Lissy
-
రా.. వదినా రా...
కుదురితే పిన్నిలా రా.. వీలైతే అమ్మలా రా.. లేకపోతే అక్కలా రా.. లేదా అత్తలా రా.. కానీ.. రా. తెలుగు సినిమాలో హీరోయిన్లుగా నటించిన అమ్మళ్లు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కుమ్ముళ్లు స్పెషల్ స్టోరీ. చెక్కుచెదరని నటన చెక్కు చెదరని అందం.. అలనాటి డ్రీమ్ గర్ల్ హేమమాలిని గురించి అందరూ అనుకునే మాట ఇది. నటన కూడా అంతే. చెక్కు చెదరలేదు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో ఆమె చేసిన రాణి గౌతమి బాలశ్రీ పాత్ర అందుకు నిదర్శనం. చాలా విరామం తర్వాత తెలుగు తెరపై ఆమె కనిపించిన చిత్రం ఇది. ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే... 1965లో విడుదలైన ‘పాండవ వనవాసం’లో ఒక పాటకు నర్తించారామె. ఆ తర్వాత ఐదేళ్లకు ‘శ్రీకృష్ణ విజయం’లో ఓ గెస్ట్ రోల్లో కనిపించారు. 45 ఏళ్ల తర్వాత ‘గౌతమిపుత్ర శాతకర్ణి’తో మళ్లీ తెలుగు తెరపై కనిపించారు. లేఖ తిరిగొచ్చింది లేఖ గుర్తుందా? అదేనండీ.. దర్శకుడు కృష్ణవంశీ ‘చంద్రలేఖ’లో లేఖ పాత్రలో చూపించిన ఇషా కొప్పీకర్ గుర్తుందా? ఆ సినిమా తర్వాత ఇషా హిందీ బాట పట్టారు. ఆల్మోస్ట్ పంతొమ్మిదేళ్ల తర్వాత ఆమె తెలుగులో ఫుల్ లెంగ్త్ రోల్ చేసిన సినిమా ‘కేశవ’. ‘కార్తికేయ’ ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో నిఖిల్, రీతూవర్మ జంటగా నటించిన ఈ చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారామె. శివరాజ్‌కుమార్ హీరోగా కన్నడంలో రూపొందుతున్న ‘కవచ’ చిత్రంలో నటిస్తున్నారు ఇషా. మోడ్రన్ గ్రాండ్‌మదర్ కాంచన పేరు వినగానే, ఏదో గుడిలో సేవ చేస్తున్నారట అని మాట్లాడుకున్న మాటలు గుర్తుకొస్తాయి. నిజం అది కాదు. దాదాపు 15 కోట్ల రూపాయలను తిరుమల తిరుపతి దేవస్థానంకు విరాళంగా ఇచ్చారామె. వెండితెర వెలుగు జిలుగులకు దూరంగా ఉంటున్న కాంచన 32ఏళ్ల తర్వాత తెలుగు స్క్రీన్‌పై కనిపించడం, అది కూడా ‘అర్జున్ రెడ్డి’లాంటి బోల్డ్ మూవీలో కనిపించడం విశేషం. 1960, 70, 80లలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తిరుగు లేని నాయికగా రాణించడంతో పాటు పలు హిందీ చిత్రాలు కూడా చేశారామె. తెలుగు తెరకు దూరమైన.. ఆ మాటకొస్తే గతేడాది మలయాళంలో చేసిన ‘ఒలప్పీపీ’ మినహా 1985 తర్వాత కాంచన సినిమాలు చేయలేదు. 32 ఏళ్ల తర్వాత మోడ్రన్ గ్రాండ్మదర్గా ‘అర్జున్ రెడ్డి’లో కనిపించారు. ‘సఫరింగ్ ఈజ్ పర్సనల్ లెట్ హిమ్ సఫర్..’ అని 77 ఏళ్ల కాంచన ఈ సినిమాలో చెప్పిన డైలాగ్ ఫేమస్ అయింది. 1985లో ‘శ్రీ దత్త దర్శనం’ తర్వాత తెలుగు తెరపై ఆమె కనిపించిన చిత్రం ఇదే. జానకీ నాయకుడితో మళ్లీ... ‘ఘరానా మొగుడు’ ఫేమ్ వాణీ విశ్వనాథ్ గుర్తున్నారా? తెలుగులో దాదాపు 40 సినిమాలు చేశారు. వాటిలో ‘కొదమ సింహం’, ‘గాడ్ ఫాదర్’ వంటి పలు చిత్రాల్లో నటించారు. పదేళ్ల తర్వాత వాణి టాలీవుడ్‌కి వచ్చారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ‘జయ జానకి నాయక’లో జగపతిబాబు చెల్లెలిగా పవర్ఫుల్ రోల్లో కనిపించారామె. ఇక మిస్సవ్వను ఎంత ట్రెడిషనల్‌గా కనిపించగలరో అంతే గ్లామరస్‌గా కనిపించగలరు భూమిక. అందుకు ఉదాహరణ ‘ఒక్కడు’, ‘మిస్సమ్మ’. ‘ఖుషి’లో బుక్ చదివే సీన్‌ని ఎవరూ మరచిపోలేరనుకోండి. ఈ బ్యూటీ మూడేళ్ల క్రితం వచ్చిన ‘లడ్డూబాబు’లో ఓ కీలక పాత్ర చేశారు. ఆ తర్వాత తెలుగు సినిమాలు చేయలేదు. అప్పటికే భూమిక పెళ్లవడం, ఒక బాబు కూడా పుట్టడంతో సినిమాలు తగ్గించేశారు. ఇక, భూమిక సినిమాల్లో కనిపించరు అనుకుంటున్న సమయంలో మిడిల్ క్లాస్ అబ్బాయి (ఎంసీఏ)తో వచ్చారు. ఈ చిత్రంలో నాని వదిన పాత్రలో భూమిక నటన సూపర్బ్. గతేడాది హిందీ చిత్రం ‘ఎం.ఎస్. ధోని’లో ధోని సిస్టర్ క్యారెక్టర్లోనూ మెరిశారు. సో.. కుర్ర హీరోలకు అక్క, వదిన అంటే భూమిక బాగుంటారని ఓ ముద్ర పడింది. అందుకు తగ్గట్టుగానే ‘సవ్యసాచి’లో నాగచైతన్యకు అక్క పాత్రకు భూమికను అడగడం, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇక.. తెలుగు సినిమాలను మిస్సయ్యే ప్రసక్తి లేదంటున్నారు భూమిక. జయప్రదం ఫ్రమ్ సౌత్ టు నార్త్ హీరోయిన్గా సక్సెస్ అయినట్లుగానే ఫ్రమ్ తెలుగు స్టేట్ టు యూపీ పొలిటీషియన్‌గా జయప్రద సక్సెస్ అయ్యారు. ‘భూమి కోసం’తో తెలుగు తెరపై మెరిసి, ‘అంతులేని కథ’తో అంతు లేని ఫేమ్ తెచ్చేసుకున్నారు. అడవిరాముడు, సాగర సంగమం, మేఘసందేశం వంటి హిట్ మూవీస్‌తో జయప్రదంగా ఆమె కెరీర్ సాగింది. పదేళ్ల క్రితం పి. వాసు దర్శకత్వం వహించిన ‘మహారథి’లో బాలకృష్ణకు అత్తగా నటించారామె. ఆ తర్వాత మాతృభాషలో నటించలేదు. హిందీ, మలయాళం, కన్నడ చిత్రాల్లో అప్పుడప్పుడూ సినిమాలు చేస్తున్నారు. మాతృభాషలో నటించడంలేదన్న కొరతను ‘శరభ’ తీర్చేసింది. ఈ చిత్రం విడుదలకు రెడీ అయింది. ఇది చేస్తున్నప్పుడే మరో తెలుగు సినిమా ‘సువర్ణ సుందరి’ కమిట్ అయ్యారామె. అన్నకు అక్క.. తమ్ముడికి పిన్ని అన్నయ్యకు అక్కగా, తమ్ముడికి పిన్నిగా నటించే చాన్స్ కొంతమంది తారలకే వస్తుంది. ఖుష్బూకి ఆ చాన్స్ వచ్చింది. పదకొండేళ్ల క్రితం ‘స్టాలిన్’లో చిరంజీవికి అక్కగా నటించారామె. ఇప్పుడు తమ్ముడు పవన్ కల్యాణ్‌కి పిన్నిగా ‘అజ్ఞాతవాసి’లో నటిస్తున్నారు. యాక్చువల్లీ తెలుగులో ఖుష్బూ కనిపించిన చివరి సినిమా రాజమౌళి ‘యమదొంగ’. అందులో మోహన్‌బాబు చేసిన యమధర్మరాజు పాత్రకు సతీమణిగా నటించారు. స్మాల్ గ్యాప్ జూనియర్ ఐశ్వర్యారాయ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమాలో స్నేహా ఉల్లాల్‌ని చూసినప్పుడు అందరూ అలానే అన్నారు. ఆ తర్వాత కొంతకాలం తెలుగులో చురుగ్గానే సినిమాలు చేశారీ తేనెకళ్ల సుందరి. ఫోర్ ఇయర్స్ బ్యాక్ ‘అల్లరి’ నరేశ్ హీరోగా వచ్చిన ‘యాక్షన్ 3డీ’ సినిమా తర్వాత తెలుగులో స్నేహా ఉల్లాల్ నటించలేదు. ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌తో బాధపడ్డానని, అందుకే కెమెరా ముందుకి రాలేకపోయానని స్నేహా ఉల్లాల్ స్వయంగా పేర్కొన్నారు. స్మాల్ గ్యాప్ తర్వాత ‘ఆయుష్మాన్ భవ’తో రీ–ఎంట్రీ షురూ అయింది. మమ్మీ ఫాలోస్ డాటర్ ఎక్కడైనా పిల్లలు అమ్మలను ఫాలో అవుతారు. మరి.. మమ్మీ ఫాలోస్ డాటర్ అన్నారేంటి అనుకుంటున్నారా? మరేం లేదు.. టూ డేస్ బ్యాక్ ‘హలో’ అన్నారు కల్యాణి ప్రియదర్శన్ డాటరాఫ్ డైరెక్టర్ ప్రియదర్శన్ అండ్ యాక్ట్రస్ లిజి. ఈ ఏడాది కూతురు తెరపైకి వస్తే.. వచ్చే ఏడాది నితిన్ సినిమాలో ‘గుర్తుందా శీతాకాలం’ (పరిశీలనలో ఉన్న టైటిల్) తల్లి పాత్రలో కనిపించనున్నారు. అన్నట్లు లిజికి ఇది మొదటి తెలుగు సినిమా కాదు. నైన్టీస్లో ‘సాక్షి, మగాడు, 20వ శతాబ్దం’ వంటి సినిమాల్లో నటించారామె. చాలా గ్యాప్ తర్వాత ఆమె తెలుగులో చేస్తోన్న చిత్రమిది. – ముసిమి శివాంజనేయులు -
భర్తపై ఫిర్యాదు చేసిన లిజి
ఆస్తుల వ్యవహారంలో నటి లిజి తన భర్త దర్శకుడు ప్రియదర్శన్‌పై ఆదివారం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. నటుడు కమలహాసన్ నటించిన విక్రమ్ తదితర చిత్రాలతోపాటు తెలుగు, మలయాళం భాషల చిత్రాల్లో కథానాయికగా నటించిన లిజి ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రియదర్శన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ మధ్య లిజికి ప్రియదర్శన్‌కు మధ్య మనస్పర్థలు తలెత్తగా నటుడు కమలహాసన్ తదితర సినీ ప్రముఖులు ఇద్దరి మధ్య సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. అనంతరం మళ్లీ విభేదాలు తలె త్తడంతో విడిపోయారు. ఇప్పుడు వీరి మధ్య ఆస్తుల పంపకాల్లో గొడవలు మొదలయ్యాయని సమాచారం. ఈ వ్యవహారంపై నటి లిజి ఆదివారం ఉదయం చెన్నై ఎగ్మూర్‌లోని పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. ఈ విషయం తెలిసిన మీడియా అక్కడకు చేరింది. అరుుతే పోలీసులు లిజిని పత్రికల వారితో మాట్లాడరాదని షరతులు పెట్టారు. ఫిర్యాదు నమోదు చేసుకుని పోలీసు కమిషనర్ కార్యాలయం వెనుకభాగం నుంచి ఆమెను పంపించేశారు. గంటల తరబడి వేచి వున్న మీడియా చివరికి నిరాశతో వెనుతిరగాల్సి వచ్చింది. -
విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన నటి
-
విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన నటి
చెన్నై: దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజి దంపతులు విడిపోవాలని నిర్ణయించున్నారు. విడాకుల కోసం చైన్నె ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయాన్ని లిజి ధ్రువీకరించారు. విడాకుల కోసం చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించినట్టు లిజి ఒక ప్రకటనలో తెలిపారు. తమ పిల్లలు, సన్నిహితులకు ఈ విషయం తెలుసని చెప్పారు. తమ జీవితంలో ఇది క్లిష్టసమయమని, తమ ఏకాంతాన్ని గౌరవించాలని ఆమె కోరారు. ప్రియదర్శన్, లిజి మధ్య విభేదాలు వచ్చాయని, వారు విడిపోతున్నారని ఇంతకుముందు వార్తలు వచ్చాయి. కమల్ హాసన్-గౌతమి, మోహన్ లాల్-ఆయన భార్య చొరవతో కొంతకాలం కలిసున్న వీరిద్దరూ చివరకు విడిపోవాలనే నిశ్చయించుకున్నారు. ప్రియదర్శన్, లిజి 1996లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కల్యాణి అనే కూతురు, సిద్దార్థ్ అనే కొడుకు ఉన్నారు. ప్రస్తుతం వారిద్దరు విదేశాలలో చదువుకుంటున్నారు. మమ్మల్ని కమల్ హాసన్ కలిపారు: లిజి -
వారికది బతుకు చెట్టు!
ఇక్కడ కొబ్బరిచెట్లు ఎక్కుతున్న మహిళల్ని చూస్తే మీకేమనిపిస్తుంది? ఎప్పుడూ అనిపించేదే... అక్కడ కూడా మగవారికి పోటీ ఇస్తున్నారని. అయితే ఇక్కడ కొబ్బరి చెట్లు ఎక్కుతున్న అమ్మాయిలు పోటీల్లో భాగంగా ఎక్కడంలేదు. పొట్టకూటికోసం ఎక్కుతున్నారు. కొబ్బరికాయలు కోసేవారికి ప్రత్యేకంగా కూలీ ఇవ్వడం గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆ డబ్బులకోసమే కేరళ అమ్మాయిలు కొబ్బరిచెట్లు ఎక్కడం నేర్చుకుంటున్నారు. నలభై మూడేళ్ల లిస్సి తొట్టియిల్ మొదట కొబ్బరిచెట్టు ఎక్కి తోటి మహిళలకు ఆదర్శంగా నిలిచింది. కొబ్బరిచెట్లనే నమ్ముకుని బతికే కేరళలో అమ్మాయిలు చెట్లు ఎక్కే అవసరం ఎందుకొచ్చిందంటే...‘‘ఏం చేస్తాం. కూటి కోసం కోటి విద్యలంటారు కదా! ప్రతీ పనిలో పోటీ పెరిగిపోయింది. కొబ్బరికాయల దింపు పని ఏడాదంతా ఉంటుంది. ఆ పని చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. కొబ్బరిచెట్లు ఎక్కడానికి శిక్షణ తీసుకుని పని మొదలుపెట్టాను. అలా వచ్చిన ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాను’’ అని చెబుతుంది లిస్సి. ఆమె మాటలు అక్కడ చాలామంది అమ్మాయిలకు నచ్చాయి. ఇంకేముంది... శిక్షణ ఇచ్చేవారి చిరునామా కనుక్కుని చెట్లెక్కడం నేర్చుకుంటున్నారు. ఒక్కో కొబ్బరికాయకి ఇన్ని పైసలని ఇస్తారక్కడ. ఆ డబ్బుతో చదువుకోవచ్చు, కావాల్సిన అవసరాలు తీర్చుకోవచ్చు అనే ఆలోచనతో చదువుకున్న అమ్మాయిలు కూడా చెట్లెక్కడాన్ని పార్ట్‌టైమ్ జాబ్‌గా ఎంచుకున్నారు. నిరుద్యోగులకు వరం... ఇరవై ఏడేళ్ళ మరియాంబి పరీద్ మాటల్లో చెప్పాలంటే కొబ్బరిచెట్లు ఎక్కే అవకాశం నిరుద్యోగులకు వరంలాంటిది. ‘‘కొబ్బరి చెట్టు ఎక్కి కిందకి చూస్తే అందరికన్నా ఎత్తుకెదిగానన్న ఆ ఫీలింగ్ భలేగా ఉంటుంది. అంటే నా ఉద్దేశ్యం...ఈ పనిలో కూడా మగాళ్లకు తీసిపోలేదన్న భావన. ఫీలింగ్ సంగతి ఎలా ఉన్నా...నాలుగు పైసలు సంపాదించుకోడానికి అవకాశం దొరికింది’’ అని చెప్పిందామె. గత రెండేళ్లలో కేరళలో 600 మంది మహిళలు కొబ్బరిచెట్లు ఎక్కే శిక్షణ తీసుకున్నారు. నిరుద్యోగమే కాక, విభిన్నంగా ఆలోచించి ముందుకెళ్లే మహిళల ఆలోచనలు కూడా కారణం అనుకోవచ్చు. కొబ్బరి చెట్టు ఎక్కడంకోసం కొత్తరకం తాళ్లు వచ్చాయి. అలాగని చెట్టు ఎక్కేయడం సులువేం కాదు. కొత్తలో కళ్లు తిరగడం వంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. చెట్టుపైకి ఎక్కాక కాయలు తీసేటప్పుడు పురుగు పుట్రా వంటివాటి నుంచి తప్పించుకోడానికి కూడా సిద్ధంగా ఉండాలి. -
'మమ్మల్ని కమల్ హాసన్ కలిపారు'
చెన్నై: నటుడు కమల్ హాసన్ మా దంపతులను మళ్లీ కలిపారని నటి లిజి తెలిపారు. దర్శకుడు ప్రియదర్శన్‌ను ఆమె 1996లో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి కల్యాణి అనే కూతురు, సిద్దార్థ్ అనే కొడుకు ఉన్నారు. ప్రస్తుతం వారిద్దరు విదేశాలలో చదువుకుంటున్నారు. ఇటీవల లిజికి ప్రియదర్శిన్కు మధ్య విభేదాలు తలెత్తాయని, అవి విడాకులకు దారి తీసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రియదర్శన్‌కు దూరం కావాలని నిర్ణయించుకున్న లిజీ ఆయన నుంచి జీవన భృతిగా రూ.80 కోట్లు కోరినట్లు ప్రచారం జరిగింది. వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చటానికి పలువురు సినీ ప్రముఖులు రంగంలోకి దిగినట్లు సమాచారం. అయితే ఎట్టకేలకు చర్చలు ఫలవంతమై లిజీ, ప్రియదర్శన్ మళ్లీ ఒకటయ్యారట. ఈ దంపతులను మళ్లీ ఒకటి చేయటంలో నటుడు కమల్ హాసన్ ముఖ్యపాత్ర వహించారట. ఈ విషయమై లిజి స్పందిస్తూ ప్రియదర్శన్‌కు తనకు మధ్య చిన్న విభేదాలు చోటుచేసుకున్న సంగతి నిజమేనన్నారు. దీంతో తాము కొంతకాలం దూరంగా ఉన్నట్లు తెలిపారు. తమ మధ్య మనస్పర్థలకు కొందరు స్నేహితులే కారణమని ఆమె ఆరోపించారు. ప్రియదర్శన్ తాను మనసు విప్పి మాట్లాడుకోలేకపోవటం వల్లే ఈ పరిణామాలకు కారణంగా లిజి పేర్కొన్నారు. ఇప్పడవన్నీ సమసిపోయాయని తెలిపారు. ప్రస్తుతం తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. తమ మధ్య పొరపొచ్చాలు తొలగిపోవటానికి కమల్, గౌతమి కారణం అని తెలిపారు. అదేవిధంగా నటుడు మోహన్ లాల్, ఆయన భార్య కూడా వివాద పరిష్కారానికి ప్రయత్నించారని లిజీ పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితం ఈ విషయమై ప్రియదర్శిన్ స్పందిస్తూ తమ మధ్య చిన్న గొడవ జరిగిన విషయం నిజమేనని, అది విడాకులు తీసుకునేంత పెద్దది కాదని స్పష్టం చేశారు. అదేవిధంగా లిజి తన నుంచి పెద్ద మొత్తంలో డబ్బు ఆశించినట్లు జరుగుతున్న ప్రచారంలోనూ నిజం లేదన్నారు. తమ మధ్య చోటుచేసుకున్న చిన్న సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నంలో ఉన్నామని చెప్పారు. -
విడాకుల వరకు వెళ్లం
తమ మధ్య గొడవ విడాకుల వరకు దారితీయదని దర్శకుడు ప్రియదర్శిన్ అంటున్నారు. ఈ విడాకుల గొడవ ఏమిటంటారా? చూద్దాం రండి. నటి లిజి, దర్శకుడు ప్రియదర్శిన్ భార్యాభర్తలు. వీరిది ప్రేమ వివాహమే. వీరి మధ్య తాజాగా మనస్పర్థలు చోటు చేసుకున్నాయని, విడాకులకు సిద్ధం అవుతున్నారని ప్రచారం జోరందుకుంది. తమిళంలో కాంచీ పురం లేసాలేసా, స్నేహితమ్ వంటి పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు ప్రియదర్శిన్ పలు మలయాళ హిందీ, తెలుగు చిత్రాలను తెరకెక్కిం చారు. ఈయన మలయాళంలో చిత్రం అనే చిత్రానికి దర్శకత్వం వహించినప్పుడు ఆ చిత్ర హీరోయిన్ లిజి ప్రేమలో పడ్డారు. వీరి ప్రేమ పలు సమస్యలను ఎదుర్కొని పెళ్లితో సుఖాంతమైంది. వీరికి కల్యాణి అనే కూతురు, సిద్దార్థ్ అనే కొడుకు ఉన్నారు. వీరు విదేశాలలో చదువుకుంటున్నారు. ఇటీవల లిజికి ప్రియదర్శిన్కు మధ్య విభేదాలు తలెత్తాయని, అవి విడాకులకు దారి తీసినట్లు ప్రచారం జరుగుతోంది. దీని గురించి దర్శకుడు ప్రియదర్శిన్ స్పందిస్తూ తమ మధ్య చిన్న గొడవ జరిగిన విషయం నిజమేనని, అది విడాకులు తీసుకునేంత పెద్దది కాదని స్పష్టం చేశారు. అదేవిధంగా లిజి తన నుంచి పెద్ద మొత్తం లో డబ్బు ఆశించినట్లు జరుగుతున్న ప్రచారంలోనూ నిజం లేదన్నారు. తమ మధ్య చోటుచేసుకున్న చిన్న సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నంలో ఉన్నామని దర్శకుడు ప్రియదర్శిన్ అన్నారు.