మణికంఠ గాలి తీసేసిన నాగార్జున.. స్ట్రాటజీలన్నీ బయటపెట్టేసి | Bigg Boss 8 Telugu Day 34 Today Episode Promo Video, Nagarjuna Expose Contestants Weaknesses | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Today Promo: పదే పదే ఏడుపు.. మణికంఠకి స్మూత్ వార్నింగ్

Published Sat, Oct 5 2024 2:16 PM | Last Updated on Sat, Oct 5 2024 3:21 PM

Bigg Boss 8 Telugu Day 34 Promo Naga Manikanta

బిగ్‌బాస్ 8లో ఐదో వీకెండ్ వచ్చేసింది. ఈ వారం ఇప్పటికే మిడ్ వీక్ ఎలిమినేషన్ పేరిట ఆదిత్యని ఇంటికి పంపించేశారు. ఆదివారం ఎవరిని పంపిస్తారో చూడాలి. మరోవైపు వైల్డ్ కార్డ్ ఎంట్రీల పేరిట దాదాపు ఎనిమిది హౌసులోకి రాబోతున్నారు. ఇలా సందడిగా ఉంది. శనివారం కావడంతో నాగార్జున వచ్చేశాడు. హౌస్‌మేట్స్‌కి ఓ వైపు ప్రశంసలు, మరోవైపు వార్నింగ్‌లు ఇచ్చాడు. మణికంఠని అయితే పూర్తిగా గాలి తీసేశాడని చెప్పాలి.

తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో భాగంగా సీత, నైనిక తప్పుల గురించి హోస్ట్ నాగార్జున మాట్లాడాడు. వీళ్ల తర్వాత మణికంఠతో ముచ్చటించాడు. సీత బాడీ లాంగ్వేజ్‌లో నీకు సమస్య ఏంటి? అని అడగ్గా.. తను వెక్కిరించినట్లు అనిపించిందని మణికంఠ అన్నాడు. మధ్యలో మాట్లాడిన సీత.. మణినే తమందరినీ కార్నర్ చేస్తున్నాడనిపిస్తోందని చెప్పింది. దీని తర్వాత నాగార్జు, మణికంఠని యాక్షన్ రూమ్‌లోకి రమ్మన్నాడు.

(ఇదీ చదవండి: నాలుగో పెళ్లి పేరుతో అందరినీ ఫూల్ చేసిన నటి వనిత)

మణికంఠ.. నీకు 8 నిమిషాలు టైమ్ ఇస్తున్నాను, నువ్వు ఎంత ఏడవాలనుకుంటున్నావో అంత ఏడ్చేసేయ్ అని నాగ్ చెప్పాడు. ఆల్మోస్ట్ అయిపోయింది సర్ అని మణి ఏదో కవర్ చేసే ప్రయత్నం చేశాడు. ఇంతలో మాట్లాడిన నాగ్.. ఒకవేళ కన్నా నా దగ్గరికి రావొద్దు, అక్కడే ఉండిపో అని ప్రియ చెప్పిందనుకో అని నాగ్ అనగానే.. నాకు భయమేస్తుంది సర్ అని భార్య గుర్తొచ్చి మణికంఠ ఏడుపు మొదలుపెట్టాడు.

నీకు చెప్పాల్సిన విషయం ఇంకోటి కూడా ఉందని నాగ్ బాంబు పేల్చాడు. ఏడవటం నీ స్ట్రాటజీ అయితే అది పనికిరాదు. హౌస్ అందరికీ తెలుసు అని మణికంఠ గాలి మొత్తం తీసేశాడు. ఒకరకంగా చెప్పాలంటే ఎమోషన్‌ చూపిస్తూ, ఏడుస్తూ హౌస్‌లో ఉండిపోవాలనేది మణికంఠ ప్లాన్. దీన్నే ఇప్పుడు నాగార్జున బయటపెట్టాడా అనిపించింది. అలానే ఇకపై ఏడిస్తే కుదరదు అని స్మూత్ వార్నింగ్ ఇచ్చినట్లు అనిపించింది.

(ఇదీ చదవండి: మీ రుణాన్ని వడ్డీతో సహా తీర్చుకుంటా.. అభిమానులపై ఎన్టీఆర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement