారని గుర్తు చేసారు. చిలకలూరిపేటలో మున్సిపల్ చైర్మన్ పదవి ముస్లీంలకు, మార్కెట్ యార్డు చైర్మన్ ఎస్సీలకు పదవులు కట్టెబెట్టారన్నారు. రూ.2వేల కోట్లతో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, రూ.900 కోట్లతో బైపాస్ పనులు జరుగుతున్నాయని, అతి తర్వలోనే సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోబోతున్నామని, రూ.150 కోట్లతో అమృత్ పథకాన్ని కేంద్రం సహకారంతో చేపట్టి మంచినీటి సమస్యను తీర్చబోతున్నారని వెల్లడించారు. కాపు, ఎస్సీ, బీసీ భవన్లు కూడా పెద్ద మనసుతో వై.ఎస్ జగన్మోహన్రెడ్డి మంజూరు చేసారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం కోటి రూపాయలతో తాను సొంత నిధులతో ముస్లీంలకు స్థలాన్ని ఇవ్వగా, మరో మూడు ఎకరాలు కూడా సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి మంజూరు చేయడానికి సుముఖుత వ్యక్తం చేసారన్నారు. ముఖ్యమంత్రి అండదండలతో అనేక కీలక ప్రాజెక్టులను చిలకలూరిపేటలో కనీవిని ఎరుగని రీతిలో చేపట్టడమే కాకుండా, వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేసుకోని నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని, నాడు - నేడు స్కీమ్ ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేసామన్నారు. రూ.1100 కోట్ల రూపాయల సంక్షేమాన్ని వై.ఎస్ జగన్మోహన్రెడ్డి చిలకలూరిపేట నియోజకవర్గానికి అందించారంటే ఈ ప్రాంత ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ, అప్యాయతను అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గుంటూరు పశ్చిమలో పార్టీ రెండుసార్లు ఓడిపోయిందని, ఈ సారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి నన్ను అక్కడకు పంపుతున్నారని, తాను ఎక్కడ ఉన్నా సరే చిలకలూరిపేట ప్రజలు తన మనసులో ఉంటారని ఉద్ఘాటించారు. చంద్రబాబు నిజస్వరూపాన్ని గుర్తించండి: ఎమ్మెల్సీ ఏసు రత్నం ఎమ్మెల్సీ ఏసురత్నం మాట్లాడుతూ, కల్లబొల్లి మాటలు చెబుతూ, మరోసారి ప్రజలను మోసం చేయడానికి తహతహలాడుతూ ముందుకు వస్తున్న వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నిజస్వరూపాన్ని గుర్తించాలని. 600 హామీలిచ్చి ప్రజలను గత ఎన్నికల్లో మోసం చేసిన అంశాన్ని ప్రజలు మరిచిపోలేదని హెచ్చరించారు. 31 లక్షల ఇళ్లను బడుగు, బలహీన వర్గాల కోసం ఇళ్లు కట్టించి ఇవ్వడానికి సన్నహాలు చేస్తుంటే, చంద్రబాబు అడ్డుకుంటున్నారని విమర్శించారు. సామాజిక, ఆర్థిక, విద్యా, ఆరోగ్య సాధికారత: ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మరో ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మాట్లాడుతూ, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని రీతిలో ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, విద్యా సాధికారతను సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి చేసి చూపించారన్నారు. షెడ్యూల్ కులాల అభివృద్ధికి రూ.60,500 కోట్లు, బీసీ కులాల కోసం రూ.70,750 ఎస్టీ సంక్షేమానికి రూ.23,430 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ.23 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ముఖ్యమంత్రి దేశ, రాష్ట్ర చరిత్రలో ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. అణగారిన బడుగు, బలహీన వర్గాలను అభివృద్ధి చేయడంతో పాటుగా ఉన్నత విద్యావంతులను చేయాలని సీఎం లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు. 37 వేల స్కూల్స్ కోసం రూ.12 వేల కోట్లతో అభివృద్ధి చేసి కార్పోరేట్‌కు ధీటుగా తీర్చిదిద్దారన్నారు. జగన్‌ను మరోసారి సీఎం చేస్తాం: నియోజకవర్గ ఇన్చార్జి మల్లెల రాజేశ్ చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి మల్లెల రాజేశ్ నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతీ సామాజిక వర్గానికి సంక్షేమం, రాజ్యాధికారం కల్పనలో పెద్ద పీట వేసి ఇచ్చిన మాటను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని ఉద్ఘాటించారు. కులం, మతం చూడకుండా అందరికీ సంక్షేమం అందిస్తూ స్వర్గీయ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డికి తగ్గ తనయుడుగా నిలిచారన్నారు. చిలకలూరిపేటలో వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేసి రాష్ట్రానికి మరోసారి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డిను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. -
నాపై చాలా దారుణంగా ట్రోల్స్.. అయినా బాధపడను: హీరోయిన్
సీనియర్ నటి ప్రియమణి పేరు చెప్పగానే యమదొంగ సినిమానే గుర్తుకు వస్తుంది. అమాయకంగా తనదైన నటనతో అభిమానులను ఆకట్టుకుంది. పెళ్లైన కొత్తలో, గోలీమార్ చిత్రాల్లోనూ తన నటనతో మెప్పించింది. టాలీవుడ్లో స్టార్ హీరోలందరితో నటించింది ముద్దుగుమ్మ. ఇటీవలే నాగచైత్యన కస్టడీ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించింది ప్రియమణి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి తాను చాలా సందర్భాల్లో ట్రోల్స్‌కు గురైనట్లు వెల్లడించింది. ముఖ్యంగా తన పెళ్లి సమయంలో నెటిజన్స్ తీవ్రంగా విమర్శలు చేశారని తెలిపింది. (ఇది చదవండి: పరువు తీసుకుంటున్న బాలీవుడ్.. చివరకి ఆ పాట!) ప్రియమణి మాట్లాడుతూ.' నేను ట్రోల్స్‌ను పెద్దగా పట్టించుకోను. బాడీ షేమింగ్, కలర్ గురించి ఇప్పటికీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాను ముస్తఫాను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. ఆ సమయంలో సోషల్‌మీడియాలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. నువ్వేందుకు వేరే మతం వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నావు?' అంటూ అసభ్యకరమైన కామెంట్స్ చేశారు.' అని అన్నారు. ట్రోల్స్‌పై స్పందిస్తూ.. నా జీవితాన్ని ఎవరితో కొనసాగించాలనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని ప్రియమణి అన్నారు. ట్రోల్స్‌ను పెద్దగా పట్టించుకోనని.. మీ అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని తెలిపారు. ట్రోల్స్‌కు ప్రాధాన్యత ఇచ్చి.. వాటి వల్ల బాధపడటం తనకు నచ్చదని పేర్కొన్నారు. కాగా.. 2017లో వ్యాపారవేత్త ముస్తఫారాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక.. నారప్ప, భామా కలాపం, విరాటపర్వం చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం షారూక్ ఖాన్ నటిస్తోన్న జవాన్‌లో కనిపించనున్నారు. (ఇది చదవండి: వాల్తేరు వీరయ్య భామకు అరుదైన అవార్డ్.. ఆడేసుకుంటున్న నెటిజన్స్!) -
ఏపీకి పట్టిన వైరస్ చంద్రబాబు
సాక్షి, పట్నంబజారు(గుంటూరు) : చైనాను వణికిస్తున్న కరోనా వైరస్‌లా...ఆంధ్రప్రదేశ్‌ను చంద్రబాబు పట్టి పీడిస్తున్నారని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి విమర్శించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చంద్రబాబు వైరస్‌లా వ్యాపించి అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. రాజధాని వికేంద్రీకరణ అంశంలో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా గురువారం గుంటూరు తాలూకా కార్యాలయం ఎదుట పార్టీ విద్యార్థి విభాగం గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో నిరసన దీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోరే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్ర ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని ప్రజలు చెబుతున్నారన్నారు. పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో చంద్రబాబు రాజధాని అమరావతి పేరుతో భూములు ఇచ్చిన రైతులను మోసం చేశారన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ప్రత్యేక విమానాల్లో విదేశాలకు తిరగటం తప్ప చంద్రబాబు చేసింది ఏముందని ప్రశ్నించారు. మూడు రాజధానులే ముద్దు అని ప్రజానీకం గొంతెత్తి చాటుతోందన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్‌గాంధీ మాట్లాడుతూ చంద్రబాబుకు దిగజారుడు రాజకీయాలు చేయటం కొత్తేమీ కాదన్నారు. సిగ్గుఎగ్గు లేకుండా స్వప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని మండిపడ్డారు. ముందుగా దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్లకార్డులు పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆతుకూరి ఆంజనేయులు, రాష్ట్ర కార్యదర్శి ఈచంపాటి వెంకటకృష్ణ(ఆచారి), మార్కెట్‌బాబు, సోమికమల్, అంగడి శ్రీనివాసరావు, శ్రీనివాస్‌యాదవ్, గనిక ఝాన్సీ, మేరిగ విజయలక్ష్మి, విఠల్, వలి, రవి, జగదీష్, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ విభాగాల నేతలు తదితరులు పాల్గొన్నారు. -
ఫిజిక్ ఉంటే ఫిట్నెస్ ఉన్నట్టు కాదు..
సాక్షి, సిటీబ్యూరో: టాలీవుడ్, బాలీవుడ్ హీరోలైన మహేశ్‌బాబు, రితిక్ రోషన్, రణ్వీర్ సింగ్‌లకు ఆయన ఫిట్నెస్ మంత్రం నేర్పిస్తున్నాడు. ఆ రంగంలో తనదైన ముద్రతోనే ముందుకు సాగుతున్నాడు. నాలుగేళ్లుగా నగరానికి వస్తూ పోతున్నాడు. ఆయన ఎవరో కాదు ఫిట్నెస్ ట్రెయినర్ ముస్తఫా అహ్మద్. ప్రస్తుతం ముంబైలో ఫిట్నెస్ సెంటర్ నిర్వహిస్తున్న ముస్తఫా అహ్మద్ ఓ ఈవెంట్లో పాల్గొనేందుకు ఇటీవల నగరానికి వచ్చాడు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడాడు. ఈ సందర్భంగా పలు ఫిట్నెస్ సూచనలు చేశారు. అవి ఆయన మాటల్లోనే.. ఫిజిగ్గా ఉంటేనే సరిపోదు.. ఫిజిక్ ఉంటే ఫిట్నెస్ ఉన్నట్టు కాదు. ఫిజిక్ ఫిట్‌నెస్‌లో ఒక భాగం మాత్రమే. ఆరోగ్యంగా ఫీల్ అవుతూ ఒక ఆరోగ్యవంతుడు చేయగలిగిన పనులన్నీ చేయడమే ఫిట్నెస్. అరగంటలో 5 కి.మీ పరిగెత్తడం, కొంత బరువు ఎత్తగలగడం, ఫ్రీగా శరీరాన్ని కదిలించగలగడం ఇవన్నీ కలిపితే ఫిట్నెస్. ఎవరైతే సరైన ఆహారపు అలవాట్లు కలిగి ఉంటారో వారికి తక్కువ శిక్షణ అవసరం. శరీరానికి అవసరమైన ఆహారం కరెక్టుగా తీసుకుంటే శారీరకంగానూ, మానసికంగానూ ఆరోగ్యంగా, చలాకీగా ఉండవచ్చు. మూడు ముఖ్య సూచనలు.. 7 నుంచి 8 గంటల నిద్ర మొదటిది. రెండోది స్థానికంగా దొరికే ఆహారం తినటం. మనం తినే ఆహారంలో 60 శాతం లోకల్‌గా దొరికేది తినాలి. వెస్ట్రన్ ఆహార పదార్థాల జోలికి వెళ్లవద్దు. స్థానిక ఆహారం వల్ల శరీరానికి ఎక్కువ మేలు కలుగుతుంది. మూడోది పనిచేసే చోట అయినా, ఇంట్లో అయినా కదులుతూ, నడుస్తూ ఉండటం. జిమ్‌కి వెళ్లకపోయినా ఫర్వాలేదు. మెట్లు వాడవచ్చు. నడవండి. దుకాణానికి వెళ్లి మీరే సరుకులు తెచ్చుకోండి. ఫ్యాట్ ఫ్రీ అంటే కొనేయొద్దు.. చాలా మంది ఇళ్లలో, ఫ్రిజ్‌లలో అనేక ఫ్యాట్ ఫ్రీ ఫుడ్ ప్రొడక్టŠస్ కొని తెచ్చి పెట్టుకుంటారు. ఫ్యాట్ అన్ని సార్లూ చెడ్డది కాదు. నెయ్యితో మంచి ఫ్యాట్ లభిస్తుంది, నెయ్యితో వంటలు చేసుకోవచ్చు. ఈ మధ్య చాలా మంది అర్థం చేసుకుంటున్నారు. నెమ్మదిగా మార్పు వస్తోంది. ఫిట్‌నెస్‌లో హైదరాబాద్.. నవాబ్‌ల నగరం ఇది. మిగతా నగరాలతో పోల్చితే ఇక్కడ ఫిట్నెస్ గురించి పెద్దగా పట్టించుకోరు అనే మాట మారుతోంది. ఇక్కడ మార్పు వస్తోంది. ఫిట్నెస్ విషయంలో ఢిల్లీ, ముంబై స్థాయికి హైదరాబాద్ మరో 3, 4 ఏళ్లలో చేరుకోవచ్చు. ఇక్కడి వారికి ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంంది. ఇలా చేస్తే మంచిది.. ⇔ సీట్లో కూర్చుని, వర్క్‌ప్లేస్‌లో కూడా ఫిట్నెస్ పొందడానికి ఎన్నో చెయ్యొచ్చు. ఇంటర్నెట్లో వేల మార్గాలున్నాయి. ⇔ ఫిట్నెస్ కావాలంటే స్కిల్ కన్నా విల్ అవసరం. ఎవరైనా ఏమైనా అనుకుంటారనే ఆలోచన అనవసరం. మీరు మీ కోసం వర్క్ చేయండి. ⇔ టీనేజ్‌లో, ఏ ఏజ్‌లో అయినా ఏం తింటున్నారో చూసుకోండి. అవసరమైన మార్పులు చేసుకోండి. తర్వాత మంచి ట్రెయినర్ ఉన్న జిమ్‌లో చేరండి. 6 నెలల్లో మీకు నేర్పిస్తారు. తర్వాత మీరు స్వయంగా చేసుకోవచ్చు. ⇔ ఇక సన్నగా, లావుగా లేదా అనుకున్న తీరులో శరీరాకృతి మారడానికి వారి వారి జెనెటిక్స్, మెటబాలిజమ్‌ని బట్టి టైం పడుతుంది. కానీ కరెక్టు ఆహారం, వ్యాయామ శిక్షణ వల్ల మార్పులు మాత్రం2, 3 నెలల్లోనే కనిపిస్తాయి. ⇔ ఇక చిన్న పిల్లలకి క్రీడలు అలవాటు చేస్తే ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఆటోమెటిక్‌గా పెరుగుతుంది. ఇది తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది. టీనేజ్‌లో పిల్లలను తప్పకుండా ఆటల్లోకి పంపాలి. ⇔ గర్భిణులు సైతం వ్యాయామం చేయొచ్చు. డెలివరీ తర్వాత 40 రోజుల తర్వాత ఇంట్లోనే చిన్న చిన్న వ్యాయామాలు కూడా చేసుకోవచ్చు. -
‘విపక్ష ఎమ్మెల్యేను కావడంతోనే వివక్ష’
సాక్షి, గుంటూరు: అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వల్లే అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని గుంటూరు ఈస్టు ఎమ్మెల్యే ముస్తఫా ఆరోపించారు. కార్పొరేషన్ సిబ్బంది, ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మంచినీటి పైపులైన్లు లీకేజీ అయి కలుషిత మంచినీరు తాగడంవల్ల గత ఐదు రోజుల్లో పది మంది చనిపోయారని, వందల మంది చికిత్స పొదుతున్నారని తెలిపారు. ప్రభుత్వం డయేరియా రోగులకు నాసిరకం మందుల్ని అందిస్తోందని ఆయన విమర్శించారు. తాగునీరు కలుషితమౌతోందని అనేకసార్లు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదుచేసినా ఎవరూ పట్టించుకోలేదని, అందువల్లే డయేరియా రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. మురికి నీళ్లు వస్తున్నాయని బాటిల్లో నీళ్లు పట్టి చూపించినా అధికారులు స్పందించలేదన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేను కావడంతోనే తన నియోజక వర్గ అభివృద్ధి పట్ల ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. -
కిడ్నాప్ చేశారని తాళ్లతో కట్టేసిన ఫోటో పంపింది..
చాంద్రాయణగుట్ట: చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ యువతి కిడ్నాప్ కలకలం రేపింది. ఇన్స్పెక్టర్ వై.ప్రకాష్ రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బండ్లగూడ పటేల్‌నగర్‌కు చెందిన అస్మాబేగం కుమార్తె తబ్బసుమ్ బేగం అదే ప్రాంతానికి చెందిన ముస్తఫా అనే యువకుడిని ప్రేమించింది. ఈ విషయం తెలిసిన అస్మాబేగం తన కుమార్తెకు సల్మాన్ అనే యువకుడితో నిశ్చితార్థం జరిపించింది. ఇది నచ్చని తబ్బసుమ్ బేగం రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇదిలా ఉండగా సోమవారం మధ్యాహ్నం తబ్బసుమ్ తన తల్లి ఫోన్‌కు వాట్సాప్‌లో తనను కిడ్నాప్ చేశారని...తాళ్లతో కట్టేసిన ఫోటో పంపింది. మరి కొద్ది సేపటి తర్వాత తనను బంధించారని ఎక్కడ ఉన్నానో తెలియదంటూ వాట్సాప్ కాల్లో మాట్లాడింది. దీంతో అస్మా బేగం చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ముస్తఫాపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముస్తఫాను పిలిచి విచారించగా అతని ప్రమేయం లేదని తేలింది. ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆమె షాహిన్‌నగర్‌లో ఉన్నట్లు గుర్తించి అక్కడ గాలించగా ఫలితం కనిపించలేదు. దీంతో రెండు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. -
‘ముజే యాద్ నహీ... మాలూమ్ నహీ’
రాజేంద్రనగర్: రియల్ ఎస్టేట్ వ్యాపారి ముస్తాఫాపై కాల్పుల కేసు ఇంకా కొలిక్కి రాలేదు. సోమవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముస్తాఫా స్టేట్మెంట్ను రికార్డు చేసేందుకు వెళ్లిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అతను సహకరించకపోవడంతో వెనుతిరిగారు. పోలీసులు సంఘటన విషయమై ఎన్ని ప్రశ్నలు వేసిన ‘జే యాద్ నహీ. ముజే మాలూమ్ నహీ’ సమాధానాలు చెబుతుండడంతో పోలీసులు వెనుతిరిగారు. ముస్తాఫాతో పాటు వారి కుటుంబ సభ్యులు సైతం ఈ సంఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు విషయమై ఆసుపత్రి వద్ద ఉన్న కుటుంబ సభ్యులను సంప్రదించినా వారి సమాధానం రాకపోవడంతో సుమోటోగా కేసును నమోదు చేశారు. ఎన్నో కీలక కేసులను గంటల వ్యవధిలో పరిష్కరించిన పోలీసులు ఈ కాల్పుల కేసులో మూడు రోజులు గడచినా ఎలాంటి పురోగతి సాధించలేదు. కాల్పులు జరిపిన వ్యక్తి బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి, రాజకీయ పార్టీ ప్రధాన అనుచరుడు కావడంతో కేసు నీరుగార్చేందుకు రాజకీయ ఒత్తిడి రావడంతో పోలీసులు మెతక వైఖరి వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
ముస్తఫా అలాంటి వారు కాదు
తమిళసినిమా: నా భర్త అలాంటి వాడు కాదు అంటోంది నటి ప్రియమణి. సినిమాకు చెందిన వారు ముఖ్యంగా కథానాయికలకు ఒక్కో సీజన్లో ఒక్కో భాషలో అవకాశాలు తలుపు తడుతాయనుకుంటా. తొలుత తమిళం, తెలుగు భాషల్లో నటిగా రంగప్రవేశం చేసిన ఈ బెంగళూర్ బ్యూటీ తరువాతనే మాతృభాష కన్నడంలో నటిగా అడుగుపెట్టింది. ఇక మలయాళంలోనూ నటించేసి హిందీ చిత్రం రంగ అనుభవాన్ని పొందేసింది. ఇలా కథానాయకిగా పలు భాషల్లో ఒక్కో సీజన్లో రాణించిన మూడు పదుల వయసు పైబడిన ప్రియమణి గత నెల తన చిరకాల ప్రేమికుడు ముస్తఫాను పెళ్లాడేసింది.పెళ్లి తరువాత సైలెంట్ అయిపోయిన ఈ భామ ఇటీవల తన పెళ్లి, భర్త, నటన గురించి పెదవి విప్పింది. తను మాట్లాడుతూ ఒక సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో తనకు ముస్తఫాకు పరిచయమైందని చెప్పింది. అయితే చూడగానే ఆయనతో ప్రేమలో పడిపోలేదని, కొంత కాలం ఫ్రెండ్స్‌గా మెలిగామని తెలిపింది. అప్పుడు ముస్తఫాకు తనపై చూపిన ప్రేమ ఆయన్ని ప్రేమించేలా చేసిందంది. పెళ్లి తరువాత నటనకు దూరంగా ఉండాలన్న ఆలోచన తనకు లేదని చెప్పింది. అదే విధంగా పెళ్లి అయిన మూడో రోజునే షూటింగ్‌కు వెళ్లానని చెప్పింది. భార్య వంటింటికే పరిమితం కావాలనే మనస్తత్వం తన భర్తది కాదని పేర్కొంది. ఆయన పరిపూర్ణ సమ్మతితోనే తాను వివాహానంతరం నటిస్తున్నానని చెప్పింది. ముస్లిం అయిన ముస్తఫాను తాను పెళ్లి చేసుకోవడాన్ని చాలా మంది వ్యతిరేకించారని చెప్పింది. అలాంటి వాటికి తాను భయపడలేదని అంది. తానెవరిని పెళ్లి చేసుకోవాలన్న విషయంలో వేరెవరినో అనుమతి కోరాల్సిన అవసరం తనకు లేదని అంది. నా భర్త, నా కుటుం బం, నా జీవితం ఇవే తనకు ముఖ్యమని ప్రియమణి పేర్కొంది. ప్రస్తుతం అమ్మడికి తమిళం, తెలుగు భాషల్లో అవకాశాలు లేకపోయినా కన్నడం, మలయాళం భాషల్లో నటిస్తోంది. -
'ఆటో ప్రీ పెయిడ్ అందరికీ వర్తింప చేయాలి'
వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ముస్తాఫా గుంటూరు (రూరల్): గుంటూరు నగరంలోని బస్టాండ్‌లో మంగళవారం ఆర్.టి.సి ఎమ్.డి, గుంటూరు రేంజ్ ఐజి, అర్బన్ ఎస్పీల చేతుల మీదుగా నూతనంగా ప్రారంభించిన ప్రీపెయిడ్ ఆటో పద్ధతి విషయం విదితమే. ప్రీపెయిడ్ ఆటో పద్ధతి ఒక యూనియన్‌కు మాత్రమే ఇవ్వడం ద్వారా సుమారు 500 ఆటో డ్రైవర్లు రోడ్డు పాలు కావాల్సి వస్తుందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ముస్తాఫా ఆటో డ్రైవర్లకు నేనున్నా అంటూ భరోసా ఇచ్చారు. అందరికీ ప్రీ పెయిడ్ పద్ధతి అమలు చేయాలని బుధవారం జిల్లా అర్బన్ ఎస్పీ రాజేష్‌కుమార్‌ను ఎమ్మెల్యే కోరారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా ఎస్పీ చర్యలు తీకుంటున్న ఎమ్మెల్యే విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు వచ్చిన తక్షణమే తన దృష్టికి తీసుకు రావాల్సిందిగా కోరారు. జిల్లా అర్బన్ ఎస్పీని కార్మిక సంక్షేమ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్, మధర్ ధెరిస్సా ఆటో డ్రైవర్స్, వర్కర్స్ యూనియన్ నాయకులు, డ్రైవర్లు కలిశారు.