అక్కినేని హీరోతో పెళ్లి.. ఆ వార్తలపై స్పందించిన మీనాక్షి చౌదరి | Tollywood Actress Meenakshi Chaudary responds On marriage Rumours | Sakshi
Sakshi News home page

Meenakshi Chaudary: అక్కినేని హీరోతో పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన మీనాక్షి

Published Tue, Nov 19 2024 9:09 PM | Last Updated on Tue, Nov 19 2024 9:12 PM

Tollywood Actress Meenakshi Chaudary responds On marriage Rumours

ఇటీవల లక్కీ భాస్కర్‌తో హిట్‌ కొట్టిన బ్యూటీ మీనాక్షి చౌదరి. మరో మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. టాలీవుడ్ హీరో విశ్వక్‌ సేన్‌ సరసన మెకానిక్ రాకీలో కనిపించనుంది. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది.

ఇటీవల వరంగల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించిన చిత్రబృందం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ప్రస్తుతం మీనాక్షి చౌదరి మెకానిక్ రాకీ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఇటీవల సుశాంత్‌ను మీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై మీరేమంటారు గుంటూరు కారం భామను ప్రశ్నించారు.

meenakshi

దీనికి మీనాక్షి చౌదరి స్పందిస్తూ..'అదంతా ఫేక్. నేను పెళ్లి చేసుకోవడం లేదు. గతనెల కూడా ఒక రూమర్‌ వచ్చింది. ఓ తమిళ నటుడి కుమారుడిని పెళ్లి చేసుకుంటున్నట్లు రాశారు. ప్రతినెల నాపై ఏదో ఒక రూమర్ వస్తోంది. అలాగే ఇప్పుడు నా పెళ్లిపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. ప్రస్తుతానికి నేను సింగిల్‌. ఇప్పుడైతే నాకు పెళ్లి  చేసుకునే ఉద్దేశం లేదు'  అని అన్నారు. 

m

కాగా.. మెకానిక్ రాకీలో మరో  హీరోయిన్‌గా శ్రద్ధా శ్రీనాథ్‌ కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు  ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మాస్‌ యాక్షన్, లవ్, సెంటిమెంట్‌ అంశాలతో మెప్పిస్తున్న ట్రైలర్‌ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది.  తాజాగా  మరో ట్రైలర్‌ను కూడా రిలీజ్‌ చేశారు.  నవంబర్‌ 22న ఈ చిత్రం విడుదల కానుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement