మీ రుణాన్ని వడ్డీతో సహా తీర్చుకుంటా.. అభిమానులపై ఎన్టీఆర్‌ | Jr NTR Emotional Comments On His Fans In Devara Movie Success Meet, Video Trending On Social Media | Sakshi
Sakshi News home page

Jr NTR Emotional Speech: మీ రుణాన్ని వడ్డీతో సహా తీర్చుకుంటా.. అభిమానులపై ఎన్టీఆర్‌

Published Sat, Oct 5 2024 11:25 AM | Last Updated on Sat, Oct 5 2024 12:27 PM

Jr NTR Emotional Comments On His Fans

అభిమానులపై ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్యాన్స్‌తో తనకున్న ఎమోషనల్‌ బాండింగ్‌ గురించి దేవర సినిమా సక్సెస్‌ పార్టీలో పంచుకున్నారు. ఎన్టీఆర్‌- కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన 'దేవర' సినిమా ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. రిలీజ్‌ రోజు కాస్త డివైడ్‌ టాక్‌ వచ్చినా దానిని తారక్‌ అధిగమించాడని చెప్పవచ్చు. అలా మొదటివారంలో బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ. 405 కోట్లు రాబట్టి సత్తా చాటాడు. ఇంతటి విజయాన్ని అందించిన అభిమానుల గురించి తాజాగా తారక్‌ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

'ఏ జన్మలో చేసుకున్న రుణమో నాకు తెలియదు. కలిసి ఒక గర్బంలో పుట్టకపోయిన.. కలిసి రక్తాన్ని పంచుకోకపోయినప్పటికీ.. మీ అందరితో రుణానుబంధం ఏర్పడింది. మీరందరూ ఎప్పుడూ నా వెన్నంటే ఉంటూ.. ప్రతి క్షణం నా కోసం పోరాడుతూ ఎల్లప్పుడు మీ ఆశీస్సులను అందిస్తున్నారు. అందుకు శిరస్సు వంచి మీ పాదాలకు నమస్కారం చేస్తున్నా. ఈ జన్మలో కాకపోయిన ఇంకోక జన్మలోనైన మీ రుణాన్ని తప్పకుండా తీర్చుకుంటాను. అప్పటి దాకా వడ్డీనీ లెక్క వేసుకుంటూనే ఉంటాను. దేవర చిత్రాన్ని ఇంత భారీ విజయం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.' అంటూ తన అభిమానుల గురించి తారక్‌ ఎమోషనల్‌గా చెప్పుకొచ్చాడు.

తారక్‌ మాటలకు ఆయన అభిమానులు కూడా రియాక్ట్‌ అవుతున్నారు. 'ఎప్పటికీ నీ కష్టంలో అండగా నిలుస్తాం' అంటూ తమ అభిమానాన్ని పంచుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement