విడాకుల వరకు వెళ్లం | No divorce, just ego clash between Priyadarshan and wife | Sakshi
Sakshi News home page

విడాకుల వరకు వెళ్లం

Published Sat, Feb 15 2014 12:56 AM | Last Updated on Sat, Sep 2 2017 3:42 AM

విడాకుల వరకు వెళ్లం

విడాకుల వరకు వెళ్లం

తమ మధ్య గొడవ విడాకుల వరకు దారితీయదని దర్శకుడు ప్రియదర్శిన్ అంటున్నారు. ఈ విడాకుల గొడవ ఏమిటంటారా? చూద్దాం రండి. నటి లిజి, దర్శకుడు ప్రియదర్శిన్ భార్యాభర్తలు. వీరిది ప్రేమ వివాహమే. వీరి మధ్య తాజాగా మనస్పర్థలు చోటు చేసుకున్నాయని, విడాకులకు సిద్ధం అవుతున్నారని ప్రచారం జోరందుకుంది. తమిళంలో కాంచీ పురం లేసాలేసా, స్నేహితమ్ వంటి పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు ప్రియదర్శిన్ పలు మలయాళ హిందీ, తెలుగు చిత్రాలను తెరకెక్కిం చారు. ఈయన మలయాళంలో చిత్రం అనే చిత్రానికి దర్శకత్వం వహించినప్పుడు ఆ చిత్ర హీరోయిన్ లిజి ప్రేమలో పడ్డారు. వీరి ప్రేమ పలు సమస్యలను ఎదుర్కొని పెళ్లితో సుఖాంతమైంది.
 
 వీరికి కల్యాణి అనే కూతురు, సిద్దార్థ్ అనే కొడుకు ఉన్నారు. వీరు విదేశాలలో చదువుకుంటున్నారు. ఇటీవల లిజికి ప్రియదర్శిన్‌కు మధ్య విభేదాలు తలెత్తాయని, అవి విడాకులకు దారి తీసినట్లు ప్రచారం జరుగుతోంది. దీని గురించి దర్శకుడు ప్రియదర్శిన్ స్పందిస్తూ తమ మధ్య చిన్న గొడవ జరిగిన విషయం నిజమేనని, అది విడాకులు తీసుకునేంత పెద్దది కాదని స్పష్టం చేశారు. అదేవిధంగా లిజి తన నుంచి పెద్ద మొత్తం లో డబ్బు ఆశించినట్లు జరుగుతున్న ప్రచారంలోనూ నిజం లేదన్నారు. తమ మధ్య చోటుచేసుకున్న చిన్న సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నంలో ఉన్నామని దర్శకుడు ప్రియదర్శిన్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement