
రాజేంద్రనగర్: రియల్ ఎస్టేట్ వ్యాపారి ముస్తాఫాపై కాల్పుల కేసు ఇంకా కొలిక్కి రాలేదు. సోమవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముస్తాఫా స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసేందుకు వెళ్లిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అతను సహకరించకపోవడంతో వెనుతిరిగారు. పోలీసులు సంఘటన విషయమై ఎన్ని ప్రశ్నలు వేసిన ‘జే యాద్ నహీ. ముజే మాలూమ్ నహీ’ సమాధానాలు చెబుతుండడంతో పోలీసులు వెనుతిరిగారు. ముస్తాఫాతో పాటు వారి కుటుంబ సభ్యులు సైతం ఈ సంఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.
ఫిర్యాదు విషయమై ఆసుపత్రి వద్ద ఉన్న కుటుంబ సభ్యులను సంప్రదించినా వారి సమాధానం రాకపోవడంతో సుమోటోగా కేసును నమోదు చేశారు. ఎన్నో కీలక కేసులను గంటల వ్యవధిలో పరిష్కరించిన పోలీసులు ఈ కాల్పుల కేసులో మూడు రోజులు గడచినా ఎలాంటి పురోగతి సాధించలేదు. కాల్పులు జరిపిన వ్యక్తి బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి, రాజకీయ పార్టీ ప్రధాన అనుచరుడు కావడంతో కేసు నీరుగార్చేందుకు రాజకీయ ఒత్తిడి రావడంతో పోలీసులు మెతక వైఖరి వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment