Priyadarshan
-
Bonalu: బోనాల్లో డ్యాన్స్ వేసేవాణ్ని
‘నేను పెరిగింది హైదరాబాద్ పాతబస్తీలో. చిన్నప్పటి నుంచి లాల్ దర్వాజా బోనాలు చూస్తూ పెరిగాను. పోతరాజు వేషంలో డ్యాన్స్ చేసేవాళ్లని చూస్తుంటే సంతోషంగా ఉంటుంది. డ్రమ్స్, మ్యూజిక్, డ్యాన్స్ చూస్తుంటే బాడీలో ఒక వైబ్రేషన్ వస్తుంటుంది. ఇప్పుడు సినిమాల్లోకి వచ్చాక డైరెక్టుగా బోనాల్లో పాల్గొనలేకపోతున్నాను గాని.. లాల్ దర్వాజా, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ.. ఇలా అమ్మవార్ల బోనాల ఉత్సవాలను టీవీలో చూస్తుంటాను.. చాలా సంతోషంగా ఉంటుంది’ అని సినీ నటుడు ప్రియదర్శి అన్నారు. సహాయ, కామెడీ పాత్రలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి.. నగరంలో బోనాల పండగ జోరుగా జరుగుతున్న సందర్భంగా ‘సాక్షి’తో తన అనుభవాలను ఇలా పంచుకున్నారు.‘నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను గమనిస్తున్నది ఏంటంటే.. బోనాల తర్వాత మనకు తప్పకుండా వర్షం వస్తుంది. ఈ విషయాన్ని నేను ఏళ్ల తరబడి చూస్తున్నాను. బోనాల సమయంలో తప్పనిసరిగా వర్షం రావడం మంచిగా అనిపిస్తుంది. హైదరాబాద్‌లో అన్ని కులాలు, మతాల వారు బోనాల ఉత్సవాలను ఎంతో సంబరంగా జరుపుకోవడం సంతోషంగా ఉంటుంది. నేను చిన్నప్పుడు బోనాల్లో డ్యాన్స్ చేసేవాణ్ని. పోతరాజు వేషధారణల మధ్య డ్యాన్స్ చేయడమంటే నాకు చాలా ఇష్టం. అలాగే హైదరాబాద్‌లో యాదవ సోదరులు సదర్ ఉత్సవాలని ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. అవి కూడా నాకెంతో ఇష్టం.. నేను పాల్గొనేవాణ్ని. ‘సేవ్ ద టైగర్స్’ వెబ్ సిరీస్‌లో నేను ఘంటా రవి పాత్ర చేస్తున్నప్పుడు ఇలాంటివన్నీ బాగా రిఫరెన్స్‌గా వాడుకున్నా. సెలబ్రిటీ అయ్యాక బోనాలు, సదర్ ఉత్సవాల్లో డైరెక్టుగా పాల్గొనలేకపోతున్నాను. తప్పదు.. కొన్నింటిని త్యాగం చేయాల్సిందే. సంక్రాంతి పండగను ఆంధ్రప్రదేశ్‌లో ఎంత ఘనంగా జరుపుకుంటారో హైదరాబాద్‌లోనూ అంతే గ్రాండ్‌గా జరుపుకొంటారు. తెలంగాణలో సమ్మక్క– సారక్క, కొండగట్టు అంజన్న, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి, మల్లన్న జాతర.. ఇలాంటివన్నీ సంస్కృతికి నిదర్శనం’. హిందువుల పండగలనే కాదు... నాకు అన్ని పండగలూ ఇష్టమే. ప్రత్యేకించి రంజాన్, బక్రీద్ సమయంలో ముస్లిం స్నేహితులని కలవడం.. వారు పెట్టే ఖీర్ (పాయసం) తినడం చాలా హ్యాపీగా ఉండేది’ అన్నారు ప్రియదర్శి. -
ఒక ప్రమాదంతో ఇంటికే పరిమితం.. అప్పుడే అర్థమైంది!
‘‘నాకు జరిగిన ప్రమాదంలో భుజానికి గాయమైంది. కెరీర్ సజావుగా సాగుతున్న సమయంలో ఇలా జరగడంతో కాస్త బాధపడ్డాను. ఆ బాధ సహజమే. అయితే ఇంతటితో నా కెరీర్ ముగిసిపోయిందని మాత్రం అనుకోలేదు. ఒక్క ప్రమాదంతో అంతా అయిపోతుందని నిరుత్సాహపడలేదు. ప్రమాదం జరిగాక ఇంటికే పరిమితం అయిన నేను సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ షేర్ చేసినప్పుడు నెటిజన్లు బాగా స్పందించేవారు. నన్ను సిల్వర్ స్క్రీన్‌పై చూడాలని ఉందని కామెంట్స్ పెట్టేవారు. దీంతో నా ప్రేక్షకులు నన్ను చూడటానికి ఎదురు చూస్తున్నారని అర్థమైంది.వారి మాటలు నాలో ఆత్మవిశ్వాసం కలిగించాయి. అలాగే యాక్సిడెంట్ తర్వాత కూడా అవకాశాలు వచ్చాయి. ఆ అవకాశాలు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. కానీ నేను పూర్తిగా ఫిట్‌గా ఉన్నప్పుడే సినిమాలు చేయాలని ఆ చాన్స్‌లు వదులుకున్నాను. దాదాపు మూడేళ్ల తర్వాత ‘డార్లింగ్’ సినిమాతో నన్ను నేను థియేటర్స్‌లో చూసుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అన్నారు.ప్రియదర్శి, నభా నటేశ్ లీడ్ రోల్స్‌లో అశ్విన్ రామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డార్లింగ్’. కె. నిరంజన్ రెడ్డి, చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నభా మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నేను స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్న ఆనంది పాత్ర చేశాను. ఒకే సినిమాలో రెండు పాత్రలు చేసినట్లనిపించింది. సవాలుగా తీసుకుని చేశాను. ప్రస్తుతం నిఖిల్ పీరియాడికల్ మూవీ ‘స్వయం భూ’లో ఓ పాత్ర చేస్తున్నాను’’ అన్నారు. -
అదంటే చాలా భయం: నటుడు ప్రియదర్శి
‘‘నటుడిగా ఉంటే విభిన్నరకాలైన పాత్రలు చేయవచ్చు. అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయి. ఇలా కాకుండా నన్ను నేను ఓ హీరోగా అనుకుంటే ఓ డిఫరెంట్ ఇమేజ్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఆ ఇమేజ్ అంటే నాకు భయం. ‘మల్లేశం’ సినిమా తర్వాత నేను దాదాపు 40 కథలు విన్నాను. ఈ కథల్లో ఓ నటుడిగా నన్ను నేను ఊహించుకోలేకపోయాను. దీంతో ‘జాతిరత్నాలు’ సినిమాలో నటించాను. ‘మంగళవారం’ సినిమాలో కూడా నాది హీరో రోల్ అనుకోవడం లేదు. దర్శక–నిర్మాతలు డిఫరెంట్ రోల్స్ ఇస్తున్నారంటే నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని ప్రియదర్శి అన్నారు. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో హర్ష కొనుగంటి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఓం భీమ్ బుష్’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో వీ సెల్యులాయిడ్, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ప్రియదర్శి మాట్లాడుతూ– ‘‘ముగ్గురు పీహెచ్డీ స్కాలర్స్ కథే ఈ చిత్రం. ఓ మంచి పాయింట్‌ను టచ్ చేశాం. ప్రస్తుతం‘గేమ్‌చేంజర్’ మూవీలో ఓ పాత్ర చేస్తున్నాను. నేను, నభానటేష్ లీడ్స్‌గా ఓ మూవీ చేస్తున్నాం’’ అన్నారు. -
దర్శి గాడి సినిమానే కదా OTTలో చూద్దాంలే అనుకోవద్దు..!
-
Balagam Success Meet: కరీంనగర్ లో 'బలగం' మూవీ విజయోత్సవ వేడుక ( ఫొటోలు)
-
హీరోయిన్ ఇంట పెళ్లి సందడి.. ఫోటో షేర్ చేసిన కల్యాణి
ప్రముఖ డైరెక్టర్ ప్రియదర్శన్ కుమారుడు, హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ తమ్ముడు సిద్దార్థ్ వివాహం ఘనంగా జరిగింది. అమెరికన్ పౌరురాలు మెర్లిన్తో అతడు ఏడడుగులు నడిచాడు. చెన్నైలో శుక్రవారం జరిగిన వీరి పెళ్లికి ఇరు కుటుంబాలతో పాటు బంధుమిత్రులు హాజరయ్యారు. సోదరుడి పెళ్లిలో తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోను కల్యాణి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది. కాగా ప్రియదర్శన్ రచయితగా, దర్శకుడిగా అనేక సినిమాలు చేశారు. మలయాళంలోనే కాకుండా బాలీవుడ్ సినిమాలకు సైతం వర్క్ చేశారు. హీరా ఫేరి, హంగామా, హల్చల్, గరం మసాలా, భాగమ్ భాగ్, చుప్ చుప్కే, డె దనాదన్, భూల్ భులాయా వంటి హిట్ సినిమాలతో బీటౌన్‌లో గుర్తింపు పొందారు. 1990లో మలయాళ నటి లిజిని పెళ్లి చేసుకున్న ఆయన 2016లో ఆమెకు విడాకులిచ్చారు. వీరికి కల్యాణి, సిద్దార్థ్ సంతానం. హలో సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన కల్యాణి ప్రియదర్శన్ ప్రస్తుతం మలయాళ మూవీస్‌తో బిజీగా ఉంది. Last evening we celebrated my brother’s marriage in the most special and intimate ceremony at home with just family. Im so excited to have Melanie be the sister I’ve always wanted ♥️. Hope we all have your blessings 🙏🏻 pic.twitter.com/6fhIDYFqJ1 — Kalyani Priyadarshan (@kalyanipriyan) February 4, 2023 Film Maker @priyadarshandir & actress Lissy's son Siddharth Priyadarshan got married. The bride is Marilyn, an American citizen and visual effects producer. Actress @kalyanipriyan is Siddharth's sister.#KalyaniPriyadarshan pic.twitter.com/v4KEhfbAB2 — Mollywood Exclusive (@Mollywoodfilms) February 3, 2023 చదవండి: స్టార్ డైరెక్టర్‌కు ప్రమాదం.. నెల రోజులదాకా కష్టమే! ఎన్నోసార్లు చావు అంచులదాకా వెళ్లొచ్చాను: విజయశాంతి -
నలుగురు దర్శకులు నాలుగు ప్రేమకథలు
జాతీయ అవార్డు సాధించిన నలుగురు దర్శకులు (ప్రదీప్ సర్కార్, అనిరుద్ రాయ్ చౌదరి, ప్రియదర్శన్, మహేశ్ మంజ్రేకర్) ఓ ప్రాజెక్ట్ కోసం కలిశారు. నాలుగు భాగాలుగా తెరకెక్కిన ‘ఫర్బిడన్ లవ్’ అనే సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ నాలుగు సినిమాల కథాంశాలు ప్రేమ చుట్టూనే ఉంటాయట. ఓటీటీ సంస్థ జీ5 నిర్మించిన ఈ చిత్రాలు ఆ ప్లాట్ఫామ్లోనే విడుదల కానున్నాయి. ‘డయగ్నాసిస్ ఆఫ్ లవ్ ’ విభాగాన్ని మహేశ్ మంజ్రేకర్, ‘రూల్స్ ఆఫ్ ది గేమ్’ను అనిరుద్ రాయ్, ‘అనామిక’ను ప్రియదర్శన్, ‘అరేంజ్డ్ మ్యారేజ్’ను ప్రదీప్ సర్కార్ తెరకెక్కించారు. ఈ నాలుగు భాగాల్లో పూజా కుమార్, అలీ ఫాజల్, రైమా సేన్ వంటి నటులు ఉన్నారు. ఈ నెల 9 నుంచి ఈ ‘ఫర్బిడన్ లవ్’ సిరీస్‌లో ఒక్కో భాగం ఆన్లైన్లో స్ట్రీమ్ కానుంది. -
ప్రణవ్, కల్యాణి లవ్‌లో ఉన్నారా?
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ ఆప్త మిత్రులు. ఒకరి కెరీర్ కి ఒకరు ఎంతగానో సహాయపడ్డారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో మలయాళంలో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ ఇటీవలే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రియదర్శన్ కూతురు కల్యాణీ ప్రియదర్శన్ తెలుగు సినిమా ‘హలో’ ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది. తాజాగా ప్రణవ్, కల్యాణి మలయాళంలో ఓ సినిమా కమిట్ అయ్యారు. ఈ ఇద్దరూ చిన్నప్పటి నుంచీ ఫ్రెండ్స్. ఆ మధ్య ప్రణవ్, కల్యాణి దిగిన సెల్ఫీ ఒకటి వైరల్ అయింది. దీంతో ఈ ఇద్దరూ రిలేషన్ లో ఉన్నట్టు మలయాళం ఇండస్ట్రీ లో వార్తలు మొదలయ్యాయి. ‘‘ప్రణవ్, కల్యాణి లవ్ లో ఉన్నారా? అనే ప్రశ్న మోహన్ లాల్ వరకూ వెళ్లింది. ఈ విషయం గురించి మోహన్ లాల్ మాట్లాడుతూ – ‘ప్రణవ్, కల్యాణి బెస్ట్ ఫ్రెండ్స్. నేను, ప్రియదర్శన్ ఎలానో వాళ్లిద్దరూ అలా. ఒక్క సెల్ఫీ వల్ల ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారని ఎలా ఊహించుకుంటారు? అనవసరమైన వార్తలు ప్రచారం చెయ్యొద్దు. నమ్మొద్దు’’ అని ఈ వార్తలను కొట్టిపారేశారు. మోహన్ లాల్ నటించిన ‘అరబికడలింటే సింహం: మరాక్కర్’లో ప్రణవ్, కల్యాణి కూడా నటించారు. అలానే ‘హదయమ్’ అనే సినిమాలో జంటగా నటిస్తున్నారు కూడా. ఈ సినిమా షూటింగ్ కరోనా వల్ల ఆగిపోయింది. -
‘అవుట్ డేటెడ్ దర్శకుడిననే ఒప్పకోలేదు!’
హంగామా-2 కోసం బాలీవుడ్ హీరోలు ఆయుష్మాన్ ఖురానా, కార్తీక్ ఆర్యన్లను మొదట సంప్రదించగా వారు నిరాకరించినట్లు దర్శకుడు ప్రియదర్శన్ వెల్లడించారు. 2003లో కామెడీ నేపథ్యంలో రూపొందించిన ‘హంగామా’కు సీక్వెల్‌గా ‘హంగామా-2’ను ఆయన తెరకెక్కిస్తున్నారు. కాగా దీనికోసం ఆయుష్మాన్ ఖురానా, కార్తీక్ ఆర్యన్, సిద్దార్థ మల్హోత్రాలు వంటి పెద్ద హీరోలను సంప్రదించానని చెప్పారు. అయితే వారిలో ఎవరూ ఈ ప్రాజెక్ట్ పట్ల ఆసక్తి చూపలేదని కూడా పేర్కొన్నారు. తాను కాలం చెల్లిన దర్శకుడినని భావించే వారు తన ప్రాజెక్టును తిరస్కరించి ఉంటారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. (ఆ వీడియో డిలీట్ చేసిన హీరో..) దీనిపై ఆయన ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. ‘నేను వారిని నేరుగా కలవలేదు కానీ అయుష్మాన్ ఖురానా, కార్తీక్ ఆర్యన్, సిద్దార్థ మల్హోత్రా వంటి పెద్ద హీరోలను దృష్టిలో పెట్టుకొనే ఈ కథ రాశాను. అయితే వారు ఈ ప్రాజెక్టును తిరస్కరించారు. బహుశా నేను అవుట్ డేటెడ్ డైరెక్టర్‌నని ఒప్పుకుని ఉండరు. ఎందుకంటే గత అయిదేళ్ల నుంచి నేను ఒక్క హిందీ సినిమాను కూడా తెరకెక్కించలేదు’ అని చెప్పుకొచ్చారు. అదే విధంగా ‘‘నా నమ్మకాన్ని విశ్వసించే నటులతోనే పని చేయడానికి నేను ఇష్టపడతాను. వారికి నాతో పని చేయడం ఇష్టం లేదని నిర్మోహమాటంగా చెప్పినప్పటికీ నటులను అభ్యర్థించడం నాకు ఇష్టం ఉండదు. నా మీద నమ్మకం ఉంచి నాతో నటించడానికి వచ్చిన వారితోనే నేను పనిచేస్తాను. ఎప్పుడైన మీరు నటులను నటించమని కోరితే వారికి మీ మీద నమ్మకం లేకపోతే అప్పుడు వారు గౌరవం ఇస్తూనే కాఫీ లేదా టీని అందించి మెల్లిగా మీ నుంచి తప్పించుకుంటారు’’ అని ఆయన చెప్పారు. కాగా హంగామా-2 సినిమా చిత్రీకరణపై ఆయన మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తయిందని చెప్పారు. బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి, ప్రణితా సుభాష్‌లు నటిస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమా కోసం వారిని సంప్రదించినందుకు చాలా ఆనందంగా ఉందని కూడా ఆయన చెప్పారు. -
అతడినే పెళ్లి చేసుకుంటాను: హీరోయిన్
సాక్షి, చెన్నై : నటుడి కొడుకు ప్రేమలో... నటి కూతురు అనగానే ఇదేదో సినిమా టైటిల్ అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు ‘తప్పు’లో కాలేసినట్లే. ప్రేమ అన్నది ఎవరికి? ఎప్పుడు? ఎలా? ఎవరి మీద పుడుతుందో చెప్పడం కష్టం. ఎక్కడో? ఏదో సందర్భంలో? అనుకోకుండా కలిగేదే ప్రేమ. అయితే ఇద్దరు చిన్ననాటి స్నేహితుల మధ్య కూడా ప్రేమ కలగవచ్చు. అలాంటిదే నటి కల్యాణి ప్రేమ కూడా అనే ప్రచారం ఇప్పుడు సినీ పరిశ్రమలో హల్చల్ చేస్తోంది. సంచలన సినీ జంట దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజీల కూతురు కల్యాణి అన్న సంగతి తెలిసిందే. ఈ చిన్నది రెండేళ్ల క్రితం ‘హలో’ చిత్రంతో టాలీవుడ్లో హీరోయిన్గా పరిచయమైంది. ఇటీవలే చిత్రలహరి సినిమాతో మంచి హిట్ కొట్టి ఫుల్ జోష్‌లో ఉంది. ఇక తాజాగా శివకార్తికేయన్‌కు జంటగా ‘హీరో’ అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇవ్వనుంది. కాగా కల్యాణి ఇప్పుడు ప్రేమలో మునిగిపోయిందన్న ప్రచారం హోరెత్తుతోంది. ఈ బ్యూటీ మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కొడుకు ప్రణవ్‌తో ప్రేమలో పడిందట. మోహన్‌లాల్, దర్శకుడు ప్రియదర్శన్ కళాశాల రోజుల నుంచి మిత్రులు. వీరిద్దరి కాంబినేషన్లో ఏకంగా 43 చిత్రాలు వచ్చాయి. ఇది ఒక రికార్డు. అంతే కాదు మోహన్‌లాల్, ప్రియదర్శన్ కుటుంబాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో మోహన్‌లాల్ కొడుకు ప్రణవ్, ప్రియదర్శన్ కూతురు కల్యాణిల మధ్య బాల్యం నుంచే స్నేహం కొనసాగుతూ వచ్చింది. అది ఇప్పుడు ప్రేమగా మారిందనే టాక్ స్ప్రెడ్ అయ్యింది. ప్రస్తుతం ప్రణవ్, కల్యాణి తమ సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ప్రేమ వ్యవహారం గురించిన ప్రశ్నకు నటి కల్యాణి స్పందిస్తూ చాలా తెలివిగా బదులిచ్చింది. ‘నేను ఒకరిని ప్రేమిస్తున్న మాట నిజం. భవిష్యత్‌లో అతన్నే పెళ్లి చేసుకుంటాను. నేను ఎవరిని ప్రేమిస్తున్నానన్న విషయం నా కుటుంబసభ్యులకు తెలుసు. మా ప్రేమకు ఎలాంటి సమస్య లేదు. నేను ప్రేమిస్తున్న వ్యక్తి పేరు, వివరాలను ప్రస్తుతానికి చెప్పను’ అని కల్యాణి పేర్కొంది. -
కరెక్ట్ నోట్
సినిమా సినిమాకు యాక్టర్స్ సరికొత్త విషయాలు నేర్చుకోవాల్సి వస్తూనే ఉంటుంది. తాజాగా ‘మరక్కార్: అరబికడలింటే సింహం’ సినిమా కోసం వీణ వాయించడం నేర్చుకున్నారు కీర్తీ సురేశ్. మోహన్‌లాల్ ముఖ్యపాత్రలో ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో కీర్తీ అతిథి పాత్రలో నటించారు. కీర్తీ పాత్ర గురించి దర్శకుడు ప్రియదర్శన్ మాట్లాడుతూ– ‘‘మరక్కార్’ సినిమాలో క్లాసికల్ సంగీతం నేర్చుకున్న విద్వాంసురాలిగా కీర్తీ కనిపిస్తారు. ఆమె పాత్రే కథలో ఓ మలుపు తీసుకొస్తుంది. మరక్కార్ ఫ్రెండ్ చినాలి అనే వ్యక్తితో కీర్తీ ప్రేమలో పడుతుంది. జనరల్‌గా పాత్రని వివరించగానే స్క్రీన్ మీద ఎలా కనిపిస్తాం అనే దానికంటే ఎలాంటి అవుట్ పుట్ తీసుకురావాలా అని కీర్తీ ఆలోచిస్తుంది. ఈ పాత్ర కోసం చాలా కష్టపడి వీణ వాయించడం నేర్చుకుంది. వీణ నేర్చుకోవడం అంత సులభం కాదు. సెట్లో ప్రతీ నోట్ కరెక్ట్‌గా వాయించింది. ఇప్పటికీ ఫస్ట్ సినిమా లో చూపించిన ఉత్సాహాన్నే చూపిస్తోంది’’ అని ప్రియదర్శన్ అన్నారు. విశేషం ఏంటంటే కీర్తీ ఫస్ట్ మలయాళం సినిమా ‘గీతాంజలి’కి ప్రియదర్శన్ దర్శకుడు, మోహన్‌లాల్ హీరో. ‘మరక్కార్’ చిత్రం ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానుంది. -
ఇరవై ఏళ్ల కల నేరవేరింది
‘‘ఒక విషయాన్ని నిజాయతీగా నమ్మి, అది జరగాలని బలంగా కోరుకున్నప్పుడు ఈ విశ్వంలోని శక్తులన్నీ ఏకమై అందుకు సాయం చేస్తాయి. ‘మరక్కార్: ది అరేబియన్ కడలింటే సింహమ్’ సినిమా తొలి టేక్ పూర్తి చేసిన తర్వాత నాకీ విషయం నిజమనిపించింది’’ అని భావోద్వేగభరితంగా అన్నారు మలయాళ నటుడు మోహన్‌లాల్. 16వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటి కేరళ ప్రాంతమైన అప్పటి కాలికట్లో కుంజాలి మరక్కార్ అనే ఓ ముస్లిం నావెల్ చీఫ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. దాదాపు 20ఏళ్ల నుంచి ఈ సినిమా గురించి చర్చించుకుంటూనే ఉన్నారట మోహన్‌లాల్ అండ్ ప్రియదర్శన్. మోహన్‌లాల్ మాట్లాడుతూ– ‘‘ప్రియదర్శన్‌తో కలిసి నేను ‘కాలాపాని’ (1996) సినిమా చేస్తున్నప్పుడు టి. దామోదరన్గారు (స్క్రీన్‌ప్లే రైటర్) మరక్కార్ పై సినిమా తీసే ఆలోచన గురించి చెప్పారు. ఆయన మరణించిన తర్వాత కూడా ఈ చిత్రం గురించి ప్రియదర్శన్, నేను బాగా చర్చించుకునేవాళ్లం. జీవితాన్ని రిస్క్‌లో పెట్టి పోర్చుగీసు వారికి వ్యతిరేకంగా పోరాడిన మరక్కార్ పాత్రలో నటించడం హ్యాపీగా ఉంది. ఇప్పటికి 104 రోజులు వర్క్ చేశాం’’ అని చెప్పుకొచ్చారు. -
అలా కలిశారు
తమిళ నటుడు అజిత్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందా? అనే సందేహం రాకమానదు ఇక్కడున్న ఫొటో చూస్తే. కానీ అందుకు టైమ్ ఉంది. మరి... అజిత్–ప్రియదర్శన్ కలిసి ఎక్కడ మాట్లాడుతున్నారు? అనే మీ డౌట్. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో. మోహన్‌లాల్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వంలో ‘మరక్కార్: ది అరేబియన్ కండలింటే సింహమ్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. అలాగే అజిత్ హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వంలో బాలీవుడ్ హిట్ ‘పింక్’ తమిళ రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా సేమ్ ప్లేస్‌లో షూటింగ్ జరుగుతోంది. దాంతో అజిత్ ‘మరక్కార్’ సెట్లోకి వెళ్లారట. అక్కడ ప్రియదర్శన్–అజిత్ ముచ్చటించుకుంటున్న టైమ్‌లో క్లిక్‌మన్న ఫొటో ఇది. -
లవ్ యు అచ్చా
అచ్చా.. అంటే హిందీలో బాగుంది అని అర్థం. మరి లవ్ యు అచ్చా అంటే.. లయ్ యు నాన్నా అని అర్థం. అచ్చా అంటే నాన్న. పూర్తిగా చెప్పాలంటే ‘అచ్చన్’. మనం నాన్న అని పిలిచినట్లు మలయాళంలో ‘అచ్చన్’ అని పిలుస్తారు. గారాబం ఎక్కువైతే ‘అచ్చా’ అని పిలుస్తారు. ఇప్పుడు ‘హలో’ ఫేమ్ కల్యాణీ ప్రియదర్శన్ తన తండ్రి, దర్శకుడు ప్రియదర్శన్‌ని ‘లవ్ యు అచ్చా’ అన్నారు. ఎందుకంటే తండ్రి డైరెక్షన్లో వర్క్ చేసినందుకు ఆమె∙ఫుల్ ఖుషీ అవుతున్నారు. మోహన్‌లాల్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వంలో ‘మరక్కార్: అరబికడలింటే సింహమ్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. 16వ శతాబ్దం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో సునీల్ శెట్టి, అర్జున్, ప్రణవ్ మోహన్‌లాల్, కీర్తీ సురేష్, కల్యాణీ ప్రియదర్శన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో తన వంతు షూటింగ్‌ను పూర్తి చేశారు కల్యాణీ ప్రియదర్శన్. ‘‘నాన్నగారితో వర్క్ చేస్తానని రెండేళ్ల క్రితం ఊహించలేదు. కానీ నిజమైంది. ‘అమ్మూ... నువ్వు సరిగా చేయడం లేదని ఈ సినిమా ఫస్ట్ డే షూట్లో నాన్నగారు సెట్లో నాపై అరిచినప్పుడు కాస్త నెర్వస్‌గా ఫీలయ్యా. ఆ తర్వాత సూపర్బ్.. బాగా చేశావ్’ అన్నప్పుడు నాకు అమితానందం కలిగింది. లవ్ యు అచ్చా. ఈ సినిమాలో నా భాగస్వామ్యం ఉన్నందుకు సంతోషంగా ఉంది’’ అని కల్యాణీ ప్రియదర్శన్ పేర్కొన్నారు. ‘‘మా అమ్మాయిని నేను డైరెక్ట్ చేస్తానని అనుకోలేదు. అయితే తనతో సినిమా చేశాను. చాలా ఆనందంగా ఉంది’’ అని ప్రియదర్శన్ అన్నారు. ఇందులో యంగ్ మోహన్‌లాల్ పాత్రలో ఆయన కొడుకు ప్రణవ్ మోహన్‌లాల్ కనిపిస్తారు. వందకోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో రిలీజవుతుంది. లొకేషన్లో తండ్రి ప్రియదర్శన్‌తో కల్యాణి -
లవ్ యు అచ్చా
అచ్చా.. అంటే హిందీలో బాగుంది అని అర్థం. మరి లవ్ యు అచ్చా అంటే.. లయ్ యు నాన్నా అని అర్థం. అచ్చా అంటే నాన్న. పూర్తిగా చెప్పాలంటే ‘అచ్చన్’. మనం నాన్న అని పిలిచినట్లు మలయాళంలో ‘అచ్చన్’ అని పిలుస్తారు. గారాబం ఎక్కువైతే ‘అచ్చా’ అని పిలుస్తారు. ఇప్పుడు ‘హలో’ ఫేమ్ కల్యాణీ ప్రియదర్శన్ తన తండ్రి, దర్శకుడు ప్రియదర్శన్‌ని ‘లవ్ యు అచ్చా’ అన్నారు. ఎందుకంటే తండ్రి డైరెక్షన్లో వర్క్ చేసినందుకు ఆమె∙ఫుల్ ఖుషీ అవుతున్నారు. మోహన్‌లాల్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వంలో ‘మరక్కార్: అరబికడలింటే సింహమ్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. 16వ శతాబ్దం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో సునీల్ శెట్టి, అర్జున్, ప్రణవ్ మోహన్‌లాల్, కీర్తీ సురేష్, కల్యాణీ ప్రియదర్శన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో తన వంతు షూటింగ్‌ను పూర్తి చేశారు కల్యాణీ ప్రియదర్శన్. ‘‘నాన్నగారితో వర్క్ చేస్తానని రెండేళ్ల క్రితం ఊహించలేదు. కానీ నిజమైంది. ‘అమ్మూ... నువ్వు సరిగా చేయడం లేదని ఈ సినిమా ఫస్ట్ డే షూట్లో నాన్నగారు సెట్లో నాపై అరిచినప్పుడు కాస్త నెర్వస్‌గా ఫీలయ్యా. ఆ తర్వాత సూపర్బ్.. బాగా చేశావ్’ అన్నప్పుడు నాకు అమితానందం కలిగింది. లవ్ యు అచ్చా. ఈ సినిమాలో నా భాగస్వామ్యం ఉన్నందుకు సంతోషంగా ఉంది’’ అని కల్యాణీ ప్రియదర్శన్ పేర్కొన్నారు. ‘‘మా అమ్మాయిని నేను డైరెక్ట్ చేస్తానని అనుకోలేదు. అయితే తనతో సినిమా చేశాను. చాలా ఆనందంగా ఉంది’’ అని ప్రియదర్శన్ అన్నారు. ఇందులో యంగ్ మోహన్‌లాల్ పాత్రలో ఆయన కొడుకు ప్రణవ్ మోహన్‌లాల్ కనిపిస్తారు. వందకోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో రిలీజవుతుంది. లొకేషన్లో తండ్రి ప్రియదర్శన్‌తో కల్యాణి -
పడవలు సిద్ధం!
పెద్ద పెద్ద పడవలను రెడీ చేస్తున్నారు మలయాళ దర్శకుడు ప్రియదర్శన్. ఆల్రెడీ కొన్ని పడవలను సిద్ధం చేశారు కూడా. ఆయన కొత్త వ్యాపారం ఏం మొదలుపెట్టలేదు. ‘మరాక్కర్–అరబ్బికడలింటే సింహం’ అనే సినిమా కోసమే ఇదంతా. మోహన్‌లాల్ టైటిల్ రోల్ చేయనున్న ఈ సినిమాలో అర్జున్, సునీల్ శెట్టి, ప్రణవ్ మోహన్‌లాల్, కీర్తీ సురేశ్, కల్యాణి ప్రియదర్శన్ కీలక పాత్రలు పోషించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ–ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ‘బాహుబలి’ ఫేమ్ సాబు శిరిల్ ఆధ్వర్యంలో సెట్ వర్క్ జరుగుతోంది. ఈ సెట్ ఫొటోలను సోషల్æమీడియాలో షేర్ చేశారు కల్యాణి ప్రియదర్శన్. అలాగే ఈ సినిమా షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుందని పేర్కొన్నారామె. సముద్రపు దొంగల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందట. ఇప్పుడు అర్థం అయ్యింది కదా... దర్శకుడు ప్రియదర్శన్ పడవలను ఎందుకు తయారు చేస్తున్నారో! -
ఒకటి ముగిసింది.. మరొకటి మొదలైంది.
వయసు పెరుగుతున్నా సినిమాలు చేయడంలో మాలీవుడ్ స్టార్ మోహన్‌లాల్ స్పీడ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇంకా రెట్టింపు అవుతోంది. ఇలా ఒక సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వగానో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మోహన్‌లాల్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా ‘మార్కర్–అరబీ కదాలింటే సింహం’. శనివారం ఈ సినిమాను ప్రకటించారు మోహన్‌లాల్. ‘‘ప్రియదర్శన్ దర్శకత్వంలో ఆంటోని పెరంబవూర్ నిర్మాణంలో రూపొందనున్న నా కొత్త సినిమాలో నటించనున్నాను’’ అన్నారు మోహన్‌లాల్. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. వీఏ శ్రీకుమార్ మీనన్ దర్శకత్వంలో మోహన్‌లాల్, ప్రకాశ్‌రాజ్, మంజు వారియర్ ముఖ్య తారలుగా రూపొందిన సినిమా ‘ఒడియన్’ కంప్లీట్ అయ్యింది. ‘‘ఒడియన్’ షూటింగ్‌ను కంప్లీట్ చేశాం. 123 రోజుల ఈ సినిమా జర్నీలో సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్’’ అన్నారు మోహన్‌లాల్. అంటే మోహన్‌లాల్ ఒక సినిమా పూర్తి చేయగానే మరో సినిమా మొదలుపెట్టేస్తారన్న మాట. మరోవైపు మోహన్‌లాల్ నటిస్తున్న మరో సినిమా ‘నీరళి’ మోషన్ పోస్టర్‌ను రీసెంట్గా రిలీజ్ చేశారు. అజయ్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పార్వతి నాయర్ కథానాయికగా నటిస్తున్నారు. ‘నీరళి’ చిత్రాన్ని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
ఉదయనిధి స్వీయ నిర్మాణంలో కొత్త సినిమా
తమిళ సినిమా: శీనురామస్వామి దర్శకత్వం వహించనున్న చిత్రంలో కథానాయకుడిగా నటించి నిర్మించడానికి యువ నటుడు ఉదయనిధి స్టాలిన్ రెడీ అవుతున్నారన్నది తాజా న్యూస్. మంచి కథావస్తువుతో కూడిన సెలెక్టెడ్ చిత్రాలను చేస్తూ విజయాలను అందుకుంటున్న ఉదయనిధి స్టాలిన్ తాజాగా ప్రియదర్శన్ దర్శకత్వంలో నటిస్తున్న నిమిర్ చిత్రం చిత్రీకరణను పూర్తి చేసుకుని, నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. వచ్చే నెల తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కాగా ఈ నటుడు నూతన చిత్రాన్ని కమిట్ అయ్యారు. ధర్మదురై వంటి మంచి విలువలతో కూడిన చిత్రాల దర్శకుడు శీనురామస్వామితో చేతులు కలిపారు. వీరి కాంబనేషన్లో తెరకెక్కనున్న చిత్రం జనవరి 19వ తేదీన ప్రారంభం కానుంది. దీని గురించి ఉదయనిధి స్టాలిన్ తెలుపుతూ దర్శకుడు శీనురామస్వామి చిత్రాలంటే తనకు చాలా ఇష్టం అన్నారు. ఆయన చిత్రాల్లో మావనతా విలువలతో పాటు కుటుంబ సమేతంగా చూసి ఆనందించే జనరంజక అంశాలు చోటు చేసుకుంటాయన్నారు. ఆయనతో జాతీయ అవార్డును గెలుచుకున్న నీర్ప్పరవై వంటి చిత్రాన్ని నిర్మించిన అనుభవంతో చెబుతున్నానని, అలాంటి దర్శకుడితో చిత్రాన్ని నిర్మించి, కథానాయకుడిగా నటించడం తన బాధ్యతను, ఇష్టాన్ని పెంచుతాయని అన్నారు.శీనూరామస్వామి దర్శకత్వంలో నటించనుండడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఉదయనిధిస్టాలిన్ తెలిపారు. -
'నిమిర్' అంటున్న ఉదయనిధి స్టాలిన్
సాక్షి, చెన్నై : ఉదయనిధి స్టాలిన్ తాజా చిత్రానికి నిమిర్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. మలయాళంలో మంచి విజయాన్ని సాధించిన చిత్రం మహేశింటే ప్రతీకారం. ఆ చిత్ర తమిళ రీమేక్‌లో ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా నమిత ప్రమోద, పార్వతీనాయర్ నటిస్తుండగా సీనియర్ దర్శకుడు మహేంద్రన్, సముద్రఖని, ఎంఎస్.భాస్కర్ ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర టైటిల్‌ను బుధవారం కేరళలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ ఆవిష్కరించడం విశేషం. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ప్రియదర్శన్ మాట్లాడుతూ మలయాళ చిత్రం మహేశింటే ప్రతీకారం చిత్రం మంచి విజయం సాధించిందన్నారు. ఆ చిత్ర కాన్సెప్ట్ ఫీల్ పోకుండా తమిళంలో మరింత వినోదాన్ని జోడించి తెరకెక్కిస్తున్నామని తెలిపారు. చిత్ర షూటింగ్‌ను తెన్ కాశీలో 36 రోజులు చిత్రీకరించినట్లు తెలిపారు. ఇతర భాగాన్ని దుబాయ్‌లో చిత్రీకరించామన్నారు. ఈ చిత్రంలో కథానాయకుడి పాత్రకు ఉదయనిధి స్టాలిన్ కాకుండా మరొకరిని ఊహించుకోలేమన్నారు. ఆయన ఇక విద్యార్థిలా తన సూచనల మేరకు చాలా బాగా నటించారని అన్నారు. దర్శకుడు మహేంద్రన్ అంటే తనకు చాలా గౌరవమని, ఆయన్ని ఈ చిత్రంలో డైరెక్ట్ చేయడం మరచిపోలేని అనుభవంగా పేర్కొన్నారు. ఈ చిత్రానికి మాటలను దర్శకుడు సముద్రఖని రాయగా, సంగీతాన్ని దర్బుక శివ, ఛాయాగ్రహణం ఏకాంబరం అందిస్తున్నారు. చిత్రాన్ని డిసెంబర్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. -
మరో వారసురాలి తెరంగేట్రం
తమిళసినిమా: మరో నట వారసురాలు కథానాయకిగా తెరంగేట్రం చేయడానికి రెడీ అవుతోందన్నది తాజా సమాచారం. ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజీ కూతురు కల్యాణి కథానాయకిగా తెరంగేట్రానికి రంగం సిద్ధమైంది. దర్శకుడు ప్రియదర్శన్, లిజీలకు కల్యాణి, సిద్ధార్థ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా రెండేళ్ల కిందట ప్రియదర్శన్, లిజీ మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే పిల్లలు లిజీ సంరక్షణలోనే పెరుగుతున్నారు. న్యూయార్క్‌లో చదువు పూర్తి చేసిన కల్యాణి సినీరంగంపై ఆసక్తి కనబరుస్తోంది. ఇప్పటికే విక్రమ్, నయనతార జంటగా నటించిన ఇరుముగన్ చిత్రానికి సహాయదర్శకురాలిగా పని చేసింది. కాగా కల్యాణిని కథానాయకి చేసే పనిలో ఆమె తల్లి లిజీ ముమ్మరంగా ఉన్నట్లు సమాచారం. తాజాగా దర్శకుడు విక్రమ్‌కుమార్ దర్శక్వతం వహిస్తున్న తెలుగు చిత్రంలో యువ నటుడు అఖిల్‌కు జంటగా కల్యాణి ఎంపికయినట్లు తాజా సమాచారం. నాగార్జున నిర్మించనున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. మరో పది రోజుల్లో కల్యాణి ఈ షూటింగ్లో జాయిన్ కానున్నట్లు సినీవర్గాల సమాచారం. కాగా విక్రమ్‌కుమార్ కల్యాణి తండ్రి, దర్శకుడు ప్రియదర్శన్ శిష్యుడన్నది గమనార్హం. అదే విధంగా కల్యాణి మరో మలయాళ చిత్రంలో నటించే విషయమై చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. -
లెజెండరీ డైరెక్టర్‌తో వెంకీ నెక్ట్స్..!
గురు సినిమాతో ఆకట్టుకున్న విక్టరీ వెంకటేష్ ఇంత వరకు తన నెక్ట్స్ సినిమాను ఎనౌన్స్ చేయలేదు. గురు సినిమా సెట్స్ మీద ఉండగానే.. వెంకీ నెక్ట్స్ సినిమా క్రిష్‌తో ఉంటుందన్న ప్రచారం జరిగింది. వీరయ్య టైటిల్‌తో పీరియాడిక్ డ్రామగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారన్న టాక్ బలంగా వినిపించింది. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అదే సమయంలో యంగ్ డైరెక్టర్ కిశోర్ తిరుమలతో ఆడాళ్లు మీకు జోహార్లు అనే సినిమా చేసేందుకు ప్లాన్ చేశాడు వెంకీ. కానీ సినిమా కూడా స్టార్ కాలేదు. తాజాగా వెంకీ నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై మరో ఆసక్తికరమైన వార్త హల్చల్ చేస్తోంది. సౌత్ స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్, వెంకటేష్ కోసం కథ రెడీ చేశాడట. ఇటీవల ఒప్పం సినిమాతో సంచలనం సృష్టించిన ప్రియదర్శన్, వెంకీ కోసం స్పెషల్ స్టోరిని రెడీ చేశాడట. రెండు దశాబ్దాల క్రితం నాగార్జునతో నిర్ణయం, బాలకృష్ణతో గాంఢీవం సినిమాలను తెరెక్కించిన ప్రియదర్శన్ తరువాత ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. ఇన్నేళ్ల తరువాత వెంకటేష్‌తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే కాంబినేషన్‌పై ఇంతవరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. -
మహేష్ డైరెక్టర్ మళ్లీ ఫైర్ అయ్యాడు..!
జాతీయ అవార్డుల వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా సినీ జాతీయ అవార్డులు ఈ సారి వివాదాలకు తెరతీస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయాలపై పలువురు సినీ ప్రముఖులు బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్, విజేతల ఎంపికపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'అవార్డుల కమిటీ, ఒత్తిళ్లకు తలొగ్గి పక్షపాత ధోరణితో విజేతలను ఎంపిక చేసిందంటూ విమర్శించారు'. అయితే ప్రతీ విమర్శకు వ్యక్తిగతంగా బదులిస్తున్న జ్యూరీ అధ్యక్షుడు ప్రియదర్శన్, 'అక్షయ్ కుమార్‌తో సినిమా చేయాలనకున్న దర్శకుడికి అక్షయ్ నో చెప్పాడు... అందుకే ఆయనకు అవార్డ్ రావడాన్ని తట్టుకోలేకపోతున్నాడు' అంటూ మురుగదాస్‌పై పరోక్షంగా విమర్శలు చేశాడు. ప్రియదర్శన్ కామెంట్స్ మురుగదాస్ కూడా ఘాటుగానే స్పంధించాడు. ' మిస్టర్ జ్యూరీ, ఇది కేవలం నా అభిప్రాయం కాదు. భారతీయ ప్రేక్షకులందరూ ఇదే అభిప్రాయంతో ఉన్నారు. వాధించటం కన్నా, నిజాన్ని బయటకు తీస్తే మంచిది' అంటూ కౌంటర్ ఇచ్చాడు. దక్షిణాది సినీ ప్రముఖులతో పాటు బాలీవుడ్ స్టార్స్ కూడా జ్యూరీ మీద గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా దంగల్ సినిమాకు అమీర్ ఖాన్ తప్పకుండా అవార్డ్ వస్తుందని భావించిన ఆయన అభిమానులు ప్రియదర్శన్ మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. #NationalAwards #Biased Mr. jury, It's nt only my opinion it's the voice of whole Indian audience, better nt to argue & dig out the truth — A.R.Murugadoss (@ARMurugadoss) 14 April 2017 -
ప్రియమైన హీరో అక్షయ్‌కుమార్‌కు..?
‘ఇమేజ్ను బట్టి ఓ నటుణ్ణి అంచనా వేయొద్దు.. జడ్జ్ చేయొద్దు. రాజ్‌కుమార్ రావు చేసిందే యాక్టింగా? అక్షయ్‌కుమార్ చేస్తే యాక్టింగ్ కాదా? బఫూనరీయా?’’ – అక్షయ్‌కుమార్‌కు మద్దతుగా ఓ ట్వీట్. ‘‘అక్షయ్ మంచి నటుడే. కానీ, ‘రుస్తుం’కి నేషనల్ అవార్డు ఇవ్వడం అవార్డులా కాదు... రివార్డులా ఉంది’’, ‘‘రుస్తుం’లో యాక్టింగ్‌కి అక్షయ్‌కి నేషనల్ అవార్డు ఇవ్వడమనేది రీసెంట్ టైమ్స్‌లో నేను విన్న పెద్ద జోక్. జ్యూరీ అధ్యక్షుడు ప్రియదర్శన్ బెస్ట్ కామెడీ ఎవర్’’ – అక్షయ్‌కు వ్యతిరేకంగా రెండు మూడు ట్వీట్స్. 64వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతల వివరాలు ప్రకటించగానే... సగటు సినీ ప్రేక్షకులు సామాజిక మాధ్యమాల్లో చెలరేగారు. అక్షయ్‌కు అవార్డు ఇవ్వడం సరికాదంటూ కొందరు, ఇవ్వడంలో తప్పేంటి? ఎందుకు ఇవ్వకూడదంటూ మరికొందరు ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తం చేశారు. మొత్తానికి, విజేతల వివరాలు ప్రకటించిన కొద్ది క్షణాల్లో వివాదం రాజుకుంది. చివరకు, అవార్డు కమిటీ జ్యూరీ అధ్యక్షుడు, దర్శకుడు ప్రియదర్శన్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ‘‘ఒక్క ‘రుస్తుం’లోనే కాదు.. ‘ఎయిర్ లిఫ్ట్’లోనూ అక్షయ్ నటన అద్భుతం. ఈ రెండిటినీ దృష్టిలో ఉంచుకునే ఆయన్ను ఉత్తమ నటుడిగా ఎంపిక చేశాం. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల అవార్డుల జాబితాలో ‘రుస్తుం’ పేరుని మాత్రమే ఇచ్చాం’’ అని ప్రియదర్శన్ అన్నారు. రెండు చిత్రాల్లో అక్షయ్ నటనపరంగా తేడా చూపించారనీ, ఆయన నటన హృదయాలను హత్తుకునే విధంగా కూడా ఉందనీ ప్రియదర్శన్ అన్నారు. ఈ వివరణతో వివాదం సద్దుమణగలేదు. ఇంతకీ అక్షయ్ అవార్డుకి అర్హుడు కాడా? అంటే.. తప్పకుండా అర్హుడే. అయితే, అవార్డు జాబితాల పోటీలో నిలిచిన చిత్రాల్లో ఆమిర్ ఖాన్ ‘దంగల్’ ఉండటం పై చర్చకు దారి తీసింది. ఆమిరే అర్హుడు! మల్లయోధుడు మహవీర్ సింగ్ ఫోగట్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘దంగల్’. ఇందులో మహవీర్ పాత్రను ఆమిర్ చేశారు. మల్లయోధుడిగా, ఇద్దరు బిడ్డల తండ్రిగా నటించారాయన. వయసు మీద పడిన వ్యక్తిగా కనిపించడం కోసం ఆమిర్ బరువు పెరిగారు. బాన పొట్టతో కనిపించారు. ఆహార్యం మాత్రమే కాదు.. నటన కూడా అద్భుతం. అందుకే ‘రుస్తుం’ సినిమాకిగాను అక్షయ్‌కి ఇచ్చే బదులు ‘దంగల్’ సినిమాకిగాను ఆమిర్‌కి ఇచ్చి ఉండొచ్చన్నది పలువురి అభిప్రాయం. ప్రియమైన హీరో అక్షయ్ అక్షయ్‌కుమార్ అంటే ప్రియదర్శన్‌కు ప్రత్యేకమైన అభిమానం ఉందన్నది చాలామందికి తెలిసిన విషయం. మలయాళంలో ప్రియదర్శన్ తెరకెక్కించిన చిత్రాలను హిందీలో అక్షయ్ హీరోగా రీమేక్ చేశారు. ప్రియదర్శన్–అక్షయ్ కాంబినేషన్లో ‘హేరా ఫేరీ’, ‘గరమ్ మసాలా’, ‘భాగమ్ భాగ్’, ‘భూల్ భులయ్యా’, ‘దే ధనా ధన్’, ‘కట్టా మీఠా’ తదితర చిత్రాలు వచ్చాయి. ఈ ఇద్దరికీ ఒకరంటే మరొకరికి అభిమానం. బహుశా.. జాతీయ అవార్డుల ఎంపికలో ఈ ‘అభిమానం’ ఏమైనా ప్రభావితం చేసి ఉంటుందా? అనే కోణంలో చర్చలు మొదలయ్యాయి. -
'కనుపాప' మూవీ రివ్యూ
టైటిల్ : కనుపాప జానర్ : క్రైం థ్రిల్లర్ తారాగణం : మోహన్ లాల్, సముద్రఖని, అనుశ్రీ, బేబీ మీనాక్షి, నెడుముడి వేణు సంగీతం : రోన్ ఎతన్ యోహన్ దర్శకత్వం : ప్రియదర్శన్ నిర్మాత : మోహన్ లాల్ మలయాళ సూపర్ స్టార్‌గా ఉన్న మోహన్ లాల్ ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్ మార్కెట్ల మీద దృష్టి పెట్టాడు. ఇప్పటికే జిల్లా, జనతా గ్యారేజ్ లాంటి సినిమాలతో తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించిన కంప్లీట్ యాక్టర్ ఇప్పుడు తన ఇతర చిత్రాలను తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు. అదే బాటలో గత ఏడాది మలయాళంలో ఘనవిజయం సాధించిన ఒప్పం సినిమాను కనుపాప పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. మాలీవుడ్‌లో 60 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంది..? కథ : గుడ్డివాడైన జయరామ్ (మోహన్ లాల్).. తన ఊరికి దగ్గర్లో ఉన్న సిటీలోని ఓ అపార్ట్మెంట్లో లిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేస్తుంటాడు. తన సంపాదనతోనే చెల్లికి ఘనంగా పెళ్లిచేసేందుకు కష్టపడుతుంటాడు. అదే సమయంలో ఆ అపార్ట్మెంట్లో ఉండే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి కృష్ణమూర్తికి (నెడుముడి వేణు) చేదోడు వాదోడుగా సహాయం చేస్తుంటాడు. కంటిచూపు లేకపోయినా.. శబ్దాల ద్వారా, వాసనల ద్వారా కంటిచూపు ఉన్న వారికంటే బాగా అన్ని పనులు చేసుకోవటంతో పాటు వ్యక్తులను గుర్తించగలుగుతాడు. అయితే జయరామ్‌కు ఈ శక్తి వల్ల అతను గుడ్డివాడుగా నటిస్తున్నాడన్న అనుమానం కూడా కొందరికి కలుగుతుంది. కృష్ణమూర్తి ఎవరికీ తెలియకుండా నందిని(మీనాక్షి) అనే అమ్మాయిని ఊటిలో ఉంచి చదివిస్తుంటాడు. అదే సమయంలో వాసుదేవ్(సముద్రఖని) అనే వ్యక్తి కోసం వెతుకుతుంటాడు. ఈ ప్రయత్నం కొనసాగుతుండగానే కృష్ణమూర్తి హత్యకు గురవుతాడు. ఆ నేరం జయరామ్ మీద పడుతుంది. ఇంతకీ కృష్ణమూర్తిని ఎవరు చంపారు..? కృష్ణమూర్తి దూరంగా ఉంచి పెంచుతున్న అమ్మాయి ఎవరు..? కృష్ణమూర్తి వెతుకుతున్న వాసుదేవ్ ఎవరు.. ? ఈ సమస్యలన్నింటి నుంచి జయరామ్ ఎలా బయట పడ్డాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : మాలీవుడ్‌లో సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న మోహన్ లాల్ హీరోగా కథబలం ఉన్న సినిమాలనే ఎంచుకుంటున్నాడు. ఎక్కువగా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలతో కంప్లీట్ యాక్టర్ అన్న టైటిల్‌ను సార్థకం చేసుకుంటున్నాడు. కనుపాప సినిమాలో గుడ్డివాడిగా నటించిన మోహన్ లాల్ మరోసారి తన అద్భుత నటనతో ఆకట్టుకున్నాడు. తన మీద పడ్డ నింద చెరిపేసుకోవటం, అదే సమయంలో ఒక పసి పాప ప్రాణాన్ని కాపాడుకోవటం కోసం ఓ గుడ్డివాడు చేసిన పోరాటాన్ని తెర మీద ఆవిష్కరించాడు. సైకో విలన్‌గా సముద్రఖని నటన సూపర్బ్. సినిమాలో పెద్దగా డైలాగ్స్ లేకపోయినా కేవలం తన ఎక్స్ప్రెషన్స్ తోనే విలనిజాన్ని పండించాడు సముద్రఖని. నందిని పాత్రలో నటించిన మీనాక్షి ముద్దు ముద్దు మాటలతో అలరించింది. ఇతర పాత్రల్లో నెడుముడి వేణు, విమలారామన్, అనుశ్రీ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : గతంలో మోహన్ లాల్ కాంబినేషన్ లో పలు విజయవంతమైన చిత్రాలను అందించిన ప్రియదర్శన్ మరోసారి అదే రికార్డ్ ను కంటిన్యూ చేస్తూ తెరకెక్కించిన చిత్రం కనుపాప. అయితే ఈ సారి మోహన్ లాల్ నటన మీద ఎక్కువగా దృష్టి పెట్టిన ప్రియదర్శన్, కథనాన్ని మాత్రం కాస్త తీరిగ్గా నడిపించాడు. నటుడిగా మోహన్ లాల్ ను ఎలివేట్ చేసే సీన్స్ లె పర్ఫెక్ట్ గా రాసుకున్న ప్రియదర్శన్, థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన స్పీడు మాత్రం చూపించలేదు. స్లో నారేషన్ కాస్త ఇబ్బంది పెట్టిన 4 మ్యూజిక్స్ గ్రూప్ ఇచ్చిన సంగీతం, ఏకాంబరం అందించిన సినిమాటోగ్రఫి ఆడియన్స్ ను కదలకుండా కూర్చోపెడతాయి. మోహన్ లాల్ స్వయంగా నిర్మించిన ఈ సినిమా నిర్మాణ విలువలు సినిమాకు ప్లస్ అయ్యాయి. ప్లస్ పాయింట్స్ : మోహన్ లాల్ నటన సినిమాటోగ్రఫి నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : తెలుగు నేటివిటి లేకపోవటం స్లో నారేషన్ కనుపాపలో ప్రియదర్శన్ కాస్త తీరిగ్గా కథ నడిపించినా.. మోహన్ లాల్ తన అద్భుత నటనతో అన్ని మైనస్‌లను కవర్ చేశాడు. - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
గౌరవప్రదంగా విడాకులు పొందలేకపోయా..
విడాకులు పొందలేక పోయామనే చింతను నటి లిజి వ్యక్తం చేశారు. కమలహాసన్‌కు జంటగా విక్రమ్ చిత్రంతో పాటు పలు భాషల్లో కథానాయకిగా నటించిన నటి లిజి. ఆమె మలయాళ దర్శకుడు ప్రియదర్శిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రియదర్శన్ తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. కాగా ప్రియదర్శిన్, లిజిలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండు దశాబ్దాలు సంసారం చేసిన వారి మధ్య మనస్పర్థలు కలగడంతో గత ఏడాది విడాకుల కోసం చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టును ఆశ్రయించారు. అంతకు ముందు చాలా మంది శ్రేయోభిలాషులు లిజి, ప్రియదర్శిన్‌ల మధ్య సమోధ్యకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కాగా గురువారం వీరు చట్టబద్దంగా కోర్టులో విడాకులను పొందారు. దీని గురించి నటి లిజి ఒక ప్రకటనలో పేర్కొంటూ దర్శకుడు ప్రియదర్శిన్తో తన వివాహ జీవితం ఈ రోజుతో ముగిసిపోయిందన్నారు. కుటుంబ సంక్షేమ కోర్టులో న్యాయమూర్తి సమక్షంలో తామిద్దరం హాజరై విడాకుల పత్రాలను అందుకున్నామన్నారు. ఇటీవల బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్-సుస్సేన్, విజయ్-అమలాపాల్ వంటి వారు సామరస్యపూర్వకంగా చర్చించుకుని విడిపోవాలన్న నిర్ణయానికి వచ్చారన్నారు. అలాంటిది తమ విషయంలో అది అందుకు భిన్నంగా జరిగిందన్నారు. తమ మధ్య తరచూ గొడవలు జరిగాయన్నారు. ప్రస్తుతం అలాంటి వాటి నుంచి బయట పడ్డానని పేర్కొన్నారు. కఠినమైన జీవితం నుంచి ఇది వేరే విధంగా నిర్ణయం జరిగిందని, అలా గౌరవప్రదంగా విడాకులు పొందలేకపోయామని నటి లిజి అన్నారు.