అరవింద్ కృష్ణ, రజత్ రాఘవ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ సిట్. ఈ సినిమాను ఎస్‌ఎన్ఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్, వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ, వాసిరెడ్డి సినిమాస్ బ్యానర్స్‌పై సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని నాగిరెడ్డి, తేజ్ పల్లి, గుంటక శ్రీనివాస్ రెడ్డి నిర్మించగా..విజయ్ భాస్కర్ రెడ్డి దర్శకత్వం వహించారు. తాజగా ఈ మూవీ ట్రైలర్ యంగ్ హీరో విశ్వక్ సేన్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ను విశ్వక్ సేన్ అభినందించారు.
చిత్ర ట్రైలర్ చూస్తుంటే.. మొదట ఓ అమ్మాయి మర్డర్ కేసు నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఆ కేసును ఎలా చేధించారనే సస్పెన్స్ కోణంలో ఈ సినిమా ఉండబోతోంది. ట్రైలర్ చివర్లో పోలీసాఫీసర్‌గా అరవింద్ కృష్ణ చెప్పడం హైలెట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో నటాషా దోషి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. రుచిత సాధినేని, అనుక్ రాథోడ్, కౌశిక్ మేకల.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు వరికుప్పల యాదగిరి సంగీతమందిస్తున్నారు. కాగా.. ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఇవాల్టి నుంచే ప్రముఖ ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment