Sushant
-
అక్కినేని హీరోతో పెళ్లి.. ఆ వార్తలపై స్పందించిన మీనాక్షి చౌదరి
ఇటీవల లక్కీ భాస్కర్‌తో హిట్ కొట్టిన బ్యూటీ మీనాక్షి చౌదరి. మరో మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ సరసన మెకానిక్ రాకీలో కనిపించనుంది. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది.ఇటీవల వరంగల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన చిత్రబృందం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ప్రస్తుతం మీనాక్షి చౌదరి మెకానిక్ రాకీ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఇటీవల సుశాంత్‌ను మీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై మీరేమంటారు గుంటూరు కారం భామను ప్రశ్నించారు.దీనికి మీనాక్షి చౌదరి స్పందిస్తూ..'అదంతా ఫేక్. నేను పెళ్లి చేసుకోవడం లేదు. గతనెల కూడా ఒక రూమర్ వచ్చింది. ఓ తమిళ నటుడి కుమారుడిని పెళ్లి చేసుకుంటున్నట్లు రాశారు. ప్రతినెల నాపై ఏదో ఒక రూమర్ వస్తోంది. అలాగే ఇప్పుడు నా పెళ్లిపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. ప్రస్తుతానికి నేను సింగిల్. ఇప్పుడైతే నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు' అని అన్నారు. కాగా.. మెకానిక్ రాకీలో మరో హీరోయిన్గా శ్రద్ధా శ్రీనాథ్ కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మాస్ యాక్షన్, లవ్, సెంటిమెంట్ అంశాలతో మెప్పిస్తున్న ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. తాజాగా మరో ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు. నవంబర్ 22న ఈ చిత్రం విడుదల కానుంది. -
చిన్నారిని చిదిమేసిన కామాంధుడు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు జిల్లా పుంగనూరులో చిన్నారి హత్య ఘటన మరువక ముందే తిరుపతి జిల్లా వడమాలపేటలో మరో దారుణం జరిగింది. ముక్కుపచ్చలారని మూడున్నరేళ్ల గిరిజన చిన్నారిపై ఓ కామాంధుడు అతికిరాతకంగా లైంగిక దాడి చేసి, ఆపై హత్య చేశాడు. పోలీసులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. తిరుపతి జిల్లా కేవీబీ పురం ఓళ్లూరు గిరిజన కాలనీకి చెందిన దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి దీపావళి పండుగ కోసం పది రోజుల క్రితం వడమాలపేట మండలం ఏఎం పురం ఎస్టీ కాలనీకి వచ్చారు. చిన్నారి మేనమామకు కాలు విరగడంతో ఆ బాలిక తండ్రి, కుటుంబీకులు సమీపంలోని పుత్తూరు రాచపాలెంలో శల్య వైద్యశాలకు తీసుకెళ్లారు. ఆ సమయంలో చిన్నారి తల్లితో ఉంది. చిన్నారికి వరుసకు మేనమామ అయిన ఏఎం పురానికి చెందిన సుశాంత్ ఆ బాలికకు చాక్లెట్ ఇప్పిస్తానని అంగడికి తీసుకెళ్లాడు. దుకాణం నుంచి చిన్నారిని పక్కనే ఉన్న సచివాలయం, పాఠశాల మధ్యలోకి తీసుకెళ్లి కిరాతకంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం బయటకు పొక్కకుండా చిన్నారిని పక్కనే ఉన్న మురికి కాలువలో తొక్కి అతి కిరాతకంగా చంపేశాడు. మృతదేహం పైకి కనిపించకుండా కాలువలోనే పూడ్చిపెట్టాడు. శరీరానికి బురద అంటుకోవడంతో పక్కనే స్నానం చేసి తిరిగి వచ్చాడు. సాయంత్రం వరకు చిన్నారి రాకపోవడంతో తల్లి చుట్టుపక్కల వెతికింది. ఎంతకీ కనిపించలేదు. ఈలోపు సుశాంత్ అక్కడికి రావడంతో పాప ఎక్కడ అని ప్రశ్నించింది. చాక్లెట్ ఇచ్చాక పాపను ఇంటి వద్దే వదలేశానని, నాకు తెలియదు అంటూ తడబడుతూ సమాధానం ఇచ్చాడు. గట్టిగా నిలదీయడంతో సుశాంత్ తప్పించుకునేందుకు పరుగులు పెట్టాడు. కాలనీ వాసులు సుశాంత్‌ని పట్టుకుని గట్టిగా నిలదీశారు. ఎంతకూ సమాధానం చెప్పకపోవడంతో శుక్రవారం రాత్రి చిన్నారి తల్లి, బంధువులు కలిసి అతన్ని వడమాలపేట పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు. అప్పటికే అతను మద్యం, గంజాయి మత్తులో కూడా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా చిన్నారి అచూకీ కోసం తల్లిదండ్రులు, బంధువులు రాత్రంతా టార్చిలైట్ల వెలుతురులో పరిసర ప్రాంతాలన్నీ గాలించారు. ఎక్కడా ఆచూకీ దొరక్కపోవడంతో తిరిగి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో సుశాంత్ దారుణాన్ని ఒప్పుకున్నాడు. అతను చెప్పిన వివరాలతో శనివారం వేకువజామున మురికి కాలువలో నుంచి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న చిన్నారి బంధువులు, ఓళ్లూరు, ఏఎం పురం గిరిజన కాలనీల వారంతా పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు వచ్చారు. -
శతకాల వీరుడికి... సువర్ణావకాశం
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు చెందిన స్టార్ క్రికెటర్ నంబళ్ల సుశాంత్ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌కు ఎంపికయ్యాడు. గత రెండు నెలలగా జరిగిన ఏసీఏ అంతర్‌జోనల్ క్రికెట్ టోర్నీల్లో భీకర ఫామ్‌ను కొన సాగిస్తూ సెంచరీల మోత మోగించిన సుశాంత్ బీసీసీఐ నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే ఏసీఏ ఆంధ్రా అండర్–19 పురుషుల జట్టుకు ఎంపికయ్యాడు. ఈ మేరకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన 15 మంది సభ్యులతో కూడిన ఆంధ్రా జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఓపెనర్‌గానే సుశాంత్‌కు ఛాన్స్ లభించింది.బీసీసీఐ ఆధ్వర్యంలో మెగా టోర్నీ..గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా బీసీసీఐ ఆధ్వర్యంలో రిలయన్స్ సంస్థ సహకారంతో ఈనెల 24 నుంచి ఆలిండియా అంతర్రాష్ట్ర అండర్–19 పురుషుల ఇన్విటేషన్ లీగ్ అండ్ నాకౌట్ టెస్ట్(త్రీడేస్ మ్యాచ్‌ల) టోర్నమెంట్ 2024–25 జరగనుంది. యువ టాలెంట్‌ను వెతికేందుకు బీసీసీఐ మెగా టోర్నీని నిర్వహిస్తుంది. ఈ మూడో సీజన్ మెగా టోర్నీలో ఆంధ్రప్రదేశ్‌తోపాటు బరోడా, బెంగాల్, గోవా, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, కేరళ, మద్యప్రదేశ్, ముంబాయ్, పంజా బ్, సౌరాష్ట్ర రాష్ట్రాల జట్ల ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఈనెల 24 నుంచి ఈ పోటీలు మొదలుకానున్నాయి. ఈ టోర్నీలో పాల్గొనే ఆంధ్రా జట్టుకు శ్రీకాకుళం నుంచి ఒకే ఒక్కడు నంబళ్ల సుశాంత్ ఎంపికయ్యాడు.అత్యద్భుతమైన ఆటతీరుతో రాణింపు..గత కొన్నేళ్ల నుంచి అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో సుశాంత్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ముఖ్యంగా ఈ సీజన్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. వైఎస్సార్ కడప జిల్లాలో కేఓఆర్ఎం కాలేజ్ క్రికెట్ మైదానంలో జరుగుతున్న ఏసీఏ అంతర్‌జోనల్ పురుషుల అండర్–19 త్రీడేస్(టెస్ట్) మ్యాచ్‌ల టోర్నీలో శ్రీకాకుళం జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న నంబళ్ల సుశాంత్ టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇటీవలి ముగిసిన పరిమిత ఓవర్ల వన్డే టోర్నీలో 5 మ్యాచ్‌ల్లో 341 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా త్రీడేస్ టోర్నీలోనూ సెంచరీల మోత మో గిస్తున్నాడు. అటు ఏసీఏ ఆంధ్రా అండర్–19జట్టుతోపాటు ఇటు ఆంధ్రా రంజీ జట్టుకు ఎంపికయ్యేందుకు బలమైన బాటలు వేసుకుంటున్నాడు. ఈ సీజన్లో ఇప్పటికే ఐదు సెంచరీలతో కదంతొక్కాడు. ఆఫ్‌స్పిన్ బౌలింగ్‌లోనూ అదరగొడుతున్నాడు.తండ్రి ప్రోత్సాహంతో..సుశాంత్ స్వస్థలం జిల్లాలోని టెక్కలి పట్టణంలోని వెంకటేశ్వర కాలనీ. ప్రస్తుతం శ్రీకాకుళంలోనే నివాసం ఉంటున్నారు. ఎచ్చెర్లలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి నంబళ్ల జగదీష్ శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తుండగా, తల్లి అర్చన గృహిణి. తండ్రి దగ్గరుండి నిరంతరం ప్రోత్సహిస్తుండటంతో సుశాంత్ అదరగొట్టేలా ప్రతిభను చూపిస్తున్నాడు.క్రికెట్ సంఘం అభినందన..ప్రతిష్టాత్మక ఆలిండియా అంతర్రాష్ట్ర మెగా క్రికెట్ టోర్నీకి నంబళ్ల సుశాంత్ ఎంపికపై క్రికెట్ సంఘ జిల్లా అధ్యక్షుడు పీఎల్ఎన్ శాస్త్రి, కార్యదర్శి హసన్రాజ షేక్, మెంటార్ ఇలియాస్ మహ్మద్, కోశాధికారి మదీనా శైలానీ, డాక్టర్ రవికుమార్ తదితరులు అభినందించారు. యువ క్రీడాకారుడి రాణింపుపై తల్లిదండ్రులు, జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు, కోచ్‌లు సంతోషం వ్యక్తం చేశారు. -
NEET paper leak case: ‘మాస్టర్‌మైండ్’ అరెస్ట్
నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ మరో ముందడుగు వేసింది. తాజాగా ఈ కేసులో ఒడిశాకు చెందిన సుశాంత్ కుమార్ మొహంతిని దర్యాప్తు సంస్థ సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ ఉదంతంలో సుశాంత్ ప్రధాన సూత్రధారి అని సమాచారం. ప్రస్తుతం అతనిని సీబీఐ ఐదు రోజుల పాటు రిమాండ్‌కు తరలించింది.ఈ కేసులో ఇప్పటి వరకు 42 మందిని అరెస్టు చేశారు. ఆగస్టు 4న నీట్ పేపర్ లీక్ కేసులో సాల్వర్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. సాల్వర్ సందీప్ రాజస్థాన్‌లోని భిల్వారాలోని మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. సందీప్‌ను పట్నాలోని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. అనంతరం 5 రోజుల రిమాండ్‌కు తరలించారు.నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ ఆగస్టు ఒకటిన చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ చార్జిషీటులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 13 మంది పేర్లను నమోదు చేసింది. ఇందులో నలుగురు అభ్యర్థులు, ఒక జూనియర్ ఇంజనీర్, ఇద్దరు కింగ్పిన్ల పేర్లు ఉన్నాయి. ఈ కేసులో కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రుల పేర్లు కూడా ఉన్నాయని సీబీఐ వెల్లడించింది. -
బ్రెయిన్ స్ట్రోక్‌తో బాలుడు మృతి
మహబూబ్‌నగర్: బ్రెయిన్ స్ట్రోక్‌తో బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలోని వర్నె గ్రామంలో విషాదాన్ని నింపింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిట్టెమ్మ, సహదేవ్ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరిలో రెండో కుమారుడు సుశాంత్(15) దేవరకద్ర మండలంలోని పేరూరు జెడ్పీ హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. శనివారం సాయంత్రం ఇంటి వద్ద బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్చిన గంటలోపే ప్రాణాలు వదిలాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నిన్నటి వరకు కుటుంబ సభ్యుల ముందు ఆడుతూ పాడుతూ గడిపిన బాలుడు బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందడం ఆ కుటుంబాన్ని తీరని శోకసంద్రంలో ముంచింది. -
చిరంజీవి భోళా శంకర్ లో నా రోల్ ఇదే...
-
రవితేజ తో నా అసలు గొడవ ..! చిరంజీవి భోళాశంకర్ లో నా రోల్
-
అందుకే వెంటనే ఓకే చెప్పాను
‘‘రావణాసుర’ వైవిధ్యమైన చిత్రం. ఇలాంటి కాన్సెప్ట్ తెలుగు సినిమాల్లో ఇప్పటివరకూ రాలేదు. అందుకే కథ వినగానే నటించేందుకు ఓకే చెప్పాను’’ అని సుశాంత్ అన్నారు. రవితేజ హీరోగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రావణాసుర’. అభిషేక్ నామా, రవితేజ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న విడుదలవుతోంది. ఈ చిత్రంలో కీలక పాత్ర చేసిన సుశాంత్ మాట్లాడుతూ– ‘‘రావణాసుర’ టైటిల్ రోల్‌ని రవితేజగారు చేశారు. నేను రామ్ పాత్ర చేశా. మా ఇద్దర్నీ సుధీర్‌గారు సరికొత్తగా చూపించారు. నా పాత్రని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఎగ్జయిట్మెంట్ ఉంది. ‘రావణాసుర’ కంప్లీట్ థ్రిల్లర్. వెర్సటైల్ యాక్టర్‌గా అన్ని రకాల పాత్రలు చేయాలనేది నా ఆలోచన. ఈ సినిమాలో ఆ కొత్తదనం కనిపిస్తుంది. ‘రావణాసుర’లో నన్ను తీసుకోవాలనే ఆలోచన అభిషేక్గారిదే. ఇందుకు ఆయనకు థ్యాంక్స్. ‘అల వైకుంఠపురములో’ చిత్రం నాకు మంచి పేరు తీసుకొచ్చింది. ఉత్తరాదిలో కూడా ఫేమ్ తీసుకొచ్చింది. అయితే ఆ సినిమా తర్వాత చాలా అవకాశాలు వచ్చినా నన్ను ఎగ్జయిట్ చేసిన ‘రావణాసుర, భోళా శంకర్..’ లాంటి సినిమాలు మాత్రమే ఒప్పుకున్నాను. అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి రావడం నా లక్. నేను మొదటి నుంచి కూడా నాకు వస్తున్న అవకాశాలతోనే ముందుకువెళ్లాను. కొన్ని సినిమాల షూటింగ్ ఆలస్యం కావడం, అనుకున్న టైమ్‌కి విడుదల కాకపోవడం వల్ల గ్యాప్ వస్తోంది. ‘చిలసౌ’ తర్వాత ఇక గ్యాప్ తీసుకోకూడదని నిర్ణయించుకున్నాను. అయితే కోవిడ్ వల్ల గ్యాప్ వచ్చింది. కానీ ఆరు నెలలుగా బిజీగా ఉన్నాను. ‘భోళా శంకర్’లో కీ రోల్ చేస్తున్నాను. అలాగే సోలో హీరోగా ఒక కథ ఓకే చేశాను’’ అన్నారు. -
భోళా శంకర్‌లో లవర్‌బాయ్‌గా సుశాంత్
చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ‘బోళా శంకర్’ చిత్రంలో ప్రత్యేక పాత్ర చేస్తున్నారు సుశాంత్. శనివారం సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించి,పోస్టర్ని రిలీజ్ చేశారు. క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి ఏకే ఎంటర్టైన్మెంట్స్పై రామబ్రహ్మం సుంకర ఈ సినిమా నిర్మిస్తున్నారు. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రం ‘బోళా శంకర్’. ఇందులో సుశాంత్‌ది లవర్‌బాయ్ తరహా పాత్ర’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
వెయ్యిన్నొక్క జిల్లాల వరకు...
‘వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే.. ముల్లోకాల ఏ మూల ఉన్నా నీ అందాల సంకీర్తనే’ అని పాడుతున్నారు రావణాసుర. రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘రావణాసుర’. సుశాంత్ కీ రోల్ చేసిన ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజితా పొన్నాడ హీరోయిన్లు. రవితేజ, అభిషేక్ నామా నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం ఈ చిత్రంలోని ‘వెయ్యిన్నొక్క జిల్లాల..’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. వెంకటేశ్ ‘సూర్య ఐపీఎస్’ చిత్రంలోని ‘వెయ్యిన్నొక్క జిల్లాలకు..’ పాటకు ఇది రీమిక్స్ వెర్షన్. అప్పట్లో ఈ పాటకు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి లిరిక్స్ అందించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో అనురాగ్ కులకర్ణి ఈ లేటెస్ట్ వెర్షన్‌ను పాడారు. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో, కెమెరా: విజయ్ కార్తీక్ కన్నన్. -
రవితేజ ‘రావణాసుర’ థీమ్ సాంగ్ విన్నారా?
రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రావణాసుర’. అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సుశాంత్ కీలక పాత్ర చేస్తున్నారు. అభిషేక్ నామా, రవితేజ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ‘రావణా..’ అంటూ సాగే థీమ్ సాంగ్‌ని విడుదల చేశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ థీమ్ సాంగ్‌ని కంపోజ్ చేయగా, పాపులర్ మ్యూజిక్ వేదిక్ బ్యాండ్ శాంతి పీపుల్, నోలిక్ ఈ థీమ్ సాంగ్‌ని ఆలపించారు. ‘‘హై ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’. రవితేజను లాయర్ పాత్రలో చూపిస్తున్నారు సుధీర్ వర్మ. కథలో ఊహించని మలుపులుంటాయి. ఏప్రిల్ 7న మా సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాతలు. -
మా నీళ్ల ట్యాంక్ ట్రైలర్ రిలీజ్ చేసిన బుట్టబొమ్మ
యంగ్ హీరో సుశాంత్ మా నీళ్ల ట్యాంక్ అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీలో అడుగుపెట్టబోతున్నాడు. వరుడు కావలెను ఫేమ్ లక్ష్మీ సౌజన్య డైరెక్ట్ చేసిన ఈ సిరీస్‌లో ప్రియా ఆనంద్ కథానాయికగా నటించింది. సుదర్శన్, ప్రేమ్ సాగర్, దివి, రామరాజు, అన్నపూర్ణమ్మ, నిరోషా, అప్పాజీ అంబరీష ముఖ్యపాత్రలు పోషించారు. శుక్రవారం సాయంత్రం మా నీళ్ల ట్యాంక్ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను బుట్టబొమ్మ పూజా హెగ్డే రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్లో దాదాపు అందరూ రాయలసీమ యాస మాట్లాడటాన్ని బట్టి ఇది రాయలసీమ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కినట్లు తెలుస్తోంది. పారిపోయిన అమ్మాయిని వెతికి తీసుకొచ్చేదాకా నీళ్ల ట్యాంక్ దిగనని మొండికేస్తాడో కుర్రాడు. దీంతో పోలీస్ పాత్రలో ఉన్న హీరో అందుకోసం గాలింపు చేపడతాడు. ఈ క్రమంలో ఆమెతో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. మరి వీరి ప్రేమ సఫలమైందా? ఇంతకీ ట్యాంక్ ఎక్కి కూర్చున్న వ్యక్తిని ఎలా కిందకు దించారు? అనేది తెలియాలంటే ఈ నెల 15 వరకు ఆగాల్సిందే! ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో తెలుగు, తమిళ భాషల్లో మా నీళ్ల ట్యాంక్ స్ట్రీమింగ్ కానుంది. చదవండి: ఘోస్ట్ మూవీ నేరుగా ఓటీటీలోకి రాబోతోందా? మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌తో తన్నులు తినాలనుంది: అఖండ విలన్ -
ఆ హీరోయిన్ నా లక్కీ చామ్: అల్లు అర్జున్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బుట్టబొమ్మ పూజా హెగ్డేలు హీరోహీరోయిన్లుగా నటించిన ‘అల వైకుంఠపురములో’ మూవీ బ్లక్‌బస్టర్‌గా అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బన్నీ కేరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. గతేడాది సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా విడుదలై నిన్నటికి(జవవరి 11) సరిగ్గా ఏడాది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మూవీ యానివర్సరీని పురస్కరించుకుని ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను బన్నీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ఈ సందర్భంగా పూజా హెగ్డేతో కలిసి ఉన్న ఫొటోకు ‘నా గుడ్ లక్ చామ్‌గా ఉన్నందుకు ధన్యవాదాలు’ అంటూ షేర్ చేశాడు. అంతేగాక ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని ఫొటోలను కూడా బన్నీ ఈ సందర్భంగా షేర్ చేశాడు. దర్శకుడు త్రివిక్రమ్, సహానటుడు సుశాంత్, అల్లు శీరిష్‌లతో కలిసి తీసుకున్న సెల్ఫీలను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నాడు. (చదవండి: వైరల్ అవుతున్న అల్లు అర్జున్ జర్నీ సాంగ్) అంతేగాక ఈ కార్యమంలో చిత్ర యూనిట్ మొత్తం కలిసి ఉన్న ఫొటోకు ‘వన్ ఈయర్ రీయూనియన్.. నాకు మర్చిపోలేని జ్ఞాపకాలను అందించిన మీ అందరికి ధన్యవాదాలు. మీకేల్లప్పుడు కృతజ్ఞతుడిని’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. కాగా ప్రస్తుతం బన్నీ క్రియోటివ్ డైరెక్టర్ సూకుమార్ దర్శకత్వంలో తెరకెక్కతున్న ‘పుష్పా’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా యూనిట్లో పనిచేసే ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందడంతో ‘పుష్పా’ షూటింగ్ నిలిచిపోయింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. (చదవండి: ఇకపై నేనేంటో చూపిస్తా.. అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు) View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
హీరో రాహుల్ దర్శకత్వంలో సుశాంత్
‘అందాల రాక్షసి’, ‘అలా ఎలా’, ‘గాలిపటం’ తదితర చిత్రాల్లో హీరోగా, మహేశ్‌బాబు ‘శ్రీమంతుడు’లో కీలక పాత్రలో నటించిన రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారనున్నారు. సుశాంత్ హీరోగా సిరిని సినీ కార్పొరేషన్ నిర్మాణంలో ఈ సిన్మా తెరకెక్కనుందని రాహుల్ తెలిపారు. ‘‘చిన్ననాటి కలలను నిజం చేసుకునేందుకు దర్శకత్వంలో తొలి అడుగులు వేయబోతున్నాను. అక్టోబర్ లేదా నవంబర్‌లో షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం’’ అని రాహుల్ ట్వీట్ చేశారు. ‘‘లవ్లీ స్క్రిప్ట్‌తో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమా చేయబోతున్నా’’ అని సుశాంత్ ట్వీటారు. -
హీరో సుశాంత్‌కు పితృవియోగం
స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు రెండో కుమార్తె, నాగార్జున సోదరి నాగ సుశీల భర్త, హీరో సుశాంత్ తండ్రి అనుమోలు సత్యభూషణరావు (68) బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన జూబ్లీ హిల్స్‌లోని స్వగృహంలో గుండె పోటుతో మరణించారు. వాస్తవానికి నాగచైతన్య నటించిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఆడియో వేడుక గురువారం జరగాల్సింది. కానీ, సత్యభూషణరావు మృతితో వాయిదా వేశారు. పలువురు సినీ ప్రముఖులు సత్యభూషణరావు మృతిపట్ల తమ సంతాపం తెలిపారు. -
అభిమానులకు ఇది పండగ సీజన్
‘‘ముంబైలో అమితాబ్ బచ్చన్ గారితో యాడ్ షూటింగ్ ఉండడంతో నాన్నగారు రాలేదు. మీకు (అభిమానులకు) సారీ చెప్పమన్నారు. త్వరలో అక్కినేని అభిమానులందరికీ పండగ సీజన్ స్టార్ట్ అవుతుంది. వరుసగా సినిమాలు వస్తాయి. సుశాంత్‌కు సినిమాలు తప్ప వేరే లోకం ఉండదు. ఈ సినిమా తన అర్హతకు తగిన విజయం అందిస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు అఖిల్. సుశాంత్, సోనమ్ ప్రీత్ బజ్వా జంటగా జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రీనాగ్ కార్పొరేషన్, శ్రీజి ఫిలింస్ బేనర్స్‌పై చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మించిన సినిమా ‘ఆటాడుకుందాం.. రా’. అనూప్ రూబెన్స్ స్వరపరచిన ఈ సినిమా పాటల సీడీలను అఖిల్ ఆవిష్కరించి సుశాంత్, అనూప్‌లకు అందించారు. థియేట్రికల్ ట్రైలర్‌ను సుమంత్ విడుదల చేశారు. అఖిల్ మాట్లాడుతూ - ‘‘అనూప్ మా సినిమాలన్నిటికీ ప్రాణం పోస్తున్నాడు. మా నాన్నకు తమ్ముడిలా.. నాకు, చైతూకీ అన్నయ్యలా పనిచేస్తాడు. వుయ్ లవ్ యూ అనూప్. రెండో సినిమా స్టార్ట్ చేసే ముందు కొంచెం చార్జింగ్ తగ్గింది. ఇవాళ మొత్తం చార్జ్ అయ్యాను. రెడీగా ఉన్నాను’’ అన్నారు. సుశాంత్ మాట్లాడుతూ - ‘‘నాగచైతన్య, అఖిల్ చేసిన ప్రత్యేక పాత్రలు సినిమాకి స్పెషల్ అట్రాక్షన్. మనసుకు నచ్చిన సినిమాలు చేయాలనుకోవడంతో గ్యాప్ వస్తోంది’’ అన్నారు. నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ - ‘‘నాలుగేళ్ల క్రితమే సుశాంత్‌తో సినిమా చేయాల్సింది. లేటైనా మంచి సినిమా చేసినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు. చింతలపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ - ‘‘మంచి టీమ్ కుదిరింది. తప్పకుండా హిట్ సాధిస్తాం. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘సుశాంత్ డెడికేషన్ చాలా ఇష్టం. డ్యాన్స్, ఫైట్స్‌లలో తన హార్డ్ వర్క్ కనిపిస్తోంది. నా సినిమా సెప్టెంబర్‌లో లేక అక్టోబర్‌లో రిలీజ్ చేయాలనుకుంటు న్నాను’’ అని సుమంత్ అన్నారు. దర్శకులు కల్యాణ్‌కృష్ణ, కార్తీక్ రెడ్డి, పల్నాటి సూర్యప్రతాప్, నిర్మాత మల్కాపురం శివకుమార్, నటుడు బ్రహ్మానందం, బీఏ రాజు తదితరులు పాల్గొన్నారు. -
జస్ట్ చిల్!
సుశాంత్ కథానాయకుడిగా జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ. నాగసుశీల నిర్మిస్తున్న చిత్రం ‘ఆటాడుకుందాం.. రా’. జస్ట్ చిల్.. అనేది ఉపశీర్షిక. సోనమ్ ప్రీత్ బజ్వా కథానాయిక. అనూప్ రూబెన్స్ సంగీతమందించిన పాటల్ని ఈ నెల 5న విడుదల చేస్తున్నారు. చింతలపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ -‘‘వినోదాత్మక కుటుంబ కథా చిత్రమిది. యాక్షన్‌కి మంచి ప్రాముఖ్యత ఉంటుంది. టైమ్ మెషీన్ నేపథ్యంలో అడ్వంచరస్ జర్నీలా సాగే సన్నివేశాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. సుశాంత్, బ్రహ్మానందం మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ వారంలోనే ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో శిల్పకళా వేదికలో ఆడియో, స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. మురళీశర్మ, పోసాని, వెన్నెల కిశోర్, రఘుబాబు, పృథ్వీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ-మాటలు: శ్రీధర్ సీపాన, కూర్పు: గౌతంరాజు, కెమేరా: దాశరథి శివేంద్ర. -
‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ దర్శకునితో సుశాంత్ కొత్త సినిమా
గత ఏడాది నవంబర్‌లో విడుదలైన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ విభిన్న ప్రయత్నంగా పేరు తెచ్చుకోవడమే కాకుండా, వాణిజ్య పరంగా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రముఖ నవలా రచయిత మేర్లపాక మురళి తనయుడైన మేర్లపాక గాంధీ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమయ్యారు. మేర్లపాక గాంధీ తన రెండో చిత్రాన్ని సుశాంత్ హీరోగా చేయబోతున్నారు. శ్రీ నాగ్ ఫిలిం కార్పొరేషన్ పతాకంపై చింతలపూడి శ్రీనివాసరావు, నాగ సుశీల ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే గాంధీ చక్కటి స్క్రిప్ట్ సిద్ధం చేశారట. ప్రస్తుతం కథానాయిక, ఇతర తారాగణం ఎంపికలో దర్శక, నిర్మాతలు బిజీగా ఉన్నారు. సెప్టెంబర్‌లో ఈ సినిమా చిత్రీకరణ మొదలుకానుంది. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల దుర్మరణం
దొడ్డబళ్లాపురం, న్యూస్‌లైన్ : డొనేట్ బ్లడ్ బట్ నాట్ ఆన్ రోడ్స్...అనే సందేశాన్ని బైక్‌పై రాసుకుని తిరిగిన యువకులు అదే బైక్‌పై వెళ్తూ ప్రమాదానికి గురై దుర్మరణం చెందిన సంఘటన పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. మృతులు చిక్కబళ్లాపురానికి చెందిన సుశాంత్(23), చింతామణికి చెందిన దీపక్(24), దొడ్డబళ్లాపురానికి చెందిన కార్తీక్(23)గా గుర్తించారు. వీరిలో సుశాంత్, దీపక్‌లు ఇక్కడి రిట్టల్ ఫ్యాక్టరీ ఉద్యోగులు. డిప్లోమా చదివిన కార్తీక్ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇదిలా ఉంటే ముగ్గురూ ఒకే బైక్‌పై శుక్రవారం రాత్రి ఇక్కడి ప్రసన్న టాకీస్‌లో తుఫాన్ సినిమాకు వెళ్లారు. అనంతరం రైల్వేస్టేషన్ సర్కిల్‌కి వెళ్లి భోజనం చేశారు. అక్కడి నుంచి బెంగళూరు-హిందూపురం రహదారిపై బైక్‌పై వస్తుండగా, మార్గం మధ్యలో ముత్తూరు వద్ద గుర్తు తెలియని వాహనం ఒకటి వీరి బైక్‌ను ఢీకొంది. దీంతో ప్రమాదంలో సుశాంత్, దీపక్‌లు ఇద్దరూ ఘటనాస్థలంలోనే దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడిన కార్తీక్‌ను బెంగళూరు ఎంఎస్ రామయ్య ఆస్పత్రికి తరలించగా శనివారం ఉదయం చికిత్స ఫలించక మృతి చెందాడు. యువకుల మృతితో వీరి తల్లితండ్రులు, బంధువులు,స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. రక్తదానం చేయాలని, అయితే అది రోడ్లపై కాకూడదని సందేశం బైక్‌పై రాసుకుని తిరిగిన యువకులు చివరకు రోడ్డుపైనే రక్తమోడి దుర్మరణం చెందడం శోచనీయం. పట్టణ పోలీ సులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.