యంగ్ హీరో సుశాంత్ మా నీళ్ల ట్యాంక్ అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీలో అడుగుపెట్టబోతున్నాడు. వరుడు కావలెను ఫేమ్ లక్ష్మీ సౌజన్య డైరెక్ట్ చేసిన ఈ సిరీస్‌లో ప్రియా ఆనంద్ కథానాయికగా నటించింది. సుదర్శన్, ప్రేమ్ సాగర్, దివి, రామరాజు, అన్నపూర్ణమ్మ, నిరోషా, అప్పాజీ అంబరీష ముఖ్యపాత్రలు పోషించారు. శుక్రవారం సాయంత్రం మా నీళ్ల ట్యాంక్ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను బుట్టబొమ్మ పూజా హెగ్డే రిలీజ్ చేసింది.
ఈ ట్రైలర్‌లో దాదాపు అందరూ రాయలసీమ యాస మాట్లాడటాన్ని బట్టి ఇది రాయలసీమ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కినట్లు తెలుస్తోంది. పారిపోయిన అమ్మాయిని వెతికి తీసుకొచ్చేదాకా నీళ్ల ట్యాంక్ దిగనని మొండికేస్తాడో కుర్రాడు. దీంతో పోలీస్ పాత్రలో ఉన్న హీరో అందుకోసం గాలింపు చేపడతాడు. ఈ క్రమంలో ఆమెతో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. మరి వీరి ప్రేమ సఫలమైందా? ఇంతకీ ట్యాంక్ ఎక్కి కూర్చున్న వ్యక్తిని ఎలా కిందకు దించారు? అనేది తెలియాలంటే ఈ నెల 15 వరకు ఆగాల్సిందే! ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో తెలుగు, తమిళ భాషల్లో మా నీళ్ల ట్యాంక్ స్ట్రీమింగ్ కానుంది.
చదవండి: ఘోస్ట్ మూవీ నేరుగా ఓటీటీలోకి రాబోతోందా?
మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌తో తన్నులు తినాలనుంది: అఖండ విలన్
Comments
Please login to add a commentAdd a comment