విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన నటి | director Priyadarshan and wife Lissy file for divorce | Sakshi
Sakshi News home page

విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన నటి

Published Mon, Dec 1 2014 8:01 PM | Last Updated on Sat, Sep 2 2017 5:28 PM

విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన నటి

విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన నటి

చెన్నై: దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజి దంపతులు విడిపోవాలని నిర్ణయించున్నారు. విడాకుల కోసం చైన్నె ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయాన్ని లిజి ధ్రువీకరించారు.

విడాకుల కోసం చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించినట్టు లిజి ఒక ప్రకటనలో తెలిపారు. తమ పిల్లలు, సన్నిహితులకు ఈ విషయం తెలుసని చెప్పారు. తమ జీవితంలో ఇది క్లిష్టసమయమని, తమ ఏకాంతాన్ని గౌరవించాలని ఆమె కోరారు.

ప్రియదర్శన్, లిజి మధ్య విభేదాలు వచ్చాయని, వారు విడిపోతున్నారని ఇంతకుముందు వార్తలు వచ్చాయి. కమల్ హాసన్-గౌతమి,  మోహన్ లాల్-ఆయన భార్య చొరవతో కొంతకాలం కలిసున్న వీరిద్దరూ చివరకు విడిపోవాలనే నిశ్చయించుకున్నారు.

ప్రియదర్శన్, లిజి 1996లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కల్యాణి అనే కూతురు, సిద్దార్థ్ అనే కొడుకు ఉన్నారు. ప్రస్తుతం వారిద్దరు విదేశాలలో చదువుకుంటున్నారు.

మమ్మల్ని కమల్ హాసన్ కలిపారు: లిజి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement