
తమిళసినిమా: నా భర్త అలాంటి వాడు కాదు అంటోంది నటి ప్రియమణి. సినిమాకు చెందిన వారు ముఖ్యంగా కథానాయికలకు ఒక్కో సీజన్‌లో ఒక్కో భాషలో అవకాశాలు తలుపు తడుతాయనుకుంటా. తొలుత తమిళం, తెలుగు భాషల్లో నటిగా రంగప్రవేశం చేసిన ఈ బెంగళూర్ బ్యూటీ తరువాతనే మాతృభాష కన్నడంలో నటిగా అడుగుపెట్టింది. ఇక మలయాళంలోనూ నటించేసి హిందీ చిత్రం రంగ అనుభవాన్ని పొందేసింది. ఇలా కథానాయకిగా పలు భాషల్లో ఒక్కో సీజన్‌లో రాణించిన మూడు పదుల వయసు పైబడిన ప్రియమణి గత నెల తన చిరకాల ప్రేమికుడు ముస్తఫాను పెళ్లాడేసింది.పెళ్లి తరువాత సైలెంట్ అయిపోయిన ఈ భామ ఇటీవల తన పెళ్లి, భర్త, నటన గురించి పెదవి విప్పింది. తను మాట్లాడుతూ ఒక సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో తనకు ముస్తఫాకు పరిచయమైందని చెప్పింది.
అయితే చూడగానే ఆయనతో ప్రేమలో పడిపోలేదని, కొంత కాలం ఫ్రెండ్స్‌గా మెలిగామని తెలిపింది. అప్పుడు ముస్తఫాకు తనపై చూపిన ప్రేమ ఆయన్ని ప్రేమించేలా చేసిందంది. పెళ్లి తరువాత నటనకు దూరంగా ఉండాలన్న ఆలోచన తనకు లేదని చెప్పింది. అదే విధంగా పెళ్లి అయిన మూడో రోజునే షూటింగ్‌కు వెళ్లానని చెప్పింది. భార్య వంటింటికే పరిమితం కావాలనే మనస్తత్వం తన భర్తది కాదని పేర్కొంది. ఆయన పరిపూర్ణ సమ్మతితోనే తాను వివాహానంతరం నటిస్తున్నానని చెప్పింది. ముస్లిం అయిన ముస్తఫాను తాను పెళ్లి చేసుకోవడాన్ని చాలా మంది వ్యతిరేకించారని చెప్పింది. అలాంటి వాటికి తాను భయపడలేదని అంది. తానెవరిని పెళ్లి చేసుకోవాలన్న విషయంలో వేరెవరినో అనుమతి కోరాల్సిన అవసరం తనకు లేదని అంది. నా భర్త, నా కుటుం బం, నా జీవితం ఇవే తనకు ముఖ్యమని ప్రియమణి పేర్కొంది. ప్రస్తుతం అమ్మడికి తమిళం, తెలుగు భాషల్లో అవకాశాలు లేకపోయినా కన్నడం, మలయాళం భాషల్లో నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment