వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ముస్తాఫా
గుంటూరు (రూరల్): గుంటూరు నగరంలోని బస్టాండ్‌లో మంగళవారం ఆర్.టి.సి ఎమ్.డి, గుంటూరు రేంజ్ ఐజి, అర్బన్ ఎస్పీల చేతుల మీదుగా నూతనంగా ప్రారంభించిన ప్రీపెయిడ్ ఆటో పద్ధతి విషయం విదితమే. ప్రీపెయిడ్ ఆటో పద్ధతి ఒక యూనియన్‌కు మాత్రమే ఇవ్వడం ద్వారా సుమారు 500 ఆటో డ్రైవర్లు రోడ్డు పాలు కావాల్సి వస్తుందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ముస్తాఫా ఆటో డ్రైవర్లకు నేనున్నా అంటూ భరోసా ఇచ్చారు.
అందరికీ ప్రీ పెయిడ్ పద్ధతి అమలు చేయాలని బుధవారం జిల్లా అర్బన్ ఎస్పీ రాజేష్‌కుమార్‌ను ఎమ్మెల్యే కోరారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా ఎస్పీ చర్యలు తీకుంటున్న ఎమ్మెల్యే విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు వచ్చిన తక్షణమే తన దృష్టికి తీసుకు రావాల్సిందిగా కోరారు. జిల్లా అర్బన్ ఎస్పీని కార్మిక సంక్షేమ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్, మధర్ ధెరిస్సా ఆటో డ్రైవర్స్, వర్కర్స్ యూనియన్ నాయకులు, డ్రైవర్లు కలిశారు.
'ఆటో ప్రీ పెయిడ్ అందరికీ వర్తింప చేయాలి'
Published Wed, Feb 25 2015 9:47 PM | Last Updated on Sat, Sep 2 2017 9:54 PM
Advertisement