వేశ్య పాత్రలో టాలీవుడ్ హీరోయిన్.. అంచనాలు పెంచేసిన ట్రైలర్‌! | Tollywood Actress Anjali Latest Web Series Trailer Out Now | Sakshi
Sakshi News home page

'మంచోడు చేసే మొద‌టి త‌ప్పు ఏంటో తెలుసా..?'.. ఆసక్తిగా ట్రైలర్!

Published Wed, Jul 10 2024 7:00 PM | Last Updated on Wed, Jul 10 2024 7:12 PM

Tollywood Actress Anjali Latest Web Series Trailer Out Now

టాలీవుడ్ భామ అంజలి ఇటీవల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంతో అభిమానులను అలరించింది. తాజాగా మరో ఆసక్తికర వెబ్ సిరీస్‌తో ఫ్యాన్స్‌ను పలకరించేందుకు వస్తోంది. అంజ‌లి లీడ్‌ రోల్‌లో వస్తోన్న వెబ్ సిరీస్‌ బ‌హిష్క‌ర‌ణ. ముకేశ్ ప్రజాపతి దర్శకత్వంలో రూపొందించిన ఈ సిరీస్‌ను జీ 5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్లపై ప్రశాంతి మలిశెట్టి నిర్మించారు.

విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్‌లో వస్తోన్న సిరీస్‌లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉండ‌నున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సిరీస్‌ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అక్కినేని నాగార్జున చేతుల మీదుగా ట్రైలర్ విడుద‌ల చేశారు. 'మంచోడు చేసే మొద‌టి త‌ప్పు ఏంటో తెలుసా..? చెడ్డోడి చ‌రిత్ర తెలుసుకోవ‌డ‌మే..' అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ఈ సిరీస్‌లో అంజలి వేశ్యపాత్రలో కనిపించనుంది. దీంతో అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్‌లో అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా.. ఈ వెబ్ సిరీస్ ఈనెల 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement