ఒక ప్రమాదంతో ఇంటికే పరిమితం.. అప్పుడే అర్థమైంది! | Nabha Natesh Interesting Comments About Darling Movie, Deets Inside | Sakshi
Sakshi News home page

ఒక ప్రమాదంతో ఇంటికే పరిమితం.. కానీ అప్పుడే..

Jul 14 2024 1:28 AM | Updated on Jul 14 2024 5:08 PM

Nabha Natesh About Darling Movie

‘‘నాకు జరిగిన ప్రమాదంలో భుజానికి గాయమైంది. కెరీర్‌ సజావుగా సాగుతున్న సమయంలో ఇలా జరగడంతో కాస్త బాధపడ్డాను. ఆ బాధ సహజమే. అయితే ఇంతటితో నా కెరీర్‌ ముగిసిపోయిందని మాత్రం అనుకోలేదు. ఒక్క ప్రమాదంతో అంతా అయిపోతుందని నిరుత్సాహపడలేదు.  ప్రమాదం జరిగాక ఇంటికే పరిమితం అయిన నేను సోషల్‌ మీడియాలో ఏదైనా పోస్ట్‌ షేర్‌ చేసినప్పుడు నెటిజన్లు బాగా స్పందించేవారు. నన్ను సిల్వర్‌ స్క్రీన్‌పై చూడాలని ఉందని కామెంట్స్‌ పెట్టేవారు. దీంతో నా ప్రేక్షకులు నన్ను చూడటానికి ఎదురు చూస్తున్నారని అర్థమైంది.

వారి మాటలు నాలో ఆత్మవిశ్వాసం కలిగించాయి. అలాగే యాక్సిడెంట్‌ తర్వాత కూడా అవకాశాలు వచ్చాయి. ఆ అవకాశాలు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. కానీ నేను పూర్తిగా ఫిట్‌గా ఉన్నప్పుడే సినిమాలు చేయాలని ఆ చాన్స్‌లు వదులుకున్నాను. దాదాపు మూడేళ్ల తర్వాత ‘డార్లింగ్‌’ సినిమాతో నన్ను నేను థియేటర్స్‌లో చూసుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అన్నారు.

ప్రియదర్శి, నభా నటేశ్‌ లీడ్‌ రోల్స్‌లో అశ్విన్‌ రామ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డార్లింగ్‌’. కె. నిరంజన్‌ రెడ్డి, చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న రిలీజ్‌  కానుంది. ఈ సందర్భంగా నభా మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నేను స్ప్లిట్‌ పర్సనాలిటీ ఉన్న ఆనంది పాత్ర చేశాను. ఒకే సినిమాలో రెండు పాత్రలు చేసినట్లనిపించింది. సవాలుగా తీసుకుని చేశాను. ప్రస్తుతం నిఖిల్‌ పీరియాడికల్‌ మూవీ ‘స్వయం భూ’లో ఓ పాత్ర చేస్తున్నాను’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement