
‘‘డార్లింగ్’ మూవీ ట్రైలర్ చాలా బాగుంది. డైరెక్టర్ రామ్ అద్భుతంగా తీశారు. ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది. యూనిట్‌కి ఆల్ ది బెస్ట్’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. ప్రియదర్శి, నభా నటేష్ జోడీగా అశ్విన్ రామ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘డార్లింగ్’. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్ మెంట్‌పై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ను విశ్వక్ సేన్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా సమయంలో నన్ను వేదికపైకి ఆహ్వానించి సైకో వివేక్‌గా పరిచయం చేశాడు ప్రియదర్శి. ‘మల్లేశం, బలగం’ లాంటి సినిమాలు అందరికీ పడవు.. రాసి పెట్టి ఉండాలి.
ఇప్పుడు తను ‘డార్లింగ్’ తో రావడం చాలా ఆనందంగా ఉంది. దర్శి గెలిస్తే నేను గెలిచినట్లు అనిపిస్తుంది’’ అన్నారు. ‘‘డార్లింగ్ అనగానే ప్రభాస్‌అన్న పేరు గుర్తొస్తుంది. అలాంటి టైటిల్ పెట్టుకోవాలంటే భయంగా ఉండేది. అయితే కథని నమ్మి ‘డార్లింగ్’ టైటిల్ పెట్టుకున్నాం’’ అన్నారు ప్రియదర్శి. ‘‘నేను ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత ఎలాంటి సినిమా చేయాలి? అని ఆలోచిస్తున్నపుడు ‘డార్లింగ్’ అవకాశం వచ్చింది’’ అన్నారు నభా నటేష్. ‘‘మూడేళ్ల ప్రయాణం ‘డార్లింగ్’. వినోదాత్మకంగా రూపొందిన ఈ సినిమా ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది’’ అన్నారు అశ్విన్ రామ్. ‘‘కథని నమ్మి తీసిన ఈ మూవీకి ప్రేక్షకుల ్రపోత్సాహం కావాలి’’ అన్నారు చైతన్య.
Comments
Please login to add a commentAdd a comment