భర్తపై ఫిర్యాదు చేసిన లిజి | Director Priyadarshan's Wife Lissy filed a complaint with Chennai Commissioner | Sakshi
Sakshi News home page

భర్తపై ఫిర్యాదు చేసిన లిజి

Published Mon, Jan 5 2015 1:59 AM | Last Updated on Thu, Sep 27 2018 8:55 PM

భర్తపై ఫిర్యాదు చేసిన లిజి - Sakshi

భర్తపై ఫిర్యాదు చేసిన లిజి

 ఆస్తుల వ్యవహారంలో నటి లిజి తన భర్త దర్శకుడు ప్రియదర్శన్‌పై ఆదివారం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. నటుడు కమలహాసన్ నటించిన విక్రమ్ తదితర చిత్రాలతోపాటు తెలుగు, మలయాళం భాషల చిత్రాల్లో కథానాయికగా నటించిన లిజి ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రియదర్శన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ మధ్య లిజికి ప్రియదర్శన్‌కు మధ్య మనస్పర్థలు తలెత్తగా నటుడు కమలహాసన్ తదితర సినీ ప్రముఖులు ఇద్దరి మధ్య సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు.
 
 అనంతరం మళ్లీ విభేదాలు తలె త్తడంతో విడిపోయారు. ఇప్పుడు వీరి మధ్య ఆస్తుల పంపకాల్లో గొడవలు మొదలయ్యాయని సమాచారం. ఈ వ్యవహారంపై నటి లిజి ఆదివారం ఉదయం చెన్నై ఎగ్మూర్‌లోని పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. ఈ విషయం తెలిసిన మీడియా అక్కడకు చేరింది. అరుుతే పోలీసులు లిజిని పత్రికల వారితో మాట్లాడరాదని షరతులు పెట్టారు. ఫిర్యాదు నమోదు చేసుకుని పోలీసు కమిషనర్  కార్యాలయం వెనుకభాగం నుంచి ఆమెను పంపించేశారు. గంటల తరబడి వేచి వున్న మీడియా చివరికి నిరాశతో వెనుతిరగాల్సి వచ్చింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement